రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అయిన రంగు, రుచి, ప్రొఫెషన్.. ఏది ఇప్పుడు నచ్చవు. కాలంతో పాటు చాలా మారిపోతుంటాయి... ప్రేమించిన వ్యక్తి మీద ఇప్పుడు వున్నంత ఇష్టం ఇక ముందు కూడా అలానే వుంటుంది అనేది మనకి మనమే చెప్పుకునే నిఖార్సయిన అబ్బాధం. జీవితం అనే పెద్ద అబద్ధం ముందు ప్రేమ అనే చిన్న అబద్ధం కూడా అబ్బాధమే అని ఎవరూ కనిపెట్టలేరు.
----------------------------------------------------------------------------
"నా పేరు సిద్ధార్థ్. అందరూ సిడ్ అని పిలుస్తుంటారు. డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూసినప్పటి నుంచి ఇంకా చూస్తూ ఉండాలి అనే ఫీలింగ్. మా ఇంట్లో అందరికీ ఒకే... నీకు ఒకే ఐతే మనం ప్రేమించుకుందాం" అజయ్ చెప్పాడని మొన్న సీన్ క్రియేట్ చేసిన అబ్బాయిని పలకరిద్దాం కథ అనుకుంటే.. ఇలా డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టేశాడు.
నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నా పక్కన ఉంటూ ఇది అంతా వింటున్న దివ్య, మిత్ర, శ్రిస్తికి కూడా ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించినట్టు ఉంది. వాళ్ళు ఏమి మాట్లాడలేదు.
"హయ్.. ఏంటి సడెన్ మీటింగ్" అజయ్ వెనక నుంచి వచ్చాడు. అందరం అజయ్ వైపు చూసాం గానీ ఎవరీ నోట్లోనుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇంకా అందరం షాక్లోనే ఉన్నాం.
"అజ్జు.. మీ వాడు మా ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు" దివ్య చెప్పి నవ్వేసింది.
అజ్జు అని పిలిచేంత క్లోజ్ అయిందా దివ్య... ఐనా ఇంత అందంగా రెడీ అయ్యి కాలేజీకి వస్తుంటే ఎవరైనా అలానే పిలుస్తారు. చేతికి బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్, మెడలో రుద్రాక్ష, బ్రౌన్ కలర్ షర్ట్, వైట్ కలర్ పాంట్.. చాలా చాలా టెంప్టింగా ఉన్నాడు.
"ఎవరికి ... దీరకా..." వెటకారంగా నవ్వుతున్నాడు. " బుద్ధునోడు ఎవరైనా ధీరకి ప్రపోజ్ చేస్తాడా.. నీకు చేసినా ఒక్క అర్ధం ఉంది" నవ్వుతూ, పొట్ట మీద చేయి పెట్టుకొని ఇంకా వెటకారం కల్పించుకొని అన్నాడు.
నాకు కోపం వచ్చింది అనే కన్నా బాధగా అనిపించింది అని చెప్పొచ్చు. నా మీద అజయ్క్ వున్న అభిప్రాయం ఇదేనా అనిపించింది.
"సిడ్, నీ నెంబర్ నాకు ఇవ్వు.. నేను కొంచం ఆలోచించుకొని నీకు ఎ విషయం చెప్తాను." ఒక బుక్ తీసి ఇచి చెప్పాను. అందరూ నా ధైర్యానికి మరింత షాక్ ఐపోయారు.
"ఇప్పుడు ఇది అవసరమా.. ఫోన్ నంబర్స్ వరకు ఎందుకు ధీర.. నేను సరదాగా ఆట పట్టిదాం అని నవ్వాను. టేక్ ఇట్ ఈజీ నో.. " అజయ్ కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు.
ఈ లోపే సిడ్ రాసిచ్చిన బుక్ తీసుకొని ఎవరిని పట్టించుకోకుండా బస్ ఎక్కేసాను.
*****
"ధీర, ఒకసారి ఇంటి బయటకిరా అమ్మ" కాలేజీకి బయల్దేరుతుంటే నాన్న పిలిచారు.
"వస్తున్న నాన్నగారు" గబగబా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాం నేను, మా చెల్లి, మా తమ్ముడు.
"కొత్త సైకిల్... లేడీ బర్డ్ .. పింక్ కలర్" విందు గట్టిగా అరిచింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ.
"నాకే నా" నవ్వుతూ అడిగాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు అడిగినా తర్వాత చూద్దాం అని దాటేసేవారు నాన్నగారు. సడన్గా ఏంటో అడగకుండానే కొనేశారు.
"ఒక మాటైనా చెప్పకుండా కొనేసారేంటండి" అమ్మ వంటింట్లోంచి వస్తూ అడిగింది.
"నా పిల్లలికి ఎప్పుడూ ఏం కావాలో అది ఇవ్వడమే నా పని. నా పెద్ద కూతురికి ఇప్పుడు ఇది అవసరం. తన చదువు చూసి మురిసిపోతూ ఈ నాన్న ఇస్తున్న చిన్న కానుక " మా నాన్నగారు మురిసిపోతూ చెప్పారు.
"నాన్నగారు మరి నాకు సైకిల్" మా చెల్లి విందు జాలిగా అడిగింది.
"నువ్వు ఇంటర్కి వచ్చినప్పుడు కొనిస్తా కదా" అన్నారు నాన్న.
రోజంతా కొత్త సైకిల్ తోనే గడిచిపోతుంది. మా నాన్నగారు నా మీద ఎంత నమ్మకంతో ఇచ్చారో సైకిల్. ఇక అందరితో మాట్లాడడం తగ్గించేసి చదువుపైన కాన్సంట్రేషన్ స్టార్ట్ చేశాను.
కొన్నిసార్లు అజయ్ ఎదురుపడ్డ పెద్దగా పట్టించుకోలేదు. మిత్ర, దివ్య, శ్రీస్టిల స్నేహం క్లాస్రూమ్ వరకే పరిమితం అయ్యింది. వాళ్ళు సైకిల్ కొనుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, కొనివ్వలేదు. కొద్ది కొద్దిగా వాళ్ళు నాతో ప్రతిదీ షేర్ చేసుకోడం ఆపేశారు.
"నెంబర్ ఇచ్చాను.. ఏ విషయం చెప్పలేదు?" సిడ్ ఓ రెండు, మూడు సార్లు అడుగుతూనే వున్నాడు. సమయం దొరికినప్పుడల్లా మా క్లాస్ దగ్గరకి వచ్చి సైట్ కొడుతూనే వున్నాడు. అవేం పట్టించుకోనట్టు ఉంటే వదిలేస్తాడులే అనుకున్నాను.
గానీ మనం తలిచినట్టే అవుతే జీవితం ఎందుకు అవుతుంది.
క్లాసులు అయినప్పటికీ చాలా లేట్ అయింది. చీకటి ఐపోయింది బయటకి వచ్చి చూస్తే.. చాలా మంది మ్యాథ్స్ క్లాస్కి ఉండకుండానే బస్సులు తీసేస్తున్నారు అని వెళ్ళిపోయారు.
పార్కింగ్లోకి వెళ్లి సైకిల్ బయటకి తెచ్చాను. స్ట్రీట్లైట్స్ కూడా సర్రిగా వెలగడం లేవు, గుండెల్లో తెలియని బయం మొదలైంది. కొంచెం దూరం వచ్చాక చుట్టూ చూసాను .. ఎవరు కనిపించలేదు చీకటి తప్ప.
"ఇంత వరకు ఉండి మరి ర్యాంకులు కొట్టాలా?" చీకటి లోనుంచి వస్తూ ఫోన్లో టార్చ్ లైట్ వేశాడు సిడ్.
హమ్మయ్య.. ఒక తెలిసిన మొఖం. కొంచెం ప్రశాంతంగా, ధైర్యంగా అనిపించింది.
"కాలేజీలో ఫోన్స్ నాట్ ఆలోవ్డ్ కథ" నవ్వుతూ అడిగాను.
"ఏం చేస్తాం, ప్రేమిస్తున్న అమ్మాయి ఎప్పుడు కాల్ చేస్తుందా అని... ఫోన్లోనే ఉంటున్నాను". నిట్టూరుస్తూ చెప్పాడు.
"నమ్మేసాను లే" నవ్వాను.
"నువ్వు నవ్వుతున్నపుడు బలే ఉంటావ్" నా వైపే చూస్తూ చెప్పాడు.
"సర్లే, ఫ్లిర్టింగ్ బాగా చేస్తున్నావ్" కొద్ది సేపు అలానే చీకటిలో నడుస్తున్నాము.. సైకిల్ తోస్తుంటే బరువుగా అనిపిస్తుంది. భుజానికి బ్యాగ్ ఒకటి .. ఇంకొంచెం ఎక్కువ బరువుగా.
"నేను సైకిల్ తోయానా?" చనువు తీసుకొని అడిగాడు నా మనసులో మాట తెలుసుకున్నట్టు.
"నీకు ఒకటి అడగనా? నిజం చెప్తావా?" తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే .. నా మనసులో మాట అడుగుదాం అనుకున్నాను.
"నాకు తెలుసు ధీర... సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నువ్వు ఎందుకు నచ్చావో చెప్తాను" నా మనసులో మాటలు సరిగ్గా తెలుసుకుంటున్నాడు.
కొంచెం సిగ్గు పడుతూ తల కిందకి దించాను.
ఎదురుగా బైక్ వెలుగు. బైక్ కరెక్ట్గా మా దగ్గరకి వచ్చి ఆగింది. పైకి తల ఎత్తి చూసాను. బైక్ మీద అజయ్, మిత్ర ఉన్నారు.
"హమ్మయ్య, నీకు ఏం కాలేదు కదా.. మీ ఇంట్లో కంగారు పడుతున్నారు ఇంకా రాలేదు అని. కనీసం నాకు చెప్పాలి కదా ఎక్స్ట్రా క్లాసెస్కి ఉంటున్న అని. ఎంత బయం వేసిందో తెలుసా ఆంటీ కాల్ చేసినప్పుడు" బైక్ దిగుతూ గట్టిగా అరుస్తూ మాట్లాడింది మిత్ర.
గట్టిగా పట్టేసుకుంది నన్ను వచ్చి. అజయ్ నన్నే కోపంగా చూస్తున్నాడు. చూస్తే భయపడే వారు ఎవరు లేరు ఇక్కడ.
"తను నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదులే మిత్ర. మొన్న నెంబర్ తీసుకుంది, ఈ రోజు కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంది". మొఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది.
"ఏం మాట్లాడుతున్నావ్ రా... తను ఒకరితే వెళ్తుంది అని చూసి నేనే తోడుగా వచ్చాను." సిడ్ జరిగింది చెప్పడానికి ట్రై చేశాడు.
"నువ్వు ఎవరికి సమాధానం చెప్పకర్లేదు. నేను తప్పు చేసే టైప్ కాదు అని అందరికి బానే తెలుసు." నేను గట్టిగా అరిచాను అజయ్ వైపు చూస్తూ.
"అపుతారా? ఒసేయ్.. నువ్వు ఇంటికి ఇంకా రాలేదు అని కాల్ వచ్చాక... అజయ్ ఎంత టెన్షన్ పడ్డాడో నీకు ఏం తెలుసు... వాల్ల అమ్మగారికి బాలేదు.. ఐన సరే నిన్ను వెతకడానికి నాతో వచ్చేసాడు." మిత్ర అలా చెప్పేసరికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
కళ్ళలో నీరు తిరిగేశాయి. నాకు నేనే చాలా చిన్నగా అనిపించాను. నా కోసం వచ్చాడు అని తెలియక ఎప్పటిలానే నోరు జారాను అనే విషయం నన్ను తొలిచేస్తోంది.
"నాకు లేట్ అవ్తుంది. మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం. నీకు తెలుసు కదరా అజయ్, నేను వెళ్ళొస్తాను.. ధీరని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టేయండి" అజయ్క్ చెప్తూ నా వైపు చూస్తూ "బై ధీర. థాంక్స్ ఫర్ ద వాక్" చెప్పి చీకట్లోకి మాయం ఐపోయాడు సిడ్.
"ఏడవకు ధీర. ఇంటికి పద లేట్ అవ్తుంది. సైకిలు తొక్కగలవా? నేను హెల్ప్ చేయాలా?" అడిగింది మిత్ర.
"పర్లేదు నేను తొక్కగలను" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను.
"తను ఇప్పటికే చాలా దూరం తోసింది. నువ్వు తొక్కు మిత్ర, నేను బైక్ మీద దింపుతాలే" అజయ్ అన్నాడు.
"మా ఇంట్లో అబ్బాయిల బైక్ ఎక్కితే ఒప్పుకోరు"
"అబ్బాయిలతో నడుచుకుంటూ, కబురులు చెప్పుకుంటూ వస్తే ఒప్పుకుంటారా" అజయ్ మాటలు కొట్టినట్టు అనిపించాయి.
నిశబ్దం. కన్నీరు కట్టలు తెచ్చుకున్నాయి.
"చాలు అపుతారా మీ గొడవ..... ఇంటివరకు కదులేవే .. కొంచెం దగ్గర వరకు బైక్ మీద వచ్చేయి. నేను సైకిల్ తొక్కుతా. దగ్గరికి వచ్చాక బైక్ దిగి సైకిల్ మీద వెళ్ళిపోదువు" అంటూ నా చేతిలో నుంచి హ్యాండిల్ తీసుకుంది మిత్ర.
ఒక అబ్బాయి బైక్ ఎక్కడం ఇదే మొదటిసారి. ఒక వైపు కూర్చోవాలా? రెండు వైపుల కళ్ళు పెట్టి కూర్చోవాలా?
కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోడం బెటర్ ఏమో.
అజయ్... నేను తన బైక్ ఎక్కాలి అనే ఇలా చేస్తున్నాడా? లేదా నా మీద జాలితో అన్నాడా?
ఐనా ఇల్లు దగ్గరేగా.. కచ్చితంగా బైక్ ఎక్కాలా? ఈ అవకాశం పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో?
"ఏంటి దిక్కులు చూస్తున్నావ్? బైక్ ఎప్పుడూ ఎక్కలేదా? ఎలా ఎక్కలో కూడా తెలీదా?"
"ఎక్కుతున్న అజయ్. ఒక నిముషం కూడా ఆగలేవా?"
సర్లే... రెండు కళ్ళు ఇటు,అటు వేసి కూర్చున్నాను. కొంచెం దూరం జరిగి.
"సరిగ్గా కూర్చో... పాడతావ్ లేకపోతే."
"వెనక పట్టుకున్న లే... నువ్ ముందు చూస్తూ జాగ్రత్తగా పోని. కావాలని పడేయకు."
...
"ఇంకెప్పుడు ఇంత లేటుగా వెళ్ళకు. ఇంట్లో కంగారు పడతారు"
"క్లాస్ మిస్ అవ్వకూడదు కదా "
"ఈ సారి ఇలా ఐతే మిత్రకి చెప్పు. మేము ఉంటాము."
"సరే"
"సిడ్.... ఏం ఐనా ఫీలింగ్ స్టార్ట్ అయిందా తన మీద"
"అలా ఏం లేదు... మంచోడులానే వున్నాడు"
"అబ్బాయిలు మంచిగానే ఉంటారు. ఏం ఐనా తేడా అవుతే మృగంలా ఇపోతారు. నీకు చెప్పే అంత వాడిని కాదు... గానీ కొంచెం జాగ్రత్త ... ఎక్కువ చనువు ఇవ్వకు"
"మరి నీ సంగతి ఏంటి?"
"నా సంగతి ఏంటి?"
"నీ బైక్ మీద ఎక్కే అంత చనువు నీకు ఇవ్వాచా?"
"ఇచ్ఛుండకూడదు... నేనూ అబ్బాయినే కదా"
.......
"గానీ సిట్యువేషన్ అలాంటిది. అందుకే నిన్ను ఎక్కించుకున్నాను"
"థాంక్స్"
"మనం ఫ్రెండ్స్ అన్నావ్ కదా.. థాంక్స్ అక్కర్లేదు లే"
...
ఇంటి దగ్గరకి వచ్చేశాం.. సైకిల్ మీద ఐనా మిత్రానే మాకన్నా ముందు మా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అంత స్లోగా తొక్కాడు అజయ్.
"బై ధీర" మిత్ర చెప్పింది.
"బై మిత్ర ... అజయ్... నువ్వు చెప్పింది గుర్తుంచుకుంటాను. జాగ్రత్తగా ఉంటాను"
"మళ్ళీ కలుద్దాం" అజయ్ నవ్వుతూ చెప్పాడు
"కలుద్దాం"
_______________________________________
*** రచయిత్రి మాట... ఎలా అనిపిస్తుంది మన కథ? చదివిన వారిలో ఒకరైన ఎలా ఉందో చెప్తే వినాలని ఆశగా ఉంది. మీరు మీ అభిప్రాయాన్ని నాతో చెప్తారని ఆశిస్తూ .... మళ్ళీ కలుద్దాం