Aruna Chandra - 4 in Telugu Moral Stories by BVD Prasadarao books and stories PDF | అరుణ చంద్ర - 4

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

అరుణ చంద్ర - 4

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 4

"బాబోయ్ ఇక్కడిదో పోబియాలా ఉంది. పద సుశీల. ఇక్కడ నేను ఉండలేను" అంటూ లేచాడు అప్పారావు.
"మామయ్యా" అని పిలిచింది అరుణ, అప్పుడే.
"ఏమ్మా. నువ్వేం చెప్పుతావు. అదే చెప్పుతావులే. ఎంతైనా వీళ్ల కూతురువే కదా" అన్నాడు అప్పారావు.
"అంత అసహనం ఎందుకు మామయ్యా. మనం తిన్న తిళ్లును, మనం ఉన్న ఇళ్లును, మనం కట్టుకున్న బట్టలును, ఇలా ఎన్నింటినో, ఆ అన్నింటినీ మన మన సొంత సంబంధీకులే సమకూర్చి మనకు పెడుతున్నారా. వాటికి లేని అభ్యంతరం, అక్కడ రాని ఆంతర్యం, పెళ్లి బంధంకు మాత్రం ఎందుకు పట్టి పట్టి వెతుకుతున్నాం. ఇదేం పద్ధతి మామయ్యా. ఘోరం అనిపించడం లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఆఁ. మా అమ్మ, నాన్న ప్రవర్తనలో తప్పు వెతుకుతున్నారు ఎందుకు మామయ్యా." అని మాట్లాడింది అరుణ.
అక్కడ నిశ్శబ్దం ఉంది, కొంతసేపు.
ఆ పిమ్మట, అరుణ, "మీరూ ఆలోచించండి మామయ్య. ఏదైనా ఎవరికి వారం ఆలోచిస్తేనే చక్కని ఫలితం తేలుతోంది. గుంపుగా పోతే వాదనలు, వేదనలు రెచ్చకొడతాయి. అంతే. ఉదాహరణకు మమ్మల్ని చూడు. నాన్న చెప్పారు. అమ్మా, నేను విన్నాం. మొదట కంగారపడ్డాం. పిమ్మట అమ్మకు అమ్మ, నాకు నేను, విడివిడిగా, రోజులు, వారాలు, నెలలు ఆలోచించాం. ఇప్పుడు ఈ రీతికి వచ్చాం. మంచి వెంటనే నిలవకపోయినా పోనుపోను అదే దారవుతోంది మామయ్యా. ఇది నా అనుభవం మామయ్యా" అని అంది.
"అరుణ చెప్పినట్టు, ఇప్పుడికిప్పుడు మీరూ ఏమీ తేల్చుకోలేరు కూడా. సో, లేవండి. మీ వీలువెంబడి మీరు ఎవరికి వారై ఆలోచించండి. ప్రస్తుతం మీకు ఉన్న ఆలోచనకు మేము సరిపోతాం. ఎందుకంటే అరుణకు ఇంకా ఆ అబ్బాయితో పెళ్లి కాలేదు కదా. సో, ఇంకా మేము మీ వాళ్లమే కదా. కనుక రుసరుసలు ఆపి, మాతో తిరగండి ప్రస్తుతానికి. అరుణ పెళ్లి లోపు మీరు మాలా ఆలోచిస్తే, సంతోషంగా వచ్చి, వాళ్లని దీవించండి. లేదా మీ అభిప్రాయాలు మీవి. ఎదుట వారి అభిప్రాయాలను మార్చాలనే స్వభావం మాత్రం మాకు లేదు. థట్సిట్ " అన్నాడు కృష్ణమూర్తి.
మళ్లీ అక్కడ మరి కొంత సేపు నిశ్శబ్దం.
ఆ పిదప, "లే వదినా" అంది లక్ష్మి.
సుశీల లేచి, లక్ష్మితో అక్కడ నుండి కదిలింది.
అప్పారావు కూడా కృష్ణమూర్తి చెప్పగానే, లేచి, అతనుతో కదిలాడు.
అరుణ నింపాదైంది. తన గది వైపు నడిచింది.


***

"మాకు, వస్తున్న శుక్రవారం, మ్యారేజ్. తప్పక రావాలి" అంటూ, తమ ఆఫీస్స్టాప్కు, పేరు పేరున తమ వెడ్డింగ్కార్డ్ను అందిస్తున్నారు, అరుణ, చంద్రలు.
వాళ్ల ఉత్సాహానికి ముచ్చట పడుతున్నారు వారంతా.
కృష్ణమూర్తి, లక్ష్మిలే కాదు, శరత్, శ్రావణిలు కూడా, స్వయంగా వెళ్లి, తమ తమ వాళ్ళను, తమ పిల్లల పెళ్లికి రమ్మనమని ఆహ్వానించారు. ఆ దారిన చెదురుమదురుగా అననుకూలతలు వారికి ఎదురయ్యాయి. ఐనా వారు వాటిని చిరునవ్వులుతో స్వీకరించారు. తమ తీరున వారిని స్వాగతించారు. అంతా సజావుగా జరపాలని తలచి, అలానే నడిచారు.


***

అరుణ, చంద్రల పెళ్లి వేడుక వేడుగ్గా ముగిసింది.
ఈ పెళ్లికి, ఆ ఇరు కుటుంబాల వైపుల వాళ్లు, అందరూ కాక పోయినా, చాలా వరకు ఇంటికి ఒకరు చొప్పున అన్నట్టు హాజరు కావడం, కృష్ణమూర్తి, లక్ష్మిలకే కాదు శరత్, శ్రావణిలుకూ కడు రిలీఫ్గా అనిపించింది.
పైగా వారి రాక, తమ చొరవ పరంపరకు, మెచ్చుకోలుతో కూడిన ఒక భుజం తట్టు అన్న ధీమా వాళ్లకు చేరువైంది.


***

తమ శోభనం రాత్రిన -
"హాపీనా" అన్నాడు చంద్ర.
"బోల్డంత" అంది అరుణ.
ఆ వెంబడిన, "ఇది కొనసాగుతూనే ఉండాలి" అని కూడా అంది.
"తప్పక. నా సహకారం కూడా కొనసాగుతూనే ఉంటుంది" చెప్పాడు చంద్ర, చిరునవ్వుతో.
"మనం పెళ్లికి ముందు ముచ్చటించుకున్నవి నెరవేర్చుకుందాం" అంది అరుణ.
"అవే కాదు. ముందు ముందు తారస పడే ప్రతి మన అవసరాన్ని అనుకూలంగా తీర్చుకుందాం" అని చెప్పాడు చంద్ర.
ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
ఇద్దరూ మెలుకువగా ఒకే మంచాన కదిలాడారు, తొలి మారు, తొలి జాము వరకు.


***

మోర్నింగ్వాక్లు కానిచ్చి, ఆ నలుగురు, లాన్లో, కుర్చీల్లో కూర్చున్నారు.
పనివాడు నాలుగు వాటర్ బాటిల్స్ను వారి మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. ఆ రోజు దిన పత్రికనూ ఆ పక్కనే పెట్టి, వాడు నిల్చున్నాడు. రాము రెండు రోజులు సెలవుతో నేడు డ్యూటీకి రాలేదు.
లక్ష్మి పనివాడితో చెప్పుతోంది, రొటీన్గా రొటీన్వే, ఐనా, రెండు బదులు మూడు హాట్ కేరియర్స్ అయ్యాయి ఇప్పుడు.
ఈ లోగా, చంద్ర లేచి, ఇంట్లోకి వెళ్లి, తిరిగి అక్కడకు వచ్చేశాడు.
ఆ పని వాడు కదిలి, ఇంటి వైపు వెళ్తున్నాడు.
అప్పుడే, ఒక కవరు, కృష్ణమూర్తికి ఇచ్చి, "ఈ మొత్తం మీరు తీసుకోవాలి మామయ్యా" అని అన్నాడు చంద్ర, నింపాదిగా.
"మొత్తమా, ఎందుకు చంద్రా" అడిగాడు కృష్ణమూర్తి, కుతూహలంగా.
"ఇంత వరకు మా జీతాలు ఎవరి ఖాతాల్లోనివి వారివే. ఇకపై, ఈ నెల నుండి మాత్రం, నా జీతం, అరుణ జీతం కలిపేసి, ఒకే కొత్త బేంక్ అకౌంట్లో జమ చేయదలిచాం. దానిల్లోంచి పిఫ్టీ పర్సంట్ మొత్తం మన ఇంటి ఖర్చులకై మా షేర్గా చెల్లించదలిచాం. అదే ఇది" అని చెప్పాడు చంద్ర, సౌమ్యంగా.
కృష్ణమూర్తి మాట్లాడలేదు. కానీ, లక్ష్మి వంక చూశాడు. అప్పటికే ఆవిడా అయన్ని చూస్తోంది.
"నాన్నా, చంద్ర వేరేగా ఉందామన్నాడు. నేనే ఒప్పించాను, మీతో మేము ఉండడానికి. అందుకు ఈ ప్రపోజల్ అతను చేశాడు. పైగా మేము బయట ఉన్నా ఇంతే బడ్జెట్టు ఇంటి ఖర్చుకు అని తేల్చేశాడు కూడా. అలాగే ఆ మిగిలిన మొత్తం నుంచి మా ఇండివిడ్యువల్ ఖర్చులుకై చెరో టెన్పర్సంట్ చొప్పున మాత్రమే నెలవారీగా వాడుకుందామన్నాడు. ఆ మిగతాది స్ట్రిక్లీ సేవింగ్కే అన్నాడు. నేనూ సరే అన్నాను. నాకూ ఈ పద్ధతి నచ్చింది నాన్నా" అని చెప్పింది అరుణ.
"అవునా, సరే. కానీ..." అని ఇంకా మాట్లాడబోతూన్న కృష్ణమూర్తికి అడ్డు తగిలి -
చంద్ర, "నాదో వ్యాఖ్య మామయ్యా. కలిసి ఉంటే కలదు సుఖం. సో, నేటికి, ముందు నాటికి, ఈ నానుడు నిలవాలంటే, చేదోడు వాదోడు రీతి పాటించాలి. తప్పదు. నేడు ఉమ్మడి వ్యవస్థ విచ్ఛన్నం కావడానికి ఆర్థిక లోటే ఒక బలమైన కారణం. సో, నా, కాదు కాదు, మా ఇద్దరి ఈ ప్రయత్నం సరైనదేనని మా విశ్వాసం. మీరు మమ్మల్ని ఈ విషయంలో నిరుత్సాహ పరచరని మేము నమ్మకం పెట్టుకున్నాం. అందుకే దీనిని మీతో చర్చించకుండా మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పాడు.
"థట్సిట్ అండ్ కంగ్రాట్స్" అంటూ చంద్రకు, అరుణకు షేక్హేండ్స్ ఇచ్చాడు కృష్ణమూర్తి, నిండుగా.
లక్ష్మి నవ్వింది, పసందుగా.
అరుణ, "ఆ విషయమూ చెప్పుతానన్నావు" అంది చంద్రతో, గబుక్కున.
"ఆఁ ఆఁ. అవునవును. మామయ్యా, మాకు పిల్లలు పుట్టాక ఈ మొత్తం పెంచుతాం" అని చెప్పాడు చంద్ర, వెనువెంటనే.
అంతే వేగంగా అరుణ, "సవరణ సవరణ, పిల్లలు కాదు, పిల్ల లేదా పిల్లాడు అంతే. ఒకే ఒకరు. ఏం చంద్రా" అని అంది.
"యయ, అంతే అంతే. ప్యూచర్ బ్రయిట్గా ఉండాలిగా." అన్నాడు చంద్ర.
"భలే. మంచి ప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారే." అన్నాడు కృష్ణమూర్తి, నవ్వుతూ.
"అది సరే అరుణా. పెళ్లికి ముందు చంద్రను మీరు, వారు అంటూ, పెళ్లి తర్వాత ఏకవచనంలోకి దించేశావేమిటి" అని అంది లక్ష్మి, నవ్వుతూ.
"అది అంతే. ఇప్పుడు మనం మనం ఒకరం" అని చెప్పింది అరుణ.
ఆ నలుగురూ నవ్వుకున్నారు, ఒక్క మారుగా.


***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)