Aruna Chandra - 3 in Telugu Moral Stories by BVD Prasadarao books and stories PDF | అరుణ చంద్ర - 3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

అరుణ చంద్ర - 3

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 3


ఆ రోజు రానే వచ్చింది.
అరుణ తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు, అక్కడ ఉంటున్న చంద్ర తల్లిదండ్రులును కలవడానికి.
చంద్ర కూడా వస్తానన్నాడు. అందుకు వద్దన్నారు అరుణ తల్లిదండ్రులు.
ముందుగా అనుకొని ఉన్నారు కనుక, ఎర్పోర్టుకు వచ్చారు చంద్ర తల్లిదండ్రులు.
సులభంగా వాళ్లు అక్కడ ఒకరికొకరు మీటవ్వగలిగారు.
"నా పేరు శరత్" అని తొలుత పరిచయం చేసుకున్నాడు చంద్ర తండ్రి. ఆ వెంటనే, "ఈమె నా భార్య. శ్రావణి" అని తన భార్యను పరిచయం చేశాడు.
"నేను కృష్ణమూర్తి" అని పరిచయం చేసుకున్నాడు అరుణ తండ్రి. పిమ్మట, లక్ష్మిని పరిచయం చేశాడు.
అంతా కలిసి, శరత్ కారులో వారి ఇంటిని చేరారు.
కృష్ణమూర్తి, లక్ష్మి రిప్రెసై వచ్చేక, వారంతా హాలులో కూర్చున్నారు.
శ్రావణి ఇచ్చిన కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు, ఉల్లాసంగా.
"ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీవి బ్రాడ్ మైండ్స్" అన్నాడు శరత్, కలివిడిగా.
"మీక్కూడా. మీవి కూడా" అన్నాడు కృష్ణమూర్తి, అదే రీతిన.
అంతా చక్కగా నవ్వుకున్నారు.
"మన మధ్య ఏ అభ్యంతరాలు తగలక పోయేసరికి హాయనిపించింది. మన పిల్లలు మాట్లాడు కున్నవి, చంద్ర అన్నీ మాకు చెప్పాడు" అని చెప్పాడు శరత్.
ఆ వెంటనే, "ఇది మా సొంత ఇల్లు. సొంత వ్యాపార రీత్యా ఇక్కడ ఉంటున్నాం గత ఆరేళ్లగా. వ్యాపారం బాగుంది. నేను, సమకూర్చుకున్న మరో 40 మందితో, దాని వృద్థికి నిరంతరం శ్రమిస్తున్నాను. ఇక, మాకు బాబు చంద్ర, పాప సుధ పిల్లలు. సుధకు గతేడే పెళ్లి చేశాం. అల్లుడు ప్రకాష్రావు. సాప్ట్వేర్ ఇంజినీరు. వాళ్లు చెన్నైలో ఉంటున్నారు. మనలాగే సుమారుగా వాళ్లూ ఆలోచిస్తుంటారు. అతి ముఖ్యంగా ప్రకాష్రావు పేరెంట్స్, వారు చెప్తే, వింటారు, ఆలోచిస్తారు. మంచిని ఎన్హేన్స్ చేయడానికే చూస్తుంటారు. ఇక నా తల్లిదండ్రులు, గుంటూరులో ఉంటున్నారు. వాళ్లవీ మన టైపు ఆలోచనలే. నా చెల్లి శ్రీకాకుళంలో బావతో ఉంటుంది. బావకు పట్టింపులు ఎక్కువ. కానీ అత్యవసరమైతే మాత్రం వారు కలుస్తుంటారు. నా భార్య గురించి, తను అసలు పేరు కమల. నేను శ్రావణి అంటాను. కారణం, నా కాలేజీ డేస్లో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. ఆమె పేరు శ్రావణి. మా పెళ్లికి ఆమె పెద్దలే కాదు, ఆ శ్రావణి కూడా ఒప్పుకోలేదు. వాళ్లు అన్ని పట్టింపులూ చూశారు. వారికి నేను సరిపోలేదట. సో, అలా ఆ శ్రావణి నాకు కాక పోయింది. ఇక, ఈ శ్రావణి తరుపు వారు అంతా కాకినాడలో ఉంటున్నారు. వాళ్లవి చౌచౌ తీరులు. అలాగని పట్టింపులుకు ప్రాకులాడరు" అని కూడా చెప్పాడు.
"మీతో సంబంధం ఏర్పడడం మాకు ఆనందానిస్తోంది. అరుణ నుంచి, మాకు కూడా, మీ అభిప్రాయాలు తెలిశాయి ముందే. అందుకే రాగలిగాం" అని అని, కృష్ణమూర్తి, "మాదీ సొంత ఇల్లే. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి, అక్కడే స్థిర పడిపోవాలని కొన్నాళ్లకి నిర్ణయించు కున్నాం. అందుకే ఆ చుట్టు పక్కలా కొన్ని లాండ్స్ను కూడా కొని అట్టిపెట్టు కున్నాం. ఉద్యోగ విరమణ పిమ్మట వాటిని అప్పటి పరిస్థితులు బట్టి వాడు కోవాలను కుంటున్నాం. ఇక, మాకు ఒక్కరే సంతానం, పాప అరుణ. తను తన కాళ్ళ మీద నిలదొక్కుకోవాలని తపిస్తుంటుంది. నా తల్లిదండ్రులు చనిపోయారు. నాకు ఒక్కతే తోబుట్టువు. అక్క సుశీల. బావ అప్పారావు. వాళ్లు వరంగల్లులో ఉంటున్నారు. వాళ్ల భావాలు సామాన్యం. ఇక, నా భార్య తరుపువారు, ఆవిడ తల్లి చనిపోయారు, తండ్రి చీరాలలో ఉంటున్నారు. ఆయనది వ్యవసాయం. నా భార్యకు ఒకే ఒక తోబుట్టువు, అన్నయ్య, సుబ్బారావు. అమిత భయస్తుడు." అని కూడా చెప్పాడు.
శ్రావణి వెళ్లి, హాట్, స్వీట్ ఐటమ్స్ తెచ్చి టీపాయ్మీద పట్టింది.
"అన్నింటా అనుకూలమయ్యింది కనుక, ఇక, సాధ్యమైనంత త్వరగా అరుణ, చంద్రల పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు" అని అడిగింది లక్ష్మి.
"అలాగే కానిద్దాం" అని చెప్పింది శ్రావణి.
"ఒక అనుకూలమైన రోజన, ఉభయలం ఈ విశేషాన్ని వెల్లడిద్దాం" అన్నాడు కృష్ణమూర్తి, హుషార్గా.
"సరే మీ ఇష్టం" అని అనేశాడు శరత్, చక్కగా చప్పట్లు చరుస్తూ.
శ్రావణి స్వీట్ను సర్వ్చేసింది.
అలా వారంతా ఆ స్వీట్సు కమ్మదనాన్ని తనివితీరా చవి చూశారు, చాలా సేపు.
అటు తర్వాత, ఊసులు నడుమ, లంచ్ని కానిచ్చేసి, శరత్, శ్రావణిలు సెండాఫ్ ఇచ్చేక, తిరుగు ప్రయాణంకై విమానం ఎక్కేశారు, కృష్ణమూర్తి, లక్ష్మిలు, ఎంతో నిండుతో.

***

ఆ మర్నాడే -
కృష్ణమూర్తి ఇంటికి వచ్చేసరికి ఎదురెళ్లి అతనిని పలకరించారు, అతని అక్క సుశీల, బావ అప్పారావు.
"బాగున్నారా. లక్ష్మి ఫోన్ చేసింది మీరు వచ్చినట్టు. అర్జంట్ మీటింగ్తో త్వరగా రాలేక పోయాను. ముందుగా చెప్పి ఉంటే, రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరం వచ్చేవారం" అని చెప్పుతూనే వారితో లోనికి నడిచాడు కృష్ణమూర్తి.
హాలులో లక్ష్మి ఉంది.
అరుణ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు.
హాలులో అంతా కూర్చున్నారు. ఈ లోగా కృష్ణమూర్తి తన గదికి వెళ్లి, రిప్రెసై వచ్చాడు.
"ఏమిటి బావగారూ విషయాలు" అని అడిగాడు కృష్ణమూర్తి, నవ్వుతూ.
అప్పటికే లక్ష్మి చెప్పి ఉండగా, అప్పుడే రాము కాఫీలు తెచ్చి, ఆ నలుగురుకూ అందించి వెళ్లిపోయాడు.
"వినీత్ పెళ్లికి నిశ్చయించాం. అరుణకై మాట్లాడదామని వచ్చాం" చెప్పింది సుశీల.
"అదేమిటక్కా. ఎప్పుడో చెప్పాను, మేనరికం నాకు నచ్చదని" చెప్పాడు కృష్ణమూర్తి.
"నాకు తెలిసిన మంచి డాక్టర్లు ఇద్దరిని వాకబు చేశాను మూర్తి. మేనరికంలో అన్నింటా కీడు జరగాలని, జరుగుతోందని ఏమీ లేదట" అని చెప్పాడు అప్పారావు, కృష్ణమూర్తితో.
"అంత వరకు ఎందుకు బావగారూ. నేనే ఆ విధం వద్దనుకుంటున్నాను. సో, అరుణకు దగ్గర సంబంధం వద్దు" అని చెప్పాడు కృష్ణమూర్తి.
అప్పుడే, వాళ్లు కాఫీలు తాగడం పూర్తవ్వడంతో, లక్ష్మి, రామును పిలిచి, ఆ ఖాళీ కాఫీ కప్పులను తీసుకు వెళ్లమంది.
వాడు అలాగే చేశాడు.
"అన్నయ్య మొదట నుండి అలాగే అంటున్నాడు. ఇప్పటికైనా నువ్వు మాట్లాడాలి వదినా" అంది సుశీల, లక్ష్మితో.
"ఈ మాటన, ఆయనకు నేను అడ్డు తగలను సుశీల" చెప్పింది లక్ష్మి.
"అదేమిటి సిస్టర్. మేము ఎంతగానో తెలిసినవారం. ఆడపిల్లను ఇచ్చుకున్నప్పుడు ఇది అతి అవసరం కదా మీకు" అన్నాడు అప్పారావు, వెంటనే.
"ఎందుకు బావగారూ అవన్నీ. నాకు మేనరిక సంబంధం ఇష్టం లేదు. అదే లక్ష్మికి, అరుణకు చెప్పి, వారి సమ్మతి పొందాను. సో, మరి అది కానిది. ఇక మేము వేరే సంబంధం చూశాం. ఉభయలం నచ్చాం. మాకు సమ్మతమైన ఒక రోజున దానిని వెల్లడించాలని అనుకున్నాం. కానీ, ఇప్పుడే మీతో ఇలా చెప్పేయక తప్పడం లేదు. లేకపోతే మన మధ్య అనవసరమైన మాటలు పెరిగేలా ఉంది" అని చెప్పేశాడు కృష్ణమూర్తి, కాస్తా ఇబ్బందిగానే.
కొద్దిసేపు సుశీల, అప్పారావు మొహాలు చూసుకున్నారు.
"అటు ఎవరేమిటి" అడిగేసింది సుశీల.
"అరుణ ఆఫీసులోనే జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. అలాగని వాళ్లది లవ్మారేజ్ కాదు. మా పెద్దలం నిర్ణయించిన అరేంజ్డ్మారేజే." చెప్పాడు కృష్ణమూర్తి.
"వాళ్లు ఎక్కడోళ్లు. వాళ్ల ఇంటి పేరు ఏమిటి" అడిగాడు అప్పారావు.
"మా ఉభయులు వైపు నుండి అట్టి సమాచారాల పట్టింపులు వద్దను కున్నాం. మేము ఆడ పెళ్లివారం, వాళ్లు మగ పెళ్లివారు. అవి మాకు చాలు అనుకున్నాం" అని చెప్పాడు కృష్ణమూర్తి.
"ఇదేం తీరు. పెళ్లి బంధం రెండు కుటుంబాలు మధ్యనే కాదు, ఆ కుటుంబాల కుటుంబాలుకూ విస్తరిస్తోంది కదా" అన్నాడు అప్పారావు, చింతగా.
"మేమూ కాదనలేదు కదా. అది ఇలానూ కొనసాగిద్దాం. వావి, వరసలు తప్పని, వీడని వివాహ బంధాన్ని ఎందుకు స్వాగతించ రాదు. దానికి ఇతర కొలమానాలు, ప్రామాణికాలు ఎంత వరకు సమంజసం. మన చర్యలు, మనం విస్తరించుకోబడుటకు ఉపయోగపడాలి కానీ, విడగొట్టుకోబడుటకు కాదుగా. చెప్పండి బావగారూ" అని అడిగాడు కృష్ణమూర్తి, అప్పారావును.
అతడు ఏమీ మాట్లాడ లేదు. కానీ చిందరవందరవుతున్నాడు.
సుశీల కూడా మాట్లాడడం లేదు.
"కొత్త విధం తొలుత చికాకుగా ఉన్నా, మార్పు కాలక్రమేణా నిలుస్తోంది, తప్పక నిలదొక్కుకుంటుంది" అని అన్నాడు కృష్ణమూర్తి.
అప్పుడే వచ్చింది అక్కడకు అరుణ.
అక్కడ వాతావరణం గుర్తించింది. ఐనా, నవ్వుతూ అప్పారావు, సుశీలను పలకరించింది, వరసలు పెట్టి.
కానీ వాళ్లు అందుకు ముభావంగా ఉండి పోయారు.
"మూర్తీ నువ్వు ఏదో అనుకుంటున్నావు. అదే మాట్లాడుతున్నావు. సరి కాదు. పైగా నీ భార్యను, నీ కూతురునూ అందుకై అణగదొక్కుతున్నట్టు అగుపిస్తోంది" అని అన్నాడు అప్పారావు.
"లేదు లేదు అన్నయ్యగారూ. అట్టిది ఏమీ లేదు. మీ బావగారు నన్ను వంచించడం లేదు. ఆయన భావాలు మంచివి అని నేను భావిస్తూనే ఉన్నాను" అని చెప్పింది లక్ష్మి.
అరుణ ఏమీ ఇంకా అనలేదు.

***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)