Not the end in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 50

Featured Books
Categories
Share

అంతం కాదు - 50

ఆ తర్వాత బుజ్జమ్మ విక్రమ్‌ని చూసి, "నా పని పూర్తయింది, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు," అని అంది. బుజ్జమ్మ మనసులో, "ఇతనికి తన గతం గుర్తుకొస్తున్నట్లుంది," అనుకుంది. తర్వాత, "సరే, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం," అని చెప్పి మళ్ళీ ఆ టవర్‌పైకి ఎక్కి కూర్చుంది.

కొద్దిసేపటికి అర్జున్ పైకి లేస్తాడు. తన తమ్ముడి మీద ఏదో పడిందని, తన శవం కూడా దక్కదని అనుకుంటూ అర్జున్ విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ శరీరం మీద పెద్ద దెబ్బ తగిలింది, కానీ అది చావు నుంచి బ్రతికించే దెబ్బ. మళ్ళీ శవం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. తను గుక్క పెట్టి ఏడుస్తూ ఉండగా, కన్నీళ్లు విక్రమ్ శరీరం మీద పడతాయి. విక్రమ్ శరీరం మీద ఉన్న బంగారు రంగు ఇంకాస్త పెరుగుతూ, ఆ దెబ్బ తగిలిన చోటు నుంచి గుండెల మీదుగా కింద కాళ్ల పైకి, పైన తల అంతా చుట్టుకుంటూ ఏదో జరుగుతూ ఉండగా, విక్రమ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. తను తనకే తెలియకుండా పైకి లేస్తాడు.

ఆకాశంలోకి వెళ్లి, "అర్జునా, నువ్వు తప్పు చెప్పావు! నేను కదా నీకు అన్నను! నన్ను తమ్ముడు అంటావే?" అని గట్టిగా నవ్వడంతో అక్కడ సీన్ కట్ అవుతుంది.

కల్కి అర్జున కర్ణ కలయిక

అప్పుడు కల్కి అర్జున కర్ణ కలయిక అని టైటిల్ పడుతుంది.

ఆకాశంలో ఉన్న విక్రమ్ అలా అనడంతో అర్జున్ ఆనందంతో నిండిపోతాడు. ఒక్కసారిగా బాగా సంతోషం కలిసిన గొంతుతో, "అన్నయ్య!" అని పిలుస్తాడు. ఇక విక్రమ్ కూడా కిందికి దిగి, "ఎందుకు బాధపడుతున్నావ్? సంతోషమంటే నాకు అర్థం అవుతుంది, బాధ ఎందుకు పడుతున్నావు?" అని అడుగుతాడు.

అర్జున్, "అవునన్నయ్యా, నాకు బాధ ఎందుకంటే ఆ జన్మలో నిన్ను అన్యాయంగా చంపేశా. నీ చేతిలో అస్త్రం లేదు, బాణం లేదు, కనీసం ఒక కత్తి ఉన్నా నువ్వు బ్రతికుండేవాడివి. కానీ నీ చేతిలో ఏమీ లేనప్పుడు నేను అన్యాయంగా చంపేశాను," అని అంటాడు.

విక్రమ్, "అది తప్పు కాదు అర్జునా, అది నీ విధి. ఆ లీల కృష్ణుడిది, వేలాది అధర్మం వైపు ఉన్న నన్ను ఎలాగైనా చంపేయాలి. అదే నువ్వు చేశావు, కృష్ణుడు చేయించాడు. ఆ భగవాన్ నీ చెంత ఉన్నాడు, మంచివైపు ఉన్నాడు," అని చెబుతాడు.

ఇద్దరూ అలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే బుజ్జమ్మ ఎగిరి దూకుతుంది. "ఏంటిది? ఏంటి బుజ్జమ్మ, నీకు వీడి గురించి తెలిసి కూడా ఏమీ చెప్పలేదు? నువ్వు ఇంత మంచిదానివి అనుకోలేదు. ఎంత మాత్రం పగ ఉంటే మాత్రం నన్ను ఎంతమంది ముందు విడిచి పెడతావా?" అని అడగడం మొదలుపెట్టాడు విక్రమ్.

బుజ్జమ్మ, "ఒరే బాబు, నాతో ఎందుకురా గొడవ? నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. నీ తమ్ముడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకొని, ఆ పైనున్న వాళ్ళను కలిసి వెళ్ళిపోండి," అని అంటుంది.

అని అంటూ ఉండగానే, తను ఒక గాలిలా మారిపోయి, తెల్లటి స్తంభం లాగా మారిపోయి పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. పైన రుద్ర మరియు శివ, అటుపక్క అంజి, సామ్రాట్ విల్లా నలుగురిని చూస్తూ నమస్కరించి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా బుజ్జమ్మని చూసి నమస్కరిస్తారు. ఇలా సీన్ కట్ అవుతుంది.

దైవసంబంధం

అప్పుడే రుద్ర, శివ పక్కనే ఉన్న అంజి, సామ్రాట్‌లను మాయ రూపాలను గమనిస్తారు. శివ అత్యధికంగా చూస్తూ, "వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే," అని అంటాడు. రుద్ర గట్టిగా నవ్వుతూ, "వాళ్ళు ఎవరో కాదు, ఇంతకుముందు ఫస్ట్ కల్పంలో చూసాము కదా, సామ్రాట్! అది వాళ్ళే! అక్కడ ఉన్నది ఎవరో కాదు, హనుమంతుడు! సాక్షాత్తు ఆ హనుమంతుడు!" అని చెప్పడంతో ఇప్పుడు రుద్ర మరియు శివ అంజికి నమస్కరిస్తారు.

అలా కట్ చేస్తే కింద చూపిస్తారు. అక్కడ విక్రమ్ మరియు అర్జున్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, "ఇప్పుడు ఏం చేద్దాం?" అని ఆలోచిస్తున్నారు.సమాధానం కింద ఇవ్వబడింది:

సామ్రాట్, "విల్లు ఎవరు, అంజీ?" అని అడుగుతాడు. వెంటనే అంజీ, "అతని పేరు రుద్ర. మన లోకంలాగే వీళ్ళకు కూడా లోకం ఉంది కదా, భూలోకం. దాంట్లో రుద్ర హీరో, అలాగే నువ్వు హీరో దాంట్లో, విక్రమ్ హీరో వేరే భూముల్లో," అని చెప్పాడు.

అది తెలుసుకున్న తర్వాత అందరూ మళ్ళీ విక్రమ్, అర్జున్ వైపు చూస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారని ఆలోచిస్తున్నారు. అనుకున్నట్టుగానే మొదటిగా విక్రమ్ కిందికి దిగిన తర్వాత ఒక దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే ప్రజలు వణుకుతూనే ఉన్నారు. వెంటనే వాళ్ళందర్నీ విడిపించిన విక్రమ్ బయటికి పిలుస్తాడు, కానీ వాళ్ళ సంకెళ్లు తగ్గలేదు. వెంటనే అర్జున్ అక్కడికి వస్తాడు. తన శరీరంలో నుంచి ఒక గబ్బిలం లాంటి ఒక పక్షి వస్తుంది.

"ఏంట్రా ఇది? నువ్వు మనిషివేనా? పిల్లి, ఫీనిక్స్, ఇప్పుడు గబ్బిలం ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావ్?" అని అంటున్నాడు విక్రమ్. అర్జున్ చిన్నగా నవ్వుతూ, "చెప్తా లే, ఫస్ట్ కానీ," అని అంటూ గబ్బిలాన్ని ప్రజల ముందు పంపిస్తాడు. అది నెగటివ్ ఎనర్జీని తీసుకొని వాళ్ళ చేతులకు ఉన్న గొలుసులను విప్పేస్తుంది. ఆ వెంటనే ఆ ప్రజలు అక్కడి నుంచి తమ స్థలాలకు చేరుకున్నారు.

కర్ణుడి కవచం అదృశ్యం

అప్పుడే వీర వాళ్ళ ముందుకు వచ్చాడు. "క్షమించండి, నేను మన రాజును కాపాడలేకపోయాను. కానీ మీ కోసం నేను వీళ్ళని తీసుకువచ్చాను. ఇంతకుమించి నేనేమి చేయలేను," అని అంటాడు వీర. అప్పుడే అర్జున్ మరియు విక్రమ్ ఇద్దరూ అక్కడికి వచ్చి "మీకు రాజు కావాలి," అని అంటూ ఉంటే, వీర, "లేదు విక్రమ్, ఇప్పుడు ఇక్కడున్న వస్తువు మిస్సయింది అంటే కర్ణుడి కవచం మిస్ అయింది. ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో ఈ ప్రదేశం మాయమైపోతుంది," అని చెబుతాడు.

వాసుదేవ వంశం రహస్యం

"అది ఎలా ఉన్నదా, అది సరే, నాకు ఒక అనుమానం," అని అంటాడు శివ. "ఏంట్రా అది?" అని అంటాడు రుద్ర. "అది కాదు, ఇప్పుడు ఆ బుజ్జి అనే ఒక కుందేలు ఖమ్మంలో నుంచి మనల్ని చూసి నమస్కరించింది కదా, దాన్ని బట్టి నాకు అర్థం అయింది ఏంటంటే అక్కడ ఉన్నది హనుమంతులు వారు కాబట్టి నమస్కరించింది. నువ్వు ఆయన శక్తితో ఉన్నావు కాబట్టి నేను మీ శక్తి పొందిన కూడా నాకంటే ఆ ప్రతిభ లేదని అర్థం. మరి సామ్రాట్‌ను చూసి ఎందుకు నమస్కరించింది నాకు అర్థం కావడం లేదు," అని అడిగాడు. రుద్ర కూడా ఆగిపోయి, "నేను ఆలోచించనే లేదు," అని అంటాడు.