మొక్కట్రావ్ పేట వూరు..కరీంనగర్ కి 70 కిలోమీటరు దూరం లో వుంది..
కరీంనగర్ నుంచి మంచిర్యాల రహదారి కి 5 కిలోమీటరు దూరం లో వుంది ఆ వూరు. రెండు కొండల మధ్య నుంచి ఆ వూరికి కి దారి వుంది..
వూరు చాలా ప్రశాంతంగా వుంది.
వూరి ప్రారంభం నుంచి చివరి వరకు ఒక పెద్ద సీసీరోడ్ వుంది.
ఆ సీసీ రోడ్ దాటి అలాగే ముందుకు వెళ్తే కొంచం దూరం లో గోదావరి వస్తుంది.
ఆ వూరికి దగ్గరలోనే కోటి లింగాల గుడి వుంది.
శాతవాహనుల మొట్ట మొదటి రాజధాని కోటిలింగాల అదే ఈ గుడి.
ఊరిలోకి అందరం ట్రాక్టర్ లో వెళ్లి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము.
ఒక గోళ్లవారి ఇంట్లో అద్దెకు దిగాము మేము.
ఒక రూమ్ లో బాబాయ్ వాళ్ళు వుండేది..ఒక రూమ్ లో ఇంటి ఓనర్ వాళ్ళు వుండేవారు.
అదే ఇంట్లో హల్ లో మేము అక్కడే వండుకొని తిని పక్కకు పడుకొనే వాళ్ళము.
మొదట్లో వాళ్లకు మా మీద కొద్దిగా తప్పుడు అభిప్రాయం వుండేది.
ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళని ఇంట్లో వుంచుకుంటునావు..
అందరు మంచిగా వుంటారా !అని అన్నారు.
కానీ ఈ ఇంటి యజమానురాలు మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు.
ఆ ఇంట్లో ఒక 45 ఏళ్ళ తల్లి ..ఒక 18 ఏళ్ల కొడుకు వుండే వారు.
కొన్ని రోజుల తరువాత మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లాగా మారిపోయాము.
చుట్టూ వుండే గొల్లవారిలో మేము కలిసిపోయాము.
అక్క, నేను పక్కన వుండే ఒక ఇంటికి టీవీ చూడటానికి రోజు వెళ్ళేది .
వాళ్లకు ఒక చిన్న బాబు వుండే వాడు..అతని ఎత్తుకొని ఆడించే వాళ్ళం.
తొందరగానే మేము అందరితో కలిసిపోయాము.
నేను నా 5వ తరగతి చివరి పరీక్ష రాయనే లేదు.
ఎండాకాలం అన్ని రోజులు అమ్మ వాళ్ళతో పని దగ్గరికి వెళ్లి..అక్కడ ఈత పల్లు..అల్లనేరుడు పల్లు తింటూ కాలక్షేమాం చేసేది.
వేసవి కాలం అయిపోయిన తరువాత నాన్న నన్ను మళ్ళీ ఈ వూరికి 10 కిలోమీటరు దూరం లో వుంటే వెల్గటూర్ అనే వూరికి సెకండరీ స్కూల్ లో జాయిన్ చేసాడు.
5 తరగతి లాస్ట్ ఎగ్జామ్ వ్రాయకుండనే 6 వ తరగతి లో జాయిన్ అయ్యాను.
అదేంటో కానీ ప్రైమరీ నుంచి సెకండరీ అనేసరికి ఏదో ఫీలింగ్ వుండేది.
6 వ తరగతి రాగానే మేము పెద్ద వాళ్ళము అయిపోయాము అనిపించేది.
నన్ను ఒకదాని మాత్రమే..స్కూల్ లో జాయిన్ చేశాడు నాన్న..
అక్కను పూర్తిగా స్కూల్ మానిపించేసాడు.
ప్రతి రోజూ స్కూల్ కి ఒక ఆటోలో నాతో పాటు ఇంక ఇద్దరు ఇదే వూరు నుంచి వచ్చి అదే స్కూల్ లో ఆరో తరగతి చదువుతారు.
వారితో నేను కూడా రోజు ఆటో లో స్కూల్ కి వెళ్లి వచ్చేది.
నాకు స్కూల్ చాలా బాగా నచ్చింది.
స్కూల్ ముందు పెద్ద గ్రౌండ్ వుంది..ఆ గ్రౌండ్ లో చాలా మంది వాలీబాల్ ఆడుతున్నారు.
స్కూల్ కి వెళ్ళిన కొన్ని రోజులకే నేను బాగా చదువుతున్నాను అని టీచర్ నన్ను క్లాస్ లీడర్ నీ చేసింది.
నాకు ప్రతి స్కూల్ లో ఒక ఫేవరెట్ టీచర్ వుండేది. ఈ స్కూల్ లో తనూజ madam అంటే ఇష్టం వుండేది.
ఆ స్కూల్ లో కంప్యూటర్ క్లాస్ లు కూడా కొత్తగా నేర్పిస్తున్నారు.
నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం..నేను కంప్యూటర్ లో డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నాను.
కొన్ని రోజులు గడిచిన తరువాత నేను కూడా కొంచం కొంచం గా వాలీబాల్ ఆడడం నేర్చుకున్న.
Pt sir నా ఆటను చూసి నువు వాలీబాల్ బాగా ఆడుతునన్నావు.
ఇంక కొంచం ప్రాక్టీస్ చెయ్ నేను నిన్ను వాలీబాల్ టీంలోకి తీసుకుంటాను అని చెప్పారు.
సర్ అలా అనడం తో నేను రోజు ప్రాక్టీస్ ఎక్కువగా చేసేది.
అయితే ఒక రోజు సాయకాలం స్కూల్ అయిపోయిన తరువాత వాలీబాల్ ప్రాక్టీస్ కోసం అని నేను నా ఫ్రెండ్ అక్కడే వున్నాము.
మేము ఆటలో పడి ఆటో టైమింగ్ మరిచిపోయాము.
అప్పటికే చాలా లేట్ అయింది.మేము ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి మా ఆటో వెళ్ళిపోయింది.
వేరే ఆటో లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాము.
అప్పటికే చాలా లేట్ అయింది..నేను ఆటో దిగి ఇంటికి రాగానే అమ్మ నన్ను పొట్టు పొట్టు కొట్టింది.
ఇంత సేపు ఏం చేశావు..మేము ఇక్కడ ఎంత టెక్షన్ పడుతున్నాం... ఇంత లేట్ గా వస్తావా ..ఇంటికి అని కొట్టింది.
వాలీబాల్ ఆడడం వల్లనా లేట్ అయింది అని అమ్మకు ఏడుచుకుంటూ అమ్మకు. నాన్న కు చెప్పాను.
రేపటి నుంచి టైం కి ఇంటికి రావాలి వాలీబాల్ లేదు ఏం లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
దానితో ఆ రోజే నేను వాలీబాల్ ఆటను వదిలేసాను.
నేను అమ్మాయిని కావడం వలనే నాకు యిష్టం అయిన ఆటను వదులుకోవాల్సి వచ్చింది ఆనిపిచింది నా మనసుకు.
స్కూల్ లేని టైం లో నేను అమ్మ వాళ్ళతో పనికి వెళ్ళేది అక్కడ నేను ట్రాక్టర్ నడిపేది.
ఒక రోజు ఇసుక క్వారి లో ఒక లారీ కింద ఆడుకుంటూ వున్నపుడు.. ఏదో మాట మిద మా చెల్లె బాగా చదువుతుంది అని మా అక్క వేరే వాళ్ళతో చెబుతుంది.
ఆ మాట విన్న ఒక లారీ డ్రైవర్ .. మీ చెల్లె
బాగా చదువుతే నేను ఒక లెక్క వేస్తాను అది చేయమను..
మీ చెల్లి ఆ లేక్కసాల్వ్ చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాడు.
ఆ లెక్క 9 9 9
8 8 8
7 7 7
+ -----------
9 9 9
-----------
ఇలా అది ఎలా ఏసి కూడిన 999 రావాలి.
ఇది చేయమని ఒక పేపర్ మీద రాసి ఇచ్చాడు.
నేను ఆ ఛాలెంజ్ ని తీసుకున్న .
ఎలా గయిన ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని ఒక 2 డేస్ కష్టపడి ఆఖరికి దానిని సాల్వ్ చేశాను.
మా అక్క... మా ఫ్యామిలీ వాళ్ళు సంతోష పడ్డారు.
ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన అని తనకి చెబుదాం అంటే తను ఎవ్వరో మాకు తెలియదు.
మళ్ళీ ఇంకో సారి తను ఇసుక క్యారీలో కనిపించలేదు.
ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యడంతో నా మీద నాకు ఇంక నమ్మకం పెరిగింది.
నేను గట్టిగా కష్టపడితే ఏదయినా చెయ్యగలను అని నమ్మకం కుదిరింది.
ఇలా కొన్ని రోజుల తరువాత ఒక రోజు మా స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ను వాళ్ళ మ్యాథ్స్ సర్ వాళ్ళను ఒక క్వెషన్ అడిగాడు.
దానికి వారి క్లాస్ లో ఎవరు సమాధానం చెప్పలేదు.
తరువాత వాళ్ళ సర్ ఇలా అన్నాడు..6 వ తరగతిలో క్లాస్ ఫస్ట్ ఎవరో వాళ్ళని తీసుకొని రా అని ఒకరిని మా క్లాస్ కి పంపించారు.
మా madam కి విషయం చెప్పడం తో మా madam నన్ను వెళ్ళమని చెప్పింది.
నేను 9 వ క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.వాళ్ళ అందరు స్కూల్ గ్రౌండ్ లో కూర్చున్నారు.
నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారో నాకు అర్ధం కాలేదు.
అందరు నన్నే చూస్తున్నారు.
నాకు చాలా భయం గా అనిపించింది .
వాళ్ళ మ్యాథ్స్ సర్ ఇలా రా అని దగ్గరి కి పిలిచి " అంకెలు ఎన్ని ? అవి ఏంటివి? అని అడిగాడు.
నేను ఆలోచిస్తూ..భయపడుతూ ..0..9 అని చెప్పాను.
దానితో సర్ వాళ్ళని తిట్టి ..
నన్ను క్లాస్ లో అందరినీ ముక్కు పట్టుకొని చెప్పదేబ్బ కొట్టు అని చెప్పాడు.
నేను భయపడుతూ అటు ఇటు చూసాను.
సర్ "ఏం భయపడకు నేను చెబుతున్న కదా కొట్టు అమ్మాయి" అన్నాడు.
దానితో క్లాస్ మొత్తని బాయ్స్ అండ్ గర్ల్స్ నీ చెప్ప దెబ్బ కొట్టాను.
పాపం ఆప్పుడు వాళ్ళు అస్సలు ఎంత బాధపడ్డారో తెలియదు.
స్కూల్ లో అందరు చూస్తుండగా వాళ్ళను అందరినీ కొట్టాను.
తరవాత స్కూల్ మొత్తం నా గురించి మాట్లాడుకున్నారు.
కొన్ని రోజుల తరువాత నాన్న పని మీద వచ్చిన డబ్బులతో పాత ట్రాక్టర్ అమ్మేసి ఒక కొత్త మహేంద్ర ట్రాక్టర్ తీసుకున్నాడు.
ఇదే టైంలో మాకు కరీంనగర్లో ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది.
కొంచెం కొంచెం మా ఆర్థిక స్థితి మారుతూ వచ్చింది.
కొన్ని రోజుల తర్వాత మేము అద్దెకు ఉంటున్న ఇంటి పక్కకు ఒక ఇంట్లో ఒక సంఘటన జరిగింది అది మా అందరిని చాలా బాధకు గురి చేసింది.
ఇంటి పక్కన ఒక 35 ఏళ్ల అబ్బాయి ఉండే తన మొదటి భార్య చనిపోవడంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్యకి ఒక కొడుకు ఉన్నాడు.
రెండవ భార్యకు ఒక కూతురు మళ్ళీ తను కడుపుతో ఉంది .
తన కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారు.
తను కడుపుతో ఉన్న వ్యవసాయం పనులు ..ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉండేది.
తను చాలా లావుగా.. తన కడుపు చాలా పెద్దగా ఉండేది.
తను కూడా చూడడానికి చాలా అందంగా ఉండేది .
ఒక రోజు బావి దగ్గరికి పనికి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా తనకి నొప్పులు వచ్చాయి.
పల్లెటూరు కాబట్టి అంబులెన్స్ కు ఫోన్ చేసిన చాలా సేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది.
అప్పటికి తనకి పెయిన్స్ చాలా ఎక్కువ అయ్యాయి bp కూడా బాగా పెరిగిపోవడంతో పిండం పైకెక్కింది.
తను అంబులెన్సు లో వెళ్తూ ఉండగానే బీపీ ఎక్కువ అయ్యి చనిపోయింది.
దారి మధ్యలోనే అంబులెన్స్ను ఆపుచేసి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారు.
ఈ సంఘటన ఊరు మొత్తాన్ని శోకసంద్రంలో ముంచింది.
ఆ చిన్న పిల్లలను చూస్తూ ఉంటే చిన్నపిల్లను అయిన నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది.
మన సమాజం లో భార్య చనిపోతే భర్త ఒక ఏడాది గడవక ముందే ఇంకో భార్యని చేసుకుంటారు.
కానీ
అదే భర్త చనిపోతే భార్య మాత్రం ఆ పిల్లలను చూసుకుంటూ జీవితాంతం బ్రతికేయాలి.
ఏందుకు అలా ..