Aruna Chandra - 7 in Telugu Moral Stories by BVD Prasadarao books and stories PDF | అరుణ చంద్ర - 7

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరుణ చంద్ర - 7

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 7


మోర్నింగ్వాక్ తర్వాత, లాన్లోకి లక్ష్మితో కలిసి వచ్చిన కృష్ణమూర్తి, ఆల్రడీ అక్కడ ఉన్న అరుణ, చంద్రలను చూసి, "ఈ రోజు మధ్యలో ఆపేసి వచ్చేశారా వాకింగ్ను" అని అడిగాడు వాళ్లను, కుర్చీలో కూర్చొని.
అరుణ చుట్టూ తల తిప్పి చూసింది. శ్రీరాజ్ దూరాన వాకింగ్ చేస్తూ కనిపించాడు.
ఆ వెంటనే, "శ్రీరాజ్ ఏం అంటున్నాడు నాన్నా" అని అడిగింది అరుణ, టక్కున.
"అదా సంగతి." అని నవ్వేడు కృష్ణమూర్తి, లక్ష్మి వంక చూస్తూ.
"మీరు ఇక్కడకు చేరడం చూసే, మీ నాన్న, నన్ను తీసుకొని వచ్చేశారు అరుణా" అని చెప్పింది లక్ష్మి, నవ్వుతూనే.
ఆ తర్వాత, మరి ఆలస్యం చేయక, రాత్రి శ్రీరాజ్కు, తనకు మధ్య జరిగింది చెప్పాడు కృష్ణమూర్తి, క్లుప్తంగా, అన్నింటిని.
ఆ తర్వాత, "శ్రీరాజ్ వెల్డన్ బోయ్" అన్నాడు కూడా.
అరుణ, చంద్ర మురిసిపోయారు.
అప్పుడే రాము ఐదు వాటర్ బాటిల్స్ను వారి మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. ఆ రోజు దిన పత్రికనూ ఆ పక్కనే పెట్టి, "క్షమించాలి. నేను ఈ రోజు ఆలస్యంగా తెచ్చినట్టు ఉంది. నేను టైం తప్పుగా చూసుకున్నాను" అని వాడు చెప్పాడు, నెమ్మదిగా.
"అదేమీ కాదు రాము. ఈ రోజు మేమే ముందుగా ఇక్కడకు వచ్చేశాం" అని అన్నాడు చంద్ర.
రాము తప్పా, అక్కడ వారంతా నవ్వుతున్నారు.
అప్పుడే శ్రీరాజ్ అక్కడకు వచ్చాడు.
"ఏమిటి లాఫింగ్ థెరఫీ మొదలు పెట్టారా ఏం" అని అడిగాడు శ్రీరాజ్, నవ్వుతూనే.
"అబ్బే లేదు శ్రీరాజ్. మీ అమ్మా, నాన్నా మనం రాత్రి మాట్లాడుకున్నవి తెలుసుకోడానికి ఈ రోజు వాకింగ్ని కుదించేసే తీరు వలన ఎదురైన వాటికి నవ్వుకుంటున్నాం" అని చెప్పాడు కృష్ణమూర్తి.
శ్రీరాజ్ కుర్చీలో కూర్చున్నాడు.
రాముకు పనులు పురమాయిస్తోంది లక్ష్మి.
పిదప, అన్నీ సదా మామూలే.


***


తిరిగి, ఉదయం 10 తర్వాత -
ఆ ఆఫీస్ రూంలో, తన ఎదురుగా శ్రీరాజ్తో పాటు ఉన్న మరో కొద్ది మంది స్టూడెంట్స్తో, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు.
ఆయనకు అడ్డు తగిలి, "సార్, మీరు ఇంత వరకు చెప్పిందంతా విన్నాను. ఎలక్షన్లుపై నాకు మక్కువ లేదు. నాకు చదువు తప్ప ప్రస్తుతం ఇంకో ధ్యాస లేదు. సో, నన్ను డ్రాప్ చేయండి." అని లేచి నిల్చున్నాడు శ్రీరాజ్.
ఆ ప్రిన్సిపాల్ ఇంకేదో చెప్పబోతుండగా, "సారీ సార్" అని అనేశాడు శ్రీరాజ్.
"ఓకే. యాజ్యులైక్. యు కెన్గో ప్లీజ్" అని అన్నాడు ప్రిన్సిపాల్, ముభావంగా.
శ్రీరాజ్ అక్కడ నుండి బయటకు వచ్చేశాడు. నేరుగా వెళ్లి, తన క్లాస్ రూం ముందు నిల్చుని, "మే ఐ కమింగ్సార్" అన్నాడు నెమ్మదిగా.
లెక్చరర్ రమ్మనగా, లోనికి వెళ్లి, తన సీట్లో కూర్చున్నాడు.
ఆ పిమ్మట, లంచ్ అవర్లో, తన హాట్ కేరియర్తో క్యాంటిన్లోకి వస్తూ, శ్రీరాజ్ చుట్టూ చూశాడు, మధుమతికై.
తను ఓ చివరన లంచ్ చేస్తూ కనిపించింది. తను ఎదుట సరళ ఉంది. ఆమె మధుమతి వాళ్ల క్లాస్మేటే.
అక్కడకు వెళ్లి, "నేను లంచ్ తర్వాత కొద్ది నిముషాలు నీతో మాట్లాడా లనుకుంటున్నాను" అని చెప్పాడు శ్రీరాజ్.
"సరే" అంది మధుమతి.
శ్రీరాజ్ కదిలి, మరో టేబుల్ ముందు కూర్చున్నాడు.
తనూ లంచ్ మొదలెట్టాడు.
తన ముందు సీటు ఖాళీగా ఉంది.
రెండే రెండు నిముషాలు వ్యవధిలో ఆ సీట్లోకి మధుమతి వచ్చి, కూర్చుంది.
"ఐపోయిందా లంచ్" అన్నాడు శ్రీరాజ్, విస్మయంగా.
"తిన బుద్ది ఆగిపోయింది. ఏం చెప్పుతావు. చెప్పు" అంది మధుమతి, చకచకా.
తన తాత ఎందుకు జల్దీగా తేల్చేయమన్నాడో శ్రీరాజ్కు ఇప్పుడు అర్ధమవుతోంది.
తను లంచ్ కానిచ్చేసి, సర్దుకొని, కూర్చున్నాడు.
"నేను చెప్పేది పూర్తిగా ముందు విను. తర్వాత మీరు, నో నో, నువ్వు మాట్లాడాలి." అని అన్నాడు శ్రీరాజ్.
మధుమతి తలాడించింది, అలాగేలే అన్నట్టు.
"నాకు ఒక స్థిరమైన తపన ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపయోగపడే ఒక ఫార్ములా క్రియేట్ చేయాలని నేను కెమిస్ట్రీని లైక్ చేశాను. అందుకై నిరంతరం యత్నిస్తున్నాను. అది తప్ప నాలో మరో థింకింగ్ లేదు. ఈ స్థితిలో నేను చిన్న డిస్ట్రబన్స్కూడా ఇగ్నోర్ చేయలేకపోతున్నాను. సో, ఈ మధ్య నువ్వు తారసపడడం, నీ బిహేవియర్ నన్ను నిజంగా కలవర పరుస్తోంది. సో, నేను ఇప్పుడు గజిబిజి అవుతున్నాను. అలాగని, దీనికి పూర్తిగా నువ్వే కారణం అని అనను. ఇక్కడో క్లారిఫికేషన్, నేను పక్కా ఎమోషనల్ ఫూల్ని. అదీ కారణం కావచ్చు. సో, నౌ, ఐ వాంట్, ఐ వాంట్ ... ఊ, ఆఁ, నేను ఒంటరితనం కోరుకుంటున్నాను. నా ఆశయం నెరవేరే వరకు మరో టెమటింగ్, ఆఁ, అదే, అదే ... మరో ఏవిగేషన్ని కోరుకో ... వడం లేదు. ప్లీజ్, ట్రై టు , ట్రై టు ... అండర్స్టాండ్ మి. ప్లీజ్" అని చెప్పేశాడు శ్రీరాజ్, కొద్ది పాటి తడబాటులు మధ్యన.
మధుమతి మాట్లాడలేదు.
ఆమె చెప్పేది వినడానికి ప్రాకులాడుతున్నాడు శ్రీరాజ్.
సుమారుగా రెండు నిముషాలు ఆగి, మధుమతి, "నువ్వు చెప్పింది విన్నాను ఏమీ మాట్లాడకుండా. సో, నువ్వూ నేను చెప్పేది అయ్యే వరకు ఆగు" అని, ఆ టేబుల్ మీది వాటర్ బాటిల్తీసి, కొద్దిగా నీళ్లు తాగింది.
పిమ్మట, "శ్రీరాజ్, నువ్వు ఇంకా నాకు నచ్చావు. నిన్ను మొదటి సారి చూడగానే, నేను నిన్ను నచ్చేశాను. తర్వాత, నీ థీరిటికల్ అండ్ ప్రాక్టికల్ బిహేవియర్ గమనించాను. గుర్తించాను. మరింత నిన్ను నచ్చాను. నీ యాంబిషన్ చెప్పావు. గుడ్. నేను నీ ప్రయత్నంకు అడ్డు కాను. రాను. బట్, ఆప్టర్థట్, నీవు కోరుకుంటున్న గోల్ను నువ్వు రీచ్ కాగానే, ఐ మీన్, నువ్వు ఫ్రీ కాగానే, నన్ను చూడు, నన్ను గుర్తించు. సో, ఆల్ది బెస్ట్. గో హెడ్." అని చెప్పి, లేచింది మధుమతి.
అక్కడ నుండి కదిలి, తిరిగి వెనుక్కు వచ్చింది.
శ్రీరాజ్ ఆమెనే చూస్తున్నాడు.
"శ్రీరాజ్ ఒన్ మోర్ థింగ్. నువ్వు చెప్పావు. నువ్వు ఎమోషనల్ మనిషివి అని. కనుకనే చెప్పుతున్నాను. నిన్ను చూడకుండా ఉండడానికి ప్రయత్నించగలను, కానీ, నిన్ను చూస్తూ ఊరకనే హండ్రడ్ పర్సంట్ ఉండలేను. కనుకనే, నేను ఇక నీకు కనిపించను. అలా అని చదువు మానేయను. నీకు నచ్చిన చదువును నేను కొనసాగిస్తాను. సో, నేను కనిపించక పోవడాన్ని నువ్వు మరోలా భావించవద్దు. నేను నీకు కనిపించక ముందు, నువ్వు ఎలా ఉన్నావో, అలానే ఉండు. నీ ధ్యాసంతా నీ ఆశయం మీద మాత్రమే పెట్టు. ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, నోనో, అపీల్, యస్, మై అపీల్" అని చెప్పేసి, మధుమతి అక్కడ నుండి వెళ్లి పోయింది, యాంత్రికంగా.
శ్రీరాజ్ లేచి క్లాస్కు వెళ్లి పోయాడు.
కానీ మధుమతి తిరిగి ఆ క్లాస్కు రాలేదు.


***

ఆ తర్వాత, లక్ష్మి, కృష్ణమూర్తి, అరుణ, చంద్రలతో కలిసి డిన్నర్ చేస్తూ, శ్రీరాజ్, "ఆ అమ్మాయి నేను చెప్పింది వింది. తను కూడా, నా లక్ష్యాన్ని సానుకూలంగా కోరుకుంది. నాకు ఆల్ది బెస్ట్ చెప్పింది" అని చెప్పాడు శ్రీరాజ్, మంచి రిలీఫ్లా.
"గుడ్. సరైన గైడింగ్ ఉంటే ఎంత ఫాస్ట్ జనరేషనైనా గాడి తప్పదు" అన్నాడు కృష్ణమూర్తి.
ఆ పిదప, అలా ఆ అంతా హాయయ్యారు.


***

6 నెలలు తర్వాత -
ఈ మధ్య తన వెంట పడుతున్న, తన తోటి మేట్ను పిలిచి, మధుమతి, "చూడు. మనం ఈ కాలేజీకి వస్తోంది పక్కా చదువుకోవడానికి. సో, ఆ పనిలో ఉండు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, చేయకు. నాకు చదువు కోవాలని ఉంది. నాకు అది తప్ప మరో ఆలోచన లేదు. సో, నా వెంట పడడం ఆపు. లేదంటే సీరియస్ యాక్షన్ చేపడతా." అని చెప్పింది, అతడితో.
అతడు ఏదో అనబోయాడు.
"నీ మాటలు ఏమీ వినతలుచుకోలేదు. నా రైట్ను నువ్వు హరించకు. నేను దానికై ఎంతైనా పోరాడతాను" అని చెప్పింది మధుమతి, చాలా సీరియస్గానే.
అతడు జారుకున్నాడు.
శ్రీరాజ్ నుంచి దూరమైన మధుమతి, ఇప్పుడు, అదే ఊరులో, మరో కాలేజీలో తన చదువు కొనసాగిస్తోంది.
తను ఇప్పుడు పూర్తిగా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంది.
అలాగే, మధుమతి, శ్రీరాజ్ చదువు తున్న కాలేజీలో, అప్పటి తనకు పరిచయస్ధురాలైన, అప్పటి తన క్లాస్మేటైన సరళతో టచ్లో ఉంది. శ్రీరాజ్ గురించి అప్పుడప్పుడూ తెలుసుకుంటుంది, అతి గోప్యంగా. పైగా అతడు ఆశయంకు ఎట్టి విధమైన ఆటంకం రాకుండా చూడమని దేవుళ్లుకు వరస పెట్టి మొక్కేసుకుంటుంది కూడా.
శ్రీరాజ్, తన పట్టుదల పటిష్ఠకై కృషి చేస్తున్నాడు, నిర్విరామంగా, నిరాంటకంగా.


***


మరో రెండేళ్ల ఆరు మాసాలు తర్వాత -
అరుణ, చంద్ర తమ విద్యా సంస్థల్లో ఒక ప్రత్యేక సభను ఏర్పాటు చేసి, దానిలో పాల్గొనేలా ముఖ్య అతిథులుగా కెమిస్ట్రీ సబ్జెక్టు ప్రముఖులను రప్పించారు.
శ్రీరాజ్ ఇప్పుడు తమ విద్యా సంస్థల్లోనే పిజీ చదువుతున్నాడు.
ఆ ప్రముఖులు ముందు శ్రీరాజ్ ఎంతో మక్కువగా తను చేపట్టిన దానిపై సూచాయగా మాట్లాడేడు. వారి మన్ననలు విరివిగా పొందాడు. వారు కోరి, శ్రీరాజ్కు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటన్నింటినీ శ్రీరాజ్ ఓర్పుగా, నేర్పుగా స్వీకరించాడు.
ఆ కార్యక్రమంకు మధుమతి కూడా వచ్చింది, ఎవరూ గుర్తు పట్టిని రీతిన.
శ్రీరాజు ప్రతిభకు, ప్రగతికి మురిసిపోయింది.


***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)