forgive me please - 4 in Telugu Love Stories by Aiswarya Nallabati books and stories PDF | మన్నించు - 4

Featured Books
Categories
Share

మన్నించు - 4

మనం అనే బంధంలో .. నేను అనే స్థానం మాత్రమే శాశ్వతం. నువ్వు అనే స్థానంలో ఈ రోజు నువ్వు వుండుండొచ్చు, రేపు ఇంకెవరో ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకోవచ్చు..

********

"ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో నేను డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను." దివ్య ప్రతీదాన్లో చాలా ఫాస్టుగా వుంటుంది. 

"అందరం ఒకే కలర్లో డ్రెస్ వేసుకుందాం" శ్రీస్తి ఎక్సైట్మెంట్గానే వుంది. 

"అదే బాగుంటుంది.. ఏం అంటావ్ ధీర?" మిత్ర మాటలకి అందరూ నా వైపు చూసారు. 

"నేను రాను అనుకుంటా .... నాకు ఆ రోజు వేరే ప్లాన్స్ ఉన్నాయి" 

మొన్న అజయ్ తో బైక్ మీద వెళ్ళక తను ఇంక కనిపించలేదు. కాలేజీకి కూడా రాలేదు రెండు రోజుల నుంచి. ఏం అయ్యుంటుంది అని ఒకటే ఆలోచన.... మిత్రని అడుగుతే ఏం అనుకుంటుందో... అడగకపోడమే మంచిది. 

"ఈ మధ్య ఇలానే వుంటుంది పరధ్యానంగా..." దివ్య అంటుంటే మళ్ళీ ఆలోచనలలో నుంచి బయటకి వచ్చాను. 

ఇంకో రోజు గడుస్తోంది.... అజయ్ క్లాస్ వైపు కిటికీలో నుంచి చూస్తున్న... సిడ్ ఆశగా నా వైపు చూస్తున్నాడు, తననే చూస్తున్న అనుకుంటున్నాడు కాబోలు. సిడ్ని చూసాక ఒక ఆలోచన వచ్చింది. అజయ్ గురించి మిత్రని అడగలేకపోవచ్చు గానీ సిడ్ని అడగొచ్చు కథ. 

ఇంటికి వెళ్లగానే అమ్మ ఫోన్ తీసుకొని సిడ్ నెంబర్ డైల్ చేసి మెసేజ్ చేస. 

"హాయి సిడ్, నేను ధీర" 

నా మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నటున్నాడు, మెసేజ్ చేసిన మరో క్షణం నాకు రిప్లై వచ్చింది. 

"హాయి ధీర, ఫైనల్లీ.. ఈ ప్రేమికుడి మీద నీకు జాలి కలిగింది." 

ఏం మెసేజ్ చేయాలో తెలీలేదు. మరీ టక్కున అజయ్ గురించి అడిగేస్తే ఫీల్ అవుతాడు ... ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పు ఏం కాదు అనిపించింది. 

"సర్లే... ప్రేమికుడు అనే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు గానీ... మనం ఫ్రెండ్స్గా ఉందామా?"

"కొన్ని రోజులు నా గురించి తెలుసుకొని అప్పుడు ఓకే చెప్పాలా? వొద్దా? అని ఆలోచిద్దంలే అనుకుంటున్నావ్... డైరెక్ట్గా అదే చెప్పొచ్చుగా" 

మాటలు నేర్చిన అబ్బాయి సిడ్, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. నోరు ఇప్పుతే ఫ్లోర్టింగ్.... 

"సిడ్, ప్లీజ్ టాపిక్ మారుస్తావా?" 

"సరే నువ్వే చెప్పు..."

ఏం చెప్పాలి..ఏదో ఒకల ఈ కన్వర్జేషన్లో అజయ్ వచ్చేలా చేయాలి.. అప్పుడు ఈజీ అవ్తుంది తన గురించి అడగడం. ఆలోచిస్తున్నా ...ఈ లోపు తనే మెసేజ్ చేశాడు. 

"ఏం చేస్తున్నావ్?"

"కొంచెం రికార్డు రాసే వర్క్ ఉంది. ఆలోచిస్తున్న ఇప్పుడు రికార్డు రాయాలా? రేపటి స్లిప్ టెస్టుకి ప్రిపేర్ అవ్వాలా అని" అజయ్ ని పక్కన పెడితే, ఇదే నా ఆలోచన ప్రస్తుతానికి. ఒక అబ్బాయి కోసం ఆలోచిస్తూ మార్క్స్ తగ్గించుకోకూడదు కదా... 

"అబ్బో ... చదువు బిడ్డ" 

"నీ సంగతి ఏంటి?" 

"అజయ్ ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి" 

అజయ్ ఏంటి... హాస్పిటల్ ఏంటి.. అడగకుండానే చెప్పాడు.. గానీ ఏం అయ్యుంటుంది అజయ్క్. 

"ఏం అయ్యింది తనకి? హాస్పిటల్లో ఎందుకు వున్నాడు? అందుకే కాలేజీకి రావట్లేదా? మిత్ర కూడా ఏం చెప్పలేదు..."

"బాబోయ్ ఇన్ని క్యూస్షన్స్ ఒకేసారి.. ఎంతైనా మీరు, మీరు ఫ్రెండ్స్ కథ..."

"ఏం అయ్యిందో త్వరగా చెప్పు... భయంగా ఉంది ఏం అయ్యిందో అని" నా హార్ట్ బీట్ కొంచెం పెరుగుతూ ఉంది, ఏదో తెలియని కంగారు. ఏం అయ్యుంటుందో అనే దిగులు. 

"ఏం లేదు ధీర, వాళ్ల అమ్మగారికి హెల్త్ బాగుపడి డిశ్చార్జ్ అయ్యారని పార్టీ చేసుకున్నాం. కొంచెం గట్టిగా తాగి డ్రైవ్ చేయడం వల్ల స్తంభానికి గుద్దుకున్నాడు. లైట్గా కళ్ళు బెణికింది అంతే" 

ఏం చెప్తున్నాడో అర్ధం చేసుకోడానికి కొంచెం టైమ్ పట్టింది. అర్థం చేసుకున్నది నమ్మడానికి ఇంకొంచెం టైం పట్టింది. 

ఈ లోపు గుడికి అని వెళ్ళిన అమ్మ, నాన్నలు ఇంటికి వచ్చేశారు. ఫోన్ చూస్తూ కనిపిస్తే కోపడుతారు అనిపించింది. 

"సరే మళ్ళీ మాట్లాడదాం.. అమ్మ పిలుస్తుంది. నేను మెసేజ్ చేసినప్పుడే చేయు ... బై" అని గబగబా టైప్ చేసి సెండ్ ప్రెస్ చేశాను. 

తను ఇంతకు ముందు పెట్టిన మెసేజ్ మరోసారి చదివి అన్ని మెసేజ్లు డిలీట్ చేసేసాను. ఏంటో ఇంకా నమ్మ బుద్ధి కావడం లేదు ఇప్పటి నుంచే తాగుడు అలవాటు ఉంది అంటే. ఏదైతే ఏం ... అజయ్ కాలేజీకి ఎందుకు రావడం లేదో తెలిసింది కదా.. అదే చాలు అనుకున్నాను. 

తర్వాత రోజు కాలేజీకి వెళ్ళక .. ఇంకోసారి ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న దివ్య ధైర్యంగా అడిగేసింది. 

"ఏంటే మిత్ర, మీ భావ కాలేజీలో కనిపించడం లేదు"

"ఇన్నాలకి నేను ప్రశాంతంగా.. స్వేచ్ఛగా ఉన్నాను.. వస్తే వెధవ నస... మొన్న మా అత్తను డిశ్చార్జ్ చేశారన్న ఆనందంలో ఫుల్గా తాగేసాడు.. తగినోడు తిన్నగా ఇంటికి రాకుండా బైక్ మీద ఫీట్లు అమ్మాయిలని చూసి.. గట్టిగా వెళ్ళి స్తంభాన్ని గుద్దుకున్నాడు." చాలా క్యాజువల్గా చెప్పింది. అదేం పెద్ద మేటర్ కాదు అన్నట్టు.

"అదేంటే అంత సింపుల్గా చెప్తావ్. ఏం ఐనా అయిందా?" దివ్య కంగారుగా అడిగింది. 

"ఇప్పటి నుంచి తాగుడు ఎంటే" శ్రీస్తి నా మనసులో మాట బయటకి అనేసినట్టు అనిపించింది. 

"వాడికి ఏం అవుతాది.. గట్టిగా గుండు రాయల వున్నాడు. కళ్ళు కొంచెం బెణికింది అంతే. ఇక మందు అంటారా... కనిపించేంత మంచోడు కాదు వాడు... ఎదవ.. వాల్ల ఇంట్లో భరించలేక మా నాన్న అంటే బయం వుంటుంది అని ఇక్కడకి పంపించేశారు వాల్ల ఇంట్లోవాళ్లు... వాల్ల ఊరులో వేషాలు ఐ పోయాయి.. ఇక్కడకి వచ్చి వేస్తున్నాడు వేషాలు. మీకు చాలా సార్లు చెప్ధం అనుకున్న.. కొంచెం దూరంగా ఉండమని... ఎలానూ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్న... వాడితో జాగ్రత్త.. తర్వాత నీ భవే కదా అని చనువు ఇచ్చాం.. అని నన్ను అనుకోకండి". 

"అదేంటే మాకు ఎప్పుడు చెప్పలేదు.. ఇలా అని తెలిస్తే మాట్లాడేవాళ్ళమే కాదు" శ్రీస్తి కళ్ళు పెద్దవి చేస్తూ అంది. 

"మనిషి ఎలాంటోడు ఐన... చూడడానికి బలే వుంటాడే మీ భావ" దివ్య సిగ్గు పడుతూ చెప్పింది. 

"నిన్ను మార్చలేం" మిత్ర చేతులు గాల్లో ఆడించింది. 

నా మనసు ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇకపై తనకు దూరంగా ఉండడం మంచిది. మన జాగ్రత్తలో మనం వుండాలి. మంచి చెడులు ఒక సిట్యుయేషన్తో చెప్పలేం గానీ... చిన్నప్పటి నుంచి తన గురించి తెలిసిన మిత్ర చెప్పిన మాటలు తేలికగా తీసుకోలేము. 

రోజులు గడుస్తున్నాయి. అజయ్ కాలేజీకి వచ్చేస్తున్నాడు, శ్రీస్తి పూర్తిగా అజయ్ తో మాట్లాడడం తగ్గించేసింది. దివ్య అజయ్ కి బానే క్లోజ్ అవ్తుంది... నేను అంటి, ముట్టనట్లు ఉన్నాను. 

అప్పుడప్పుడు సిడ్ పలకరిస్తున్నాడు. నేను ముందు అంత బెట్టు చూపించకుండా .. నవ్వుతున్నాను. 

ఫ్రెషర్స్ డే కోసం అన్ని సిద్ధం అవుతున్నాయి. డాన్స్ ప్రాక్టీసులు, రిహార్సల్స్, ఆర్గనైజర్స్ అంటూ సగం మంది క్లాసెస్కి రావడం లేదు. 

కొత్తగా నేను బొమ్మలు గీయడం మొదలు పెట్టాను. టెక్స్ట్ బుక్స్లో ఒకసారి, నోట్ బుక్స్ చివరి పేజీలో ఒకసారి.. ఒక రోజు ఐతే క్యూస్షన్ పేపర్ వెనకాల కూడా గీసేసాను. 

రోజూ ఒకదాన్నే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను. టర్నింగ్ వచ్చిన దగ్గర ఇంకా తిప్పడం రాలేదు, కిందకి దిగి టర్న్ చేసి మళ్ళీ తొక్కుతున్నాను. 

"ఒకదానివే వెళ్తే బోర్ కొట్టడం లేదా" తిరిగి చూసేసరికి సిడ్ పార్కింగ్ గోడ మీద అనుకొని నిల్చొని ఎదురు చూస్తున్నాడు నేను ఎప్పుడు వస్తానా అని. 

"బోర్గానే ఉంది. గానీ ఏం చేస్తాం.. నా ఫ్రెండ్స్కి సైకిల్ లేదుగా" 

"మీ ఇల్లు ఎక్కడ అస్సలు?" 

"ఎందుకూ?"

"మా నాన్నకి అక్కడ ఒక మంచి ఇల్లు చూసి కొనేసుకోమంటాను. అప్పుడు రోజు నేను నీతో మాట్లాడుతూ ఇంటికి రావోచ్ కథ" 

"మీరు మరీ అంత డబ్బు ఉన్నవారా?"

"ఏదో ఉంది లే.. సరే గానీ ఇల్లు ఎక్కడో చెప్పలేదు"

"చెప్తే నిజంగానే వచ్చేస్తావేమో అనే భయం" 

"సరదాగా అన్నునులే.. ఎంత దూరం తొక్కుతున్నావో తెలుసుకుందాం అని" 

"పెద్ద దూరం ఏం కాదు... పెద్ద అమ్మవారి చెట్టు దగ్గర సందులో"

మా ఇల్లు ఎక్కడో చెప్పగానే ఇంక ఏం మాట్లాడకుండా కంగారుగా వెళ్ళిపోయాడు... ఏంటో ఈ మనిషి.. వస్తాడు, ఫ్లృట్ చేస్తాడు వెళ్ళిపోతాడు... 

ఫ్రెషర్స్ డే వన్ వీక్ కి వచ్చేసింది. 

"ఒకసారి నీ మ్యాథ్స్ B నోట్స్ ఇస్తావా" కిటికీ దగ్గర నుంచి అడిగాడు అజయ్. 

అజయ్ తో మాట్లాడి చాలా రోజులు అయ్యింది. ఆ మాటకి వస్తే సరిగ్గా చూసి చాలా రోజులు అయినట్టు వుంది. 

"మిత్ర దగ్గర తీసుకోవాల్సిందిగా" ఇష్టం లేనట్టు చెప్పాను. 

"తన రైటింగ్ అర్ధం కావడం లేదు. ప్లీజ్... రేపే ఇచ్చేస్తాను" 

బ్యాగ్ లోనుంచి బుక్ తీసి ఇచ్చాను. 

"థాంక్స్"

"రేపు ఇచ్యే... మాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది"

"సరే"

****

"ఇదిగో నీ నోట్స్. థ్యాంక్ యూ సో మచ్" సైకిల్ మీద ఇంటికి బయల్దేరుతుంటే తర్వాత రోజు సాయంత్రం చెప్పినట్టే బుక్ తీసుకొని వచ్చాడు అజయ్. 

"పర్లేదు"

"నువ్వు బొమ్మలు భలే గీసావ్. నిజంగా భలే ఉన్నాయి"

"హ్మ్మ్"

"ఏం అయ్యింది. ఈ మధ్య సర్రిగా మాట్లాడడం లేదు. నేనేమైనా తప్పు చేశానా?"

"అదేం లేదు. చెప్పు"

"నీకు మెహంది పెట్టడం వచ్చా?" 

"అదేంటి అలా అడిగావు?"

"బొమ్మలు బాగా వేస్తున్నావ్ కదా అని.. వచ్చేమో అని"

"హా బానే వొచ్చు"

"మిత్ర కి పెడతావా.. తీసుకువస్తా మీ ఇంటికి.. ఫ్రెషర్స్ డే కోసం"

"సరే... సండే రండి"

"సరే ఐతే మళ్ళీ కలుద్దాం... నిజంగా చాలా బాగా గీసావ్ బొమ్మలు"

"కలుద్దాం" 


********


రచయిత్రి మాట: 

@potti థాంక్స్ అండి ఫస్ట్ రేటింగ్ అండ్ రివ్యూ ఇచ్చినందుకు. మీ కోసమే ఈ చాప్టర్ త్వరగా రిలీజ్ చేస్తున్న. మీరే ఈ కథకి మొదటి అభిమాని. 

కథ చదివి నచ్చినవాళ్ళు రేటింగ్స్, రివ్యూస్ ఇస్తే రాయాలి అనే ప్రోత్సాహం వస్తుంది. దయచేసి మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్.. మీ రివ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.