Zombie Emperor - 14 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 14

Featured Books
Categories
Share

థ జాంబి ఎంపరర్ - 14

జాంబీల దాడి – సుమంత్ నాయకత్వం

అలా కట్ చేస్తే, సుమంత్ చేతికి జాంబీల గాయం అయింది. అది ఎవరికీ కనిపించకుండా స్లీవ్‌లతో కప్పేసి బయటికి వస్తాడు. అతనిని చూసి మీనాక్షి, "ఏమైందిరా లోపల? అసలు ఏం జరుగుతుంది?" అని అంటూ ఉంటే...

సుమంత్: "అమ్మా, మనం వెళ్ళిపోదాం!" అని అంటూ ఉండగానే, బయట నుంచి పెద్ద పెద్ద కేకలు, పరుగులు తీస్తున్న శబ్దం వినిపిస్తుంది. జంతువులు కూడా భయంతో పారిపోతున్నాయి. ఆ దెబ్బకు మీనాక్షి పిల్లలందరినీ ఒకచోట చేర్చి ఉండగానే, మరో పక్కనుంచి కొంతమంది మనుషులు భయంతో పరిగెడుతున్నారు. వాళ్ళ వెనకాలే అంతుచిక్కని వేగంతో, విచిత్రమైన నడకతో, భయంకరంగా కనిపిస్తూ, గిట్టు గిట్టు శబ్దాలతో జాంబీలు పరిగెడుతున్నాయి!

వెంటనే సుమంత్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఆ పిల్లలను, ఆ ప్రజలను ఒక చోటికి చేర్చి, పిల్లలను లోపల పెట్టి, "చూడండి పిల్లలు! మీరు భయపడకండి. ఇప్పుడు మనం మనమే గెలవాలి. ఎవరు వచ్చినా మనమే ముందు పరిగెత్తాలి. మీ చుట్టూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని కనిపించకుండా ఉంచుతారు. మీరు స్పీడ్‌గా పరిగెత్తాలి వాళ్లతో పాటు!" అని అంటూ, పిల్లలని మధ్యలో పెట్టి, అందరినీ తీసుకుని ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు.సుమంత్ పరివర్తన - సోల్ క్యాప్చర్ జాంబీ ఆవిర్భావం

పరిగెడుతూనే సుమంత్ చెయ్యి బాగా మందడం మొదలుపెట్టింది. అతను గట్టిగా తన చేతిని పట్టుకుంటూ ఉంటే, అతని కళ్ళు ఎర్రగా మారుతూ, పళ్ళు జివ్వుమంటున్నట్టు అనిపిస్తోంది. అయినా పెద్దగా పట్టించుకోకుండా సుమంత్ ముందుకు వెళ్తున్నాడు.

వెనకాల నుంచి ఎవరో ఎటాక్ చేస్తున్నట్టు సుమంత్‌కు తెలియకుండానే వెంటనే వెనక్కి తిరుగుతాడు. జాంబీ ఒకరిని పట్టుకోబోతూ ఉండగా, సుమంత్ స్పీడ్‌గా వెళ్లి, ఒక గుద్దుతో ఆ జాంబీని దూరంగా పడేస్తాడు. "అందరూ పదండి! పారిపోదాం పదండి!" అని అంటూ అందరినీ ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు.

సోల్ క్యాప్చర్ జాంబీ ఆవిర్భావం

అదే టైంలో, ఎక్కడో ఒకచోట ఒక పిల్ల జాంబీ తెల్లటి కళ్ళతో ఉండగా, దాని కళ్ళు ఎర్రగా మారుతూ, దాని శరీరం మాయమవుతూ, పక్కనే ఉన్న ఆత్మలతో కలిసిపోతుంది (అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలతో). తెల్లటి గుడ్డ పైన విచిత్రమైన, వివిధ మొహాలతో కలిసిపోయి, దాని కాళ్ళు, చేతులు కనిపించకుండా కేవలం ఒక బట్ట కప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. అప్పుడు అది గట్టిగా అరుస్తూ, "సోల్ క్యాప్చర్ జాంబీ" అనే పేరును పలుకుతూ, అక్కడ చనిపోయిన ఆత్మలన్నింటినీ తన వెనకాల ఒక సైన్యంగా చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది.అలా సోల్ క్యాప్చర్ జాంబీని పక్కనపెట్టి, ఇప్పుడు సుమంత్ వైపు చూపిస్తే, అందరినీ తీసుకొని ఒక చిన్న గుడి లాంటి చోట (క్రిస్టియన్స్ గుడిలా కనిపిస్తుంది, లోపల చిన్న సిలువ కూడా ఉంది) దాచిపెట్టాడు. ప్రజలందరినీ లోపల పెట్టి తను చూస్తూ ఉన్నాడు చుట్టూ. అది కూడా ఒక ఊరే అని అర్థమవుతుంది, కానీ ఆ ఊరు అంతకుముందే సర్వనాశనం అయిపోయిందని, మళ్ళీ అక్కడికి రాబోతున్నాయని అర్థం చేసుకొని, అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు.

అతని చేతి నుంచి బాగా రక్తం పోవడం మొదలుపెట్టింది. అతని కళ్ళు ఇప్పుడు పూర్తిగా రెడ్ కలర్‌లోకి మారడానికి సిద్ధంగా ఉన్నాయి. అతని కళ్ళు అప్పుడు రాత్రి కాబట్టి స్పష్టంగా చూస్తున్నాయి కానీ ఎక్కడో చిన్న లైట్ అతని చూపులు మందగించేలా చేస్తుంది. అతను గుడి లోపలికి వెళ్లి ప్రజలను చూస్తున్నాడు. అతని పళ్ళు మరింత జివ్వుమంటూ ఉండగా, అక్కడున్న వాళ్ళ మెడల మీద నరాలు కనిపిస్తూ ఉండగా, అతడు తన ఉర్రూతలు ఊగుతున్న రక్తాన్ని అదుపు చేసుకోలేక పోతున్నాడు.

అప్పుడే ఒక కిటికీలో నుంచి జాంబీ లోపలికి వచ్చి ఎవర్నో పట్టుకుంటూ ఉంటే, తను చాలా స్పీడ్‌గా కదిలి ఆ జాంబీ తలకాయ రెండు ముక్కలు చేసి పక్కకు విసిరిపడేస్తాడు. అక్కడే ఉన్న శిలువను చేతిలోకి తీసుకొని బయటికి వెళుతున్నాడు. అక్కడే ఉంటే తను కూడా వాళ్ళని ఎక్కడ చంపేస్తానేమో అని అతనికి భయంగా అనిపిస్తుంది.

స్కెలిటన్ జాంబీ & డైనోసార్ జాంబీ ఆవిర్భావం

అతను వందలాది జాంబీ సైన్యం ముందు ఒక్కడే హీరోలా నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎంతో మందిని చంపిన తర్వాత అతనికి అలసట వచ్చింది. రక్తం ఇంకా ఎక్కువగా పోస్తూ ఉంటే అతని కళ్ళు తిరుగుతున్నాయి. మెల్లగా ఒక పక్కకు వెళ్లి చెట్టు కింద కూర్చున్నాడు.

అప్పుడే చనిపోయిన జాంబీలు ఎముకలన్నీ కటకట కటకట అంటూ ఒకటే రూపాంతరాన్ని సాధించుకున్నాయి. దాన్ని చూస్తూ, "ఏంటిది? ఎముకల జాంబీనా? అంటే దీన్ని ఇంగ్లీషులో స్కెలిటన్ జాంబీ అంటారు కదా? అయ్యో బాబోయ్! మామూలు జాంబీలనే తట్టుకోలేకపోతున్నా, ఇప్పుడు ఈ ఎముకల జాంబీ ఏంటి?" అని అనుకుంటూ ఉండగానే, అతని వెనకాల ఉన్న వందల సైన్యం కాస్త ఇప్పుడు ఎముకలతో పూర్తిగా జాంబీలుగా మారిపోయింది. అయినా దాని సైన్యం పక్కాగా రూపాంతరం చెంది పిల్ల జాంబీలు, స్కెలిటన్ జాంబీలుగా మారిపోయాయి.

అతను ఇంకా నీరసంగా మారిపోయాడు. అతనికి ఆకలి పెరిగిపోతూ ఉంది. అదే టైంలో, ఎముకల జాంబీలు విడిచేసిన చర్మాన్ని మరో పక్క నుంచి ఎర్రటి కళ్ళతో చూస్తూ చూస్తూ, ఒక జాంబీ తనకు తానే అటు ఇటు వెళుతున్న జాంబీలను తన సైన్యంగా మార్చుకుంటూ, అక్కడ పడిపోయిన (అంటే ఇప్పుడు స్కెలిటన్ జాంబీ యొక్క) చర్మాన్ని, కండలను తను తీసుకొని తనకు రెక్కలుగా మార్చుకొని తన రూపాన్ని పూర్తిగా ఒక డైనోసార్ జాంబీ షేప్‌లోకి తీసుకువస్తుంది. అది గాలిలోకి ఎగరడానికి ఆ కండలు మరియు చర్మం ఉపయోగపడుతూ గాలిలోకి ఎగిరింది. దాని కింద చిన్న చిన్న జాంబీ పిల్లలు డైనోసార్ పిల్లల లాగా మారిపోయాయి.

అది చూస్తున్న సుమంత్‌కు అంతే కళ్ళు బయలు కమ్మాయి, గుండె వేగం పెరిగింది. "ఏంటిది? ఇది డైనోసార్ లా ఉంది! డైనోసార్ జాంబీ! ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో?" అని వణుకుతూ ఉన్నాడు.

మౌంటెన్ జాంబీ ఆవిర్భావం - జాంబీ జనరల్స్ యుద్ధం

అప్పుడే అది (డైనోసార్ జాంబీ మరియు స్కెలిటన్ జాంబీ) రెండు ఒకటి ఒకటిని చూసుకుంటూ ఎవరు గొప్ప అని పోటీ పడుతుండగా, దూరం నుంచి ఏదో పెద్ద పెద్ద అడుగులతో ఆ ఇద్దరి మధ్యకు వచ్చింది. పెద్ద గుండ్రటి కళ్ళతో, చూడడానికి రెండు ఫుట్‌బాల్ లాంటి కళ్ళతో గుండ్రంగా తిప్పుతూ చూస్తూ ఉంది. దాని పెద్ద పెద్ద నోరు, భయంకరమైన చర్మం చాలా గట్టిగా ఉంది. కండలు పర్వతాన్ని తలపించే శరీరం. అంతే అది చూడగానే సుమంత్ యొక్క శరీరం వనకడం ఆపేసి, కింద పడిపోయే స్థాయికి చేరుకుంది. తన చల (తల?) చుట్టూ గిర్రున డైనోసార్ జాంబీ, స్కెలిటన్ జాంబీ ఇప్పుడు పర్వత రాక్షసుడు మౌంటెన్ జాంబీ అని అంటూ ఆ మూడు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా కలలో విహరిస్తూ ఉన్నాడు సుమంత్.

ఆ ఇప్పుడు డైనోసార్ జాంబీ, స్కెలిటన్ జాంబీ, అలాగే మౌంటెన్ జాంబీ... మూడు ఒకరినొకరు చూసుకుంటున్నాయి. మౌంటెన్ జాంబీ చూస్తే చిన్నపిల్లాడిలా కనిపిస్తుంది (బహుశా దాని భారీ ఆకారం వల్ల), కానీ అది భారీ ఆకారంలో ఉంది. దాని మైనస్ పాయింట్‌ను గమనిస్తూ డైనోసార్ మరియు స్కెలిటన్ జాంబీలు, "వీడు వేస్ట్, ఎందుకు పనికిరాడు" అన్నట్టుగా అసలు చూడకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాయి. "జాంబీ జనరల్‌గా నేనుండాలి!" అంటే, "లేదు, నేను ఉండాలి!" అని ఇద్దరు ఒకరినొకరు గట్టిగా చూసుకుంటున్నారు.