“Gem in the Soil – A Real Life Story Part 3 in Telugu Biography by rajeshwari shivarathri books and stories PDF | మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 3

Featured Books
Categories
Share

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 3

నా చేతులుంచి ఫోన్ కింద పడగానే నాన్న నా దగ్గరకు వచ్చారు.
వచ్చి నన్ను కొట్టబోయాడు..ఇంతలో అమ్మ వచ్చి ..."అనుకోకుండా పడిపోయింది ఏం అన్నాకు" అని నాన్న కు చెప్పింది.

నాన్న ఎత్తిన చేయిదించి  ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు.
నేను ఏడుస్తూ మూలకు కూర్చున్నాను.

తరువాత అమ్మ వచ్చి నన్ను బుజ్జాగించింది.
నాన్న ఆ ఫోన్ తీసుకొని షాప్ కి వెళ్లి మళ్ళీ వేరే కొత్త ఫోన్ తెచ్చాడు.

ఈసారీ నాన్న నాకు అసలు ఫోన్ ఇవ్వలేదు.
నేను కూడా అడగలేదు ఇకా..

ఇలా కొన్ని రోజులు గడిసిన  తర్వాత నాన్న పని చేసే  ఒక  సారు ద్వారా ఒక పెద్ద పని వచ్చింది.
ఈ పని వల్లనా మా జీవితాలే మారిపోయాయి.

ఆ పని కోసం అమ్మనాన్న పని జరిగే వేరే వూరికి వెళ్లాల్సి వచ్చింది.

మమ్మల్ని తీసుకొని వెళ్తే మా చదువు పాడవుతుంది అని..
పక్కన  ఉన్న గుడిసెల వాళ్లకు చెప్పి,
అమ్మ–నాన్న ఇంకా మిగతా వాళ్లు కలిసి ..మొత్తం పదిమంది దాకా అక్కడికి వెళ్లారు.

అక్కడికి వెళ్లి పని చేస్తే డబ్బులు బాగా వస్తాయని,
ఇక్కడ మమ్మల్ని విడిచి పెట్టీ వెళ్లారు.

మేము చిన్న పిల్లలం కాబట్టి
మా పెద్దమ్మ కొడుకు.. కూతుర్ని ..మాకు తోడుగా ఉంచారు.
మా అన్న కూడా మాతో పాటు స్కూల్లో కి వచ్చేవాడు 

మా అన్న, మా అక్క ఆరో తరగతిలో చదువుతున్నారు.
కానీ మా పెద్దమ్మ కూతురు మాత్రం స్కూల్ కి వెళ్ళేది కాదు. అన్నకు వండి పెట్టాలని ఇక్కడే తనని విడిచిపెట్టి వెళ్లారు.

మేం నలుగురం అందరం కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళం కానీ ఎవరిది వాళ్లు వండుకునే వాళ్ళుము.

అమ్మ వాళ్లు వెళ్లిన పని ఒక  గోదావరిలో ఇసుక క్వారీ పని .
అక్కడ జెసిబి తో ఇసుకతోడి లారీలను నింపుతూ ఉంటే అమ్మవాళ్లు అవి పోవడానికి ..రావడానికి మట్టితో రోడ్డు పోయాలి.

లారీలు వెళ్లడానికి  గోదావరి లో దారి చేయడం కోసం
ట్రాక్టర్లతో మట్టి కొట్టడం – ఇదే అమ్మ వాళ్లు అక్కడ చేసే పని.

ఒక్క ట్రాక్టర్ లో మట్టి నింపితే ట్రిప్ కు 100 రూపాయలు ఇచ్చేవాళ్లు.
ఇలా ఒక ట్రాక్టర్‌ని పదిమంది కలిసి నింపేవారు.

రోజుకి 30, 40, 50 ట్రిప్పులు కూడా కొట్టేవారు.
ఒకరోజు అయితే నాకు తెలిసి 100 ట్రిప్పులు కూడా కొట్టారు.
అదే కూలీ అయితే ఒక్కరికీ 200 చొప్పున ఇచ్చేవాళ్ళు.

అమ్మ–నాన్న ఊరికి వెళ్లిన తర్వాత కొన్ని రోజుల వరకు మేము  స్కూల్‌కి బాగానే వెళ్లాము.

కానీ మా పక్కనే గుడిసెలో ఉన్న కొంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా పేకాట ఆడేవారు.

వాళ్ళను చూసి మాకు  కూడా  పేకాట ఆడాలి అనిపించేది.
అడ్డు చెప్పడానికి అమ్మానాన్న లేకపోవడంతో మేము స్కూల్ లేని టైంలో పేకాట ఆడే వాళ్లము.

అమ్మవారు ఖర్చు కోసం ఇచ్చిన డబ్బులతో పేకాట ఆడేవాళ్ళం.

అదేంటో కానీ ఆ ఆటలో ఏదో ఒక కైపు ఉంది –
ఎంతసేపు ఆడినా ఇంకా ఆడాలని అనిపిస్తుంది.

మనకి తెలియకుండానే మళ్లీ మళ్లీ  డబ్బులు తెచ్చి ఆడాలని అనిపించేంత మజా కలిగిస్తుంది.

అందుకే కావచ్చు చాలామంది పేకాటకు ఊరికే బానిస అయిపోతుంటారు.

ఆస్తులు పోయినా, పైసలు పోయినా
పట్టించుకోని స్థితికి ఈ ఆట తీసుకెళ్తుంది.

పేకాటకు డబ్బులు లేని సమయంలో మా పక్కనా వున్న  పెద్ద పెద్ద ఇల్లలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్లి చిన్న చిన్న పనులు చేసి ..
వారు ఇచ్చిన డబ్బుతో కూడా మేము పేకాట ఆడే వాళ్లము.

ఆట మీద ఇష్టంతో మేము స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేది.

అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము రోజు స్కూల్ కి వెళ్తున్నామని అబద్ధం చెప్పేది.

ఇలా రోజు స్కూల్ మానేయడంతో ఒకరోజు మా క్లాస్ టీచర్ మా క్లాస్ అమ్మాయిని మధ్యాహ్నం పూట మా ఇంటికి పంపించింది.

తను వచ్చిన సమయంలో నేను సరిగ్గా అప్పుడే పేకాట ఆడుతున్నాను.
ఆ విషయం మా ఫ్రెండ్ మా క్లాస్ టీచర్ కి చెప్పింది. 

తెల్లారి ఉదయం స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా క్లాస్ టీచర్ మమ్మల్ని బాగా కొట్టింది. 
ఆ రోజుతో ఇక ఎప్పుడు స్కూలు మానేయలేదు.

స్కూల్ లేని టైములో నేను మా ఇద్దరి అక్కలు, అన్న కలిసి కింగ్ కాంగ్ అనే సినిమాకి వెళ్లాము.

నేను వాళ్ళందరి కంటే చాలా చిన్నదాని నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు మొదట్లో వచ్చినా కొన్ని సన్నివేశాల వల్ల చాలా భయం వేసింది. 

నేను మా అక్కని గట్టిగా పట్టుకొని కూర్చున్నాను మా అక్క వాళ్ళు కొంచెం పెద్దగా వున్న వాళ్ళు కూడా పిల్లలే కాబట్టి  వాళ్లకు కూడా కొన్ని సన్నివేశాలు భయంగా అనిపించాయి. 

కానీ వాళ్ళు సైలెంట్ గా చూశారు.
అ సినిమా మాకు  చాలా బాగా నచ్చింది.
అమ్మ నాన్న లేకుండా మొదటిసారి మేమే సినిమాకు వెళ్లాము. 
ఆ ఎక్స్పీరియన్స్  కూడా మాకు చాలా బాగా నచ్చింది.
సినిమా చూసి ఇంటికి వచ్చాము .

కొన్ని రోజులకు మాకు మాకు పిల్లల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు అయ్యాయి .
అక్క పెద్దక్క తో మాట్లాడకు అని చెప్పింది.

అయినా కానీ నేను అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని. 

పెద్దక్క స్కూలుకి వెళ్ళేది కాదు  పనికి మాత్రమే వెళ్ళేది.
పెద్దక్క అన్నకు అన్నం వండి స్కూలుకు పంపించేది. మా అక్క నేను మాత్రం ఇంట్లో అన్ని పనులు ఇద్దరం కలిసి చేసుకొని  స్కూల్ కి వెళ్లే వాళ్ళము.

ఇలా గడిచిన కొన్ని రోజుల తరువాత

మేము అందరం స్కూల్ కి వెళ్ళిన తర్వాత పెద్దక్క ఒక్కతే ఒంటరిగా గుడిసెలో ఉండేది.
పక్కనే ఉన్న ఒక  అతను పెద్దక్క తో తప్పుగా  మాట్లాడేవాడు ఆట ..కానీ ఆ విషయం మాకు చెప్పలేదు అక్క.

ఇంతలో లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చాయి అందరం ఎగ్జామ్స్ బాగా రాశాము.
నాకు 600 కి 588 మార్కులు వచ్చాయి నేను అప్పుడు రెండవ తరగతి మాత్రమే చదువుతున్నాను. 
క్లాస్లో నేనే ఫస్ట్ రావడం.. అందరూ నన్ను మెచ్చుపోవడం నాకు చాలా బాగా నచ్చింది.

దానితో నేను ఆరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువును మాత్రం వదలకూడదు అని.

ఎండాకాలం సెలవులు వచ్చిన తర్వాత అమ్మ నాన్న మమ్మల్ని తీసుకొని వెళ్లడానికి వచ్చారు.

అమ్మ నాన్న వాళ్లు వచ్చిన తర్వాత  పెద్దక్క గుడిసెలలో ఒక అతను తప్పుగా మాట్లాడుతున్నాడని అమ్మవాళ్లకు చెప్పింది.

దానితో అతన్ని దొరకపట్టి చాలా కొట్టారు .ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అని భయం కూడా చెప్పారు.

గుడిసె లోపలికి ఎవరు వెళ్లకుండా గట్టిగా అడ్డులు పెట్టి అమ్మ నాన్న వాళ్ళతో మేము పని జరిగే చోటుకు వెళ్ళాము.

అమ్మ నాన్న వాళ్లతో వెళ్తున్నాము అన్న సంతోషం కన్నా ఆ గుడిసెల ప్రాంతాన్ని విడిచిపోతున్నామన్న బాధ ఎక్కువగా ఉండేది.

తెలిసి తెలియని వయసులో ఎన్నో తప్పులు చేసిన మాకు జీవితంలో ఆ గుడిసెలో గడిచిన ఆనంద క్షణాలు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది.

అమ్మ నాన్నతో కలిసి మేము గోదావరిలో పని ఉన్న ఊరికి వెళ్లాము.

మేము వెళ్ళిన ఊరు పేరు చేగ్యం.
ఆ ఊరికే అనుకోని గోదావరి నది ఉంది. 
కానీ పని జరిగే చోటు ఆ ఊరికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

మేము ఉండడానికి ఆ ఊరి వాళ్ళతో మాట్లాడి మాకు పని ఇచ్చిన సారు ఒక పాడుబడిన పెద్ద గడి లాంటి ఇల్లును ఇచ్చారు. 

ఆ ఇల్లు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే పెద్ద తలుపులు ఉంటాయి.

తలుపులు తీసుకొని లోపలికి వెళ్తే ముందు అంత ఖాళీ ప్లేస్.. ఎడమ పక్క ఒక నాలుగు రూములు.. కుడిపక్క ఒక నాలుగు రూములు ఉన్నాయి.

ఆ ఖాళీ ప్లేస్ దాటుకొని ముందుకు వెళ్తే వంట చేయడానికి ఒక పెద్ద గది ఉంది..
ఆ వంట గదిని దాటుకొని పోతే ఇంకా లోపలికి రెండు రూమ్లు ఉన్నాయి. 

వంటగదికి కుడివైపున స్నానాలు చేసే గది ఉంది అది చాలా పెద్దగా విశాలంగా ఉంది .
అక్కడే నీళ్ల కోసం ఒక బావి కూడా ఉంది. 

ఆ బావి దగ్గర నుంచి ఇంటి వెనుక వైపుకు వెళ్తే ఒక పెద్ద నిమ్మచెట్టు ఉంది.

కనీసం ఆ ఇంట్లో మాలాంటి వాళ్ళు 50 మంది అయినా ఉండొచ్చు.

కానీ మేము పిల్లలతో కలిసి 10 ,15 మంది వరకు ఉన్నాము.
అందుకే మేము ముందు ఉన్న ఎడమవైపు గదులలో మాత్రమే ఉన్నాము.

మేము ఉండే గదులను మరియు వాడుకొని స్థలాలను శుభ్రంగా చేసుకొని ఉన్నాము. 

వంట రూమ్ వెనుక భాగాన్ని కోళ్లను కమ్మడానికి మేము ఉపయోగించే వాళ్ళము. 

కానీ ఆ రూములోకి వెళ్లాలంటే పిల్లలo అయిన మాకు చాలా భయం వేసేది. 

అగది పగటిపూట కూడా చాలా చీకటిగా ఉండేది. అందుకే ఆ గదికి మేము చంద్రముఖి గది అని పేరు కూడా పెట్టాము.

ఆ ఇంట్లో పగటిపూట  పెద్దవాళ్లు కూడా ఒక్కరు  ధైర్యంగా ఉండలేకపోయేవాళ్ళు.

ఆ ప్రాంతమంతా చాలా నిశ్శబ్దంగా ఉండేది.
ఈ ఇంటి ముందు ఒక రైస్ మిల్లర్ వుంది.
దానితో ఆ మిల్లు లోని ఉనుకాంత ఈ ఇంటిపై పడుతూ ఉండేది. 

ఉదయానే అందరూ ఇంటి పనులు అన్ని పూర్తి చేసుకొని అన్నం వండుకొని తిని.. 8 గంటల వరకే గోదావరికి ట్రాక్టర్లు లో  అందరం కలిసి పనికి  వెళ్లే వాళ్ళము.

అమ్మానాన్న వాళ్లు ఇంకా మిగతా వాళ్ళు గోదావరి నది ఒడ్డున ఉన్న మట్టిని ట్రాక్టర్ లో ఎత్తుతూ ఉండేవారు.

మేము పక్కకు కూర్చొని మట్టిలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. 
గోదావరి నది చాలా అందంగా ఉంది కానీ ఎండాకాలం అవడంతో గోదావరిలో నీళ్లు ఎక్కువగా లేవు.
మేమున్న ఒడ్డుకు కుడి పక్కన కాకుండా ఎడమ పక్కన నీళ్లు పారుకుంటూ వెళ్తున్నాయి.

మేము పనిచేసే టైం లో మంచినీళ్ల కోసం గోదావరిలో ఒక చెలిమ తీసుకొని అవే నీళ్లు తాగుతూ పనిచేసేవాళ్ళం.
ఆ చెలిమిలో వచ్చే నీళ్లు చాలా తేటగా చాలా రుచిగా ఉండేవి. 

మేము మట్టి నింపుతున్న ఒడ్డున.. కొన్ని వింత పిట్టలు ఉండేవి. 
అవి రామ చిలుక కలర్ లో ..వాటి ముక్కులు మాత్రం చాలా  పెద్దగా  నల్ల కలర్ లో ఉండేవి.

ఒక్కోసారి 
మేము వాటిని పట్టుకొని ఆడుకునే వాళ్ళము.

ట్రాక్టర్లో నింపిన మట్టిని గోదావరిలో తీసుకొని వెళ్లి రోడ్డులో పోసేవాళ్లు. 

ఇక్కడ పనిచేసే వారందరూ మా చుట్టాలే. అందులో ఉన్న మా పిన్ని మా నాన్నతో ఇలా అంది. 

నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్లకి పెళ్లి చేయాలి అంటే నీకు చాలా డబ్బులు కావాలి కాబట్టి ఇప్పటినుంచే  ఒకరిని పనికి పెట్టు.. ఇలా చేస్తే నీకు డబ్బులు వస్తాయి ..
వాళ్లకి పని కూడా వస్తుంది అని చెప్పింది. 

కొన్ని రోజులు వరకు నాన్న వాళ్ళ మాటలు పట్టించుకోలేదు కానీ వుకా పదేపదే చెప్పడంతో నాన్న ఎండాకాలంలో అక్కను పనికి పెట్టాడు.

ఇంక వుంది