Not the End - 49 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 49

Featured Books
Categories
Share

అంతం కాదు - 49

"ఏంట్రా వీడు ఇలా పరిగెడుతున్నాడు? నన్నేమో అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు!" అని బుజ్జమ్మ గట్టిగా నవ్వుతూ, "కావాలి! నన్నే బంధిస్తాడా? కొద్దిసేపు ఆడుకుందాం!" అని అనుకుంటుండగా, విక్రమ్ కొద్దిసేపటికి తేరుకున్నాడు. తన చేతిలోకి బాణం వచ్చింది. అక్కడ ప్రకృతి శక్తులు పెద్దగా కనిపించకపోవడంతో నెగటివ్ ఎనర్జీ లోకి ఆ శక్తి ప్రవహించింది. ఆ నెగటివ్ ఎనర్జీతో బాణం తయారు చేసి తన విల్లుతో వేయడం మొదలుపెట్టాడు. అటు ఇటు ఎగురుతూ ప్రతి ఒక్క అసురుని చంపడం మొదలుపెట్టాడు. బీజాసురుడు మరింత బెదిరిపోయాడు.

ప్రదేశం: యుద్ధభూమిలో

వెంటనే అక్కడున్న అర్జున్, "ఇదిరా! ఇదిరా నా తమ్ముడు అంటే!" అని గర్వంగా రొమ్ము విరిచి మాట్లాడుతుంటే, బుజ్జమ్మ, "నీ తొందర ఆపు! లేదంటే నీ కథ ఇప్పుడే మొదలు పెట్టాల్సి వస్తుంది!" అని అంది.

బీజాసురుడు చూస్తున్నాడు. "వీడిని ఇలా వదిలేస్తే నిజంగానే చంపేస్తాడే ఎలా ఉన్నాడు!" అని అంటూ నెగటివ్ ఎనర్జీలో కలిసిపోయాడు. ఆ ఎనర్జీ నుంచి దాడి చేయడానికి సిద్ధమవుతూ, గట్టిగా నవ్వుతూ, "విక్రమ్! నీ అంతం ఇప్పుడు నా చేతిలోనే! నువ్వు మా అన్న మకరధ్వజుణ్ణి చంపేశావు. ఇప్పుడు నేను నిన్ను చంపేస్తా! కత్తికి కత్తి! ప్రాణానికి ప్రాణం!" అని అంటూ ఒక శూలం లాంటిది విసురుతూ ఉండగా, అర్జున్ అది చూసి ఆశ్చర్యపోతూ విక్రమ్‌ను కాపాడాలి అనుకున్నాడు.

విక్రమ్ తన వెనకాల వస్తున్న శూలాన్ని చూసుకోకుండా, ముందున్న రాక్షసులను అంతం చేయడంపై దృష్టి పెట్టాడు. వెంటనే తనలోని ఎమోషన్ పెరగడం వల్ల అర్జున్ లోని ఫీనిక్స్ ఒక్కటి బయటికి వచ్చింది. అది వచ్చి రావడంతోనే అక్కడున్న వాళ్ళందరిని తగలబెట్టడం మొదలుపెట్టింది. ఆ దెబ్బకు బీజాసురుడు విత్తరపోయాడు. "ఏంట్రా ఇది? ఎక్కడి నుంచి వచ్చింది?" అనుకుంటూ ఉండగా, ఆ పిల్లి లోకి ఫీనిక్స్ కలిసిపోయింది. ఫీనిక్స్ లోని వేడి పిల్లి యొక్క పంజాల్లోకి చేరుతుంది.

ప్రదేశం: యుద్ధం ముగింపు

ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడ రాక్షసులందరూ అంతమవుతూ ఉన్నా, బీజాసురుడు తన శక్తితో ఇంకొంతమందిని సృష్టిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి ప్రజలను కూడా బంధించి బయటకు తీసుకువచ్చి, "చూడండి! నేను చెప్పింది మీరు చేయకపోతే వీళ్ళని ఇప్పుడే చంపేస్తా!" అని బెదిరించడం మొదలుపెట్టాడు. భయంతో బీజాసురుడు తడబడుతున్నాడు.

వెంటనే ప్రజల ప్రాణాల మీదికి రావడంతో బుజ్జమ్మ ఒక్క జంప్‌లో కిందికి దూకింది. ఆ పెద్ద ఆకారం, పెద్ద చెవులు, గంభీరమైన మొహం చూసిన అక్కడున్న బీజాసురుడు, "బుజ్జిమాత! ఏంటి? ఇప్పుడు ఈమె కూడా వచ్చిందా? ఇంకా నా అంతం!" అని అనుకుంటూ ఉండగా, బుజ్జిమాత గంభీరంగా, "ఇప్పటిదాకా నీ ఆటలు కొనసాగించావు. ఇక నువ్వు కూడా చనిపో! నీ అన్న చనిపోయినట్టుగానే!" అని అంటూ తన చెవులతో ఒకసారి ఒక బాంబు లాంటిది బీజాసురుడి మీదికి విసిరింది. ఆ బీజాసురుడు దాన్ని తట్టుకోలేక, దానిలో కలిసిపోయి మెత్తగా పిండిలా మారిపోతూ ఉండగా, "మమ్మల్ని చంపావు! మమ్మల్ని చంపినందుకు మీ అందరి మీద పగ తీర్చుకోవడానికి సోమసేనుడు వస్తాడు!" అని అంటూ అతడు ప్రాణాలు కోల్పోతాడు. కానీ అంతకుముందే ఫీనిక్స్ రాకముందే, ఆ బల్లెం విక్రంలో కలిసిపోయింది. అతడు ప్రాణాలు కోల్పోయే సమయానికి చేరుకున్నాడు.

ప్రదేశం: యుద్ధం ముగిసిన తర్వాత, విక్రమ్ దగ్గర

అదే సమయంలో, విక్రమ్ చనిపోతూ తన ప్రాణాలు విడుస్తూ ఉండగా, దూరం నుంచి అర్జున్ గట్టిగా అరుస్తూ, "తమ్ముడూ! కర్ణా!" అంటూ గట్టిగా పరిగెడుతూ వచ్చాడు. విక్రమ్‌ను తన చేతిలోకి తీసుకొని, "నిన్ను ఈసారి కూడా రక్షించలేకపోయాను! నన్ను క్షమించు!" అని అంటూ విక్రమ్ తలను పట్టుకొని లేపుతున్నాడు.

అదే సమయంలో ఎక్కడి నుంచో ఏదో వెలుగు అక్కడున్న టవర్ వద్ద మెరుస్తున్నట్లుగా ఒక్క క్షణం మెరిసి, ఏదో బయటికి వచ్చింది. దానిలో నుంచి ఏదో బంగారు రంగులో వెలుగుతున్న వస్తువు ఒక్కసారిగా దూసుకు వస్తూ విక్రమ్‌ను తాకింది. ఆ దెబ్బకు అర్జున్ ఎగిరి కింద పడతాడు. అతడు కూడా స్పృహ తప్పి పడిపోతాడు.

ప్రదేశం: టవర్ పైన

ఆ తర్వాత, బుజ్జమ్మ, "నా పని పూర్తయింది. ఇక మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు," అని అంటూ ఉండగా, బుజ్జమ్మ విక్రమ్ వైపు చూస్తూ, "నీ గతం నీకు గుర్తొచ్చేలా ఉందే," అని అనుకుంటుంది. తర్వాత, "సరే, నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దాం," అని మళ్ళీ ఆ టవర్ పైకి ఎక్కి కూర్చుంటుంది.

ప్రదేశం: మనోహర గ్రహం, యుద్ధం ముగిసిన తర్వాత

కొద్దిసేపటికి అర్జున్ పైకి లేస్తాడు. తన తమ్ముడి మీద ఏదో పడింది, తన శవం కూడా దక్కదు అని అనుకుంటున్న అర్జున్ విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ శరీరం మీద పెద్ద దెబ్బ, కానీ అది చావు నుంచి బ్రతికించే దెబ్బ. మళ్ళీ శవం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. తను గుక్కపెట్టి ఏడుస్తూ ఉండగా కన్నీళ్లు విక్రమ్ శరీరం మీద పడతాయి. విక్రమ్ శరీరం మీద ఉన్న బంగారు రంగు ఇంకాస్త పెరుగుతూ, ఆ దెబ్బ తగిలిన చోటు నుంచి గుండెల మీదికి, కింద కాళ్ళ మీదికి, పైన తల మీదకు అంతా చుట్టుకుంటూ ఏదో జరుగుతూ ఉండగా, విక్రమ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు.

తను తనకే తెలియకుండా పైకి లేస్తాడు. ఆకాశంలోకి వెళ్లి, "అర్జునా! నువ్వు తప్పు చెప్పావు! నేను కదా నీకు అన్నను! నన్ను తమ్ముడు అంటావే?" అని గట్టిగా నవ్వడంతో అక్కడ సీన్ కట్ అవుతుంది.

టైటిల్: కల్కి: అర్జున కర్ణ కలయిక