Party in Telugu Short Stories by M C V SUBBA RAO books and stories PDF | పార్టీ

Featured Books
Categories
Share

పార్టీ

పార్టీ 

రంగ మ్మా ఈరోజు రాత్రి మన ఇంట్లో పార్టీ ఉంది. అయ్యగారి బంధువులు స్నేహితులు చాలా మంది వస్తారు. గుమ్మానికి బంతిపూల దండలు కట్టు. కర్టెన్ లన్ని మార్చెయ్యి. ఇల్లంతా తడి గుడ్డు పెట్టు . డైనింగ్ టేబుల్ మీద పింగాణీ సామానంతా పెట్టు. వాటర్ బాటిల్స్ తెప్పించు.భోజనంలోకి ఒక స్వీట్ హాట్ బిర్యాని సాంబార్ అన్నం ఒక వేపుడు అప్పడాలు వడియాలు రెడీ చెయ్యి అంటూ గబగబా చేయవలసిన పనులు లిస్టు చెప్పేసింది ఆ లంకంత కొంపకి యజమానురాలు సుమిత్ర.

సుమిత్ర భర్త సుధాకర్ గారు పెద్ద సివిల్ కాంట్రాక్టర్. చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు. బాగా సంపాదించాడు. సుమిత్ర గారికి ఇద్దరు మగపిల్లలు. సిటీలో బాగా పేరు మోసిన స్కూల్లో
చదువుకుంటున్నారు.

రంగమ్మ కూడా అదే కాలనీలో గెడ్డ పక్కన రేకుల షెడ్డులో కాపురం ఉండి ఆ చుట్టుపక్కల పది ఇ ళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కాలక్షేపం చేస్తోంది.
భర్త ఆటో నడుపుకుంటూ ఉంటాడు. సుమిత్ర గారికి పిల్లల్ని బయటకు పంపించడం భయమేసి రంగమ్మ పిల్లల్ని క్రికెట్ ఆడుకోవడానికి రమ్మంటారు ప్రతి ఆదివారం .సుమిత్ర గారి పిల్లలతో రంగమ్మ పిల్లలు రాజు ,రవి క్రికెట్ ఆడుకుంటూరు. క్రమేపి వాళ్ళ అందరి మధ్య స్నేహం బాగా పెరిగింది.

అబ్బా లంకంత ఇల్లు ఎంత చేసినా పని తేవడం లేదు. పిల్లలకి సెలవులు ఇంటి దగ్గరే ఉన్నారు. గబగబా పని పూర్తిచేసుకుని పిల్లలకి అన్నం వండి పెట్టాలి . అన్నం వండడం ఎందుకు సుమిత్రమ్మ గారు వెళ్ళేటప్పుడు ఏమైనా ఇస్తారేమో. చూడాలి పార్టీ స్పెషల్స్ కూడా బాగా ఎక్కువగానే చేయించారు సుమిత్ర గారు . అమ్మగారు ఏమైనా ఇస్తే పిల్లలకి ఈ రోజు కడుపు నిండా తిండి పెట్టొచ్చు అనుకుంటూ ఆలోచిస్తున్న రంగమ్మ కి లోపల గదిలోంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.

అమ్మ నేను రాజు గాడి ని రవి గాడి ని కూడా మన సాయంకాలం మన పార్టీకి పిలుస్తానమ్మ అంటూ సుమిత్ర గారిపెద్దబ్బాయి రాజేంద్ర గొంతు వినిపించింది. లేదమ్మా వాళ్ళనీ పిలవకూడదు.
ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బాగా ధనవంతులు. వాళ్ళు మురికి గుడ్డలు వేసుకుని మన పార్టీకి వస్తే మన గౌరవం పోతుంది. వచ్చిన వాళ్ళ మనని తప్పుగా ను తక్కువగా ను అంచనా వేసుకుంటారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి ఇష్టం ఉండదు. నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్ అంటూ గట్టిగా కసిరింది సుమిత్ర.

అయితే ప్రతి ఆదివారం మళ్ళీ మన ఇంటికి వస్తున్నారు గా ఆడుకోవడానికి మరి అప్పుడే ఏమైంది అంటూ రాజేంద్ర గట్టిగా అడుగుతున్నాడు. వాళ్లు పెరట్లో ఆడుకుని వెళ్ళిపోతారు. మన మన ఇంట్లోనికి రానివ్వడం లేదు కదా అంటూ సుమిత్ర సమాధానం చెప్పింది.

పాపం రంగమ్మ కి ఒక్కసారి కళ్ళలో నీళ్లు వచ్చాయి. డబ్బు లేకపోవడం వల్లనే కదా ఇంత తేడా చూపిస్తున్నారు. నేను వండిన ఆహారం పనిచేస్తుంది వీళ్ళకి. నేనొక రోజు రాకపోతే గిలగిల్లాడిపోతారు. కానీ నా పేదరికం వల్లనే నా పిల్లల్ని వేరు చేస్తున్నారు అంటూ గబా గబా పనులన్నీ పూర్తి చేసుకుని వండిన సామగ్రి అంతా టేబుల్ మీదకు చేర్చి అమ్మ నేను వెళ్లి వస్తానంటూ బయలుదేరింది రంగమ్మ. అలాగే అంటూ సుమిత్ర గారు తల ఊపి రేపు వస్తావు కదా ప్రశ్నించింది. 

రంగమ్మ ఏమి మాట్లాడకుండా గబగబా ఇంటి దారి పట్టింది. వచ్చేటప్పుడు అమ్మగారు ఏమి ఇవ్వలేదు ఒట్టి చేతులతోటే పంపించేశారు. రేపటికి బోల్డు మిగిలిపోతాయి. పార్టీలు అంటారు గాని ఎవరు కడుపునిండా తినరు. అందరికీ ఆరోగ్య సమస్యలు కాబోలు. రేపటికి కొన్ని పదార్థాలు పాడైపోతాయి. అవి చెత్తకుండీలో పారబోయవలసిందే. ఒట్టి చేతులతో వె డితే పిల్లలు మొహం చిన్న బుచ్చుకుంటారు. నోరు తెరిచి ఏమీ అడగరు. ప్రస్తుత కాలంలో ఆ వయసు పిల్లలు ఈ పండగ నాడు ఏమి కోరుకుంటారో అందరికీ తెలిసిందే .రేకులు కొంపలో కాపురం చేస్తాం కాబట్టి పిల్లలకి కుటుంబ పరిస్థితి అర్థం అయిపోయింది అనుకుంటూ కొంగున కట్టిన ముడి విప్పి

 అందులోంచి 50 రూపాయల నోటు తీసి బేకరీ షాప్ ముందు ఆగింది. ఆ బేకరీ షాప్ వాళ్ళ ఇంట్లో కూడా రంగమ్మ పాచి పని చేస్తుంది. ఆ 50 రూపాయల నోటు షాపు వాడి చేతిలో పెట్టి చెయ్యి కేకు వైపు చూపించింది.
ఆ షాపు వాడికి రంగమ్మ పరిస్థితి తెలుసు. పైగా షాపు వాడు రామభక్తుడు. మిగిలిన డబ్బ అడగకుండా ఉన్న వాటిలో మంచి కేక్ తీసి బాక్సులో పెట్టి బాక్స్ రంగమ్మ చేతికి ఇచ్చాడు. 

రంగమ్మ కళ్ళల్లో గిర్రున నీరు తిరిగేయి. మనుషుల మధ్య ఎంత తేడా అనుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర ఆగింది. ఇంతలో తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి రంగమ్మ ఆనందానికి అవధులు లేవు. ఆ రేకుల షెడ్డు మధ్యలో ఒక చాప ఆ చాప మీద మధ్యలో ఒక కేకు ఆ కేకు చుట్టూ చప్పట్లు కొడుతూ ఆ కాలనీ వాసుల పిల్లలు సుమిత్ర గారి పెద్దబ్బాయి రాజేంద్ర అందరూ ఆనందంగా కనిపించారు. మరి ఏమి మాట్లాడకుండా తను తెచ్చిన కేకును కూడా కోసి పిల్లలందరికీ ముక్కలు పెట్టింది. పిల్లలందరూ రాజేంద్ర తో సహా తిని ఆనందంగా వెళ్లిపోయారు. అబ్బా రాజేంద్ర ఎంత తెలివైన పిల్లాడు అటు అమ్మ మాట కాదనలేదు. ఇటు తన కోరిక నెరవేర్చుకున్నాడు.

చిన్నతనంలోనే ఇ టువంటి తారతమ్యాలు నేర్పితే రేపటి సమాజంఇంకాఎలాఉంటుందోమనoఊహించుకోగలం. ధనిక పేద తారతమ్యాలు బాగా పెరిగిపోతాయి. పెద్దవాళ్లు నేర్పవలసింది అందరూ సమానులే అన్న విషయం.  
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279