Those three - 2 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ఆ ముగ్గురు - 2

జమ్మూ కు అవతలి P O K లో ఆ మట్టి రోడ్లో ఓ ట్రక్కు ఆగింది. భారత్ --పాక్ సరిహద్దు కు అతి సమీపంలో ఉన్న
ఓ కుగ్రామం ఆనుకునే ఆ రోడ్డు వుంది. అన్వర్ తో ఆ నలుగురు దిగారు.
" జాగ్రత్త ! All the best." ఆ రెండు ముక్కలు అని ట్రక్కు డ్రైవర్ బండి రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ క్షణం వారి
సాహస యాత్ర ప్రారంభం అయింది. అక్కడ నుండి చిట్టడవి, కొండల వరుస ఆరంభం అవుతాయి. అన్వర్ జేబులోంచి రూట్ మ్యాప్ తీశాడు. ఓ నిమిషం మ్యాప్ ను పరిశీలించాడు. ఆ కొండ వైపే మన ప్రయాణం." చూపుడు వేలితో ఓ కొండ ను చూపిస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఆ నలుగురు అతడిని అనుసరించారు.

కొండ ముందున్న కాలి బాటలో అడుగులు వేస్తున్నారు. అప్పుడప్పుడూ ఒకరిద్దరు కాలిబాటలో ఎదురవుతున్నారు.

**********
రాత్రి ఎనిమిది గంటల కే ఆ గ్రామం నిద్ర లోకి జారుకుంది.
అంతటా నిశ్శబ్దం.
ఆ గ్రామ పెద్ద అన్వర్ బృందానికి ఆశ్రయం ఇచ్చాడు.వారున్న గదిలో చిన్న దీపం వెలుగుతోంది. పగలంతా నడచి నడచి అలసిపోయారు. అందరూ దట్టమైన కంబళి లో ముడుచుకు పోయారు.

ఒక్క అన్వర్ తప్ప మిగతా నలుగురినీ నిద్ర మత్తు
పూర్తిగా కమ్మేసింది.

అన్వర్ వెల్లికిలా పడుకున్నాడు. రెండు చేతులు తలగడ గా ఇంటి కప్పు చూస్తూ ఆలోచిస్తున్నాడు. అలాగే కొన్ని క్షణాలు గడిచాయి. పడుకున్న నలుగురిలో ఒకడు కదిలాడు.
అన్వర్ అటు చూశాడు.
" అలీ" మెల్లగా పిలిచాడు.
ఆ పిలుపుకు,అతడు లేచి కూర్చున్నాడు.
" నిద్ర పట్టలేదా ? అన్వర్ ప్రశ్న కు జవాబుగా ఆతడు నవ్వాడు. అలీ, అన్వర్ మెల్లగా తలుపు తీసి ఆవలికి వచ్చి చప్పున తలుపు మూశారు.
వెన్నులోంచి వణుకు పుట్టించే చల్లగాలి వీస్తోంది.
ఇంకా వేగం పుంజు కోలేదు.
ఆ ఇంటి ముందు అదో వసారా. పేరుకు వసారా. కాని--అన్ని వైపులా మూసి వున్నారు.ద్వారానికి తలుపు లేదు.
అందులో నుండి చల్లగాలి తెరలు తెరలు గా లోపలికి వీస్తోంది.
అన్వర్ సిగరెట్ వెలిగించాడు. అలీ కీ ఆఫర్ చేశాడు. అతడు వద్దన్నాడు. ఇద్దరా అక్కడే తిన్నె పైన కూర్చున్నారు.
కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి.
" క్యాంప్ లో నిన్నెప్పుడూ గమనిస్తూంటాను. చాలా మూడీ గా వుంటావు. మిగతా వారి తో అంతగా కలిసి పోవు."
అలీ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అన్వర్.
మళ్ళీ అలీ పెదవులపై చిరునవ్వు.
అలీ ని పరిశీలన గా చూశాడు అన్వర్. వయసు పాతికేళ్ల లోపే. గులాబి వర్ణం లో చూడ చక్కగా ఉంటాడు. కొనదేలిన ముక్కు,. చురుకైన చూపులు. పొడవు కు తగ్గ శరీర సౌష్టవం. కాని కళ్ళ ల్లో సుళ్ళు తిరిగే ఆలోచనా వలయాలు.
" మనం సమాజానికి దూరంగా ఒక లక్ష్యం తో పని చేస్తున్న సైనికులం . మనకు మన ఆత్మీయుల తో అన్ని బంధాలు తెగి పోయాయి. చావో బతుకో తెలీని పరిస్థితి మనది.
మనసులో మాట చెప్పుకోవటానికి అయిన వారు దూరంగా వున్నపుడు మనకు మనం తోడు నీడై వుండాలి."

అన్వర్ ఓదార్పు గా అన్న మాటలు అలీని కదిలించాయి.
కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర. అన్వర్ అనునయంగా భుజం
తట్టాడు. అలీ కళ్ళు తుడుచుకున్నాడు.
అన్వర్ చివరి దమ్ము లాగి సిగరెట్ నీకు ను బయటకు విసిరేశాడు.
" కాశ్మీర్-పంజాబ్ సరిహద్దు ల్లో చిన్న గ్రామం మాది. గ్రామం లో సిక్కులు, ముస్లిం లు కలిసి మెలిసి జీవించేవారు,. నిజం చెప్పాలంటే ముస్లిం కుటుంబాలు అయిదారే. అయినా మమ్మల్న సిక్కులు ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు.ఒకరి పండుగలను మరొకరు కలిసి జరుపుకునే వారం.ఎలాంటి తారతమ్యం ఉండేది కాదు." క్షణం ఆగాడు. బహుశా ఆనాటి సంఘటన మనసులో మెదిలాయి కాబోలు. ! అన్వర్ అలీ నే కన్నార్పకుండా చూస్తూండి పోయాడు.
" మాది సైనిక కుటుంబం . తాత మెహబూబ్ అలీఖాన్ ఇందిరా గాంధీ టైం లో ఇండో- పాక్ యుద్ధం లో ప్రాణాలకు తెగించి పోరాడి ' శౌర్య-చక్ర '. సంపాదించారు. ఆ యుద్ధం లో ఒక కాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాస్తోకూస్తో పెన్షన్ తో ఆయనకు జీవితం జరిగిపోతోంది. నాన్న తాత బాట లో నే నడచి ఆర్మీ లో చేరాడు. కార్గిల్ వార్ లో ప్రాణాలకు పోగొట్టుకున్నాడు.
ఈ వయసులో తాతకు కొడుకు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. " క్షణం సేపు కుటుంబ చిత్రం మనసులో మెదలి చెప్పటం ఆపాడు అలీ.
బయట మెల్ల మెల్లగా గాలి వేగం పెరుగుతోంది.
" ఇప్పుడు కుటుంబానికి నాన్న పెన్షనే ఆధారం. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన గ్రాట్యుటీ అక్క పెళ్ళికి, నా ఇంజనీరింగ్ చదువు ఖర్చై పోయాయి. తమ్ముడు"ప్లస్ 2' చదువుతున్నాడు. రాను రాను ఇంటి పరి‌స్థితులు మరీ దిగజారాయి. ఇంటికి ఆదాయం లేదు. వర్కింగ్ స్కిల్స్ లేనందువల్ల నాకు మంచి ఉద్యోగం దొరకలేదు.వేరే దారి లేక
అమ్మ ఇంటి ముందు చిల్లర కొట్టు ప్రారంభించింది. అమ్మను
ఇబ్బంది పెట్టలేక తాతయ్యే కొట్లో కూర్చుంటున్నాడు.
ఓ సగటు భారత యువకుడి జీవన నేపధ్యం అలీ క"ధనం లో ప్రతి ధ్వనించింది.
" ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాలి. నేతలు చెప్పే ఓటి మాటలు ఓటుకే పరిమితం.
తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్య పెడుతుంటారు.
అవకాశాలు లేవు. పెద్ద మనసుతో చేయి అందించే వారు లేరు. Frustration. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ." ఆవేశం, నిస్సహాయత అలీ మాటల్లో కలగలిసిపోయాయి.
అన్వర్ అలీ ని సానుభూతి గా చూశాడు. అలీ మనసు
లో సంఘర్షణ కళ్ళల్లో స్పష్టం గా కనబడుతోంది.
" తొందర పడ్డానో, తప్పు చేశానో ఈ ముళ్ళ బాట లో అడుగులేశాను. సైనిక కుటుంబం లో పుట్టి జీహాదీ గా మారాను. మన సంస్థ దృష్టి లో నేనొక పవిత్ర యోధుణ్ణి.
మా వాళ్ళ దృష్టిలో దారి తప్పిన యువకుణ్ణి. అందుకే నా వివరాలు మా వాళ్ళకు చెప్పలేదు . నేనెక్కడో మంచి ఉద్యోగం చేస్తున్నానని వారి నమ్మకం. ఆ నమ్మకం అలాగే కొనసాగాలి. అలీ పెదవులపై జీవం లేని నవ్వు.
అన్వర్ కేవలం శ్రోతే అయ్యాడు.
" మన వాతావరణం లో ఇమడ లేకే ఈ అసైన్మెంట్ ఒప్పుకున్నాను. జీహాదీ గా మారిన తర్వాత మనం అన్నింటికీ సిధ్ధం గా వుండాలి. నా గురించి నేను ఆలోచించటం ఎప్పుడో మానేశాను.మా వాళ్ళు ఆర్థిక సమస్యల నుండి బయటపడితే చాలు. " ఊహించని విధంగా అలీ అన్వర్ రెండు చేతులు పట్టుకున్నాడు.
" అన్వర్ భాయ్ ! ఈ భూమి మీద నా పాత్ర ముగిశాక
సేవింగ్స్ మొత్తం మా వాళ్ళకు చేరాలి. వివరాలు నా సెల్ లో ఉన్నాయి. ఎలాగైనా అందజేయాలి, ప్లీజ్" !
చేతులు వెనక్కి తీసుకోలేదు అన్వర్. ఈ డెడ్లీ అసైన్మెంట్ లో నేను మాత్రం మినహాయింపు అనుకున్నావా , బాధ్యత లుఅ
అప్పగిస్తున్నావ్ . ? నవ్వుతూ అన్నాడు అన్వర్.
" నువ్వన్నది నిజమే. ఎవ్వరూ మినహాయింపు కాదు. కాని
ఇంతకన్నా వేరే దారి లేదు. వివరాలు ఎవరో ఒకరి కి తెలిసి వుండాలి కదా." అలీ మాటల్లో ఆతృత. మరి నాకే బాధ్యత లు అప్పగిస్తున్నావెందుకు ?"
" నువ్వు నన్ను అర్ధం చేసుకున్నావ్. నా బాధలు పంచుకున్నావ్. మన టీం లో నిన్ను మించిన ఆత్మీయులు ఎవరుంటారు ?"
" ఓకే. అన్వర్ భారంగా నిట్టూర్చాడు.
" నేను దాటుకున్నాక నా గురించి నిజం చెప్పకు. వారు నమ్మేలా ఏదో ఒకటి చెప్పు. ఓదార్పు. అమ్మ కు ధైర్యం చెప్పు" అలీ గొంతు వణికింది. అన్వర్ అలీ భుజం తట్టాడు
వేగం గా వీస్తున్న చలిగాలులు హోరుమంటూ శబ్దం చేస్తున్నాయి. ప్రతి యేడూ 'ఈద్' సంబరంగా జరుపుకునే వాళ్ళం. మన వాళ్ళు సిక్కులు తో కలిసి పోయేవారు. వారు, వీరు అనే బేధం లేకుండా ఘుమఘుమలాడే బిర్యానీ తో విందు చేసికొనేవాళ్ళం. నాన్న కొసరి కొసరి వడ్డిస్తుంటే
అందరం విందు కమ్మ గా ఉందంటూ అమ్మ ను మెచ్చుకునే వారు. ఇప్పుడది ఓ. కలలా మిగిలిపోయింది. " మరోసారి అలీ కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర.
అన్వర్ అనునయంగా అలీ ని దగ్గరకు తీసుకున్నాడు.