He is alive... - 11 in Telugu Love Stories by vasireddy varna books and stories PDF | తనువున ప్రాణమై.... - 11

Featured Books
Categories
Share

తనువున ప్రాణమై.... - 11

ఆగమనం.....


ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొని జుట్టు పీక్కోవడం తప్ప, 
పాపం మన హీరో పరిస్థితి కూడా అదే!!
బరస్ట్ అయినా బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని...
వరస్ట్ సిట్యువేషన్ లో పీకేసుకుంటున్నాడు!!

ఒసేయ్ పొట్టి దాన, నువ్వు నా కంటికి మళ్ళి కనిపించవా, చంపేస్తా నిన్ను!! నీవల్ల అనవసరంగా మాటలు పడ్డాను!! లైఫ్ లో ఫస్ట్ టైం, నీవల్ల అనిపించుకున్నాను!! నువ్వు నాకు మళ్ళీ కనిపించు, పిచ్చ పొట్టి చెప్తా నీ పని!! అప్పుడు చెప్తాను!! చెప్తా... చెప్తా... అని, పిచ్చ పిచ్చగా పిచ్చ పొట్టి వాగుడుకాయని తిట్టేసుకుంటున్నాడు.

కూల్ గా లేని, మన హీరో దగ్గర ఉన్న ఫోన్ మోగుతుంది.
స్క్రీన్ మీద నెంబర్ చూసి, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
మన సిక్స్ ఫీట్ వాళ్ల అక్క....

హలో, అక్క...

తమ్ముడు ఎక్కడరా?? నేను ఫ్లోర్ అంత చూస్తున్నాను, కనిపించడంలేదు. వాష్ రూమ్ కి, ఏమైనా వెళ్ళావా??

హా... అక్క వస్తున్నాను. ఒక్క నిమిషం.

ఫోన్ కట్ చేసి, పాకెట్లో పెట్టేసుకున్నాడు.
క్షణం పాటు కళ్ళు మూసుకొని, గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. లేచి థర్డ్ ఫ్లోర్ కి స్టార్ట్ అయ్యాడు! అసహనంగా, తల రబ్ చేసుకుంటూ.. ముఖం మీదగా కిందికి జారుతున్న చెయ్యి, అనుకోకుండా అతని పెదవులకు తగిలింది.

ముందుకు వేస్తున్న, అతని అడుగు ఆగిపోయింది.
తాకి తాకకుండా తాకిన వేళ్లను, తిరిగి పెదవుల మీద నిలిపి... నెమ్మదిగా అటు ఇటు తడుముతున్నాడు.

ఒక్కసారిగా పొట్టిది చేసిన సర్కస్ ఫీట్స్ మొత్తం కళ్ళముందు ఒక రౌండ్ తిరుగుతున్నాయి.
ఆ క్షణం తనలో కలిగిన ఫీలింగ్స్ అన్ని, 
తిరిగి తనని టచ్ చేస్తున్నాయి.
దానికన్నా ముందు అతని ఈగో, 
వాటన్నిటినీ డామినేట్ చేస్తుంది.

ఒసేయ్ పిచ్చి పొట్టి ఎంత పని చేసావే!!
నా ఫస్ట్ కిస్! మై.. మై.. ఫస్ట్ కిస్!!
నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ...ఆ...
అని చిన్నగా అరుస్తాడు!!
ఒసేయ్ పిచ్చా నువ్వు నాకు దొరుకు... 
నీ గొంతు పట్టుకొని, నేలకేసి కొట్టకపోతే చూడు!!
వచ్చినవి, రానివి, అన్నీ కలిపి వందలు కొద్ది...
తిట్టేసుకుంటూ, వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి చేరుతాడు.

తమ్ముడు, ఏంటి రా... అలా ఉన్నావు??
కాస్త టెన్షన్ గా, పిచ్చిగా ఉన్న జుట్టు సరిచేస్తూ అడుగుతుంది. 

అక్క లీవ్ ఇట్! ఇట్స్ ఓకే కొంచెం తలనొప్పిగా ఉంది! 
ముందు, నీకేం కావాలో తీసుకో, బయలుదేరాము.

నిజంగా బానే ఉన్నావా!! 
లేకపోతే ఇంకేమైనా టెన్షన్ ఉందా!!

ఏంటక్కా నువ్వు నాకేం టెన్షన్స్ ఉంటాయి!! 
నేను ఏమన్నా ఇంటర్నేషనల్ ఫిగర్ నా!! 
లేకపోతే, ఇంటర్నేషనల్ బిజినెస్ మాన్ నా!! 
నాకు, నీకు తెలియని టెన్షన్స్ ఉండడానికి!?
జస్ట్ కొంచెం హెడ్ ఎక్ గా ఉంది!! 
అని జుట్టు అంతా సెట్ చేసుకుంటాడు.

తలనొప్పి వచ్చే అంత, ఏముంది రా నీకు??
ఇంకాస్త అనుమానంగా చూస్తుంది.

అబ్బా అక్క విసిగించకు!! 
ఇప్పుడే చాలా చిరాగ్గా ఉంది!! 
తర్వాత చెప్తానులే!! 
ముందు నువ్వు కావలసినవి తీసుకో...
సరే, నువ్వు కాఫీ ఏమైనా తాగుతావా??

నాకొద్దు! నీకు అవసరం అని తెలుస్తుంది!!
నువ్వు తాగు, ఈ లోపు నేను షాపింగ్ కంప్లీట్ చేసుకుంటా!! ఒక్క అరగంట పట్టిద్ది!! 
అవ్వగానే, వెళ్ళిపోదాం!!

సరే నువ్వు కానివ్వు!! 
నాకు మాత్రం అర్జెంటుగా, 
ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి!!

అక్కడున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి, 
కాఫీ కావాలి అని చెప్పేసి.. 
అక్కకి షాపింగ్ లో, హెల్ప్ చేస్తూన్నాడు!!
ఐదు నిమిషాల్లో చేతికి అందిన కాపీని...
ఆరామ్ గా సిప్ చేస్తున్నాడు!!

నిజంగా ఒక స్ట్రాంగ్ కాఫీ సరిపోతుందా!!
లేదా అంతకు మించిన స్ట్రాంగ్ ఇంకేమన్నా కావాలా!!
అమ్మో రాత్రికి చెల్లికి పెళ్లి!
తప్పు తప్పు ఆలోచించకూడదు!!

బరెస్ట్, అయినా బ్రెయిన్ కి వచ్చిన.. 
హెడేక్ కంట్రోల్ అయింది!!
పొట్టిది చేసిన వరస్ట్ తాలూకు థాట్స్... 
కంట్రోల్ అవ్వడం లేదు!!
దాని ఎఫెక్ట్ ఎక్కడ పడింది??
డ్రైవింగ్ సీట్లో అక్క కూర్చుంటే....
పక్క సీట్లో 6 ఫీట్ సెటిల్ అయ్యాడు!!

ఏరా తమ్ముడు ఏమైంది రా!! డ్రైవింగ్ చేయలేనంత, హెడేక్ ఏంటో చెప్తావా, లేదా?? డైరెక్ట్ గా పాయింట్ అడుగుతూ, కార్ స్టార్ట్ చేసింది.

ఏం చెప్పాలి అక్క? ఇదంతా ఆ పిచ్చా దానివల్లే జరిగింది!!
చెత్త పొట్టి పిచ్చాది!! దానికి అసలు బ్రెయిన్ ఉందో దొబ్బిందా నాకు అర్థం కావడం లేదు!! అంటూ తిట్ల మధ్య జరిగిన... లవ్ ఫస్ట్ సైట్ స్టోరీ మొత్తం చెప్పేసి... తన అక్కని, తల పట్టుకుని దిగాలుగా చూస్తున్నాడు.

నిజమేరా, ఆ పిల్ల పిచ్చదే ఇంత గోల చేసిందా? ఒక్కటి మాత్రం నిజం రా తనకు అనిపించింది చెప్పేసింది. అది కిస్ పెట్టి,  డైరెక్ట్ గా లిప్స్!! ఆ పొట్టి పిల్లని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా!! ఆడపిల్లలకు ఆ మాత్రం ధైర్యం ఉండాలి రా!! కానీ నేను మిస్ అయ్యాను రా, అని చిన్నగా నవ్వుతుంది.

అక్క నువ్వు నవ్వుతున్నావు!? 
అది కూడా, ఆ పొట్టిది చేసిన పనికి మెచ్చుకుంటూ!! 
నువ్వు దానికి సపోర్ట్ చేస్తుంటే.. 
నాకు ఇక్కడ మండుతుంది!!
అని, ప్రస్టేట్ అవుతున్నాడు. సిక్స్ ఫీట్!!

నువ్వు ఫీల్ అయినా సరే, నిజం ఒప్పుకోవాలి రా!!
నాకు పెళ్లయి ఎన్ని సంవత్సరాలు, అయింది రా??
చిన్న చిన్నవి తప్ప ఇలా, స్ట్రాంగ్ ఫీలింగ్.. 
నేను నోరు తెరిచి ఎప్పుడు చెప్పలేదు!!
ఒక ఆడపిల్ల చెప్పాలంటే, చాలా ధైర్యం కావాలి రా!!
మరీ ముఖ్యంగా లవ్,లస్ట్ ఈ రిలేషన్ లో ఫీలింగ్స్...
ఆ పొట్టి పిల్లలో నాకు నచ్చినది ఆ ధైర్యమే!!

కానీ మీ బావ మాత్రం, బంగారం రా!!
అలా నేను చూస్తే చాలు, ఇలా అర్థం అయిపోతుంది!!
ప్రతి ఆడపిల్ల, అలాంటి భర్తె కావాలని కోరుకుంటుంది!!
ఇది కావాలి అని అడిగే పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు!
సంతృప్తి తో నిండిన సంతోషం ఆమె ముఖంలో...
చాలా క్లియర్ గా, కనబడుతుంది!!

అంటే ఏంటి అక్క! నువ్వు ఒక అమ్మాయిగా, ఆ పొట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు!! కానీ ఇలా చూసి చూడగానే, లవ్ అంటూ... ముద్దు పెట్టడం కరెక్ట్ అంటావా??

కరెక్ట్ అని చెప్పను..!! 
ఎట్ ది సేమ్ టైం.. 
రాంగ్ అని కూడా చెప్పను..!!
ఎందుకో తెలుసా..?? 
నువ్వు కావాలని బలమైన కోరిక.. 
అది, ఆ అమ్మాయిలో చాలా బలంగా ఉంది.
ఆ అమ్మాయిలో నీ పట్ల కలిగిన ఈ ఫీలింగ్ కి... 
తను 100% సరెండర్ అయిపోయింది.

సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్కటి అడుగుతాను, హానెస్ట్ గా 
నీకేమనిపిస్తుందో అదే చెప్పు!! 
ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక.. 
నీలో పుట్టిందే అనుకో..?? 
అప్పుడు నువ్వు, ఎలా రియాక్ట్ అవుతావు??
అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది??
నీకు, ఏం చేయాలనిపిస్తుంది?? 
నీకు, ఎలా చెప్పాలనిపిస్తుంది??

@@@@@@@@@

తదుపరి భాగం... మీకోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.