Aruna Chandra - 8 in Telugu Moral Stories by BVD Prasadarao books and stories PDF | అరుణ చంద్ర - 8

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

అరుణ చంద్ర - 8

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 8


మరో 18 నెలలు పిమ్మట -
మోర్నింగ్వాక్లు కానిచ్చి, ఆ ఐదుగురు, లాన్లో, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.
రాము వెళ్లి పోయిన తర్వాత, శ్రీరాజ్, "డియర్స్, నా గోల్ రీచింగ్కు దరి అయ్యాను. పేపర్స్ సిద్ధమైపోయాయి. సబ్మిట్ చేయడమే మిగిలింది." అని చెప్పాడు, చాలా హుషారుగా.
అందరూ చప్పట్లు చరిచారు.
"గుడ్ జాబ్, కంగ్రాట్స్" అన్నాడు కృష్ణమూర్తి తొలుత.
పిమ్మట ఆ మిగతా ముగ్గురూ కంగ్రాట్స్ చెప్పారు.
అందరికీ థాంక్స్ చెప్పాడు శ్రీరాజ్.
"ఇప్పటికైనా మాకు నువ్వు ఆ పేపర్స్ ద్వారా చెప్పబోయేది ముందుగా తెలియచేస్తావా" అని అంది లక్ష్మి, కుతూహలంగా.
"ఎందుకు వాడిపై వత్తిడి. అంతటికీ త్వరలో తెలియచేయబోతున్నాడుగా" అన్నాడు కృష్ణమూర్తి.
అరుణ, చంద్ర ఏమీ అనలేదు. కానీ వారికీ ముందుగా తెలుసుకోవాలని ఉంది.
శ్రీరాజ్ చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. తప్పా, దానికై ఎట్టి వ్యాఖ్య చేయలేదు.
కానీ, "నేను మధుమతిని కలవాలనుకుంటున్నాను" అని చెప్పాడు, గబుక్కున.
"తను గుర్తు ఉందా" అని అడిగింది అరుణ, విస్మయంగా.
"నేచురలీ. బట్, నేనే ఇప్పటి వరకు ఆమె గురించి ఎట్టి తలంపు చేయలేదు. ఇప్పుడు, నా మాటకు అన్కండిషనల్వేల్యూ ఇచ్చిన వ్యక్తిగా తనను నేను గుర్తుకు తెచ్చుకున్నాను" అని చెప్పాడు శ్రీరాజ్.
"ఎందుకు" అని అడిగాడు చంద్ర.
"జస్ట్, ఒన్ కైండాఫ్ మోరల్. అంతే" అన్నాడు శ్రీరాజ్.
"థట్స్ గుడ్." అని అన్నాడు కృష్ణమూర్తి, హాఫీగా.


***


ఆ తర్వాత, ఉదయం 11 గంటలు ప్రాంతంలో, శ్రీరాజ్, తను గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజీకి వెళ్లాడు, కోరి.
నేరుగా అడ్మినిస్ర్టేషన్ సెక్షన్కు పోయాడు. అక్కడ వారు శ్రీరాజ్ను ఈజీగా గుర్తు పట్టారు. చక్కగా రిసీవ్ చేసుకున్నారు.
శ్రీరాజ్, మధుమతి వివరాలుకై వాకబు ప్రారంభించాడు.
అప్పటి రికార్డ్స్ బట్టి, మధుమతి ఇంటి అడ్రస్సు సేకరించాడు. అలా ఆ కాలేజీ నుండే, తిన్నగా, కారులో, మధుమతి ఇంటికి వెళ్లాడు.
మధుమతి తండ్రి, సుబ్బారావు, ఒక ప్రభుత్వ ఉన్నతాధికారని అప్పుడే తెలుసుకున్నాడు శ్రీరాజ్.
బయట ఉన్న సెక్యూరిటీ మెన్ ద్వారా, ఒక కాగితం మీద తన వివరాలు రాసి, లోనికి పంపి, మధుమతికై వచ్చానని తెలియచేశాడు.
మధుమతికే ఆ కాగితం అందింది.
ఛంగున ఆమె బయటకు వచ్చేసింది.
శ్రీరాజ్ను అతి ఆనందంతో ఇంటి లోనికి తోడ్చుకొని వెళ్లింది.
మధుమతి ఏమీ మాట్లాడలేకపోతోంది.
నవ్వుతూ శ్రీరాజ్నే చూస్తోంది.
తను సందిగ్థంలోనే అతనిని హాలులో సోఫాలో కూర్చుండ పెట్టగలిగింది కూడా.
"కూర్చో మధుమతి" శ్రీరాజే అన్నాడు.
తను అతని ఎదురుగా సోఫా కుర్చీలో కూర్చుంది.
"మధుమతీ ఏమిటి అలా చూస్తూ ఉన్నావు." అన్నాడు శ్రీరాజ్ నవ్వుతూ.
"ఇది కలా, నిజమా తేల్చుకోలేక పోతున్నాను" చెప్పింది మధుమతి.
"ఇది నిజం. నేను శ్రీరాజ్నే. నేను అనుకున్నది పూర్తి చేసేశాను. ఆ పేపర్సు సబ్మిట్ చేయడమే మిగిలింది. రిజల్ట్ ఏదైనా, టేక్టి ఈజీ. నా వరకు, నా వర్స్ నేను పెర్ఫెక్ట్గా చేసి పెట్టాను. థట్సాల్. నౌ ఐ యాం ఫ్రీ. సో, తొలుత నిన్ను కలవాలని అనుకున్నాను. ఇలా వచ్చేశాను" చెప్పాడు శ్రీరాజ్ చాలా కూల్గా.
మధుమతి, "ఓ గాడ్, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేను నీ పేపర్స్ సబ్మిట్ వరకు వేచి ఉండాలనుకున్నాను" అని అంది.
శ్రీరాజ్ చిన్నగా నవ్వేసి, "వాట్ ఈజ్ ఎబౌట్ యు" అని అడిగాడు.
"నేనూ పిజీ చేశాను. జాబ్ సర్చింగ్లో ఉన్నాను" చెప్పింది మధుమతి.
"ఓ గుడ్" అన్నాడు శ్రీరాజ్, హుషారుగా.
"ఇకపై నువ్వు ఏం చేయబోతున్నావ్" అడిగింది మధుమతి.
"మాకు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. తాత వాటి మేనేజ్మెంట్ అప్పచేప్పేలా ఉన్నారు" చెప్పాడు శ్రీరాజ్.
మధుమతి చిరునవ్వుతో శ్రీరాజ్ అన్నది వింది.
ఆ వెంటనే, గుర్తుకు వచ్చినట్టు, "అయ్యో, నీకు బ్లాక్ కాఫీ ఇష్టం కదూ. తెస్తాను" అంటూ లేచి వెళ్లింది, పరుగులాంటి నడకతో.
తిరిగి మూడు నిముషాల్లో వచ్చింది, ఆ కాఫీతో.
ఆ కాఫీ కప్పు పుచ్చుకుంటూ, "నీకు ఎలా తెలిసింది, నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని" అని అడిగాడు శ్రీరాజ్.
"ఇచ్ఛ ఉంటే తెలుసుకోవడం కష్టమా" అని అడిగింది మధుమతి, సరదాగా.
శ్రీరాజ్ నవ్వేసి, "మీ వాళ్లు" అని అడిగాడు.
"అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్న. జాబ్ రీత్యా ఆఫీసుకు వెళ్లారు." అని చెప్పింది మధుమతి.
"ఓ. ఇంటితనమంతా నీదే నన్నమాట" అన్నాడు నవ్వేస్తూ.
"ఏదో కాస్తా కూస్తా. ఆయాలా ఓ మనిషి ఉంది మాతో" అని చెప్పింది మధుమతి.
ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టేస్తూ, "మరి నేను వెళ్తా." అన్నాడు, లేస్తూ.
మధుమతి ఇబ్బందిగా కదిలింది. ఐనా, లేచి నిల్చుంది.
"నీ మొబైల్ నెంబరు అదేనా" అని అడిగింది.
"నా నెంబరు ఉందా." అని అడిగాడు శ్రీరాజ్.
చిన్నగా నవ్వేసి, "ఇష్టమైతే ఏదీ కష్టం కాదని చెప్పాగా. నేను ఫోన్ చేయవచ్చా" అని అడిగింది మధుమతి.
"వై నాట్. నీ నెంబరూ ఇవ్వు" అన్నాడు శ్రీరాజ్.
మధుమతి తన మొబైల్తో, శ్రీరాజ్కు ఫోన్ చేసింది.
శ్రీరాజ్ ఫోన్ రింగవుతుండగా, "అదే నా నెంబర్" అని చెప్పింది మధుమతి, నవ్వుతూ.
"గుడ్. బైబై" అన్నాడు శ్రీరాజ్.
మధుమతి బయటకు వచ్చింది, శ్రీరాజ్తో.
శ్రీరాజ్ కారు స్టార్ట్ చేసిన తర్వాత, "బై" అంది మధుమతి, వెలితిగా, గాలిలోకి తన కుడి చేయిని ఎత్తి ఊపుతూ.


***


డిన్నర్ టైంలో -
"మధుమతిని కలిశాను" చెప్పాడు శ్రీరాజ్.
"అవునా. హౌ ఈజ్ షి" అని అన్నాడు కృష్ణమూర్తి.
అరుణ, చంద్ర శ్రీరాజ్నే చూస్తున్నారు.
లక్ష్మి అన్నంలో పప్పు కలుపుకుంటుంది.
"షి ఈజ్ గుడ్. బట్, చాలా ఎమోషనైంది నన్ను చూడగానే. దెన్నెక్ట్స్ మామూలే." అని చెప్పి, తన కుటుంబం గురించి చెప్పాడు శ్రీరాజ్, చిన్నగా నవ్వుతూనే.
అరుణ పచ్చడి వడ్డించుకుంటుంది.
చంద్ర అన్నంలో కూర కలుపుకుంటున్నాడు.
కృష్ణమూర్తి చారన్నం రెండు ముద్దలు తిని, "ఐతే మధుమతికి పెళ్లి కాలేదు" అన్నాడు, సడన్గా.
భోజనాలు ఆపి, కృష్ణమూర్తిని చూశారు, లక్ష్మి, అరుణ, చంద్రలు.
శ్రీరాజ్ మాత్రం భోంచేస్తూనే, "అంతేలా ఉంది" అని అనేశాడు.
"ఏమిటి నాన్న నీ ఉద్దేశ్యం" అని అంది అరుణ, కృష్ణమూర్తితో.
"ఏముంది తల్లీ, మధుమతి మంచి అమ్మాయిలా అనిపిస్తోంది. శ్రీరాజ్ కూడా ఆమెకై అనుకూలిస్తాడేమో అనిపిస్తోంది. సో, మనం అనుకుంటే, పెళ్లికై వాళ్లతో మాట్లాడదామా అని" అని చెప్పేశాడు కృష్ణమూర్తి.
"ఏమో ఇద్దరికీ వ్రాసి పెట్టి ఉందేమో. లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి" అంది లక్ష్మి.
"ఒక ఓటు, అనుకూలం" అన్నాడు కృష్ణమూర్తి, చిన్నగా.
"మీదీ అదేగా. రెండు అనుకూలంగా" అంది అరుణ.
"ఐనా మేజార్డీ కాదుగా" అన్నాడు కృష్ణమూర్తి, నవ్వుతూ.
"శ్రీరాజ్ తాత వాడేగా. అంటే మూడు అనుకూలంగా. ఐతే మేజార్టీయే" అన్నాడు చంద్ర.
"ఎన్ననుకున్నా. తల్లిదండ్రులు మీరు. పూర్తి మేజార్టీ రానిదే ఏమీ చేపట్టొద్దు" అంది లక్ష్మి.
"నువ్వు ఏమంటావు అరుణా" అన్నాడు చంద్ర.
"ఏముంది, శ్రీరాజ్ ఇష్టమే నాదిన్నూ" అంది అరుణ, శ్రీరాజ్ను చూస్తూ.
"నీకేనా, శ్రీరాజ్ ఇష్టమే మా అందరి ఇష్టం" అన్నాడు చంద్ర నవ్వుతూ.
"శుభమ్ అని అనేయనా శ్రీరాజ్" అని అన్నాడు కృష్ణమూర్తి.
"ఇంతకీ వాళ్ల ఇష్టం ఏమిటో" అన్నాడు శ్రీరాజ్.
"వాళ్లతో మాట్లాడమా" అని అడిగాడు కృష్ణమూర్తి.
"మీ ఇష్టం తాతా" అని అనేశాడు శ్రీరాజ్.
"అయితే శుభమే" అంది లక్ష్మి, గట్టిగానే.
పిమ్మట వారంతా నవ్వుకున్నారు.


***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)