Love Song - 34 in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 34

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 34

రామాపురం నుంచి వచ్చిన ప్రభ ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంకా తను సెటిల్ అవ్వలేదని చెప్పినా కూడా జస్ట్ ఫార్మాలిటీ కోసం ఆడపిల్ల వాళ్లే అడిగారు కాబట్టి మనం కాదు కూడదు అంటే బాగుండదు కదా వచ్చిన మొదటి సంబంధం ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని ఈ కాలంలో అమ్మాయిలు దొరకడం చాలా కష్టమని మేడం చెప్పడంతో తను ఏమీ బదులు మాట్లాడకుండా తన పనికి వెళ్తాడు.

కొడుకు చదువు పూర్తయిన ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నది మనసులో ఉన్న కూడా తను పని చేసిన ఫ్యాక్టరీ కాబట్టి ఏమీ చెప్పలేక పోతుంది గౌరీ. వారు అడిగినంత మాత్రాన వాడికి ఇష్టం లేకుండా నేనేం చేయను పైగా అమ్మాయి కూడా బాగుంది లక్షణంగా ఉందని చెప్పడంతో నేను అడగాల్సి వచ్చింది అనుకుంటూ ఉండగానే సాయంత్రం ప్రభ ఇంటికి వస్తాడు

ఇక ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుని ఫ్రెష్ అప్ అయి వచ్చిన ప్రభుకి కాఫీ అందిస్తున్న ప్రభ మాత్రమే ఏమీ మాట్లాడలేదు. తను కూడా ఒక గ్లాసులో తీసుకొని ప్రభ పక్కన కూర్చుంటుంది.

ప్రభ కి అమ్మని చూస్తే జాలి అనిపిస్తుంది కానీ ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా అలాంటి ప్రయత్నం ఎలా ? అని మనసులో అనుకుంటూ ఉండగానే " ప్రభ"అని అమ్మ పిలవడంతో చెప్పమ్మా అంటూ చూస్తాడు. 

మీ చరిత అక్కకి డెలివరీ అయింది అని చెప్పావు కదా వెళ్లి చూసొద్దామా" అని అడుగుతుంది గౌరీ.
అలాగే తప్పకుండా వెళదాం కానీ రెండు రోజుల తర్వాత మనం చెప్పి కాఫీ కప్పు అక్కడ నుంచి తన గదికి వెళతాడు.. తను ఉన్న గదికి ఉన్న కిటికీ నుంచి పెళ్లి బాజాలు ఊరేగింపులో వినబడుతూ ఉంటే పెద్దాయన అనన్య అర్జన్లో పెళ్లిళ్ల గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదే అనుకుంటూ అలా నిద్ర రావడంతో కళ్ళు మూసుకున్నాడు. 

***
ఉదయం ఆఫీస్ టైం కావడం తో అరణ్య డ్యూటీ కి బయలుదేరి వెళుతుంది. కదిరినాడులో ఒక రైతు పొలానికి సంవత్సరావడంతో వెళ్లి సర్వేయర్ తో పొలాన్ని సర్వ్ చేసిన తర్వాత వస్తూ ఉండగా గుడికి దగ్గరలో వస్తున్న ఒక పెద్ద ఆమె తన తన డ్రైవర్ కి బండి నిలబెట్టమని చెప్పి ఎదురుగా వస్తున్న అరణ్య వాళ్ళకి ప్రసాదం ఇవ్వడంతో తిని "ప్రసాదం చాలా బాగుంది "అని చిరునవ్వుతో చెబుతుంది అరన్య..
దైవ ప్రసాదం కదమ్మ మనం పరిశుద్ధమైన మనసుతో తయారు చేస్తాము కాబట్టి అలాగే ఉంటుంది. కొత్తగా వచ్చిన ఎమ్మార్వో అంటే నువ్వేనా" అన్న పెద్ద ఆమె ప్రశ్నకు అవును అన్నట్టు తల ఊపుతుంది అరణ్య.
"దేవుడు. చల్లగా చూడని ఈ ఊరిలో కాస్త జాగ్రత్త సుమా! సరే వస్తాను "అని చెప్పి వెళుుతుంది. 

అక్కడి నుండి రాముని, సర్వేయర్ని. వెళ్ళమని చెప్పి తాను కారులో బయలుదేరి వెళుతూ ఉండగా ఎదురుగా అర్జున్ కనిపించినట్టు నిలపమని చెయ్యి ఊపితున్నట్టు కనిపించడంతో కారుని కాస్త స్లో చేయగా ఎవరు కనిపించలేదు.

"ఎందుకు  ఈ రోజు నాకు పదేపదే అర్జున్ గుర్తొస్తున్నాడు "అనుకొని ఇంటికి దగ్గరికి వెళ్లి తన గదిలోకి వెళుతుంది. 

అప్పుడే వచ్చిన పెద్దాయన వాకిలి దగ్గర నిలిచి అరణ్య ఓ గ్లాసు నీళ్లు తీసుకుని రామ్మ అని పిలుస్తూ ఉన్నా అరణ్య బయటికి రాకపోవడంతో పతంగి లోపలికి అడుగు పెట్టాలని అనుకుంటూ ఉండగా ఓ గ్లాసు నిండా నీళ్లు తీసుకుని వచ్చిన అరణ్య " అర్జున్ ఇదిగో వాటర్ అన్నావుగా అయినా అక్కడే నిలుచున్నాను ఏంటి లోపలికి రా అని అంటూ ఉంటే పెద్దాయన పతంగిలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. 

"అమ్మ అరణ్య" అన్న పెద్దాయన మాట విని ఈ లోకానికి వస్తుంది చేతిలోనే గ్లాసును పెద్దాయన చేతిలో ఉంచి లోపలి వెళుతుంది అరణ్య.

పాపం అరణ్యకి అర్జున్ బాగా  గుర్తొస్తున్నట్టున్నాడు ఆ అబ్బాయి తనకి నచ్చాడేమో అంటూ పతంగి వైపు చూస్తాడు పెద్దాయన. 

అవునయ్యా అమ్మాయిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది పతంగి బదులిస్తాడు. 

పతంగి ఆరోజు అరణ్యని చూడడానికి వచ్చిన వాళ్ళ ఫోటో ఏమైనా ఉందా అన్నది పెద్దాయన ప్రశ్న. 

"ఫోటోనా అయ్యా ఒక్క నిమిషం " అంటూ ఆలోచించి ఒక ఫోటో ఉండాలయ్య ఆరోజు అమ్మాయిని తనతో పాటు నిలబెట్టుకొని పక్కన నన్ను కూడా రమ్మన్నారు అంటూ ఫోటో చూపిస్తాడు. 

ఫోటో చూసిన పెద్దాయన ఒక్క క్షణం తన కళ్ళు తిప్పుకోలేక పోతాడు.
అది చూసిన పతంగి  "ఏంటయ్యా అలా చూస్తున్నారు మీకు వారం ముందేమైనా తెలుసా" అన్న ప్రశ్నతో లేదు అన్నట్టు తల ఊపుతూ మళ్లీ చూస్తూ ఉండేసరికి" అయ్యా మీకు వారు బాగా నచ్చినట్టున్నారు" అని మరొక్కసారి పతంగి మాట్లాడతాడు. 

అవును వీళ్ళు నాకు బాగా నచ్చారు ఎందుకో తెలుసా వీళ్లను చూస్తుంటే ఆదిదంపతులు గుర్తుకొస్తారు . వీళ్ళు తప్పకుండా అరణ్యని బాగా చూసుకుంటారు ఇంకేం అబ్బాయి కూడా మంచి వాడే అనిపిస్తుంది పైగా ప్రభ కి బాగా తెలుసు అని పెద్దాయన చెబుతూ ఉంటే ఇంకేమయ్యా అరణ్యకి పెళ్లి కుదిరినట్లే అంటూ అక్కడ నుంచి పొలం వైపు వెళ్తాడు పతంగి.

అరణ్యకు అర్జున్ అంటే ఇష్టం అని తెలిసిన తరువాత పెద్దాయన ప్రభకి ఫోన్ కలుపుతాడు.

“హలో! చెప్పండి గురూజీ,” అని ప్రభ పలికేసరికి,
“ఏం లేదు ప్రభ,” అని సమాధానం ఇస్తాడు.

“అదిగో, మీరు మాట్లాడుతున్నటువంటి మీ వాయిస్ చెబుతుంది. మీరు నాతో ఏదో చెప్పాలని,” అని ప్రభ చెబుతాడు.

వీడు మనసులో మాటలను గుర్తుపట్టేట్టు కూడా మనసుని చదువుతాడేమో అనుకుంటూ, ఇంకా చెప్పక తప్పదా అనుకుంటూ ఉంటే, “సరే గురూజీ, మీరు చెప్పాలనుకున్నదే చెప్పండి,” అని కాల్ కట్ చేయాలని అనుకుంటాడు.

“ప్రభా!” అని పెద్దాయన మళ్లీ పిలిచేసరికి, “ఆ!”చెప్పండి "అని అడుగుతాడు ప్రభ.

ప్రభ నేను ఒక మంచి పని కోసం వెళ్లాలని అనుకుంటున్నాను నువ్వు నాతో పాటు వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందిరా వస్తావా" అంటూ మళ్ళీ మాట్లాడుతాడు పెద్దాయన.

గురూజీ మీరు అడగలే గాని తప్పకుండా వస్తాను చెప్పండి ఎప్పుడు రావాలో.

" ప్రభ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి నువ్వు గాంధీ నగర్ దగ్గరికి వస్తే నేను వెహికల్ తెస్తాను, అక్కడ నుంచి వెళదామా "

"తప్పకుండా వస్తాను గురూజీ మీరు వచ్చేయండి" అని చెప్పి లోపలికి వెళ్తాడు ప్రభ.

ఇంట్లో అమ్మతో చెప్పి అక్కడి నుంచి గాంధీ బజార్ సర్కిల్ దగ్గరికి రావడంతో ఇక్కడ ఎదురు గా "అర్జున్ నిలయం "అని కనిపించడంతో పెద్ద ఆయనకి చాలా సంతోషం అనిపిస్తుంది. 

"ప్రభ ,అదిగో అదే అర్జున్ వాళ్ళ ఇల్లు వెళదామా"అని చెప్పడంతో ఇద్దరూ వెహికల్ తీరా ఇంటి గేటు దగ్గరకి వెళ్లేసరికి పెద్దాయన లోపలికి వెళ్లాలా వద్దా ఆలోచిస్తూ ఉన్నాడు.

గురూజీ మీరు నాకు రమ్మని చెప్పింది అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడడానికి అని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు ప్రభ. 

అవును ప్రభ ,అరన్య చిన్నప్పటినుంచి ఇంతవరకు నన్ను ఏమీ అడగలేదు పైగా అర్జున్ తనంతట తానే వచ్చి కూడా నన్ను అడగలేదు చాలా తెలివైనవాడు అనుకుంటా వాళ్ళ అమ్మానాన్నలని ఇంటికి పంపించాడు అందుకే తప్పకుండా అనన్య ఆలోచనలకు పెళ్లి చేయాలని అనుకున్నాను 
అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి అంటూ గేటు దగ్గరికి వస్తూ ఉండగా గేట్ వాచ్మెన్ అడ్డగిస్తాడు.
"అన్నా , మేము కొత్తవారమే కావచ్చు కానీ బాగా తెలిసిన వాళ్ళం కాస్త లోపలికి పోనిస్తారా పెద్దవాళ్లతో మాట్లాడాలి "అని ప్రభ అడుగుతున్నా కూడా లేదండి మా సర్ చెప్పేవరకు మిమ్మల్ని లోపలికి రాని వద్దన్నారు అంటూ మళ్ళీ అడ్డగిస్తాడు. 
ఆ మాట విన్న పెద్దాయనకి గుండె ఆగినంత పని అవుతుంది అంటే నీలకంఠం గారు కచ్చితంగా నన్ను చూసి ఉంటారు .అందుకోసమే అడ్డగించమని చెప్పాడేమో అయితే ఇంటికి వచ్చి మరి అరన్య నచ్చిందని చెప్పివెళ్లారు కదా , ఇప్పుడు ఎందుకు రావద్దని అంటున్నాడు అని మనసులో అనుకుంటాడు పెద్దాయన

. ప్రభ కూడా ఎంతగా చెప్పినా వాచ్మెన్ వినకుండా" మా సార్ లోపలికి రానియవద్దన్నారు తప్పకుండా నేను వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇటు వెళ్లిపోండి అని దారి చూపిస్తాడు వాచ్మెన్..

ఇక ఇది జరగని పని అని అనుకున్న ప్రభ అర్జన్ కి ఫోన్ కలిపిన అది రింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలో తనకు తెలియదు.

 "ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంటికి వచ్చి అరణ్య అంటే వాళ్లకి ఇష్టమని చెప్పి... ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి?" అంటూ ప్రభ పెద్దాయన వైపు చూస్తుంది. పెద్దాయన కళ్లు నేల వైపు చూస్తూ ఉంటాయి. ఆ కళ్లలో ఏదో బాధ ఉందని ఖచ్చితంగా అర్థమవుతుంది

 "ఇదేంటి గురూజీ... మనం అంత దూరం నుంచి వచ్చినా వాళ్లు లోపలికి రావద్దని చెబుతున్నారు?" అని ప్రశ్నిస్తాడు ప్రభ
:"బహుశా వాళ్లకి అరణ్య నచ్చి ఉండవచ్చు..."వాతావరణం నచ్చక పోవచ్చు ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకు ఏమనిపించిందో దీన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతోంది ప్రభ.

కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని అంటూ ఇంకొక అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకుని అడుగు వేయబోతాడు.

"మనుషులకి ఒక్కసారి చెప్తారు గోపి (వాచ్మెన్), అడుగు ముందుకు వేస్తే దాని పర్యవసానం వేరే ఉంటుంది చెప్పు" అని గట్టిగా మాట్లాడుతూ వస్తాడు లోపలి నుంచి నీలకంఠం.

నీలకంఠ వైపు చూసిన పెద్దాయన నీలకంఠం దగ్గరికి వెళ్లి కాలు పట్టుకున్నంత పని చేస్తాడు అయినా అక్కడ స్థానం లేదని గట్టిగా చెప్పడంతో  ఇంక ఏమి మాట్లాడలేక  వెనుతిరిగేసరికి ప్రభ కి
ఆశ్చర్యమేస్తుంది.

ఇదేంటి ఊరిలో అంత మంచి పేరు ఉండి ఎంతో ధైర్యంతో అందరితో మాట్లాడే పెద్దాయన ఎందుకు ఇలా చేస్తున్నారు ఇద్దరు ఒకరికొకరికి ముందే తెలుసా సరే ఇది ఏమైనా గురూజీని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అనుకుని" గురూజీముందు ఇక్కడి నుంచి వెళదాం "అని ప్రభ పెద్దాయనని వడివడిగా పిలుచుకొచ్చి కారులో కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉంటారు.
"గురూజీ "అని మరొక్కసారి మాట్లాడిచ్చేసరికి పెద్దాయన కళ్ళలో నీటి బొట్లు రాలడం చూసిన ప్రభ కి గుండె తరుక్కుపోతుంది.
తను ఏడవడం ఏంటి .తను ఏం తప్పు చేశారు? ఎందుకు అతన్ని కాలు పట్టుకుంటున్నాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూ ఉంటే అవన్నీ మనం అడక్కుడదేమో ఏది ఏమైనా పెద్దాయన వచ్చింది అన్నయ్య పెళ్లి విషయం మాట్లాడడానికి కదా ఇద్దరూ ఎదురుగా కూర్చొని మాట్లాడితే కదా విషయం తెలిసేది అని మనసులో అనుకుంటూ ఉంటే పెద్దాయన కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ఉండడం చూస్తాడు.

గురూజీ మీరు ఏడ్వకండి ఇలా
చూడలేకపోతున్నాను అంటూ బండి నడుపుతుంటాడు.
"ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక రోజు ఇలాంటి బాధ తప్పకుండా కలుగుతుంది ప్రభా తట్టుకోవాలి. మనం ధైర్యంగా ముందుకు వెళితే దేనినైనా
సాధిస్తాం, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను అప్పుడు నాకు భయం అనిపించలేదు. కానీ ఈ విషయంలో నాకెందుకో చాలా భయంగా ఉంది.
నీలకంఠం చాలా పట్టుదలగల మనిషి . తను ఎలా ఉండాలి అనుకుంటే కచ్చితంగా అలాగే ఉంటాడు. అర్జున్ ని, అరణ్య ని పెళ్లి చేసుకోనని పట్టు పట్టాడంటే తన మనసులో అరణ్యానికి కోడలిగా స్థానం లేదని నాకర్ధం అయిపోయింది. ఏం చేయాలి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అరణ్య నన్ను ఇప్పటివరకు ఏది అడిగింది లేదు. కనీసం తనకి నచ్చిన వాడితో పెళ్లి చేస్తే తను ఆనందంగా ఉంటుందని అనుకున్నాను నేను తనకి ఎన్నాళ్లు... తనకంటూ ఒక మంచి తోడు నిస్తే హాయిగా జీవితాన్ని గడుపుతుంది కానీ ఇదేంటి ఇలా జరుగుతోంది ప్రభ. నాకు చాలా బాధగా ఉంది అసలు నిజంగా నేను మరణిస్తే ఎంత బాగుంటుందనిపిస్తుంది అని పెద్దాయన చెబుతూ ఉంటే ఒక్క క్షణం కారు ఆపి ప్రభ పెద్దాయన వైపు చూస్తాడు.