He is alive... - 12 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | తనువున ప్రాణమై.... - 12

Featured Books
Categories
Share

తనువున ప్రాణమై.... - 12

ఆగమనం.....


సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్కటి అడుగుతాను, హానెస్ట్ గా 
నీకేమనిపిస్తుందో అదే చెప్పు!! 
ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక.. 
నీలో పుట్టిందే అనుకో..?? 
అప్పుడు నువ్వు, ఎలా రియాక్ట్ అవుతావు??
అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది??
నీకు, ఏం చేయాలనిపిస్తుంది?? 
నీకు, ఎలా చెప్పాలనిపిస్తుంది?? అని అడిగింది ప్రమోద.

అడిగినందుకు, అక్కని చాలా అంటే..
చాలా దారుణంగా చూస్తున్నాడు.

ఏంటి రా ఆ చూపు, అంత భయంకరంగా చూస్తున్నావు!!
నీ చూపులతోనే మీ అక్కని కాల్చేద్దాం, 
చంపేద్దాం అని ఫిక్స్ అయ్యావా!!
ఈ చూపులన్నీ మీ బావ చూస్తాడు లే కానీ,
నువ్వు మరీ అంత కష్టపడకుండా... 
నిన్ను అడిగిన దానికి చెప్పు ముందు అంది సీరియస్ గా అతని ఫీలింగ్స్ తోసిపుచ్చుతు.

అసలు ఏం అనుకుంటున్నావు అక్క?? 
నువ్వు నన్ను ఏం అడుగుతున్నావో అర్థమవుతుందా?? 
అసలు ఆ పిచ్చ పొట్టిని దృష్టిలో పెట్టుకొని ... అడుగుతున్నావు!! అదైనా నీకు తెలుస్తుందా!! అని రివర్స్ ప్రశ్నిస్తున్న 6 ఫీట్ లో
బర్నర్ మీద ఉన్న కుక్కర్ లో లా ప్రెషర్ పెరుగుతూ ఉంది!!

ఏంటి తమ్ముడు!! ఎందుకు రా అంత కోపం!! 
అయిన తెలియకుండా, ఎందుకు అడుగుతాను?? 
తెలిసే అడిగాను!! నువ్వు తెలియదు అని చెప్పకు!! 
నీలో ఇంత కోపం ఉందని, నాకు అసలు తెలియదురా!! 
నా తమ్ముడు లో నాకు తెలియని కోపాన్ని చూపించింది ఆ పిల్ల, ఎంతైనా గ్రేట్ రా అని నవ్వుకుంటూ తమ్ముడిని చూస్తుంటే 

అక్క నువ్వు ఇంకా దాని భజన ఆపుతావా!!
నువ్వు ఆ పిచ్చ పొట్టి దాన్ని మెచ్చుకోకు!! 
నాకు అసలు నచ్చడం లేదు!!
అలాగే నవ్వడం కూడా ఆపు!!
నాకు కాలిపోతుంది ఇక్కడ!!
తను ప్రస్టేషన్ కి పెట్రోల్ పోస్తున్న... 
అక్క నవ్వుతో ఇంకాస్త ఫైర్ అయ్యాడు.

"మాస్టర్ కొట్టినందుకు కాదు, స్టూడెంట్ చూసినందుకు"అన్నట్టు ఉంది సిక్స్ ఫీట్ ఫ్రస్టేషన్. 

పొట్టిది ముద్దు పెట్టినందుకు కాదు, అక్కడ అమ్మాయిలు తిట్టినందుకు, ఇక్కడ అది అక్క ప్రశ్నిస్తున్నందుకు ఇరిటేట్ గా ఉంది అతనికి.

"అసలు కన్నా, వడ్డీ ముద్దంట"
అసలు మేటర్ కన్నా…
కొసరు మ్యాటర్ వల్ల....
భాగ కాలిపోతుంది మన సిక్స్ వీటికి

ఆగి ఆగి వెళ్లే సిటీ బస్సు లాగా.....
ఆగి ఆగి నవ్వుతున్న అక్కని చూస్తుంటే...
లవర్ బాయ్ నుంచి డెవిల్ బాయ్ గా మారిన....
మన హీరో సిక్స్ ఫీట్ కోపం అస్సలు ఆగనంటుంది!!


తమ్ముడి కోపానికి కష్టంగా తన నవ్వు కంట్రోల్ చేసుకున్న ప్రమోద
సరే... సరే... నవ్వను ఓకేనా..!!
నా క్వశ్చన్ కి, ఆన్సర్ చెయ్.. అని అంతే సీరియస్ గా చెప్పి తెలుసుకోవాలని ఉందిరా, చెప్పు... నీ జెన్యూన్ ఫీలింగ్ చెప్పు అంది సూటిగా తమ్ముడిని చూస్తూ.

ఏంటక్కా నువ్వు, చెప్పడానికి ఏముంది దీనిలో.
నాకు ఇంతవరకు ఎప్పుడు, అటువంటి ఫీలింగ్ రాలేదు!! వస్తే ఒక ఐడియా ఉండేది ఏమో.

ఒకవేళ వస్తే... అని ఇంకేదో చెప్పబోతున్న అతని వాయిస్ డౌన్ అయింది పొట్టిది గుర్తుకొచ్చిందో... మరి ఫస్ట్ థిస్ ఫీలింగ్ వచ్చిందో... తగ్గించిన గొంతుతో తెలియదు అక్క అన్నదే అతని లాస్ట్ వర్డ్ అయింది.


తమ్ముడు ఫీలింగ్స్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తున్న ప్రమాద ఏంటి రా ఒక్కసారే, అంత డౌన్ అయ్యావు?? ఆ పొట్టి పిల్ల ఇచ్చిన ముద్దు కరెక్ట్ అనిపించిందా?? అని అడగగానే చివరన చూసిన తమ్ముడు చూపులకి వెనక్కి తగ్గుతూ

ఇంతకీ ఎలా ఉంది.. నచ్చిందా, నచ్చలేదా?? అని కవ్విస్తూనే ఇల్లు రావడంతో కార్ బ్రేక్ వేసింది బట్ వస్తున్న నవ్వుని మాత్రం, ఆపలేకపోతుంది!!

అక్క అలా నవ్వకు..!! చిరాకుగా అరిచి ఎంతకీ అక్క నవ్వు ఆగకపోతుంటే ఛా... చెప్పి నేనే చెడగొట్టుకున్నాను కదా!! 
నువ్వు నవ్వుతూ నన్ను తేలిక చేస్తున్నావ్!!
అని అక్క మీద చిర్రుబుర్రులాడుతూ... సిక్స్ వీట్ మొఖం కంప్లీట్ గ డల్ అయింది.

తమ్ముడు చిన్నపిల్లాడిలా ఏంటి రా ఇది? 
నువ్వు తేలికవడం ఏంటి?? పిచ్చ నీకు??
నీకు అర్థమయ్యేలా, సింపుల్గా ఒక విషయం చెప్పనా...
ఇప్పుడు మనము లోపలికి వెళ్తాము!!

నా కూతురుకి నన్ను చూడగానే, ఆనందం వచ్చేస్తుంది!!
ఆ ఆనందంతో నా దగ్గరికి వచ్చి నన్ను చుట్టేసుకుంటుంది!!
మధ్యలో నువ్వు గాని, మీ బావ గాని, ఇంకెవరన్నా గాని...
ఆపడానికి ప్రయత్నించారే అనుకో....నా కూతురు ఆగుతుందా??

ఏడ్చో, మారం చేసో, పేచీ పెట్టో, ఏదో ఒకటి చేసి... నా దగ్గరికి వచ్చేస్తుంది!!నన్ను చుట్టుకుపోతుంది!! నా దగ్గర నుంచి, ఒకటో రెండు ముద్దులు తీసుకుంటుంది!!

అప్పుడుగాని, దాని ఆనందం తీరదు. అప్పుడు దాని సంతోషం నాకు... పంచానన్న, ఫీలింగ్ దానికి వస్తుంది!!
ఇప్పుడు నేను ఏం చెప్పానో... నీకు అర్థం అయిందా?? అని ప్రశ్నిస్తున్న ప్రమోదని కన్ఫ్యూజ్ ఫేస్ తో చూస్తున్నాడు

ప్రశాంతంగా తమ్ముడు ని చూస్తూ... దగ్గరికి తీసుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, అతని చెంపల మీద నెమ్మదిగా టాప్ చేస్తూ... ఆపుకోలేనంత ఆనందం, కోరిక ఏదైనా సరే అది ఎవరి మీద వస్తే వాళ్లకి వెంటనే పంచాలనిపిస్తుంది.

అలా పంచడానికి కావాల్సింది నమ్మకం!!
తన కోరిక మీద తనకి ఉన్న నమ్మకం!!
నా కూతురు మనసు ఎంత స్వచ్ఛమైనదో...
ఆ పిల్ల మనసు కూడా అంతే స్వచ్ఛమైనది!!

నీ మీద కలిగిన ఆ కోరికని అంతగా నమ్ముతుంది, ఆ కోరికలో అంత ప్యూరిటీ ఉంది. ఇక్కడ నేను ఆ అమ్మాయిని సమర్థించడం లేదు. తనలో కలిగిన ఆ కోరికని సమర్థిస్తున్నాను!!
ఆ నమ్మకాన్ని సమర్థిస్తున్నాను!! 
ఆ ధైర్యాన్ని సమర్థిస్తున్నాను!!
ఆ కోరిక నువ్వు కావడం... 
నాకు చాలా గొప్పగా ఉంది!!

ఈ ఫ్రస్టేషన్, కోపం, చిరాకు అన్ని ఇక్కడే వదిలేసేయ్!! 
కూర్చుని దీనికి ఆలోచించుకుంటావో... 
డిస్కస్ చేసి దించేసుకుంటావో... నీ ఇష్టం.
బట్ సాయంత్రం పెళ్ళికి మాత్రం నువ్వు ఇలా ఉండకూడదు!! 
అంతే... అని ఫైనల్ వార్డ్ చెప్పి దిగు వెళదాము అంటూ తను కార్ దిగింది.

సిక్స్ ఫీట్ కి క్షణం పట్టలేదు అక్క ఇచ్చిన ఎగ్జాంపుల్ నుంచి జరిగిన సీన్ రివైండ్ చేసుకొని అందులోని పొట్టి దాని ఇష్టాన్ని అంచన వేయడానికి. 

ఆక్షణం పొట్టి దాన్ని ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశాడా లేదా అన్నది అతనికి ప్రశ్న అర్థం ఫాస్ట్ గా కారు దిగి అక్కని కౌగిలించుకున్నాడు!!

యువ్ ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ అక్క!!
ఫస్ట్ కిస్, డిస్టర్బ్ చేసింది!!
అలా ముద్దు పెట్టి ఆ పొట్టిది, నన్ను బాగా డిస్టర్బ్ చేసింది!!
కాసేపటికి సెట్ అవుతాను, బట్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ కి వెరీ హానెస్ట్ .... థాంక్యూ అక్క!! అని 
చాలా నిజాయితీగా అక్కకు థాంక్స్ చెప్పాడు!!

తమ్ముడు మాటలకి, తృప్తిగా నవ్వుతు సరే..!! ఇల్లంతా హడావిడిగా ఉంది కదా!! నీ రూమ్ కి వెళ్లి ముందు రిలాక్స్ అవ్వు. అన్ ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ లేదా పెయిన్ ఏదైనా డిస్టర్బెన్స్ కామన్. 

బట్ అందులోని అవతల వాళ్ళ ఫీలింగ్ కూడా మనం చూడాలి అని మళ్లీ చెప్తే హుమ్మ్... సరే ట్రై చేస్తాను అని కన్విన్స్ గా చెప్పి   నువ్వు వెళ్ళు లగేజ్ తీసుకొస్తాను అన్నాడు డిక్కి ఓపెన్ చేస్తూ.

ఆ బరువు నువ్వొక్కడివే మోయనక్కర్లెదు. అదిగో నీకు కంపెనీ వస్తుంది చూడు అని వాళ్ళ వైపే వస్తున్న భర్తను చూపిచింది ప్రమోద.

ఏం జరుగుతుంది ఇక్కడ.. అక్క తమ్ముళ్ళు ఇద్దరు అలా కరుచుకుపోయారు. ఏంటి విషయం..!!
అంటూ... దగ్గరికి వచ్చాడు ప్రమోద హస్బెండ్ ‌.

ఏమీ లేదండి, మా తమ్ముడికి మీ కంపెనీ కావాలంటా.. 
డిక్కీ లోని లగేజ్ మోయడానికి అని చెప్పింది అల్లరి నవ్వుతో 

ఉఫ్... మీ తమ్ముడితో పాటుగా నన్ను కూడా లగేజ్ మోయమంటున్నావు.. అంతేగా అని ప్రమోద చెవి దగ్గరికి వచ్చి మా మేడం గారు మాత్రం నన్ను మోయడం మానేశారు అంటూ.. కన్ను గీటాడు.

అబ్బా అబ్బా... ఏంటండీ మీరు!! 
అవతల తమ్ముడు ఉన్నాడని కూడా చూడకుండా... అసలు సిగ్గు లేకుండా పోతుంది అని భుజం మీద చిన్నగా ఒకటి వేసింది.

ఆహా... మరదలు పెళ్లి అని చెప్పి!!
నన్ను పస్తులు ఉంచి మోయకుండా ఏడిపిస్తున్నావు!!
ఈ పెళ్లి హడావిడి అంతా పూర్తి అవ్వనివ్వు!!
మీ చెల్లి ఫస్ట్ నైట్ తో పాటు... మనది కూడా మొదలు పెడతా
రెడీగా ఉండు.... అంటూ బుగ్గలాగాడు.

హా! మొదలుపెడతారు మొదలు పెడతారు.... 
నీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు... అని కసిరి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రమోద.

వీళ్ళిద్దరి అల్లరి సరసాలు చూస్తూ మన హీరో.. డిక్కీ దగ్గర లగేజ్ తో కుస్తీ పడుతున్నాడు.

వెళుతున్న భార్యని ఇష్టంగా చూస్తూ బావమరిదికి బరువు మోయడానికి కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు ప్రమోద హస్బెండ్.


ఇంట్లోనే హడావిడినంత వదిలిపెట్టేసి మేడ మీదకి చేరిపోయాడు. సిక్స్ ఫీట్. ఫ్లోర్ మీద లేజీగా పడుకుని  పొట్టి దానితో ఫస్ట్ కిస్, అలాగే అక్క మాటలు.. కంపేర్ చేసి చెక్ చేసుకుంటున్న అతనిలో రకరకాల ఆలోచనలు.

@@@@@@@@@

తదుపరి భాగం... మీకోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.