ధర్మాత్మ విస్తరణ: కొత్త సైన్యాలు, గ్రహాల విలయం
ఇక అక్కడితో కట్ చేయకుండా, ధర్మాత్మ అసుర లోకంలో ఉన్న సైనికులను మరియు మంచి మంచి మంత్రగాళ్లను, శక్తివంతమైన అధిపతులను సేకరించడం మొదలుపెట్టాడు. తను చేసే పోటీలో మరింత తీవ్రత పెంచుతూ ఉన్నాడు. అదే సమయంలో ప్రతి ఒక్క గ్రహంలో తల్లులు అందరూ నిద్రలేచారు. వాళ్ళు తమ పక్కన బిడ్డలు ఉంటారని వాళ్ళ మొహం ఒక్కసారి చూద్దామని ఎంతో ఆనందంగా చూస్తారు కానీ, వాళ్ళ పక్కన ఎటువంటి బిడ్డ లేకపోవడం ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడం గమనించారు. సత్య ఉపగ్రహంలోకి ఏవో బుల్లెట్లు వస్తూ ఉంటే, ఆ గ్రహం ఆ బుల్లెట్లను వెనక్కి తిప్పికొడుతూ ఉండడం ప్రజలను కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
తల్లులు అందరూ ఇలా అంటున్నారు, "మా బిడ్డలు ఎక్కడ అమ్మ?" అని మాయ తన అమ్మని అడుగుతుంది. "క్షమించండి, నీ బిడ్డను నేను కాపాడలేకపోయాను." అసలు ఏం జరిగిందో అని పూర్తిగా చెప్పిన తరువాత, మాయ ఇలా అంటుంది, "నా బిడ్డను ఎవరు వేరు చేయలేరు! నేను కచ్చితంగా నా బిడ్డను తెచ్చుకుంటాను!" అని ముందుకు వెళుతూ ఉంది. కానీ తను అప్పుడే పిల్లల్ని కన్నది, ఒక గంట సేపు మాత్రమే అవ్వడంతో తను పెద్దగా కదలలేకపోతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి అంతకంటే దారుణం. తనకు శక్తులు ఉన్నాయి కాబట్టి మాయ లేచి కనీసం మాట్లాడగలుగుతుంది కానీ, మిగతా వాళ్ళు కళ్ళల్లో నీళ్లు కారుతూ, "మాయా!" అని ఒకరినొకరు పిలుచుకుంటున్నారు.
కల్కి పునరాగమనం: అగ్ని, వాయువు, బ్రహ్మ, శివుడి కలయిక
ఇలా ఇక్కడ కట్ చేస్తే, మరో పక్క వాయుదేవా, "ఇప్పుడు మీరు వెళ్ళాలి!" అని అంటాడు. వాయుదేవుడు, "ఆగండి! వెళ్తాను కానీ ఇప్పుడు ఆ ధర్మ ఏం చేస్తాడో అని నాకు ఆసక్తికరంగా ఉంది," అని అంటున్నాడు. సరే సరే, లావా నేలమీద పారుతూ వస్తూ ఉంది. ఆ దెబ్బకు కొత్తగా పుట్టిన చెట్లు, పాత చెట్లు, ఇల్లు, భవనాలు మొత్తం కాలి బూడిద అయిపోతున్నాయి. ఇక్కడ జరుగుతూనే ఉంది. యుద్ధభూమికి రాగానే ధర్మ ఒక కంటి సైగతో వాటిని తన వైపు రానివ్వకుండా చేస్తున్నాడు. మిగతా ప్రజలందరూ చచ్చినా పర్వాలేదు అనుకున్నాడో ఏమో కానీ, లావా మాత్రం ఒకే దిశలో వెళ్తుంది అని బిత్తరపోయి అటూ ఇటూ చూస్తూ ఉండగా, పూర్తి లావా ఉన్న కలర్‌లోకి పసుపు రంగులోకి మారిపోయింది.
ఆ లావా డైరెక్ట్‌గా వెళ్లి కల్కి ఉన్న స్తంభంలోకి చేరుతుంది. కల్కి శరీరం 21 సంవత్సరాలు ఉన్న వయసుకు చేరుకుంటుంది. కల్కి శరీరానికి చుట్టుకుంటూ పవర్‌ఫుల్ ఆర్మర్‌గా పూర్తవుతుంది. అని అంటే అగ్నిలో పుట్టిన యువకుడిలా కనిపిస్తున్నాడు. ఇతనికి ఇంకో పేరు ఏదో ఉంది అది నాకు కూడా గుర్తుకులేదు. ఇప్పుడు కల్కి శరీరం పూర్తిగా రెడీ అయిపోయింది. అంతే! వాయువు అంటే గాలి శక్తి పూర్తి వేగంతో ముందుకు వస్తూ ఉండగా, ధర్మాత్మను ఒక ఎత్తు వరకు ఎత్తి కింద పడేస్తుంది. అంతే! అది కూడా స్తంభంలోకి వెళ్లి స్పీడ్‌గా తిరగడం మొదలు పెడుతుంది. కల్కి శరీరానికి పూర్తి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అంతే! శబ్దాలతో ఉండగా, ధర్మ తన పూర్తి శక్తిని యాక్టివేట్ చేసుకున్నాడు. తనకు ఆరు చేతులు, ప్రతి చేతిలో వింతైన ఆయుధం, తన నిజమైన చేతుల్లో ఐదు రకాల డైమండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇది క్లైమాక్స్ టర్న్. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ కలియుగ రాజు అని అనుకుంటున్నాడు ధర్మ.
ధర్మాత్మ మరింత చెలరేగిపోతూ చుట్టూ ఉన్న దుష్టశక్తులను తన దగ్గరున్న లవర్ (పువ్వు గుర్తు) డైమండ్‌లోకి లాక్కోవడం మొదలు పెడతాడు. ఆ శక్తులను బంధించి వాటి పేరుతో మరింత శక్తి పొందుతున్నాడు. ఇక అక్కడ కట్ చేస్తే, బ్రహ్మదేవుడు మెదడులోకి ప్రవేశించడానికి తన మాయా రూపాన్ని ధరించాడు. ఇప్పుడు మూడు తలలున్న బ్రహ్మదేవుని చూశాం. ఇప్పుడు ఆరు తలలున్న బ్రహ్మదేవుని చూస్తాం. ఒక్కోటి ఒక్కో బాధ, కోపం, అమాయకత్వం వంటి రూపాలలో ఆరు తలలు కనిపిస్తూ, చేతిలో ఒక తాళపత్రం, ఇంకో చేతిలో పెన్ను లాంటి వస్తువు, మరో చేతిలో పువ్వు, మరో చేతిలో శంఖం ఇలా నాలుగు చేతులతో కల్కి శరీరంలో ప్రవేశిస్తాడు. తను వెళ్ళడమే మెదడులో తను ప్రయత్నం మొదలుపెట్టాడు. సిస్టం పూర్తిగా యాక్టివేట్ చేస్తాడు. ఇక శివుడు తన మాయ రూపమైన శివశక్తి రూపంలోకి మారిపోయి శరీరంలోని భాగాలను యాక్టివేట్ చేస్తాడు. అంతే! ఒక్క దెబ్బతో అగ్నిపర్వతం పేలినట్టుగా ఒక పెద్ద శబ్దం, వెలుగు. మొహం చూడడానికి అస్సలు కనిపించడం లేదు.
కల్కి గుర్రం: దైవశక్తుల బలిదానం
అప్పుడే ఒక గుర్రం శబ్దం. కల్కిని ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ధర్మ యొక్క ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మంత్రగాళ్ళు చదివిన మంత్రాలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. ఒక గుర్రం శబ్దం. అంతే! గుర్రం శబ్దానికి ఆ మంత్రగాళ్ళు గుండె ఆగి చచ్చిపోయారు. నల్లటి కవచంతో, చేతిలో రౌద్ర ఖడ్గంతో, తెల్లటి గుర్రం మీద ఎక్కి పాప నాశనం చేయడానికి సిద్ధమవుతున్నాడు. దానికి ఖడ్గానికి తగిలిన ప్రతి వస్తువు బూడిద అయిపోతుంది. దుష్టశక్తులు నాశనం అవుతున్నాయి. పాపాలు కడిగివేయడానికి సిద్ధమవుతున్నాడు. తన గుర్రం చేస్తున్న శబ్దాలకి గుండె ఆగిపోతూ ఉండగా, ధర్మ ఎదురుగా వెళ్తాడు. "కల్కి! నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా గురించి నీకు తెలుసు కదా?" అని అంటాడు. అసలు మాట్లాడని కల్కి ఒక పెద్ద అరుపుతో యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ధర్మ కాలచక్రాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, కొంచెం కష్టంగానే కల్కిని ఎదుర్కొంటున్నాడు. కల్కి కళ్ళలో నీలిరంగు సముద్రపు అలలు కనిపిస్తున్నాయి. శరీరంలోని ప్రతి అవయవం ఒక విచిత్రమైన శక్తిని కలిగి ఉంది.
ఇంకా ఏదో మిస్ అయింది అని అనుకుంటున్న సమయంలో, హీరోలందరూ ఒకరు చెయ్యి ఒకరు పట్టుకున్నారు. "చూడండి! ఇన్ని సంవత్సరాలు మనం చేసిన ఏమీ చేయలేవు కానీ ఒకే ఒక్క పని చేయగలం. మన శక్తులన్నిటినీ మనం కల్కికి ఇవ్వగలగడమే మనం చేసే పెద్ద పాప ప్రక్షాళన!" అని అంటాడు రుద్రుడు. అంతే! హీరోలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గుండ్రంగా తిరగడం మొదలు పెడతారు. వాళ్ళు తిరిగే స్పీడ్‌కి వాళ్ళల్లోని శక్తులు పూర్తిగా బయటికి పోతాయి. కర్ణుడి కవచం, విల్లు, బాణం, అర్జునుడి తెల్లటి కవచం వంటివి మొత్తం హీరోలలో ఉన్న ప్రతి వ్యక్తి పూర్తిగా కల్కి సొంతమవుతుంది. అంతే! ధర్మ, "ఏంటి! నన్ను అడ్డుకోగాలని అనుకుంటున్నావా?" అని అంటూ మాయం అవుతాడు. అంతే! పిచ్చి కోపం వచ్చినట్టుగా కల్కి తన శరీరాన్ని పూర్తిగా విసురుతాడు. నీడలో చూస్తే ఏ మృగమో కనిపెట్టడానికి అష్ట కష్టాలు పడిన నీడ కనిపిస్తుంది. అతడు గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులకి గద్దలు, చిన్న చిన్న పక్షులు, పెద్ద పెద్ద జీవులు అన్ని అతలాకుతలమవుతున్నాయి. గట్టిగట్టుగా అరుస్తున్నాయి. అన్ని చచ్చిపోయే పరిస్థితికి వస్తున్నాయి. తన చేత్తో అటూ ఇటూ అంటూ ఉంటే గాలి భీకరంగా వీస్తుంది. తన చేతులు గండ్ర గొడ్డలిగా మారాయి. అంతే! ఒక్కో గోరుతోనూ ఒక్క దుష్టశక్తిని అంతం చేస్తున్నాడు. అతని పని అది అన్నట్టుగా భూమి మీద మొత్తం రౌండ్ కొడుతున్నాడు. చుట్టూ తిరిగి దుష్టశక్తులను, ఆత్మలను ఏమీ బ్రతకనివ్వడం లేదు. ఇప్పుడు పడిపోయిన హీరోలు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ, "ఇప్పుడే మొదలైంది కదా?" అని అనుకుంటున్నారు.
కల్కి విధ్వంసం: ధర్మ అంతం, ప్రకృతి తాండవం
ధర్మాత్మ ఎక్కడికో వెళ్లి తేలిందని చూస్తే, భూమి చుట్టూ త్వరగా ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ తన శక్తి, తనలో దాచుకున్న దుష్టశక్తులు అన్నిటినీ విడుదల చేస్తూ తనొక భయంకర శక్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. తనలో ఉన్న, తన దగ్గర ఉన్న డైమండ్లు తన చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులు నవ్వుతూ తిరుగుతూ ఉంటే వందల కొద్దీ దుష్టశక్తులు అతని వెనకాల ఉన్నాయి. ప్రత్యర్థి అంటే ఇతడే అని చూపిస్తారు. కల్కి మాత్రం భూమి అంతా తిరుగుతున్నాడు. పాప ప్రక్షాళన అంటే ఏమో అనుకున్నారు కానీ, రక్తపాతం చూపిస్తున్నాడు. మంచి లేదు, చెడు లేదు. కనిపించిన వ్యక్తిని నరుక్కుంటూ వెళ్తున్నాడు. పూర్తిగా శక్తి అదుపు తప్పిన ఒక పిచ్చివాడిలా కనిపించడం మొదలు పెట్టాడు. ఇవే కనిపిస్తున్నాయి. భూమ్మీద ప్రజలందరూ కళ్ళు తిరిగి కిందపడిపోయారు.
ధర్మ శరీరం నుంచి రకరకాల సూట్స్‌లో నుంచి గన్నులు, తుపాకులు, ఇంకా అద్భుతమైనవి ఏంటంటే అస్త్ర శాస్త్రాలు విడుదల చేయగలుగుతున్నాడు. తనకున్న వెనకాల నుంచి వచ్చిన దుష్టశక్తుల ద్వారా తన దగ్గర ఉన్న ఆ నాలుగు చేతుల ద్వారా ఒక బాంబు స్క్వాడ్ రెక్కలు (ఇది ఒక ప్రత్యేకమైన సృష్టి). అస్సలు ఏంటంటే ఒకపక్క దైవ శక్తులు ఉంటే, మరోపక్క టెక్నాలజీ. టెక్నాలజీతో అంతం చేయడం అంటే ఏమో అనుకున్నారు. భూమికి బొక్కలు పెడుతున్నాడు ధర్మ. మరోపక్క దుష్ట శక్తులు అంతం చేస్తున్న పని పేరుతో సృష్టిని అంతం చేస్తున్నాడు కల్కి.
ఇక మాయ శక్తులు కలిగిన కల్కి, టెక్నాలజీ కలిగిన ధర్మ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరినంటే ఒకరికి పిచ్చి పగ ఏదో ఉన్నట్టుగా ఇద్దరూ ఒకరు భీకరంగా చూసుకుంటున్నారు. కల్కి ఇప్పటికి ఒక్క మాట మాట్లాడడం లేదు. అతడు చేసే పని చేసుకుంటూ వెళుతున్నాడు. మరో పక్కనుంచి ధర్మ మాట్లాడుతూ, "కల్కి! నీ అంతం ఇప్పుడే ప్రారంభం!" అని అంటూ తన సూట్ నుంచి వచ్చిన బాంబులను విడవడం మొదలుపెట్టాడు. కల్కి వాటిని తన చేతులతో పట్టుకొని మింగుతున్నాడు, వాటిని కరిగించుకుంటున్నాడు. ధర్మ అసలు ఆపడం లేదు, తన నుంచి దుష్టశక్తులను విడుదల చేస్తున్నాడు. అవి తనలాగే మారిపోతున్నాయి, చుట్టూ చుట్టూ కుంటున్నాయి. కల్కి ఇక పిచ్చి కోపంతో ఉన్నాడేమో, అంతే! దొరికిన మృత్యు శక్తిని మరియు దుష్ట శక్తిని పట్టుకొని చీల్చి చెండాడుతున్నాడు. అంతే! ధర్మకు భయం వేసింది. తను పారిపోతున్నాడు. కల్కి గుర్రం ఎక్కాడు. ధర్మ పరిగెడుతున్నాడు. వెనకాల కల్కి గుర్రం గట్టిగా అరుస్తుంది. ముక్కు అడుగుకు ఒక్కో స్టెప్పుతలం అవుతూ ఉండగా ప్రజలు మరింత కుంగిపోతున్నారు. భూమి రెండుగా చీలుతుంది.
మళ్ళీ వెనక్కి తిరిగిన ధర్మ, "భయపడ్డాను అనుకున్నావా?" అని అంటూ మరోసారి తన కాలచక్ర శక్తిని ఉపయోగిస్తూ తను స్పీడ్‌గా కదలడం మొదలుపెట్టాడు. కల్కికి అవేమీ అవసరం లేకుండానే, కాలభైరవుడు అంటే శివుడి అంశతో పుట్టిన కాలభైరవుడు తనతోనే ఉన్నాడు. అలాంటప్పుడు కాలం తనకు ఎదురు ఎలా వస్తుంది? తను కాలచక్రాని కంటే ముందుగా ప్రయాణిస్తున్నాడు. అంతే! చెయ్యి పట్టుకున్నాడు ధర్మాది. ఒక్క తోపుకు 'ఫట్ ఫట్' మంటూ విరిగినట్టుగా, శరీర భాగాలు ఊడిపోతున్నట్టుగా శబ్దాలు. కల్కి పట్టుకోగానే దుష్టశక్తులు అతలాకుతలమవుతున్నాయి. ధర్మ ఇప్పటిదాకా సేకరించిన శక్తులన్నీ పేలిపోతున్నట్టుగా బయటకు వస్తూ ఉంటే, నరాలలో ఉన్న నాగుపాములు వాటిని దుష్టశక్తులను పట్టుకోడానికి సిద్ధమవుతున్నాయి. అతని వెనుక నుంచి అంటే కల్కి వెనుక నుంచి పాములన్నీ అంటే నాగశేషు, వాసుకీలు బయటకు వచ్చారు. అడగను కింద కల్కి కూర్చోవడానికి ఒక సీటులా తమ తోకలతో కూర్చున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన కల్కి ఇలా అంటున్నాడు, "కలియుగాంతం! కలియుగంలో పాప నాశనం కోసం, అధర్మ నాశనం కోసం ఎదురు చూసిన కల్కి యొక్క భీకర దృశ్యం!" అని అంటూ ధర్మ గొంతు పట్టుకున్నాడు. తన వెనకాల ఉన్న నాగుపాములు రెండు దుష్టశక్తులను మింగడం మొదలు పెట్టాయి. మింగిన వెంటనే కల్కి కడుపులోకి వెళ్లి మొత్తం అంతమవుతున్నాయి. మళ్ళీ కొత్తగా పుడితే తప్ప ఇప్పుడు ఏమి కనిపించడం లేదు. ధర్మ భీకరమైన అరుపులతో గట్టిగా అరుస్తున్నాడు. భూమి బద్దలైపోతూ ఉండగా ప్రకృతి శక్తులు కూడా అలాగే తాండవం చేస్తున్నాయి. వానలు, వరదలతో ముంచెత్తుతున్నాయి. ఐదు రకాల భూములు కలవడం వల్ల ఏమో తెలీదు, ఒకేసారి ఎండ, వాన, మంచు, గాలి వంటి మొత్తం శక్తులు అల్లకల్లోలం చేస్తున్నాయి. స్పేస్‌లో కూర్చుని ఉన్న కల్కి, ధర్మ. అప్పటికి మొత్తం ఆత్మ శక్తులను, దుష్టశక్తులను కలిపేసుకోవడం వల్ల ఒక్కో దాన్ని చీల్చి చెండాడుతున్నాడు. తన గండ్ర గొడ్డలి లాంటి పదునైన గోర్లతో పూర్తిగా దుష్టశక్తులను అంతం చేసిన తర్వాత ధర్మ శరీరాన్ని రెండు ముక్కలుగా చేస్తాడు. ఒక ముక్క శేషు నాగుకి, మరో ముక్క వాసుకి పడేశాడు.
కల్కి అంతర్ధానం: మోహిని ఆత్మ, పంచభూత ముద్ర
వెంటనే తన శరీరంలో ఉన్న శివుడు బయటికి వచ్చాడు. అలాగే బ్రహ్మదేవుడు తన బ్రహ్మ లోకానికి చేరుకున్నాడు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, "ఇప్పుడు ఏం జరుగుతుంది?" అని. శివుడు బయటికి వెళ్ళగానే ఆ శక్తిని అప్పటిదాకా ముగ్గురు త్రిమూర్తులు పట్టి అదుపు చేశారు. ఇప్పుడు అదుపు తప్పిన పొట్టేలు లాగా భూమిని తొక్కడం మొదలుపెట్టాడు. ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్తుందో అని భయపడుతుంటే, మరో పక్కనుంచి మోహిని ఆత్మ అప్పుడెప్పుడో చనిపోయిన మోహిని ఆత్మ ఇప్పుడు బయటికి వచ్చింది. ఎర్రటి కాంతితో మెరిసిపోతూ ఉండగా, భూమి మీద ఎటువంటి శక్తులు లేకుండా మానవ జీవితం ఫస్ట్ ఎలా ఉన్నదో, టెక్నాలజీ అంటే ఏంటో తెలియని రోజులకి తీసుకువెళ్లాలని అనుకున్నాడో ఏమో, నష్టం మొత్తం దైవశక్తుల మరియు ఇతర శక్తులను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కల్కి. తన చేతి మీద కొత్తగా ఒక ముద్ర, అది చూడడానికి పంచభూతాల శక్తులు కలిపిన ఒక రౌండ్ షేప్‌లో, విష్ణుమూర్తి చేతిలో ఉన్న విష్ణు చక్రంలా కనిపిస్తూ ఉంది. ఆ ముద్ర తన కుడి చేతి మణికట్టు మీద ముద్రగా ఏర్పడింది.
తను విధ్వంసం ఆపకుండా భూమి రెండు ముక్కలు చేసేలా గట్టి అరుపుతూ పెద్దగా మారిపోతున్నాడు. తన శరీరానికి ఉన్న నిప్పు భయానకంగా మారిపోతుంది, ఎక్కువగా వేడిని చల్లడం మొదలుపెడుతుంది. దేవుళ్ళు, ప్రజలు, హీరోలు మొత్తం ఇప్పుడు ఎవరు ఎలా ఆపుతారని బాధపడడం, భయపడడం మొదలుపెట్టారు. "శ్రీకృష్ణుడు ఏది చేసినా చివరికి అంతమే. పోయినసారి ప్రహ్లాదుడు వల్ల బ్రతికిపోయాం కానీ ఇప్పుడు ఎవరున్నారు?" అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
రాధాదేవి శాంతి: కల్కికి తల్లిదండ్రుల ప్రేమఅంతే! శివుడు నాట్యం చేయడం మొదలుపెట్టాడు. తన జుట్టు ముడివేసి ఉన్నాడు కదా, వెంటనే తన జుట్టు ఊడి ముడి విప్పడంతో గంగాదేవి ఎగిరి పడుతుంది. అక్కడ విధ్వంసం చేస్తున్న కల్కి శరీరం మీద మెల్లగా పడడం మొదలుపెడుతుంది. గంగ పడగానే కల్కి వేగం తగ్గుతూ శాంతించడం మొదలుపెడతాడు. ఆ గంగలో నుంచి ఏదో శబ్దం, చిన్నగా పాట వినిపిస్తుంది. ఆ గొంతు ఎంతో మధురంగా ఉంది. వెంటనే కల్కి శరీరంలోని గుండె మెల్లగా వేగం తగ్గుతూ ప్రశాంతంగా మారిపోయింది. ఈ
అప్పటిదాకా మోటార్ ఆడినట్టుగా, నీళ్ళను మోటార్ బయటికి తీసినట్టుగా రక్తాన్ని ఒకటే పనిగా అందిస్తూ ఉన్న గుండె మెల్లగా తగ్గించడం మొదలు పెడుతుంది. వేగం తగ్గే కొద్దీ అతనిలో శాంతి పెరుగుతుంది. ఆ గుండెలోని రూపం ఇలా అంటుంది: "కృష్ణా! నువ్వు నా ప్రేమకై ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశావు. ఇప్పటికీ నేను నీ గుండెలోనే ఉన్నాను. అది మన ప్రేమ, మన ప్రేమ యుగయుగాల నుంచి వస్తూనే ఉంది. ఎప్పుడు నెరవేరుతుంది?" అని శబ్దాలు వినిపిస్తున్నాయి. "రాధా!" అని ఒక చిన్న పేరుతో సీన్ కట్ అవుతుంది.
కల్కి అంతర్ధానమైపోవాలని నిర్ణయించుకొని ఒక్కో అడుగు వేస్తూ భూమ్మీదకి దిగుతాడు. తను ఇప్పుడు 21 ఏళ్ల బాలుడుగా కనిపిస్తూ ఉండగా, హీరోలు ఐదుగురు మరింత గట్టిగా, "నాన్న!", "అమ్మ!", "నా బిడ్డ ఎక్కడ? నాకు నా బిడ్డను చూడాలి!" అని ఐదుగురు స్త్రీలు అరుస్తున్నారు. అది గమనిస్తున్న కల్కి తన రూపాన్ని చూసుకున్నాడు. నీలిరంగు కళ్ళు, నల్లటి శరీరం, భయంకరమైన గోర్లు, శరీరమంతా అక్కడక్కడా కాలిపోయినట్టుగా అప్పటికి చిన్నగా అగ్ని వెదజల్లుతూ ఉంది. ఇదంతా చూస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న కల్కి మరో అడుగు ముందుకు వేయగా, ఐదుగురు పిలుస్తారు. "ఒకరికి పుట్టలేదు. ఐదుగురికి పుట్టావు. అది నీ లక్ష్యం. నీకు తెలుసు కదా, ప్రతి జన్మలోనూ నువ్వు నీ తల్లిదండ్రులను దూరం చేసుకుని ఎన్నో సంవత్సరాలు జీవించావు. కానీ వాళ్ళు దైవశక్తులు ఉన్న వాళ్ళు ఏమో కానీ, మీ మానవ శక్తులు ఉన్నవాళ్ళు. మా పట్టుదల మేము వదులుకోము. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేమందరం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం! ఒక్కసారి నీ మొహం చూపించరా? పుట్టిన రోజు నుంచి నీ మొహం ఎలా ఉంటుందో అస్సలు చూడలేదురా!" అని ఐదుగురు అడుగుతున్నారు. కల్కి ఎంతో మధురంగా, "అమ్మా! మీరు నా మొహం చూస్తే మీరు తట్టుకోలేరు. నా జీవితం ప్రతిసారి ఇలాగే అయ్యింది. నా తల్లిదండ్రులకు చిన్నప్పటినుంచి దూరమవ్వడం నా రాతలు రాసి ఉందేమో. మొదటిగా మా అమ్మ నాన్నలు, ప్రేమించిన అమ్మాయిని కనీసం దక్కించుకోలేకపోయాను. అదే జరుగుతుంది," అని అంటున్నాడు. "ఏమంటున్నావు? నిన్ను తీసుకువెళ్లే ధైర్యం ఎవరికి ఉంది? వాళ్లతో పోటీపడి మాకు కావాల్సిన వాళ్ళను పోగొట్టుకోలేదు. అలాంటిది నా కన్న కొడుకు మిమ్మల్ని ఎలా వదులుకుంటాను?" అని అంటున్నారు ఐదుగురు హీరోయిన్లు.కల్కి శాంతి: ప్రేమ, కుటుంబం, మరియు కొత్త రూపం
ఆ మాటలకు కల్కి వెనక్కి తిరిగి చూస్తాడు. తన మొహం చూస్తూ, "ఇంత ముద్దు కొడుకుని ఎవర్రా నిన్ను బాగాలేదన్నది? ముద్దుగా బుగ్గలు, నీలిరంగు కళ్ళు... ఎవరికైనా ఇలాంటి కొడుకు ఉంటాడా? మాకు మాత్రమే మా ఐదుగురు ముద్దుల కొడుకురా నువ్వు!" అని అంటున్నాయి తల్లులు. అటు పక్కనుంచి ఐదుగురు హీరోలు వస్తున్నారు. హీరోలు కూడా అతన్ని చూసి, "కల్కి! నీకేం కాలేదు కదా?" అని తండ్రి ప్రేమతో అడుగుతున్నారు. కల్కి శివుడి వైపు చూస్తాడు. శివుడు చిన్నగా నవ్వుతాడు. "నీకు ఇదే మంచిది కృష్ణా! ఇలాగే ఉండిపో. ఐదుగురు ముద్దుల కొడుకు అనే బిరుదు నీకొక్కడికే వస్తుంది," అని చిన్నగా నవ్వడంతో, కల్కి తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని రెండు సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయాడు. ఐదుగురు చేతుల్లో ముద్దుగా పడిపోయాడు. అతని రూపం అప్పటికంటే ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. విష్ణు చక్రం యొక్క ముద్ర, ఐదు శక్తుల ముద్రలు అతని చేతిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పదేళ్ళ తర్వాత: కృష్ణుడు, మరియు ధర్మాత్మ ఆవిర్భావం
ఇలా సీన్ కట్ చేస్తే, కొన్ని సంవత్సరాలు తర్వాత చూపిస్తారు. అప్పుడు రెండు ముక్కలుగా చేసిన ధర్మాత్మ ఇప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక చిన్న పిల్లాడిలా తేలి ఉంటాడు. అది యుద్ధానికి 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇప్పుడు యుద్ధం జరిగిపోయిన 10 సంవత్సరాల తర్వాత చూస్తే, ఐదుగురు ముద్దుల కొడుకుగా కృష్ణుడు పేరుతో జీవిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధ సమయంలోకి వెళ్తే, కృష్ణుడు తన తల్లులతో కలిసి చిన్న పిల్లాడిలా ఉన్నాడు. అప్పుడు దేవుళ్ళు మరియు ప్రజలు, "అంతం కాదా?" అని ఆశ్చర్యపోతారు.
అలా కట్ చేసి ధర్మాత్మను చూసినప్పుడు, రుద్రుడి స్టోరీలో మొదటి సీన్ చూపిస్తారు. అదే అంతం కాదు అన్నట్టుగా, ఆ సీన్ లో చూపించిన ఎర్ర కళ్ళ వ్యక్తి ఇప్పుడు తప్పించుకున్న ఎర్ర కళ్ళ వ్యక్తితో ఒకేలా కనిపిస్తాడు.
భవిష్యత్ సంకేతం: "ఇది అంతం కాదు!"
ఇప్పుడు పెద్ద డైలాగ్‌తో మూడు ప్లేసుల నుంచి "ఇది అంతం కాదు!" అని శబ్దంతో స్టోరీ పూర్తైపోతుంది.,
పూర్తి అయిపోయింది అని అనుకుంటున్నారా కంప్లీట్ చేయమంటారా? కామెంట్ చేయండి నెక్స్ట్ రావాలి కావాలి అనిపించిన వాళ్ళు మీ అభిప్రాయం ఏంటో ఓరల్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి