రాత్రంతా పెద్దాయన తను నాటువైద్యం ఎలా నేర్చుకున్నాడో, ఆ విద్య వెనుక దాగి ఉన్న అనుభవాలేమిటో చెబుతుంటే ప్రభకు సమయం తెలియనే లేదు. ఆ కథలోని ప్రతి సంఘటన అతని మనసులో ఏదో ఒక ముద్ర వేసింది. పెద్దాయన మాటలు వింటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. చివరకు ఎప్పుడు నిద్రపోయాడో కూడా తెలియకుండా గాఢనిద్రలోకి జారుకున్న ప్రభ, ఉదయం కాస్త ఆలస్యంగా, దాదాపు పది గంటల సమయంలో కళ్లు తెరిచాడు. నిద్రలేచిన వెంటనే నిన్నటి రాత్రి పెద్దాయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తొచ్చాయి. వాటిని తలుచుకుంటూ ఊరికి వెళ్లాలనుకుని బయటకు వచ్చిన ప్రభకు అక్కడ గోవిందు కనిపించాడు.
ఇద్దరూ మాట్లాడుతుండగా ,ప్రభ అని గోవిందు పిలిచేసరికి అట్ట చూస్తాడు .
" ప్రభ నా పెళ్ళికి గీతిక వచ్చింది "అని చెప్పగానే ప్రభా కళ్ళు ఆశ్చర్యంగా చూస్తాయి. అప్పుడే వచ్చిన అరణ్య కాఫీ తీసుకొని రావడంతో వాళ్ళిద్దరూ మాట్లాడకుండా మంచం మీద కూర్చుంటారు.
"గోవిందు "అని అరణ్య అనడంతో ఇద్దరు అటువైపు చూస్తారు కాఫీ తాగుతూ.
గోవిందు , నీ పెళ్లి లో నేను ఒక ప్రాణం ఉన్న బొమ్మని చూశాను తెలుసా ? అని అంటూ ఉండగానే
"అరణ్య నువ్వు చెప్పేది గులాబీ రంగు పావడతో ఉన్న అమ్మాయినా ? అని గోవిందు కల్పించుకుంటాడు.
అవును తనే ఇంతకీ అమ్మాయి ఎవరు మీకు చుట్టమా ? లేదా....
తను లతిక వాళ్ళ చుట్టాలమ్మాయి అంటూ ప్రభా వైపు చూస్తాడు.
ఇక వీళ్ళిద్దరూ గీతిక గురించే మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్న ప్రభ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత బాగుండదు అనుకొని" అరణ్య నేను ఇంటికి వెళతాను అని నిలిచోవడంతో " ప్రభ ఆగరా ఒక్క నిమిషం " అని అరణ్య పిలుస్తున్న "అరణ్య అమ్మకి బాగోలేదు అందుకే త్వరగా వెళ్ళాలి "అని చెప్పి బయలుదేరుతాడు .
అలా చెప్పి అక్కడి నుంచి లేచి బండి దగ్గరికి ప్రభ వెళుతుంటే చూస్తున్న అరణ్యకు అతని మాటల్లో తొందర కనిపించినా, అడుగుల్లో మాత్రం ఏదో ఆలోచనల బరువు కనిపించింది.
“గోవిందూ! మనం అమ్మాయి గురించి మాట్లాడుతుంటే. ఎందుకు వాడు అలా వెళ్లిపోతున్నాడు?” అని అడిగింది.
గోవిందు కాసేపు ప్రభ వెళ్లిన దారివైపు చూస్తూ, “ఏం చేద్దాం అరన్యా! వాడిని కాలేజీ రోజుల నుంచి ఎవరైనా ఇష్టపడినా, వాడు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు,” అన్నాడు.
అరన్య కళ్లలో చిన్న ఆశ్చర్యం మెరిసింది.
“అంటే... ఇది వన్‌సైడ్ లవ్ అన్నమాట!” అని ఆమె నవ్వుతూ అంది.
గోవిందు కూడా చిరునవ్వు నవ్వాడు. కానీ ప్రభ మనసులో మాత్రం ఆ మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
అంతలో గోవిందకు లతిక ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్తాడు.
బండిని రైడ్ చేస్తూ వెళుతున్న ప్రభాకు గీతిక ఆలోచనలు మనసులో మెదులుతున్నాయి . బైక్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఉదయపు చల్లని గాలి ప్రభా ముఖాన్ని తాకుతున్నా, అతని మనసులో మాత్రం ఆలోచనల వేడి తగ్గడం లేదు. బైక్ హ్యాండిల్‌పై చేతులు ఉన్నా, అతని ఆలోచనలు మాత్రం గీతిక చుట్టూనే తిరుగుతున్నాయి.
“నేను పెళ్లికి రాకపోవడమే మంచిదేమో…” అనుకున్నాడు ప్రభా.
“గీతిక పెళ్లికి వచ్చిందంటే… కచ్చితంగా వాళ్ల అమ్మానాన్న వస్తారని ఆశించి ఉంటుందేమో. వాళ్లను ఒక్కసారి చూడొచ్చనే ఆశతోనే ఇంత దూరం వచ్చి ఉండొచ్చు. కానీ… తను ఎంత ఆశగా వచ్చిందో, అంతే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వాళ్ల అమ్మానాన్న రాలేదని తెలిసినప్పుడు ఆమె మనసు ఎంతగా బాధపడి ఉంటుందో!” అన్న ఆలోచన అతని మనసును కలచివేసింది.
కొద్దిసేపు బైక్ వేగం తగ్గింది. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నా, చెట్ల ఆకులు గాలికి కదులుతున్నా… ప్రభా దృష్టికి అవేవీ కనిపించలేదు. అతని కళ్ల ముందు మాత్రం గీతిక ముఖమే కనిపిస్తోంది.
“అలాగని… ఎన్నాళ్లిలా బాధపడుతూ ఉంటుంది? గతాన్ని తలుచుకుంటూ తన జీవితాన్ని తానే శిక్షించుకుంటూ ఉంటే ఎలా?… కనీసం తన మనసులో ఉన్న బాధకు ఒక ముగింపు ఇవ్వడానికి అయినా!”తన కోసం తపించే వాళ్ల వైపు ఒక్కసారి తిరిగి చూడొచ్చు కదా,
అయినా “గీతిక జీవితం సంతోషంగా ఉండాలనే ఆలోచన వైపు తన మనసు ఎందుకు మళ్లడం లేదు? గతం ఆమెను ఎంతగా గాయపరిచినా… భవిష్యత్తు మాత్రం ఆమె చేతుల్లోనే ఉంది కదా!” అనుకుంటూ ప్రభా ఒక నిట్టూర్పు విడిచాడు.
బైక్ మళ్లీ ముందుకు దూసుకెళ్లింది. కానీ అతని మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది—గీతిక దగ్గర, ఆమె కన్నీళ్ల దగ్గర, ఆమెకు తెలియని ఒక కొత్త జీవితాన్ని చూపించాలనే తన ఆలోచన దగ్గర.
“తను సంతోషంగా ఉండాలి… అంతే.”అని తనలో తానే అనుకున్నాడు ప్రభా.ఆ ఒక్క మాటలోనే గీతికపై తనకున్న ఆప్యాయత ఎంత లోతుగా ఉందో అతనికే అర్థం కాలేదు.
అయినా నువ్వు నన్ను ఎప్పుడు చేరుతావో అని ఆలోచిస్తూ ఇంటి దగ్గరికి వచ్చేసరికి బైక్ దిగి ఇంటి లోపలికి అడుగు పెట్టగానే హాల్లో ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఉండటం కనిపించింది. వారిని చూసి ప్రభ కాసేపు ఆగిపోయాడు.
ప్రభా రా అని చిరునవ్వుతో పిలిచిన మేడం వైపు చూస్తాడు. తను తనను చదివించిన మేడం అంతేకాదు అమ్మకు మంచి స్నేహితురాలు. ఆమెను చూసి ప్రభకు గౌరవం ఉన్నా, ఆమె పక్కన కూర్చున్న వారెవరనే విషయం తెలుసుకోవాలనిపించింది.
“వీళ్లు ఎవరమ్మా?” అని అడగాలని అనిపించింది.
కానీ ఎందుకో ఆ ప్రశ్న నోటికి రాలేదు. మౌనంగా వెళ్లి అమ్మ మేడం నా మధ్య కూర్చుంటాడు.
వచ్చినవాళ్లు ప్రభావైపు ఒకసారి చూసి అట్లనే మర్యాదల తర్వాత ఇక బయలుదేరుతామంటూ చెప్పగా అమ్మ మేడం లిద్దరు వెళ్లి సాగనంపి లోపలికి వస్తారు.
కాసేపు నిశ్శబ్దం.
ప్రభ మేడం వైపు చూడడానికి కాస్త భయం అనిపించగా అమ్మాయి చూస్తాడు విషయం అర్థం చేసుకున్న గౌరీ తన స్నేహితురాలి వైపు చూస్తుంది.
" ప్రభ వచ్చిన వాళ్ళు ఎవరని అడుగుతున్నావా?" వాళ్లు మీ అమ్మ పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ చెల్లెలు" అని చెబుతూ ఉండగా అమ్మను ఫంక్షన్ దగ్గరి నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడు ఆమె అక్కడికి రావడం బైకు మీదన్న తన వైపు చూడడం కూడా గుర్తుకు వస్తుంది ప్రభకు.
" ఏంట్రా అలా ఆలోచిస్తున్నా వు, ఇక దాపరికం ఏముంది వాళ్లకు ఉన్నది ఇద్దరమ్మాయిలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే " అవును ప్రభ వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది చిన్నమ్మాయి అని గౌరీ కల్పించుకోవడంతో ప్రభ ముఖంలో వెంటనే అసహనం కనిపించింది.
“అమ్మ మీ ఇద్దరి ఆలోచన నాకు అర్థం అయింది ... నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నా జీవితం ఒక దారిలోకి వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటున్నాను. అంతవరకు ... అని అని ఏదో చెప్పబోతుండగా "" అది కాదురా వాళ్లకి ఆస్తి, అమ్మాయికి చదువు కూడా బాగుంది. వాళ్లు అడిగితేనే ఇక్కడికి రమ్మని చెప్పాము" అని మేడం మృదువుగా చెబుతుంది.
మేడం నిజం చెప్పాలంటే నాకు ఇంకా అటువంటి ఆలోచన లేదు. అన్నప్రభ మాటలు విని
మేడం మాత్రం చిరునవ్వుతో, “నువ్వు ఎలాగో ఒకరోజు సెటిల్ అవుతావులే ప్రభా! జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా నడవదు. సమయం వచ్చినప్పుడు కొన్ని విషయాలు వాటంతట అవే జరుగుతాయి,” అని చెప్పింది.
ఆ మాటలు విన్న ప్రభా మేడమ్ క ఎదురు చెప్పలేక అమ్మ వైపు చూస్తాడు.
ప్రభ ఏంట్రా అలా చూస్తున్నావ్ ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన ఆ పని ఏం జరగదులే నువ్వు సెటిల్ అయ్యేవరకు కాస్త ఆగాల్సిందే. అయితే మనం అప్పటికప్పుడు అమ్మాయిని చూడాలంటే కష్టం అవుతుంది కదా ఇప్పటినుంచి అలా కొన్ని సంబంధాలు చూస్తూ ఉంటే నీకు ఏదైనా నచ్చితేనే అడుగు ముందుకు వేస్తాం కూడా . వాళ్ళు మీ అమ్మ కు ఇన్ని సంవత్సరాలు ఉపాధిని కల్పించారు అందుకని వాళ్ళ మాటలని కూడా మనం గౌరవించాలి కదా. నీకు నచ్చనది మీ అమ్మ ఏ పని చేయదు నువ్వేం భయపడకు, దిగులు పడకు జస్ట్ ఫార్మాలిటీ అంతే అని మేడం చెబుతూ ఉంటే ," గురువు అంటే ఇంతేనేమో ఎలాంటి వారికైనా భవిష్యత్తు బాగుండాలని ఎంత అర్థవంతంగా బోధించడానికి ప్రయత్నిస్తారు రియలీ యువర్ గ్రేట్ మేడం" అని మనసులో అనుకుని ఇద్దరి వైపు అలా ఒక్కసారి చూసి ప్రభ ఏమీ మాట్లాడలేదు. కాసేపు మౌనంగా నిలబడి, తన గదిలోకి వెళ్లిపోయాడు.
గదిలో ఒంటరిగా కూర్చున్న తర్వాత అతని మనసులో అసహనం మొదలైంది“రామాపురంలో నడిస్తే అక్కడ ప్రేమ గోల... ఇంటికి వస్తే ఇక్కడ పెళ్లి గోల... అసలు నాకు ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా అవకాశం లేదా?” అని తనలో తానే అనుకున్నాడు.
గీతిక గుర్తొచ్చింది. వెంటనే పెళ్లి మాట గుర్తొచ్చింది. ఆ రెండింటి మధ్య తన మనసు ఎటు వెళ్లాలో తెలియక తడబడింది.
అయినా ఆలోచనలకు తావివ్వకుండా తన పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పని అయినా తన మనసును కాస్త మళ్లిస్తుందని అనుకున్నాడు.
తన కాంట్రాక్ట్ ఉద్యోగం విషయంలో సహాయం చేస్తానని గతంలో చెప్పిన డాక్టర్‌కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ అవతల నుంచి వచ్చిన సమాధానం మాత్రం అతని ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.
“ప్రభా... నీకు ఇప్పించాల్సిన కాంట్రాక్ట్ విషయం నా చేతిలో లేదు. అది వేరే వాళ్లకు ఇచ్చేశారు. వాళ్లు ముందే తీసుకున్నారు. నేను కూడా ప్రయత్నించాను, కానీ ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు,” అని డాక్టర్ చెప్పాడు.
ప్రభ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన అవకాశం కూడా తన చేతుల నుంచి జారిపోయిందనే బాధ అతని మనసును భారంగా చేసింది.
“సరే డాక్టర్ గారు... అర్థమైంది. మీరు ప్రయత్నించినందుకు ధన్యవాదాలు,” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఫోన్‌ను జేబులో పెట్టుకున్న ప్రభ ముఖంలో ఉన్న ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. ఉదయం నుంచి వరుసగా ఎదురైన సంఘటనలు అతని మనసును అలసిపోయేలా చేశాయి. రామాపురంలో గీతిక గురించి మొదలైన ఆలోచన... ఇంట్లో వినిపించిన పెళ్లి మాటలు... ఇప్పుడు చేతికి అందుతుందనుకున్న ఉద్యోగ అవకాశం కూడా చేజారిపోవడం...
అన్నీ కలిసి అతని మనసుపై ఒకేసారి భారంగా పడ్డాయి.
అయినా ప్రభ తన పనిని ఆపలేదు. నిరాశను ముఖంలో కనిపించనివ్వకుండా మౌనంగా తన పని కొనసాగించాడు.