సూర్య కిరణాలే సోకని  శీతల వాతావరణం. పగటి లో సగభాగం గడిచిపోయినా చలి తీవ్రత తగ్గలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.   అన్వర్, అతడి టీం సభ్యులు.  జమ్మూ ప్రాంతంలో LOC కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.
పగటి సమయం కనుక అడవి జంతువుల బెడద అంతగా ఉండదు. అందుకే వారి నడకలో ధీమా,వేగం కనిపిస్తున్నాయి.   ఆ నిశ్శబ్ద వాతావరణంలో వారు నడుస్తున్నప్పుడు బూట్ల క్రింద  నలిగే ఆకుల చిరు సవ్వడి
స్పష్టంగా కనిపిస్తోంది.   ఆకుల పై పేరుకున్న మంచు వారు
ఆకులను తగిలినప్పుడు. చెదిరి క్రిందక జారుతోంది.   ప్రకృతి చీకటి ముసుగులో జోగుతున్నప్పుడే వారి ప్రయాణం మొదలైంది.
                అలా నడుస్తూ వారు ఓ సమయంలో ప్రదేశానికి వచ్చారు.అక్కడో మిలిటరీ పోస్ట్ ఉంది.   రెండు చిన్న గ్రామాలకు వేదిక అది.   అబుల్ సలాం పేరు చెప్పగానే అవుట్ పోస్ట్ ఇన్చార్జి లో మంచి స్పందన కనిపించింది. రూట్ మ్యాప్ చూపించి ఎలా సరిహద్దు వరకు వెళ్ళాలో వివరించాడు ఇన్చార్జి. అక్కడ అన్వర్ బ్రృందం గరం గరం చాయ్ తాగి కాస్తంత రిలాక్స్ అయి మళ్ళీ నడక ప్రారంభించారు.
            అన్వర్ బృందం సూర్యోదయమే కాదు, సూర్యాస్తమయం కూడా చూడలేకపోయారు.   చీకటి జీమూతంలా కమ్ముకుంటోంది  .ఓ చాటు ప్రదేశంలో అయిదుగురు ఆగారు.   సుదీర్ఘ మైన నడక తర్వాత అలుపు తీర్చుకునే అవకాశం వచ్చింది.   ఇక సరిహద్దు దాటటమే వారి చివరి మజిలీ.   ఊపిరి బిగబట్టి అదను కోసం ఎదురు చూస్తున్నారు.   కాటుక లాంటి చీకటి లో కలిసి పోయి పాముల్లా పాకుతూ సరిహద్దు దాటాలి.   వారి ప్రతి కదలిక నూ ప్రతి క్షణం నీడలా వెంటాడే మృత్యువు.
           పెన్ టార్చ్ వెలుగు లో మ్యాప్ ను పరిశీలించి తామున్న ప్రదేశాన్ని ఇంచుమించుగా అంచనా వేయగలిగాడు అన్వర్.   చీకటి మరింత చిక్కబడింది.   అన్వర్ టీం చీమల బారు  ఒకరి వెనుక ఒకరు  మెల్లగా ముందుకు సాగుతున్నారు.   కిలోమీటరు దూరంలో POK సరిహద్దు అంతమవుతుంది.   అక్కడ కంచె ను దాటి ' No man land '  లో అడుగు పెట్టాలి.   అది దాటిన తరువాత
భారత సరిహద్దు ఆరంభమవుతుంది.   అక్కడ మరో కంచె.
       కంచె కు ఈవలి వైపు న(. P O K లో ) పహారా కాస్తున్న పాక్ దళాలు అన్వర్ టీం కదలికలు గమనించినా వాటిని
చూడనట్లే నటిస్తున్నాయి. మరికొంత సమయం భారంగా గడిచింది.   భారత సరిహద్దు దగ్గర BS టీం ఒకటి చేసే  ఆ
నిశ్శబ్ద నిశీధి లో అన్వర్ కు వినిపిస్తోంది.వారు అక్కడి నుంచి అవతలకు కదిలి వెళ్ళగానే సరిహద్దు దాటాలని అన్వర్ ఆలోచన.  ప్రతిక్షణం ఉద్వేగం-- ఉత్కంఠ .
         జమ్మూ కాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల్లో  నియంత్రణ రేఖ పొడవునా ( L O C ) , అక్కడక్కడా పెద్ద పెద్ద నీటి మడుగులు (  big water bodies  ), ఎగుడుదిగుడు
నేలలతో , దట్టమైన అడవులు, ( rough terrain with untrampled Virgin forests ) ఉన్నాయి. ఇలాంటి చోట్ల
కేవలం సరిహద్దు భద్రతా దళాల (B S F ) నిఘా చాలదు.
ముఖ్యంగా రాత్రి పూట మిలిటెంట్ కదలికల్ని గమనించటం చాలా కష్టం.
         అలాంటి sensitive selected spots   లో underground and under water sensors, optical fibre cables , electro optical sensors, micro aerostats    లాంటి  ' high tech equipment ' "  " "operation chakra- vyuha' అన్న పేరుతో అమర్చారు.   వీటిని కంట్రోల్ రూం దగ్గర లో వుండే రాడార్స్ తో అనుసంధానించారు.   ఈ రాడార్స్ 360° డిగ్రీల పరిధిలో 
హైటెక్ ఎక్విప్మెంట్ అమర్చిన ప్రదేశం పై తమ నిఘా ఉంచుతాయి.   చిమ్మ చీకటిలో కూడా మిలిటెంట్ కదలికల్ని ఈ రాడార్స్ సెన్స్ చేయగలవు.   ఈ హైటెక్ ఎక్విప్మెంట్ అమర్చిన  చోట సీక్రెట్, స్పెషలైజ్డ్  కెమెరాలు ఉంటాయి.
వాటికి  guns కూడా అమర్చ బడి వుంటాయి. తమ పరిధి లోకి వచ్చే మిలిటెంట్ కదలికల్ని రాడార్స్ రికార్డు చేశాక కెమెరాలు activate అవుతాయి.   ఇందుకు కారణం రాడార్స్ కు కెమెరాలకు  co-ordination  ఉండటమే. కెమెరాలకు అమర్చిన guns ను కంట్రోల్ రూం నుండే ఆపరేట్ చేయవచ్చు.   ఇవి కొన్ని క్షణాల వ్యవధి లోనే
మిలిటెంట్స్ ను మట్టి కరిపిస్తాయి. దురదృష్ట మేమంటే
ఈ హైటెక్ టెక్నాలజీ  ISI కు లీక్ చేయబడింది.
      అర్థ రాత్రి హిమపాతం ( snow fall ) పెరిగింది.   నిలుచున్న చోటు నుండి పది అడుగుల దూరంలో ఏముందో
కనిపించటం కష్టం గా ఉంది.   అప్పటికీ అన్వర్ బృందం లో ఉన్న సభ్యులు  (  image enhancement technology తో పనిచేసే night vision goggles  పెట్టుకుని ఉన్నారు.
అవి 200 గజాల పరిధిలో ఉన్న  ఆకారాలను, వస్తువులను
చూపగలవు.   
            నెమ్మదిగా భద్రతా దళాల కలవరం సద్దు మణిగింది.
మళ్ళీ రాజ్యమేలుతున్న నిశ్శబ్దం.    ముందు అన్వర్ కదిలాడు. వెనుకే అతడి బృందం. అందరూ ఒకేచోట గుంపుగా  నియంత్రణ రేఖ దాటటం క్షేమం కాదనుకున్నారు.
మనిషి మనిషికీ మధ్య కనీసం  వంద గజాల దూరం
ఉండేలా పొజిషన్ తీసుకున్నారు.   పది నిమిషాల్లో  P O K
కంచె పైనుండి no man land లోకి  అడుగు పెట్టారు. వెంటనే వంగి చకచకా L O C వైపు అడుగులు వేయసాగారు.
No man land లో సగం దూరం వచ్చాక  కొంచెం దూరంలో L O C  కి  కొంచెం కనిపించింది.   ఉత్సాహంగా, నిటారుగా నిలబడి ముందు కు  కదిలారు.   రెండు అడుగులు వేశారో లేదో ,మంచు తెరల ను చీల్చుకుంటూ మెరుపుల్లా మెరిసి
బుల్లెట్లు వారి గుండెల్ని తాకాయి. నలుగురు నిలువునా కూలిపోయారు .   అన్వర్ ఉలిక్కిపడ్డాడు. తన ఎడమవైపు
ఉన్న ఇద్దరు నేల మీద పడి ఉన్నారు.   తల తిరిగి పోయింది. తను మాత్రం ఎలా గురి తప్పించుకున్నాడో అర్థం కాలేదు.
తను చేసిన తప్పు అర్థమైంది. అండర్ గ్రౌండ్ సెన్సార్స్ ఉంటాయన్న సంగతి మర్చిపోయాడు.   తన నిర్లక్ష్యానికి నలుగురు బలై పోయారు. ఎడమవైపు తను  నిలుచున్న ది కొండ అంచు.   ఆ అంచు నుండి కొండ వాలు ప్రారంభమవుతుంది.
          కొండ వాలు చివర  పల్లపు ప్రదేశం లో  మిణుకు మిణుకు మంటూ నక్షత్రాల్లా వెలుగుతున్న దీపాలు కనిపించాయి.  పల్లం వైపు రెండు అడుగులు వేశాడో లేదో 
శవాలు పడి ఉన్న చోటుకు ఒక ట్రక్కు వచ్చి ఆగింది. ట్రక్ హెడ్ లైట్స్ ఫోకస్  మంచు తెరల ను చీల్చుకుంటూ ఆ ప్రదేశాన్ని వెలుగుతో నింపింది.   మెరుపులా తను ఓ ఫైన్
వృక్షం  చాటుకు వెళ్ళాడు.   ప్రాణభయం తో  ఉడుము ల
ఆ చెట్టు పైకి పాకుతూ చాలా ఎత్తుకు వెళ్ళాడు. సాధార
    ణ పరిస్థితుల్లో ఆ ఎత్తు కు అంత త్వరగా చేరుకోవటం అసాధ్యం.
        B S F జవాన్లు ట్రక్కు దిగారు. వారి టార్చ్ లైట్ ల వెలుగులు  శవాలపై వలయాకారంలో పరుచుకున్నాయి.
జవాన్లు వారిని కదిలించి చూశారు.   ఆ ముగ్గురి లో అసలు కదలికే లేదు.   చివర నాలుగో వాడు అలీ. అతడి నుండి కదలించారు. అతడిలో చిరు కదలిక.  బాధగా మూలిగాడు.
బుల్లెట్ గొంతు ను చీల్చుకుంటూ వెళ్ళలేదు. గొంతు చివర  భుజం పై గాయం చేసింది. మిగిలిన ముగ్గురి నీ వదిలేసి BSF
బృందం అలీని ట్రక్కు లో కూర్చోబెట్టింది.   ఒక జవాను రక్తం స్రవించే కుండా అలీ  భుజం పై తన scarf ను బలం గా అదిమాడు. అలీ మరోసారి మూలిగాడు. ట్రక్ వెనుదిరిగి వెళ్ళి పోయింది.
            అన్వర్ చివరి సారిగా తన వారిని చూశాడు.   వారితో తన బంధం తెగిపోయింది.   గుండె దిటవు చేసుకుని కదిలాడు.   కడుపులోంచి బాధ, ఏడుపు తన్నుకొస్తున్నాయి.
తన పొరపాటు వల్లే వారు బలై పోయారు.   అలీ బందీ అయ్యాడు.   తను ఒంటరిగా మిగిలాడు.   ఇప్పుడేం చేయాలి ? ప్రాణ భయంతో చెట్టెక్కుతున్నప్పుడు ఈ ప్రశ్న తనకు స్ఫురించలేదు.    ఆ క్షణాల్లో తన మానసిక స్థితి వేరు.
ఇప్పటి పరిస్థితి వేరు. ఈ నిమిషం నుంచి తన జీవన గమనాన్ని ఎలా కొనసాగించాలి ?
          కారణం ఏదైనా తను తిరిగి స్వదేశానికి వచ్చాడు.
" ఆపరేషన్ జన్నత్ " అన్న మిషన్ తరపున  పని చేయటం తన విధి.  తన కంటూ. జీవితం లో ఏ లక్ష్యం లేదు.  తనో
తెగిన గాలిపటం. మంచో చెడో ఇదే మార్గం లో ముందుకు
వెళ్ళడమే తను చేయగలిగిన పని.   తన లాంటి వాళ్ళు మనసు ప్రకంపనలకు స్పందించ కూడదు.   తనో టార్గెటెడ్ మిస్సైల్.
    " తూర్పు వెలుగు రేకలు విచ్చుకోకముందే  తాను పల్లపు ప్రదేశం చేరుకోవాలి '"   ఆ నిశ్శబ్ద నిశీధి లో అతడి 'ప్రస్థానం'
తన ప్రమేయం లేని గమ్యం తెలియని తీరాల వైపు సాగింది.
                                                                    contd 4