లవ్లీ గురించి పప్పు అడిగినప్పుడు చెప్పిన తర్వాత మంచికాలం రావాలంటూ కూర్చుంటే ఎప్పటికీ రాదు. పాజిటివ్ థింకింగ్ ఉంటేనే కచ్చితంగా వస్తుంది. అది ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు అని బాధపడ్డాడు ప్రభ.
పోనీ లేరా తను చాలా బాధలో ఉంది అని పప్పు అనడంతో బాధ ఉందని చచ్చేవరకు బాధపడుతూనే ఉండాలా,? బాధను దిగ మింగి ఆనందాన్ని వెతుక్కొని జీవితాంతం బతికి చావచ్చు కదా "అని ఈసారి ప్రభా వాయిస్ రైజ్ అయ్యింది.
ఆమ్మో! వీడు చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు అనుకుని " ప్రభా ! ఆ అమ్మాయి కచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పాపం బతికినా శవంళా మిగిలిపోయింది. తేరుకోవాలంటే కాస్త సమయం అవసరం అన్నాడు పప్పు.
సమయం జీవితాంతం ఉంటుంది.కానీ జీవితం చాలా చిన్నది. అసలు తను నా గురించి ఏమనుకుంటుంది.నన్ను గడ్డి పోచలా తీసి పారేసింది. "నువ్వే చెప్పావుగా బతికినా శవంలా మిగిలిందని మరి బతికిన వారితో కలిసి ఉండదే కష్టం అలాంటిది ఆ బతికిన శవంతో కలిసి ఉండేదనేది ఒక కల." అందుకే నేనింక ఎక్కువ ఆలోచించకూడదని అనుకుంటున్నాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండడమే వద్దనుకుంటున్నాను. ఎలాగో అమ్మ ఫోన్ చేసింది కాబట్టి ఓనర్ కి చెప్పి ఊరు వెళ్తా అన్నాడు ప్రభ.
ప్రభ ప్లీజ్ ఆలోచించారా అన్నాడు పప్పు దగ్గరికి వస్తా.
ఏంట్రా ఆలోచించేది " మనిషి సహనానికి ఒక హద్దు ఉంటుంది. అది నశించిన తర్వాత కోపం మొదలవుతుంది.కోపానికి ద్వేషం జత కడుతుంది. ద్వేషం మొదలయితే అది ఎంతవరకు వెళుతుందో లవ్లీ కథ తెలుసుకున్నావుగా , అసలు నీకు ఒక విషయం తెలుసా ! మనిషికి పొగరుంటే గుణపాఠం చెప్పి ఆ పొగరుని తగ్గించవచ్చు. కానీ చాదస్తపు మనుషులకి ఏ పాఠం చెప్పినా వారి చాదస్తం తగ్గించడం చాలా కష్టమని నాకనిపించింది . కాబట్టి నేను ఊరు వెళ్లాలని అనుకుంటున్నాను అని బట్టలు సర్దుకుని ఊరికి వెళ్ళాడు ప్రభ.
*
కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన గీతిక ఏం చేయాలో అర్థం కాక మనసంతా ఆందోళన ఉండడంతో జేజి దగ్గరికి వెళ్లి కూర్చుంది.గీతిక వచ్చి కూర్చోవడం చూసిన జేజి తను ఇంకా బాధ పడుతూనే ఉంది అని తెలుసుకొని తనని మాట్లాడిస్తూ ఉండగా తాతయ్య వస్తాడు
తాతయ్యని చూసిన గీతిక అక్కడ జరిగిన విషయాలకు వీళ్ళతో చెప్పడం వద్దు అని చెప్పలేదు చెబితే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటూ ఉండగా తాతయ్య కల్పించుకొని గీతిక అలా ఆఫీస్ కి వెళ్లి రాకూడదా కొన్ని రోజులు వెళితే పని మీద మనసు పడితే ఈ బాధని మర్చిపోగలవు అన్నాడు తాతయ్య.
తాతయ్యకి జరిగిన విషయం తెలీదు కదా అందుకే అలా చెబుతున్నారు అనుకుని వెళ్తాను అని చెప్పింది గీతిక .
*
రాణికి మూడు నెలల పాటు విశ్రాంతి అవసరం అనీ డాక్టర్ చెప్పడంతో కృష్ణ ఆఫీస్ వర్క్ , కంపెనీ బాధ్యత అంతా తనే చూసుకుంటున్నాడు. కృష్ణ గీతికతో "నువ్వు సడన్గా డ్యూటీ కి రావడం మానేస్తే మీ మేడంకి కూడా అనుమానం వస్తుంది కాబట్టి వచ్చి రిజైన్ లెటర్ ఇమ్మని చెప్పడంతో ఆఫీస్ కి వచ్చి లోపలికి వెళ్ళగా అక్కడ తన పని చేసే ఛాంబర్ వైపు చూసేసరికి మాలతి, లవ్లీలు గుర్తుకు రావడంతో సాటి ఆడదానిని కూడా చూడకుండా ఎంత పని చేశారు. అనుకుంటూ మరొక చెంబరు వైపు చూడగా జున్ను, గుండులు గుర్తుకు రావడంతో వీళ్లిద్దరూ ఆరోజు ఉండి ఉంటే నాకు ఏదో విధంగా సహాయపడి నన్ను అక్కడికి పోనేకుండా చేసేవాళ్లు. అందుకే " ఒక నాణెం తయారు చేయడానికి రెండు బొమ్మలు ముద్రించారు ఒకవైపు మంచి అయితే మరొకవైపు చెడు అన్నట్టు " వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అందుకే నా జీవితంలో ఎవరిని నమ్మకూడదు . జాగ్రత్త గా అడుగు వేయాలి అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి చూస్తే లోపల కృష్ణ ఎవరితోనో మాట్లాడుతుండడం చూసి అక్కడే నిలబడింది. వాళ్ళు లేచి డోర్ వైపు వస్తూ ఉండగా వాళ్ళు ఎవరో ఏంటో వారి నుండి మరో ప్రమాదం వస్తుందేమో అనుకొని తను పక్కకు వెళ్లి అటు వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళు వెళ్లిపోగానే పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళింది గీతిక.
కూర్చో గీతిక ఎలా ఉన్నావ్ ,అడిగాడు కృష్ణ.
ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాను సర్ అంటూ తను తెచ్చిన రిజైన్ లెటర్ ని ఇచ్చింది గీతిక.
గీతికా కూర్చో , నీలో ఇంకా భయం పోయినట్టు లేదు. మరచిపోవడానికి ప్రయత్నించు. ధైర్యంగా ఉండడం నేర్చుకో. అనే కృష్ణ చెబుతూ ఉంటే "మరచిపొమ్మని చెప్పడం చాలా ఈజీ సార్ కానీ ఆ సమస్య వల్ల మరో సమస్య నాకు పుట్టుకొచ్చిందని మీతో నేను చెప్పలేను" అని గీతిక మనసులో అనుకుంటూ ఉండగా కళ్ళలో నీళ్లు తిరిగా యి గీతికకి.
" గీతిక! ఏడుపు నీకు ఎప్పుడు సమాధానం కాకూడదు. అది కేవలం మన మనసు బరువు దించే ఓదార్పు మాత్రమే అని గుర్తు పెట్టుకో. "అనే కృష్ణ చెబుతుంటే సర్ నాకు రాత్రి జ్వరం వచ్చింది ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అని చెప్పగా సరే గీతికా నీవు ఎందుకు ఇలా చెబుతున్నావో నాకు అర్థమైంది నాతో కూడా నీకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు అని మనసులో అనుకున్నాడు కృష్ణ
"సర్ నేను ఇక వెళ్లి రానా" అడిగింది గీతిక.
సరే , గీతిక జాగ్రత్త ! కొన్నాళ్లు నువ్వు నీ సొంత ఊరికి పోతే బాగుంటుంది. దీన్నంతా మరచి హాయిగా ఉండు అని కృష్ణ చెబుతుంటే రాని నవ్వు నవ్వుతూ అలాగే సర్ ట్రై చేస్తాను అని చెప్పి బయటకు వస్తూ ఉంటే "నాకంటూ నేను పుట్టిన ఊరు ఉందా? పుట్టించిన తల్లిదండ్రులు ఉన్నారా? ముందు వెనక పుట్టినా అక్క చెల్లి, అన్నదమ్ములు ఉన్నారా , నాకంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో నాకు నేనే అన్ని చావైనా బతుకైనా నాకు నేనే కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను. " అని మనసులో అనుకుంటూ ఒడిఒడిగా వచ్చి తీరా ఇంటి దగ్గర రోడ్డు దాటుతుండగా పప్పు ఎదురు రావడంతో కనీసం అతని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే గీతిక! అని పప్పు పలకరించిన మాటలు వినబడనట్టు గేటు తీసుకొని లోపలికి వెళ్ళింది గీతిక
*
ప్రభ ఇంటికొచ్చినప్పటి నుంచి పరిశీలించిన గౌరీకి కొడుకు ఎందుకో ముందులా కనిపించకపోయేసరికి ఆలోచనలో పడింది గౌరీ.వీడెందుకు ఇలా ఉంటున్నాడు అక్కడ ఏమైనా సమస్య వచ్చిందా, నేను ఏదో మంచి విషయం చెబుదామని ఫోన్ చేసి రమ్మని చెబితే వాడు నేను చెప్పిన పని చేసే మూడ్లో లేడు కాబట్టి రెండు రోజులు చూసి తర్వాత చెబుతాలే అనుకుంది గౌరీ. అంతలో ప్రభ తమ మేడం ఇంటికి వెళ్లి రావడంతో ఏరా! ఆంటీ వాళ్ళు బాగున్నారా అడిగింది గౌరీ.
తను మా మేడం, ఆంటీ కాదు అని నేను ఎన్నిసార్లు చెప్పాను . అమ్మ ! నేను ఆంటీ అని పిలవను. మేడం అనే పిలుస్తా. అని ప్రభ అనేసరికి సరే నీ ఇష్టం ఎలాగైనా పిలుచుకోగానే పోయి ముందు రెడీ ఐ రా ఫంక్షన్ కి వెళ్ళాలి.
ఏం ఫంక్షన్ అడిగాడు ప్రభ.
మా ఓనర్ వాళ్ళ ఇంట్లో సీమంతం ఉంది . అందుకే వాళ్ళు నిన్ను తప్పకుండా తీసుకుని రావాలని చెప్పారు బయలుదేరు వెళ్దాం.
ఆడవాళ్ళ ఫంక్షన్ కి ఎవరు వస్తారమ్మ , నేను రాను నువ్వే వెళ్లి రా అన్నాడు ప్రభ.
అది కాదురా వాళ్లు నిన్ను తీసుకురమ్మన్నారు అంది గౌరీ.
అమ్మ ! నేను రానని చెప్పానుగా నువ్వు వెళ్లిరా నాకు ఎందుకో అలసటగా ఉంది , నిద్రపోవాలి కాసేపు నిద్రపోవాలి ప్లీజ్ అని చెప్పి బెడ్ మీదకి వెళ్ళాడు ప్రభ .
" ఏటి దగ్గరికి తీసుకు వెళ్లిన గుర్రానికైనా గొట్టంతో నీళ్లు పోయచ్చు కానీ వీడు మాత్రం వాడికి నచ్చినట్టే ఉంటాడు కానీ ఎవరి మాట వినడు . ఇంతకీ వాళ్ళ అడిగితే నేనేం అబద్ధం చెప్పాలో మరి అనుకొని రెడీ అయ్యి వెళ్ళింది గౌరీ.
ప్రభ గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది . అయినా తను ఫోన్ మోగుతున్న శబ్దం వినే స్థితిలో లేడు . అంతలో ఫోన్ మోగడం ఆగిపోయింది. అంతలో డోర్ ని గట్టిగా తట్టే శబ్దం రావడంతో మెలకువ వచ్చిన ప్రభ ఆవలిస్తూ ఎన్నాళ్ళయిందో నేను ఇలా నిద్రపోయి బంగారం లాంటి నిద్రను చెడగొట్టారు కదరా ఎవరది , అంటూ తలుపు తీయగా ఎదురుగా గోవిందు కనిపించడంతో నవ్వుతూ రారా ఇప్పుడేనా రావడం అంటూ లోపలికి పిలిచాడు ప్రభ.
లోపలికి వచ్చిన గోవిందు సోఫాలో కూర్చుని ఆవులిస్తుంటే 'ఏరా అంతగా అలసిపోయావా , పెళ్లి అంటే తమాషాన ఏంటి , పట్టు ఈ నీళ్లు తాగి కాసేపు నిద్రపో అలసట తీరుతుంది చెప్పాడు ప్రభ.
ఏం నిద్ర రా బాబు . పెళ్లి ఫిక్స్ అయిందని మాటే కానీ అందర్నీ పిలవడానికి అటు ఇటు తిరిగి తిరిగి కాళ్లలో నొప్పి పెడుతున్నవి .ఈ శరీరం అంతా తొక్కిన చింతపండులో అయిపోయింది.
ఇంకా ఎంత మాత్రానికే అలా అంటే ఎలా అన్న ప్రభ ప్రశ్నకి విస్తుపోయి చూశాడు గోవిందు
ఏంట్రా ముఖాన్ని అలా పెట్టావ్ లతిక లాంటి అమ్మాయి నీ ఇంటికి వస్తుంటే ఆ మాత్రం కష్టపడలేవా మరి అన్నాడు ప్రభ.
అవునవును , నాకేమో వారం రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత ప్రారంభమయ్యేది ఎవరిదో "తన దాకా వస్తే గాని ఏదైనా తెలిసేది లేదంట " నీకు అలాంటి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు చైర్ మీద వెళ్ళఖిల పడుకుంటూ గోవిందు.
గోవిందు ! ముందు వేడి వేడి కాఫీ తెస్తాను తాగి కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత వెళ్ళదు గాని అన్నప్రభ వంటగదిలోకి వెళ్లి అమ్మో ! వీడి దగ్గర అనవసరంగా పెళ్లి గురించి మాట్లాడి ఇరుక్కుపోయేలా ఉన్నానే అందుకే మాట మళ్ళించాలి అనుకొని కాఫీ తెచ్చి ఇవ్వగా గోవిందు తాగుతూ "అమ్మ ఎక్కడికి వెళ్లారు ఇంట్లో ఇంతవరకు కనిపించలేదు అమ్మని పిలవరా ఈ పెళ్లి కార్డు ఇచ్చి వెళతాను "అన్నాడు గోవిందు.
అమ్మ లేదు ఏదో ఫంక్షన్ అని బయటకెళ్ళింది రాత్రికి ఏమైనా రావచ్చేమో అన్నాడు ప్రభ.
అలాగా అయితే నువ్వే కుదురుగా కూర్చో అని చెప్పేసరికి పక్కన కూర్చోగా లగ్న పత్రికను తీసుకుని రెండు చేతులతో పట్టుకొని నా పెళ్ళికి నువ్వు , అమ్మ తప్పకుండా రావాలి అని పిలుస్తాను గోవిందు.
నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుంది రా అందరికంటే ముందే వస్తాను చూడు అని చెప్పగా గోవిందు ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.