ఆగమనం.....
వీళ్ళిద్దరి అల్లరి సరసాలు చూస్తూ మన హీరో.. డిక్కీ దగ్గర లగేజ్ తో కుస్తీ పడుతున్నాడు.
వెళుతున్న భార్యని ఇష్టంగా చూస్తూ బావమరిదికి బరువు మోయడానికి కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు ప్రమోద హస్బెండ్.
ఇంట్లోనే హడావిడినంత వదిలిపెట్టేసి మేడ మీదకి చేరిపోయాడు. సిక్స్ ఫీట్. ఫ్లోర్ మీద లేజీగా పడుకుని పొట్టి దానితో ఫస్ట్ కిస్, అలాగే అక్క మాటలు.. కంపేర్ చేసి చెక్ చేసుకుంటున్న అతనిలో రకరకాల ఆలోచనలు.
ఎందుకో మనసంతా గజిబిజిగా అయిపోతుంది!!
ఎంతకీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు!!
ఎన్నిసార్లు పెదవులను, టచ్ చేసి చూసుకున్నాడో...
ఎన్నిసార్లు పొట్టి దాన్ని తలుచుకున్నాడో...
ఎన్నిసార్లు పొట్టి దాన్ని అడ్డమైన తిట్లు తిట్టుకున్నాడో...
అయినా బాబు ఈగో సాటిస్ఫై అవ్వడం లేదు!!
తలకింద చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసుకున్న అతని మనసంతా కొట్టితే ఆక్రమించింది. అది ఒకపక్క డిస్టర్బ్ చేస్తూ మరొకపక్క చికాకు పుట్టిస్తున్న..
ఇంకోపక్క ఏదో మూల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది.. ఆ యాంగిల్ అతనికే ఆశ్చర్యంగా అనిపిస్తుంటే ఎవరే నువ్వు నిమిషాల్లోనే నా మైండ్ ఇంతగా చెడగొట్టేసావ్ అని తిట్టుకుంటున్నాడు మళ్ళీ.
ఏదో నీడ వచ్చి, ముఖం మీద పడడంతో కళ్ళు తెరిచిన అతనికి, ఎదురుగా... తన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు.
పూర్తిగా నేల మీద పడుకున్న సిక్స్ ఫీట్ ని ఇద్దరూ విచిత్రంగా చూస్తున్నారు.
ఏం చేస్తున్నావ్ రా ఒక్కడివే ఇక్కడ??
అయిన ఇలా నేల మీద పడుకున్నావు ఏంట్రా??
నీకోసం వెతుకుతుంటే, అక్క చెప్పింది పైన ఉన్నావని
కింద మన బ్యాచ్ అంతా వెయిటింగ్, రారా పోదాం!!
అంటూ ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు నస పెట్టేస్తున్నారు!!
మామూలుగా అయితే, బాబుకి అలా ఉండదు!!
కానీ బాబు మూడ్ అంతా, పొట్టిది చెడగొట్టేసింది!!
దాంతో ఫ్రెండ్స్ ఇద్దరినీ, చిరాగ్గా చూస్తున్నాడు!!
ఇద్దరినీ మార్చి, మార్చి చూస్తూ.. లేచి కూర్చున్నాడు!!
ఏంటి మామ, నెట్వర్క్ లేని మొబైల్ లా డల్ అయ్యావు!!
అంటూ, ఒక ఫ్రెండ్ నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు!!
బాబు భుజం చుట్టూ చేయి వేసి, ఊపేస్తున్నాడు!!
ఒరేయ్ బక్కోడ వాడి మూడ్, సరిగ్గా లేనట్టుంది!!
నువ్వు నీ కుళ్ళు సెటైర్లు, కంట్రోల్ చేస్తే బాగుంటుంది!!
అంటూ, రెండో వాడు బక్కోడికి వార్నింగ్ ఇస్తున్నాడు..
అతనికి క్లియర్ గా తెలుస్తుంది బాబు డల్ గా ఉన్నాడని.
మన హీరో నవ్వుతూ, అందరితో కలివిడిగా ఉండే రకం!!
ఒంటరిగా ఉండి అందరిని అవాయిడ్ చేసే రకం కాదు!!
ఏంటి బావ, ఇంత మూడ్ ఆఫ్ లో ఉన్నావు!!
ఏదైనా బిజినెస్, ఇష్యూ స్ వచ్చాయా!!
ఇప్పుడే కద, స్టార్ట్ చేస్తున్నావు??
అప్పుడే, టెన్షన్స్ మొదలయ్యాయా??
అంటూ, అతను కూడా పక్కనే సెటిల్ అయ్యాడు!!
మొదటివాడు ఒకలాగా అడిగితే...
రెండవవాడు మరోకలా అడిగాడు...
ఏదైతే ఏమైంది, ఇద్దరూ విసిగిస్తున్నారు!!
ఇద్దరినీ చిరాగ్గా చూస్తూ, ముందుకు వంగి,
రెండు చేతులతో తలపట్టేసుకున్నాడు!!
వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా, మోఖాలు చూసుకుంటున్నారు!!
ఇద్దరు రెండు వైపులా నుంచి, బాబుని పట్టేసుకున్నారు!!ఏమైందిరా అంటూ.. ఇద్దరూ కలిసి కుదిపేస్తున్నారు!!
అహే... ఆపండి రా!!
ఏంటి రా, మీ గోల!!
ఎటువంటి ఇష్యూస్ లేవు!!
ఏ బిజినెస్ టెన్షన్స్ లేవు!!
ముందు వదిలేయండి రా బాబు!!
అంటూ, ఇద్దరిని తోసేస్తాడు!!
ఇద్దరిని పిచ్చా చిరాకుతో చూస్తున్నాడు!!
మీరు కిందకి పొండి...
నేను కాసేపు ఆగి వస్తాను...
ఏం కావాలో మీరు చూసుకోండి!
నన్ను కాసేపు వదిలేయండి!!
ఫుల్ గా ఇద్దరి మీద ప్రస్టేట్ అవుతున్నాడు!!
పిచ్చిగా అరుస్తున్న ఫ్రెండ్ ని,
వాళ్ళిద్దరూ విచిత్రంగా చూస్తున్నారు.
ఒరేయ్ మామ నీకు ఏదో అయ్యింది రా!! పిచ్చి కుక్క కరిచిన పిచ్చోడిలా, అలా అరుస్తున్నావు ఏంటి రా??
ఓరేయ్ బక్కోడ నువ్వు నోరు ముయ్ రా!!
నీ యబ్బ ఏం పోలిక రా అది!!
నోటికి ఏది వస్తే అది వాగేస్తావా!!
వెధవ, మూసుకొని కూర్చో!!
ఒరేయ్ నేనేమన్నాను రా!!
వాడి ముఖం సరిగ్గా చూడు, నీకే తెలుస్తుంది!!
గర్ల్ ఫ్రెండ్ లెఫ్ట్ లెగ్ తో కిక్ ఇస్తే...
బ్రేకప్ తో రోడ్డు మీద పడ్డ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు!!
సరిగ్గా చూడు! కళ్ళు దోబ్బ లేదు కదా!!
వాడిని చూసి ఆ తర్వాత మాట్లాడు!!
ఇటువంటి విషయాలలో బక్కోడు మంచి ఎక్స్పర్ట్!!
తను కరెక్ట్ అని చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నాడు!!
ఇప్పటివరకు ఏది మాట్లాడినా పట్టించుకోలేదు కానీ....
బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి....
ఒక్కసారిగా తిక్క లేచింది మన హీరోకి.
మరొక్క మాటకి అవకాశం ఇవ్వలేదు బక్కోడికి.
బక్కోడిని వంగబెట్టి నాలుగు పీకాడు!!
ఒకడిని కొట్టగానే, రెండోవాడు దూరం జరిగాడు!!
బక్కోడు మన హీరో ఫ్రస్టేషన్ కి బలైపోయాడు!!
అక్కడ పొట్టి దాన్ని కొట్టలేకపోయాడు కదా!!
ఆ తిక్క మొత్తం బక్కోడి మీద చూయించేసాడు!!
ఒరే బావ, నీకు నిజంగానే మైండ్ దొబ్బింది రా!!
వాడికే నేను సపోర్ట్ చేస్తున్న! నీ పిచ్చి పిక్స్ లో ఉంది!!
వాడు అన్నట్టు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఆ??
అటువంటిది, ఏమైనా కనెక్ట్ అయిందా??
ఇద్దరిని పిచ్చ కోపంతో
చూస్తున్నాడు మన హీరో!!
లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ కాకపోయినా...
లవ్ కాన్సెప్ట్ కావడంతో!!
ఫ్రెండ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి..
దడుచుకున్న బక్కోడు దూరంగా జరిగిపోయాడు!!
వీడి వీపు పగిలితే గాని, వాడి ప్రెస్టేషన్ అర్థం కాలేదు!!
ఇద్దరినీ ఒక్క నిమిషం మార్చి మార్చి చూసి...
అవునని ఒప్పేసుకుంటూ, తల పట్టుకున్నాడు!!
తను ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవడంతో...
బక్కోడు బాద్షా లా టి షర్ట్ ఎగరేస్తున్నాడు!!
మై గెస్ ఆల్వేస్ కరెక్ట్ అన్నట్టు, రెండో వాడికి...
చూడు అని కళ్ళగరేస్తూ సైగ చేస్తున్నాడు!!
రెండవవాడు 'తూ..'అని ఉమ్మేసినట్టు సైగ చేస్తూ..
రారా అంటూనే, మన హీరో దగ్గర కూర్చున్నాడు!!
ఒరేయ్ బావా, ఈ లవ్ కాన్సెప్ట్ ఏంటి రా!!
మాకు ఏమీ అర్థం అవటం లేదు!!
ఇదంతా ఎప్పుడు జరిగింది రా??
అసలు నువ్వు ఎప్పుడు లవ్లో పడ్డావు రా??
మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు!!
కొంపదీసి యుఎస్ లో ఎవరినైనా లవ్ చేసావా??
అంటూ, ఇద్దరూ మళ్లీ మొదలుపెట్టారు!!
ఒరేయ్, నోరు మూస్తారా ఇద్దరు!!
మీ ఇద్దరి అనుమానాలు తగలెయ్య!!
నేను లవ్ చేస్తే, మీకు తెలియకుండా ఉంటుందా!!
కొంచెం వాడండి రా, ఉందిగా లోపల??
అని ఇద్దరు మీద విరుచుకుపడుతున్నాడు!!
ఒరేయ్ బావ, లవ్ కాన్సెప్ట్ అని చెప్పింది నువ్వు!!
అవును రా మామ, లవ్ అని చెప్పింది నువ్వే కదా!!
మళ్ళీ తెలియదా మమ్మల్ని తిడుతున్నావు!!
ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిని లవ్ చేసావో?? చెప్పాల్సింది కూడా నువ్వే కదా, మామ!!
ముందు ఆ విషయం చెప్పు మామ!!
అంటూ, మొదటి వాడి మాటకి అడ్డుపడిపోతూ...
మన హీరోని దబయిస్తూ, బక్కోడు దూరిపోయాడు!!
బాబు ప్రస్టేషన్ కి బలయింది, మరి పక్కోడే కదా!?
ఒరేయ్ ఆపుతావా? లేక నీ మొఖం పగలగొట్టానా!!
వాడు ఏదో ఫ్రస్టేషన్ లో ఉంటే, నీ ఎగస్ట్రాలు ఏంటి రా??
బాగా ఓవర్ చేస్తున్నావు!!
కట్ చేయలేదే అనుకో, నా చేతిలో చచ్చేవే!?
ఒరే బావ, నిజంగా లవ్ చేసావా??
ఎప్పుడు ఇదంతా జరిగింది రా??
అయినా ఎవర్రా ఆ అమ్మాయి??
ఇక్కడ అమ్మాయా లేకపోతే, అక్కడ అమ్మాయా??
సేమ్ క్కొఛన్స్ కాపీ కొట్టి సాఫ్ట్ గా అడుగుతున్నాడు!!
ఒరేయ్, మీ ఇద్దరిని కలిపి తంతాను!?
వాడు అడిగిందే, నువ్వు రిపీట్ చేస్తున్నావు!!
నేను లవ్ మ్యాటర్ అన్నాను గాని...
నేను లవ్ చేశాను, అని చెప్పానా!!
ఆ పిచ్చ పొట్టిది, నన్ను లవ్ చేసిందంటా!!
ఆ పిచ్చ వాగుడుకాయి నన్ను డిస్టర్బ్ చేసింది!!
ఆ పొట్టిది చేసిన పనికి, అక్క కూడా సపోర్ట్ చేస్తుంది!!
మన హీరో తన పిచ్చ ప్రస్టేషన్ కి, తన మూడ్ ఆఫ్ కి కారణమైన పొట్టి దాని హిస్టరీ!!
దానితోపాటు, తన అక్కతో జరిగిన డిస్కషన్!!
అంతా క్లియర్ గా, ఇద్దరికీ చెబుతాడు!!
మన హీరో పిట్ట కథలాగా చెప్పిన పొట్టి దాని ప్రేమ కథ విన్న ఫ్రెండ్స్ ఇద్దరు నోర్లు వెళ్లబెట్టి, గుడ్లు బయటపెట్టి...
సిమ్ కార్డు పీకేసిన సెల్ ఫోన్స్ లాగా దర్శనమిస్తున్నారు!
విన్న వాళ్ళ పరిస్థితే అలా ఉంటే!!
ఫేస్ చేసిన మన హీరో పరిస్థితి,
ఈ మాత్రం ఉండొచ్చు!!
@@@@@@@@@
తదుపరి భాగం... నీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
నీ రేటింగ్, సమిక్ష, స్టిక్కర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
నేనే కదా అని ఇవ్వకుండా వదిలేయకు!
నీకు కూడా విలువ ఉంది ఇక్కడ!
నీవు కూడా నాకు, అమూల్యమే!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.