ఫంక్షన్ కి వెళ్ళిన గౌరీ రాత్రి ఎనిమిదయినా ఇంటికి రాకపోయేసరికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో తనే బండి తీసుకొని ఫంక్షన్ జరిగే చోటికి వెళ్ళాడు ప్రభ . ఫంక్షన్ ముగిసిపోయి ఇంటికి వెళ్లాలని నిలుచున్న గౌరీని ఓనర్ చెల్లి వచ్చి "మా అన్నయ్య చెప్పిన గౌరీ దేవి మీరేనా" అంటూ పలకరించింది.
అవునండి నేనే అంది గౌరీ.
చూస్తుంటే మీరు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు అడిగింది ఆమె.
అదేం లేదు మేడం ఏదైనా వెహికల్ వస్తుందేమోనని చూస్తున్న అంది గౌరీ కొడుకు కోసం అని చెప్పకుండా ఇలాగైనా వాడు వస్తాడేమోనని కాస్త ఆలస్యమైన అక్కడే నిలబడి ఉంది గౌరీ అలా మాట్లాడితే ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే వచ్చాడు ప్రభ.
అమ్మా! ఏడుకే ఫంక్షన్ అయిపోతుందన్నావు కదా ఏదైనా వెహికల్లో వచ్చేయొచ్చుగా లేదంటే ఫోన్ చేయొచ్చుగా అన్నాడు బండి తిప్పుతూ ప్రభ.
వెహికల్ కోసమే ఇక్కడ నిలుచున్నా ఇంతసేపయినా ఏది రాలేదు గౌరీ చెప్పడంతో సరే బండి ఎక్కమని చెప్పాడు ప్రభ .
ప్రభా బండి స్టార్ట్ చేస్తుంటే గౌరీ ఓనర్ చెల్లి వైపు చూడడంతో ఆమె బాయ్ చెప్పగా ఆలోచనలో పడింది గౌరీ.
మా ఓనర్ చెల్లెలు మధ్యతరగతి కుటుంబానికి చెందింది అంత ఆడంబరం లేదు . ఓనర్, బార్య భయంతో ఎప్పుడూ వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసింది లేదు. వాళ్ళు సొంతంగా బిజినెస్ చేస్తూ కొంతవరకు ఎదిగిన వారు. ఆమెకి ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయిది పెళ్లి అయిపోయింది. రెండవ అమ్మాయి చాలా గడుసుది అయినా మంచి రూపం లక్షణం ఉన్న అమ్మాయి మా వాడిని చూపించమని ఓనర్ ఎన్నిసార్లు చెప్పాడు. అయినా దానికి సమయం రాలేదని ఇన్నాళ్లు ఊరికే ఉన్నాను. ఇక ఇల్లు కొనేదానికంటే ముందు నుండే అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత పెళ్లి చేయొచ్చు అన్నది నా ఆశ . పెళ్లి పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు లెక్క. నాకు తెలిసి మావాడు ఆమెకి నచ్చి ఉంటాడని నాకనిపిస్తోంది. అని మనసులో అనుకుంటూ ఆనందంలో తెలియాడుతున్న గౌరీని ఇంటి దగ్గర బైకాపీ దిగమ్మ! ఇంటి దగ్గరికి వచ్చాము అని ప్రభ చెప్పే వరకు ఆలోచన నుండి బయటికి రాలేదు గౌరీ.
ఇదేంటి గౌరీ దేవి గారు ఇవాళ ఇంత పరధ్యానంలో ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారేంటి అన్నాడు తాళం తీస్తూ ప్రభ.
ఏం లేదు ప్రభ అక్కడ వాళ్ళు ఫంక్షన్ చాలా బాగా చేశారు అది గుర్తొచ్చింది అంతే అది గుర్తొచ్చింది అని చెప్పింది గౌరీ లోపలికి వెళ్తూ.
అమ్మ! నీ ముఖం వెలిగిపోతుందంటే ఏదో ఆనందంలో మునిగి తేలుతున్నావు లేదా మంచి వార్త ఏదో విని ఉంటావు నీ గురించి నాకు తెలియదా ఏంటి , కాసేపు ఓపిక పడితే ఆ సంతోషం మాటల రూపంలో బయటకు వస్తుందిగా అనుకుంటూ డోర్ వేస్తూ మొబైల్ తీసి చూడగా పది మిస్డ్ కాల్స్ వచ్చి ఉన్నాయి.
ఎవరై ఉంటారు అని చూస్తే పప్పు . ఏం జరిగింది అంటూ ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. పప్పు వీడికి ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అనుకుని మరొక్కసారి చేసిన బిజీ అని రావడంతో ఫోను పక్కన పెట్టి బెడ్ మీద పడుకున్నాడు.
పప్పు చామంతికి ఒకసారి ఫోన్ చేసి డబ్బులు కావాలి అని అడిగిన దానికి" నాకు తెలుసు మీ నాన్న పెయింటింగ్ వేయడానికి కిందపడి ఎముక ప్యాక్చరయిందని దానికి 50, 000 అమౌంట్ కావాలి.
నా దగ్గర 20,000 మాత్రమే ఉన్నాయి అని చెప్పడంతో అక్కడ హాస్పిటల్ లోనే కూర్చుని ఉంటాడు.
గీతిక తాతయ్యని ఎముకల డాక్టర్ దగ్గరికి వస్తూ ఉండగా చూసిన పప్పు అటు తిరిగి కూర్చుని ఉంటే వచ్చిన గీతిక. తనే మాట్లాడించి విషయం తెలుసుకుని మిగిలిన 30,000 నేను ఇస్తాను తర్వాత అని చెప్పినందుకు చాలా సంతోషిస్తాడు.
వెంటనే డాక్టర్లకి కట్టి బాగా ట్రీట్మెంట్ ఇప్పించమని చెబుతుంది గీతిక.
అలాగే చేస్తాను చాలా థాంక్స్ గీతిక అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు
ఇక. పై ఖర్చులకోసం తను దాచుకున్న డబ్బును ఇతర ఖర్చులకు, మందులు కొనడానికి అవుతుందని అనుకుంటూ డాక్టర్ కి లక్ష రూపాయలు కట్టడంతో ఆపరేషన్ చేశారు.
పప్పుకి మనసు కాస్త కుదుటపడడంతో నాన్నని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వచ్చాడు.
ప్రభ ఫోన్ చేయగా రిసీవ్ చేసి జరిగిన విషయం చెప్పడంతో "చ! నేను మొబైల్ మర్చిపోయి ఎంత పని చేశాను .ముందే తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండేది .ఎలాగో మీ సిస్టర్ నీకు సాయం చేసిందిలే." చూసావా! నీ రాఖీ బలానికి ఉన్న పవర్. ఇదే అన్నా చెల్లి అన్నా అనుబంధం అంటే. " సరేలే , ఇక ఆ విషయం గురించి నాకెందుకు నువ్వు నెలలోపు 30000 ఇస్తానని చెప్పావు కదా , ఎలా ఇస్తావు . నీకు వచ్చేది పదివేలు అని ప్రభ అడగడంతో నోటి మాటలు లేవు పప్పుకి.
పప్పు , నువ్వు చింతించొద్దు .నీ డబ్బుని నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను అది గీతికకి ఇవ్వు . పాపం తనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఏమో, సమయానికి దేవుడు తనని నీకోసమే పంపించినట్టున్నాడు. అని చెప్పి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి నాన్నని జాగ్రత్తగా చూసుకో అని ప్రభ చెప్పడంతో పప్పుకి కాస్త ధైర్యంగా అనిపించింది.
హాస్పిటల్ నుండి తాతయ్యను ఇంటికి తీసుకొచ్చిన గీతిక హాల్లోకి వదిలి తన రూమ్ కి వెళుతుంటే "గీతిక" అంటూ జేజి పిలవడంతో వచ్చి పక్కన కూర్చుంది గీతిక.
" గీతిక! ఈ మధ్య నీవు చాలా డల్ గా కనిపిస్తున్నావు" అన్న జేజి మాటలకి గీతిక ఏడుస్తూ "తాతయ్య ! నేనేం తప్పు చేశానని నాన్న నామీద అరిచి వెళ్ళిపోయారు. నాకు నాన్న తప్ప ఎవరున్నారు. పూర్తిగా విషయం తెలుసుకోకుండా నిందలేస్తే ఎలా. భరించే వాళ్లకి ఒక మనసు ఉంటుందని ఎదుటి వాళ్ళకి అర్థం కాదా. కంటితో చూసింది నిజమని నమ్మితే ఎలా .ఏం జరిగిందో తెలుసుకోవాలి గా . 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన పిల్లల మీద నమ్మకం లేకపోతే ఎలా. సమాజంలో అందరూ అందరిలా ఉండరు. ఎవరికివారు నచ్చినట్టు బతుకుతారు. అది ఇంత వయసొచ్చినా ఆలోచించరేంటి . నాకు ఆ మాటలు వింటుంటే బతకాలనిపించట్లేదు. కాకపోతే చనిపోతే తప్పు చేసానంటారేమోనని చనిపోలేకపోతున్నాను."అంటూ గీతిక ఏడ్చేసింది.
గీతికని ఓదారుస్తూ తాతయ్య "పోనీ నువ్వు జాబ్ కి వెళ్లొచ్చు కదమ్మా." అనేసరికి గుండెలో దడ పెరిగిపోతుంది గీతికకి. వీళ్ళకి ఆఫీస్ కి సంబంధించిన ఆఫీస్ కి సంబంధించి జరిగిన విషయాలేవీ తెలియదనుకుంటా. ఆ ప్రభ కూడా చెప్పలేదేమో మంచి పని చేశాడు. అందుకే ఆఫీస్ కి వెళ్ళమని తాతయ్య చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఆ సంఘటన గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అనుకుంటూ ఉండగా ' ఎందుకమ్మా అంత మౌనంగా ఆలోచిస్తున్నావు.నేను చెప్పేదేమంటే ఆఫీస్ కి వెళితే పనిమీద ధ్యాసతో ఈ విషయాలు కాస్త మరిచే అవకాశం ఉంది.'అని తాతయ్య చెప్పాడు.
పోనీలెండి తనకి ఆఫీస్ కూడా నచ్చలేదు ఏమో అందుకే తను వెళ్ళాలానుకోవడం లేదు అంది జేజి.
జేజి ! మీరు సరిగా అనే ఆలోచించారు . నాకు వారు జాబ్ కి తీసుకునేటప్పుడు ఇస్తామన్న జీతం నెల గడిచాక ఇవ్వలేదు. అందుకే నేను రానని చెప్పేసాను. వేరే ఏదైనా కంపెనీలో జాబ్ చూసుకుంటానని చెప్పింది గీతిక.
నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా .నాకు కావాల్సింది నువ్వు ఆనందంగా ఉండడం అంద జేజి.
అలాగే, జేజి తప్పకుండా మీరు చెప్పినట్టే ఉంటాను. అని చెప్పి తన రూమ్ కి వెళ్లి కుర్చీ మీద కూర్చుని ఇంటి పైకప్పువైపు చూస్తూ 'నెక్స్ట్ నా స్టెప్ ఏంటి 'అనే ఒక ప్రశ్న మిగిలింది గీతికకి.
ఇంతేనా ఆడపిల్ల జీవితం అగ్నిగుండంలో పడి విలవిలా తన్నులాడుతూ ఉండడమేనా. పూల పాన్పు పై పడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు కష్టపడి ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లినా అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు .ఏం చేయాలి "అని అనుకుంటూ ఉండగా చిన్నప్పుడు తెలుగు మాస్టారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి గీతికకి.
"మానవ ప్రగతికి కావాలి ఒక ఆశయం
ఆ ఆశయమే అవుతుంది ప్రగతి సాధన కి ఒక ఆయుధం
ఆశయాన్ని మలచుకోవడంలో
1. " అగ్నిని రాచే కొద్ది రాజుకుంటుంది
అదే అగ్నిని ఆర్పే కొద్దీ ఆరిపోతుంది
అలాగే
సమాజం అవమానించినా
అపహేళన చేసినా
అనుమానించినా
అడ్డంకు ఎన్ని అడ్డంకులెదురైనా
యువతా మేలుకో ఆశయాన్ని మలచుకో.
2. ఆశయాన్ని సాధించడంలో
ప్రవహించే నీటికి అడ్డు కట్టినా
పొలం వైపు మళ్ళించినా
కట్టలు తెంచుకొని ఉరుకులు , పరుగులతో తన గమ్యం అయిన సముద్రాన్ని చేరుతుంది
అలాగే
సమాజంలో అవమానాన్ని అణగదొక్కి
అపహేళనని భరించి
అడ్డంకి ని అధిగమించి
ప్రగతి బాటననుసరించి
యువతా మేలుకో నీ ఆశయాన్ని సాధించుకో. "
అన్న తన తెలుగు మాస్టర్ మాటలను గుర్తు చేసుకుని చైర్ లో వెనక్కి, ముందుకు ఊగుతూ ఒక వారం విశ్రాంతి తీసుకొని ముందు జాగ్రత్త వహిస్తూ మరొక కంపెనీలో ఫ్రెషర్ అని చెప్పి జాబ్ కి చేరుకోవాలి అని నిర్ణయించుకొని కుర్చీ మీద నుండి లేచి లేచింది గీతిక.
ఇక పడుకోవాలని అనుకొని బెడ్ వైపు తిరగడంతో ఎందుకో ఫోన్ తీసి ఫొటోస్ చూడాలనిపించి నారాయణ బంగారం ల ఫోటోలని చూస్తూ "అమ్మా, నాన్న, తమ్ముడు మీరు నాకు కావాలి . మీరు నన్ను వదులుకున్న నేను మిమ్మల్ని వదులుకోను . అమ్మా నాపై ఉన్న నీ చల్లని ప్రేమ ఏమైందమ్మా. చేయని తప్పుకు భరించరాని శిక్ష వేసి 19 సంవత్సరాలు అవుతోంది. నేనూ మనిషినే కదా . నాకు ఒక మనసు ఉంది కదా. ఆ మనసులోని ఘోష ఎందుకు వినిపించ లేదమ్మా. ఈ బాధని తట్టుకోలేకపోతున్నానమ్మ. నీ ప్రేమ రుచి చూసిన దాన్ని ఆ రుచి మళ్ళీ కావాలి. నీకు ఇష్టమైన ప్రియ గీతిక అన్న పేరు పెట్టి నన్ను పూర్తిగా మరచిపోతున్నావు. ఇది నీకు తగునా! నువ్వేన్నాళ్ళిలా ఉంటావో నేను చూస్తాను. కచ్చితంగా నీ ప్రేమని పొందుతాను అంటుంటే కళ్ళు నీటితో నిండి ఒక కన్నీటి బొట్టు సెల్ మీద పడడంతో కళ్ళు మసకబారగా తుడుచుకొని ఫోటో క్లోజ్ చేసి ఒక్క క్షణం ఏడుస్తూ బెడ్ మీద పడిపోయి బోర్లా పడుకొని అటు ఇటు తిరిగి నిద్ర రాకపోయేసరికితలెత్తి చూస్తూ ఉండగా జేజి వచ్చి "గీతికా పడుకో నువ్వు ఉదయాన్నే వెళ్లాలని చెప్పావు కదా అని చెప్పడంతో నిద్ర పోతుంది.