you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 33

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 33

అరుణ్ ఇంటికి చేరుకోగానే హాల్లో టీవీ చూస్తూ కనపడ్డారు సంధ్యా గారు.
అరుణ్ నేరుగా వెళ్లి ఆవిడ ఒడిలో తల పెట్టుకొని పడుకొని "  హాయ్ మా డాడీ ఏరి అప్పుడే ఆఫీస్ కి వెళ్ళిపోయారా"  అని అడుగుతాడు.

ఆవిడ టీవీ చానల్స్ మార్చుతూ " లేదు మీ ఆవిడ ఓదార్పు యాత్రకు వెళ్ళాడు"  అని అంటుంది.

" ఏంటి?" అని అరుణ్ ఆవిడ ఒడిలో నుంచి లేచి కూర్చుంటాడు .

" మీ ఆవిడని ప్రియా ఎంగేజ్మెంట్ కి తీసుకెళ్లలేదని అలిగి కూర్చుంది , దాని అలక తీర్చే ప్రోగ్రాం లో ఉన్నాడు మీ డాడీ"  అని అంటారు సంధ్య.

అరుణ్ వాళ్ళ అమ్మ వైపు ఐ బ్రో రేస్ చేసి చూస్తే.
సంధ్య గారు జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. 
" మేము ప్రియా ఫంక్షన్ కోసం రెడీ అయ్యే టైం కి మీ ఆవిడ బ్రష్ చేసుకుంటూ కిందకి వచ్చింది.  అప్పటికి మీ నాన్న ఫంక్షన్ కి వెళ్తున్న వస్తావా తల్లి.... అని అడిగాడు . నాకు ఫంక్షన్స్ అంతగా నచ్చావు మావయ్య మీరు వెళ్లి రండి అని చెప్పి వెళ్ళిపోయింది. మీ నాన్నగారు ప్రియా ఫంక్షన్ అని చెప్పలేదు ఆవిడ గారు చెప్పే వరకు వినను కూడా వినలేదు , వెళ్ళిపోయింది. నాకు ఎలాగో నువ్వు ఇచ్చిన పని తగ్గింది కదా అని అనుకున్నాను . ఇందాకడే కాసేపటి క్రితం టీవీలో ప్రియా ఎంగేజ్మెంట్ గురించి న్యూస్ చూసి తనకు ఎందుకు చెప్పలేదు , తనని ఎందుకు తీసుకెళ్లలేదని అలిగి పైకి వెళ్ళిపోయింది దాని అలక తీర్చే ప్రోగ్రాం లో పడ్డాడు మీ నాన్న"  అని ప్రతి మాట సాగదీస్తూ చిరాకు నిండిన స్వరంలో అంటుంది సంధ్య.

అరుణ్ వాళ్ళ అమ్మ చెప్పిన విధానానికి నవ్వుకుంటూ "  మరి నువ్వు వెళ్లలేదే ఆ ఓదార్పు యాత్రకి"  అని అడుగుతాడు.

సంధ్య అరుణ్ వైపు కోపంగా చూసి " ఒరేయ్ మంచి తిక్కలో ఉన్నాను నన్ను కెలికావ్ అనుకో దెబ్బలు పడిపోతాయి  చెప్తున్నా "  అని అంటారు.

" అదేంటమ్మా అలా అంటున్నావ్ మీరు ఇష్టంగా కోరి తెచ్చుకున్న కోడలే కదా"  అని అంటాడు. 

" నేనెప్పుడూ కోరుకున్నాను రా అది నా కోడలిగా రావాలని . దేవుడికి ప్రార్థించాను కూడా అది నా కోడలుగా రాకూడదు అని . కానీ మీ నాన్నగారే నా చెల్లి కూతురు అది ఇది అని తీసుకొచ్చి నీకు అంట గాట్టాడు . మీ నాన్న నిన్ను అడిగినప్పుడు నువ్వు దాన్ని చేసుకోను అని అంటావేమో అని ఆశగా చూసాను , నువ్వేమో మీ ఇష్టం నాన్నగారు అని గొప్ప ఉత్తమ కొడుకు లాగా డైలాగు వేశావు,  మీ నాన్న గారేమో సంతోష పడిపోయి దాన్ని నీ కిచ్చి పెళ్లి చేశాడు.  అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు అది దాని అలవాట్లు ఎప్పుడైనా పొద్దున లేచిందా  అది 10 ఐతేగాని లేవదు మహాతల్లి . ఈ ఇంట్లో వంటగది ఎక్కడుందో తెలుసా దానికి. అసలు ఒక పని అయినా చేస్తుందా అది.   నా కోడలు ఎలా ఉండాలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న.  కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని తారుమారు చేస్తూ దీన్ని నా కోడలు చేశాడు ఆ దేవుడు " అని తెగ బాధ పడిపోతుంది సంధ్య గారు.

అరుణ్ వాళ్ళ అమ్మ వైపు చూసి జాలిపడి " అమ్మ నువ్వు అత్తగారి పోస్ట్ లో ఉన్నావు , దానికి ఆర్డర్ వెయ్యాలి నువ్వు , ఆర్డర్ వేసి  పని చేయించుకోవాలి నువ్వు . ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసావో నీ కోడలు ఎలా ఉండాలి అనేది తనని అలా మార్చుకోవచ్చు కదా"  అని అంటాడు.

సంధ్యా గారు అరుణ్ వైపు ఒక లుక్ ఇచ్చి " ఏంటి ఆర్డర్ వేయాలా? .  దానికి ఆర్డర్ వేసే అంత ధైర్యం నాకు లేదు బాబు.  దానికి ఏమైనా చెప్పావనుకో ముందు మీ నాన్నగారు వస్తారు అది చిన్న పిల్ల అయిన దానికి పని చేయాల్సిన అవసరం ఏముంది ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉండగా అని దాని వెనకేసుకు  వచ్చి గారాబం చేస్తాడు , పోనీ మీ నాన్నగారు లేనప్పుడు దానికి ఏదో ఒక పని చెబుదాము అనుకుంటే , ఫోన్ వెంటనే మీ అత్తగారు అదే నా మరదలు కి వెళ్ళింది. ఆవిడ అదేదో తన కూతురు ఇంటి చాకిరీ అంతా తన భుజాల మీద వేసుకొని చేస్తుంది అన్నట్లు  , శ్లోకాలు  పెడుతుంది , నేనేదో ఆవిడ కూతురిని రాచి రంపాలు  పెట్టే శాడిస్ట్ అత్త లాగా .  నా వరకు వద్దురా నువ్వు చెప్పరా నువ్వు ఎప్పుడైనా దాంతో ఏ పనైనా చేయించుకున్నావా " అని అడుగుతారు సంధ్యా గారు.

ఈ టాపిక్ తిరిగి అరుణ్ మీదకి వచ్చేపాటికి అరుణ్  కి ఏం చెప్పాలో అర్థం కాక " మ... డాడీ ఓదార్పు యాత్ర ఎక్కడ వరకు వచ్చిందో చూసి వస్తాను, నువ్వు ఈ లోపల సీరియల్స్ చూసుకో  " అని అక్కడి నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతాడు.

కొడుకు అలా ఎస్కేప్ అవడంతో కొడుకు వైపు చూసి నవ్వాలో ఏడవలో అర్థం కాక ఒక నిట్టూర్పు వదులుతుంది. 

అరుణ్ తన రూమ్ దగ్గరికి చేరుకునే లోపు అరుణ్ ఫాదర్ కమల్ గారూ అప్పుడే బయటకు వస్తూ ఉంటాడు. 
అరుణ్ నీ చూసి  కొంచెం కోపంగా "ఒరేయ్ ప్రియా ఎంగేజ్మెంట్ కి వెళ్తున్న సంగతి ఉషా కి ఎందుకు చెప్పలేదు " అని కోప్పడతాడు.

" నాకు ప్రియ ఈరోజు మార్నింగ్ కాల్ చేసి చెప్పింది అందులోను మీ మేనకోడలు నేను వెళ్ళే టైం కి లేవలేదు , పొద్దున్నే దాని లేపొద్దు అని మీరేగా అంటారు" అని అంటాడు అరుణ్.

" నేను లేపొద్దు అన్నాను కరెక్టే , కనీసం ఏదైనా ఒక నోట్  రాసి ఉండి వెళ్ళచ్చు కదా"  అని అంటాడు కామన్.

" సరే నాన్న ఇంకా పైన నోట్ రాసి వెళ్తాలే "  అని అంటాడు అరుణ్ కొంచెం చిరాకుగా. వాళ్ల నాన్నగారి వల్లే ప్రీఉష ఇలా చేస్తుందని అరుణ్ కి బాగా తెలుసు కానీ ఏమి అనలేదు.

" సర్లే నేను తనకి నచ్చచెప్పానులే కానీ,  సాయంత్రం ఉష నీ  బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి దానికి ఏమేం కావాలో కొని ఇవ్వు. భర్తగా అసలు దాని గురించి పట్టించుకుంటావా అసలు నువ్వు. నీకు ఇచ్చి దాని పెళ్లి చేసి తప్పు చేశానేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు, కొంచెం నీ ఫ్రెండ్స్ గురించే కాకుండా కట్టుకున్న భార్య గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టు"  అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కమల్ గారు.

’ అది భార్య లాగా ఉంటే భర్త లాగా నేను కూడా దాన్ని పట్టించుకుంటాను, ఎప్పుడో పక్కన వాడి మీద ఏడవడం తప్ప దాని గురించి అది ఎప్పుడు ఆలోచించింది కనుక, అందుమైతే ఇచ్చాడు గాని ఆడపిల్లకు ఉండవలసిన ఒక్క లక్షణం కూడా దానికి ఇవ్వలేదు ఆ దేవుడు ’ అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తాడు.

అరుణ్ నీ  చూసి ప్రిఉష కొంచెం కోపంగా " ఈరోజు ప్రియా ఎంగేజ్మెంట్ అని నాకు  ఎందుకు చెప్పలేదు " అని అడుగుతుంది.

అరుణ్ ఫ్రెష్ అవ్వడానికి కబోర్డ్ లో నుంచి బట్టలు తీసుకుంటూ " తమరు పొద్దున్నే లెగిస్తే తెలిసేది,  10  ,11 అయితే గాని లెగరుగా అమ్మాయిగారు "  అని అంటాడు.
’ అబ్బా.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను లెగిసి ఉంటే చక్కగా ఆ ఫంక్షన్ కి వెళ్లి ప్రియా ఎంగేజ్మెంట్ చూసే దాన్ని’  అని అనుకోని
" అయినా సరే లేపాల్సింది ఇంత మంచి న్యూస్ పొద్దున్నే వినే అవకాశం ఉండేది.  ఏదైతే తను ఎట్టకేలకి పెళ్లి చేసుకుంటుంది నాకు ఉన్న సగం టెన్షన్స్ అన్ని తీరినట్టే " అని అంటుంది .

అరుణ్ ప్రిఉష వైపు కోపంగా ఒక చూపు చూసి బాత్రూం లోకి వెళ్తాడు.
అరుణ్ రెగ్యులర్గా వేసుకున్న బట్టలు లో( టీ షర్ట్ షార్ట్) బాత్రూం నుంచి  బయటకు రావడం  చూసి "ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావ్ డ్రెస్ చేంజ్ చేసుకో బయటికి వెళ్లాలి " అని అంటుంది.

అరుణ్ చిరాకుగా " ఎక్కడికి?"  అని అడుగుతాడు .

" ఎక్కడికి ఏంటి మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఎలాగో ఎంగేజ్మెంట్ కి రాలేదు కదా తనకి ఒక మంచి గిఫ్ట్  తీసుకుందాం పద"  అని అంటుంది.

"  అక్కర్లేదు నేను ఆల్రెడీ తనకి గిఫ్ట్  ఇచ్చాను " అని అంటాడు అరుణ్. 

" సరే అయితే ఒకసారి వెళ్లి  కంగ్రాట్యులేట్ చెప్పి వద్దాం " అని అంటుంది.

" అక్కర్లేదు ఇప్పుడు టైమ్ ఎంత అయిందో చూసావా ఈ టైం లో పని కట్టుకొని మరీ వెళ్లి తన మూడ్ పాడు  చేయాల్సిన అవసరం లేదు, అందులోనూ స్వీటీ  ఈరోజు  తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంది నువ్వు వెళ్లి ఆ హ్యాపీనెస్ ని పాడు చేయొద్దు"  అని అంటాడు బెడ్ మీద పడుకొని కళ్ళ మూసుకొని.

ఆ మాటలకి కోపం వచ్చి  " అంటే ఏంటి ని ఉద్దేశం  నేనే తన హ్యాపీనెస్ ని పాడు చేస్తున్నానన్న" అని అడుగుతుంది. 

" దాంట్లో డౌట్ ఎందుకు నీ  అక్కర్లేని అనుమానాలతో ఇతరులను ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు కదా"  అని అంటాడు.

" అవును మీ ఫ్రెండ్ ప్రియా ఒక్క గొప్ప దేవత మరి ఫస్ట్ ఏమో ఆ విన్ను ని ప్రేమించింది,  వాడేమో ఆక్సిడెంట్ లో పోయాడు , దాంతో ఈ జన్మలో పెళ్లి చేసుకోను , నా విన్ను నా మనసులో ఎప్పటికీ ఉంటాడు అని పెద్ద డైలాగులు వేసింది . ఏదో అమర ప్రేముకురాళ్ళులా, మరి ఇప్పుడు ఈ పెళ్లి సంగతి ఏంటో "అని అంటున్న ప్రిఉష మాటలకి కోపంగా చూస్తాడు అరుణ్.

అరుణ్  చూపులకు కొంచెం భయపడ్డ ధైర్యం ప్రదర్శిస్తూ " ఏంటి అంత కోపంగా చూస్తున్నావ్ ,  విన్ను నీ ప్రేమిస్తున్నాను అని అంటూ , ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్లు అది మీ బ్యాచ్ లోనీ బాయ్స్ అందరితో  ఎంత క్లాస్ గా ఉంటుందో ఎవరికీ తెలియదు ,  ఇప్పుడేమో మీరందరూ బోర్ కొట్టినట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇంకొకడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది, దానికి పెద్ద అమర ప్రేమికురాలు లాగా ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని డైలాగులు. ఎవరికి తెలియదు అలాంటి అమ్మాయి గురించి, అది నీతో ఎన్నిసార్లు .." అని అంటున్న ప్రిఉష చెంప పగులుతుంది.

చెవులలో గ్యూ...మని రీసౌండ్ చెంప అంతా కూడా ఒక రేంజ్ లో నొప్పి పుడుతుంది, తనకు తెలియకుండానే కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటాయి , ప్రిఉష కి.

ఎదురుగా చూస్తే అరుణ్ కొంచెం దూరంలో చెయ్యి పైకి ఎత్తి నుంచుని ఉంటాడు చాలా కోపంగా , కానీ కొట్టింది అరుణ్ కాదు. 
ప్రిఉష అప్రయత్నంగా తన చెయ్యి తన చెంప మీద పెట్టుకొని కొట్టింది ఎవరో అని చూస్తుంది కొట్టింది సంధ్య,  అరుణ్ కాదు . 
సంధ్యా వెనకాలే కమల్ కూడా ఉంటాడు కానీ కమల్ ఏమీ మాట్లాడడు, అతని మొహం లో కూడా కొంచెం కోపం కనిపిస్తూ ఉంటుంది.
ప్రిఉష కోపంగా ఉండడంతో తన అలక తీరుస్తాడు కమల్ ,ప్రిఉష తర్వాత ఎలాగో ఎంగేజ్మెంట్ కి వెళ్ళలేదు కదా ప్రియా కి గిఫ్ట్  తీసుకోవాలి అని అంటుంది . సో కమల్ అరుణ్ నీ ప్రిఉష నీ  బయటకు తీసుకువెళ్లి ఏం కావాలో కొనిపేటమని అంటాడు . అదే విషయం కిందకి వెళ్లి సంధ్యా కి చెప్తాడు,  ప్రిఉష గిఫ్ట్ కొనాలి అనుకుంటుంది అని తెలిసి సంధ్యా గారు కూడా , సడన్ గా చెప్పడంతో ఏ గిఫ్ట్ ప్రియా కి తీసుకోలేదు తను కూడా ఒక గిఫ్ట్ సజెస్ట్ చేద్దామా అనుకొని  ఏ గిఫ్ట్ కొంటే బాగుంటుంది తనకి చెప్తామని ఇద్దరు పైకి వస్తారు అంతలో ప్రిఉష మాటలు మొత్తం వింటారు. ఆది  విని ప్రిఉష మనసులో ప్రియా మీద ఇంత ద్వేషం ఉందని తెలుసుకొని చాలా కోపం వస్తుంది ఇద్దరికీ.

పుట్టి పెరిగి ఇప్పటివరకు ప్రీఉష నీ ఎవరు కొట్టింది లేదు ఇప్పుడు వాళ్ళ అత్తయ్య ,తన  మామయ్య ముందే అలా తనని కొట్టేపాటికి చాలా ఏడుపు వస్తుంది .

" మామయ్య ....అత్తయ్య ..చూశారా నన్ను ఎలా కొట్టిందో " అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంది.

సంధ్యా కోపంగా "  ఇంకొక మాట ప్రియా గురించి తప్పుగా మాట్లాడావనుకో ఇంకొక చెంప కూడా పగలగొడతాను "  అని కోపంగా అంటుంది.

ప్రిఉష భయంతో తన ఇంకొక చెంప పైన చెయ్యి పెట్టుకొని " మావయ్య ...చూసారా అత్తయ్య నన్ను కొడతాను అంటుంది"  అని అంటుంది ఏడుపు గొంతుతో.

కమల్ గారు మెల్లగా మాట్లాడుతూ " నువ్వు మాట్లాడింది తప్పు తల్లి ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు ప్రియా గురించి "  అని అంటారు .

వాళ్ళ మామయ్య కూడా సంధ్య కే సపోర్ట్ చేయడంతో చాలా కోపం వస్తుంది ప్రిఉష కి.
ప్రిఉష ఏడుస్తూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ కమల్ ప్రిఉష వెనకాల వెళ్లడు.

అరుణ్ వైపు చేసి "  ప్రిఉష మనసులో ప్రియా మీద ఇంత ద్వేషం ఉందా " అని అడుగుతాడు కమల్. 

అరుణ్ కమల్ వైపు కోపంగా చూసి "  అవును డాడ్ నీ మేనకోడలకి ప్రియా అంటే నచ్చదు,  ప్రియా కి నాకు మధ్య ఏదో ఉంది అన్నది దాని అనుమానం,  దానికి ఎన్నో సార్లు నచ్చచెప్పి చూశాను , కానీ నా మాట ఎప్పుడూ వినదు. ఎప్పుడు ప్రియా ని సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది , ఇన్ఫాక్ట్  ప్రియా ని తన మాటలతో ఎన్నోసార్లు బాధ పెట్టింది , కానీ ప్రియా ఎప్పుడూ ప్రిఉష గురించి నెగిటివ్గా చెప్పలేదు నా దగ్గర , ఎప్పుడు కూడా ప్రిఉష నీ  హ్యాపీగా చూసుకోమనే అంటూ ఉంటుంది " అని అంటాడు.


" ఉషా,  ప్రియ ని తన మాటలతో హార్ట్ చేసిందా , ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు " అని అడుగుతాడు కమల్. 
ప్రిఉష ప్రియా నీ తన మాటలతో హార్ట్ చేసింది అని తెలిసి చాలా బాధపడతాడు కమల్, ప్రియా గురించి ఆయనకి బాగా తెలుసు , ప్రియా తన హ్యాపీనెస్ కన్నా పక్కన వాళ్ళ హ్యాపీనెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రియా క్యారెక్టర్ అంటే ఆయనకి బాగా ఇష్టం, ఇన్ఫాక్ట్ ప్రియా  నీ తన సొంత కూతురుగా భావిస్తాడు. ఆయన ఒకప్పుడు ప్రియ ని తన కోడలిగా తెచ్చుకుందాం అని కూడా అనుకున్నాడు, కానీ చెల్లికి ఇచ్చిన మాట కోసం ప్రిఉష నీ  అరుణ్ కిచ్చి పెళ్లి చేశాడు.

అరుణ్ కొంచెం కోపంగా " చెప్పినా ఏం చేస్తావు డాడీ నువ్వు ఎప్పుడు నీ మేనకోడలకే సపోర్ట్ చేస్తావు కదా"  అని అంటాడు.

" అరుణ్ నేను ఉషా కి సపోర్ట్ చేస్తాను అన్నమాట నిజమే,  కానీ ప్రియా విషయంలో మాత్రం కాదు"  అని అంటూ " నేను తనతో వెళ్లి మాట్లాడుతాను"  అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కమల్.

కొనసాగుతుంది..

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.