Satthibabu in Telugu Short Stories by M C V SUBBA RAO books and stories PDF | సత్తిబాబు

Featured Books
  • खेल खेल में - जादूई - भाग 4

    "खेल खेल में - जादूई"- (पार्ट -४)जादूई जंगल में बुढ़े बन गये...

  • दिल से दिल तक - 1

    राधिका एक छोटे से गाँव में रहती थी, जिसका नाम था शांतिपुर। य...

  • पेम का पहला खत

    कहानी                                                       ...

  • बेवफा - 38

    **एपिसोड 38: दर्द की आंधी**राहुल और सलोनी के खेल ने समीरा की...

  • Kurbaan Hua - Chapter 14

    वैयर हाउस की रहस्यमयी रातवैयर हाऊस के एक कमरे में संजना गहरी...

Categories
Share

సత్తిబాబు

సత్తిబాబు 

" పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసలు ఏ 
 పని అవలేదు వంటింట్లో. మన ఇన్వెర్టర్ కూడా పనిచేయట్లేదు అంటూ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సంధ్య చెప్పిన మాటలకి రాజారావు గుండెల్లో రాయి పడింది. 

అసలే వేసవికాలం రాత్రి ఏసీ లేకుండా ఎలాగా అని ఆలోచిస్తూ అసలే ఈ ఊరికి కొత్త ఇప్పుడు ఎలక్ట్రీషియన్ నెంబర్ ఎలాగా అని అనుకుంటూ రాజారావు ఎదురింటి ప్లాట్ తలుపు తట్టాడు. ప్లాటు తలుపు తీయగా నే " నమస్కారమండి నా పేరు రాజారావు నేను ఎదురింటిలో కొత్తగా దిగా ను. కొంచెం మీకు తెలుసున్న ఎలక్ట్రీషియన్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి మా ప్లాట్ లో కరెంట్ లేదంటూ చెప్పిన మాటలకి తలుపు తీసిన పెద్దమనిషి వెంటనే తన సెల్ లో వెతికి ఇతని పేరు సత్తిబాబు చాలా బాగా చేస్తా డు అంటూ నెంబర్ ఇచ్చాడు. థాంక్స్ అండి అంటూ బయటికి వచ్చి రాజారావు సత్తిబాబుకి కాల్ చేయగానే 
వెంటనే ఫోన్ తీసి పదిహేను నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటానండి అంటూ అడ్రస్ చెప్పమన్నాడు ఎలక్ట్రీషియన్ సత్తిబాబు. 
నిజంగానే పదిహేను నిమిషాలకి ముందే కాలింగ్ బెల్ మోగింది. ఒక నల్లగా పొట్టిగా ప్యాంటు చొక్కా వేసుకుని జుట్టు బట్టతలలా ఉన్న ఒక యువకుడు చేతిలో సంచి పట్టుకుని లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది రాజారావుకి.
"నేనండి ఎలక్ట్రీషియన్ సత్తిబాబుని అంటూ మెయిన్ స్విచ్ దగ్గర అటు ఇటు కెలికి మొత్తానికి లైట్లు వెలిగే లా చేశాడు సత్తిబాబు.ఈరోజు రాత్రికి ఏ ప్రాబ్లం లేకుండా చేశాను. రేపు ఉదయం మళ్ళీ వచ్చి పర్మినెంట్ గా చేస్తాను అంటూ చెప్పాడు సత్తిబాబు.తర్వాత ఇన్వర్టర్ కూడా పనిచేసేలా చేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మీది ఏ ఊరు ?అని అడిగాడు రాజారావు." మాది కాకినాడ అని సమాధానం ఇచ్చాడు సత్తిబాబు. మీ ఇల్లు ఎక్కడ? అని అడిగాడు రాజారావు "మాది విద్యుత్ నగర్ బ్యాంక్ కాలనీ అంటూ చెప్పాడు సత్తిబాబు. మీ అమ్మ పేరు సత్తెమ్మ కదూ !తన మనసులోని సందేహాన్ని వెలిబుచ్చాడు రాజారావు. అవునండి అంటూ సమాధానం ఇచ్చాడు సత్తిబాబు.

 మీ అమ్మ సత్తెమ్మ మా ఇంట్లో పని చేసేది. నువ్వు అప్పటికి బాగా చిన్నపిల్లాడివి. నేను గుర్తున్నానో లేదో నీకు అంటూ అడిగిన రాజారావుకి మీరు బ్యాంక్ కాలనీలో ఉండేవారుగా మిమ్మల్ని చూడగానే నాకు అదే డౌట్ వచ్చింది నాకు గుర్తు లేకపోవడం ఏమిటి అప్పటికి నా వయసు 10 ఏళ్లు. మీ అన్నదమ్ములు అందరు నాకు బాగా గుర్తున్నారు. మీరు మమ్మల్ని చూసిన విధానం ఎలా మర్చిపోతాం. ఇంట్లో వాళ్ళ లా చూసేవారు. మీరు ఏం వండుకున్నా మాకు అదే పెట్టే వారు. నాకు కాఫీ అంటే ఇష్టం అని పెద్ద గ్లాస్ తోటి ఇచ్చేవారు మీ అమ్మగారు అ0టు మా ఇంటి తో తనకు గల అనుబంధాన్ని చెప్పుకుంటూ వచ్చాడు సత్తిబాబు. 

నేను అప్పటికి ఐదో తరగతి చదువుతున్నాను. మీ అమ్మ ఎలా ఉంది ?అన్న ప్రశ్నకి "మా అమ్మ బానే ఉంది మా నాన్న కాలం చేశాడు. మా అక్కల ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేసేము. వాళ్ళ అమ్మ సత్తమ్మ ఈ పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడేది ఆ రోజుల్లో. మొగుడు తాగుబోతు. పాపం ఆ రోజుల్లోనే పది ఇళ్లల్లో పాచిపని చేసేది. గుప్పెడు మెతుకులు బయటపడేయకుండా క్యారేజీలో ఇంటికి పట్టుకుని వెళ్ళేది. ఇది ఇరవై ఏళ్ల నాటి సంగతి. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత ఆ సత్తెమ్మ గురించి తెలియదు. మళ్లీ ఇన్నాళ్ళకి సత్తిబాబు ఆ పాత సంగతులు గుర్తు చేస్తుంటే ఆనందం వేసింది. నువ్వు ఏం చదువుకున్నావు? అని అడిగాడు రాజారావు. నేను పదవ తరగతిలో ఉండగా మా నాన్న చచ్చిపోయా డు. పదవ తరగతి తర్వాత ఐటిఐ లో ఎలక్ట్రీషియన్ కోర్సు నేర్చుకున్నాను. తర్వాత మా అమ్మ పనిచేసే ఒక ఇంటి ఓనర్ గారు నన్ను తెలుసున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారి దగ్గర పనికి పెట్టారు . ఆయన చాలా చోట్ల పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేసేవాడు. 

నేను కూడా ఆయన దగ్గర చాలా శ్రద్ధగా పనిచేసి కాంట్రాక్టులు ఎలా చెయ్యాలో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సొంతంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటాను. నేను బతుకుతూ నలుగురికి పని కల్పించాను. మా ఆవిడ ఇంజనీరింగ్ కాలేజీలో గుమస్తాగా పనిచేస్తుంది. అమ్మాయికి పెళ్లి చేసేసాను. అబ్బాయి ఆస్ట్రేలియాలో నేవీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 

మా అమ్మ కొన్న స్థలంలో ఒక ఇల్లు అబ్బాయి సంపాదనతో మరొక ఇల్లు కొనుక్కున్నా ము అంటూ అమాయకంగా గబగబా చెప్తున్న సత్తిబాబు మాటలకి నిజంగా ఆశ్చర్యం కలిగింది నాకు. నాకు ఇంకా సత్తెమ్మ కొంగుపట్టుకుని వచ్చే చిన్నపిల్లవాడిలా కనిపించాడు సత్తిబాబు. పైకి అమాయకంగా కనబడే ఆ వ్యక్తి కష్టం అభివృద్ధి చూస్తే ఆశ్చర్యవేసింది. 

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చేతిలో ఫైల్ తో ఒక యువకుడు లోపల వచ్చాడు. వస్తూనే సోఫాలో కూల పడ్డాడు. రాజారావు భార్య మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది. మంచినీళ్లు తాగిన తర్వాత ఏరా ఇంటర్వ్యూ ఏమైంది ?అని అడిగిన ప్రశ్నకి మామూలే నాన్న అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు రాజారావు కొడుకు సుధీర్. పాపం బీటెక్ పాస్ అయ్యి మూడేళ్లయింది. కొన్నాళ్ళు హైదరాబాదులో పనిచేసి సరైన జీతం రాక తిరిగి వచ్చేసాడు సుధీర్. చాలీచాలని జీతాలు ఉన్నప్పుడు కూడా రాజారావు సుధీర్ ని కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలలో చదివించాడు. వేలకు వేలు పోసి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసి ఇంజనీరింగ్ లో ర్యాంకు రాకపోయినా ప్రైవేట్ కాలేజీలో లక్షలు కట్టి ఇంజనీరింగ్ చదివించాడు. పదవ తరగతి నుంచి సుధీర్ కి ఒక ప్రత్యేకమైన గది. ఆ గదిలో సకల సౌకర్యాలు కల్పించి ,పరీక్షల ముందు ఇంటికి ఎవరైనా వస్తామని ఫోన్ చేస్తే మొహమాటం లేకుండా మా అబ్బాయికి పరీక్షలు రావద్దని చెప్పేవాడు రాజారావు.

 ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లడానికి ఒక బండి ఒక సెల్ ఫోను కొనిచ్చి రోజు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ బీటెక్ పూర్తి చేయించాడు. పాపం సుధీర్ కి క్యాంపస్ లో ఉద్యోగం వచ్చిన జీతం ఆశించినంత రాకపోవడంతో కొద్ది రోజులు ఉద్యోగం చేసి మానేశాడు సుధీర్. యిన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంత ఖర్చు పెట్టినా సరైన ఉద్యోగం రాలేదు. 

జీవితం ఎవరిని ఎలా మారుస్తుందో మనకు తెలియదు. చిన్నప్పటి నుంచి మనం మంచి స్కూల్లో జాయిన్ చేసి లక్షల ఫీజులు కట్టి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి అతి జాగ్రత్తగా రాత్రి పగలు పిల్లల గురించి కష్టపడుతూ అనేక ప్రణాళికలు వేసి అనేక సౌకర్యాలు కల్పించి పిల్లల్ని పెద్ద చదువులు చదివించిన ఏ హైదరాబాదులోనో బెంగళూరులోనో ఏదో ఒక ఉద్యోగం లో జాయిన్ అయిపోయి కాలం గడుపుతున్న అనేకమంది పిల్లల్ని చూస్తుంటే నిజంగా మనం శ్రద్ధ తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. సత్తిబాబు జీవితాన్ని దగ్గరగా చూస్తే. చదువుకి జీవితానికి సంబంధం లేదనిపిస్తుంది. చిన్నప్పటినుంచి ఏ సౌకర్యాలు లేకుండా అలా గాలికి పెరుగుతూ తనకు తోచిన విద్య చెప్పించి కొడుకుని ప్రయోజకుడు చేసిన సత్తెమ్మనీ చూస్తే చూస్తే కొంచెం గర్వంగా అనిపించింది. పిల్లల పెంపకం ఒక కళని చాలా మంచి వాతావరణంలో పెంచాలని చాలామంది చెబుతుంటారు. మరి సత్తిబాబు ఎలాంటి వాతావరణంలో పెరిగాడు.

 రోజు పదిమంది ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించే తల్లి తాగుబోతు తండ్రి గుడిసెలో కాపురం ఇలాంటి వాతావరణంలో పెరిగాడు సత్తిబాబు. పల్లెటూరు స్కూల్లో చదివి ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది. అయినా కానీ ఈ రోజుల్లో ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధిస్తే జీవితం గడపడానికి ఏ విధమైన లోటు ఉండదు. ఎన్ని డిగ్రీలు సంపాదించినప్పటికీ చేతిలో నైపుణ్యం లేకపోతే ఏమి ఉపయోగం లేదు.

మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చదివాడు? అన్న సత్తిబాబు మాటలకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు ఇంకా సరి అయిన ఉద్యోగం రాలేదు అంటూ చెప్పిన రాజారావు మాటలకి నాకు ఒక పెద్ద కంపెనీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది కానీ వాళ్లు ఉన్న మా ఉద్యోగస్తులలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కచ్చితంగా ఉండాలని చెప్పారు. మీరు ఏమీ అనుకోకపోతే మీ అబ్బాయి నా దగ్గరికి పంపించండి. ఎక్కడికి వెళ్లి ఉద్యోగం చేయక్కర్లేదు అంటూ చెప్పిన సత్తిబాబు మాటలకి రాజారావుకి నోట మాట రాలేదు. సత్తిబాబును చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు రాజారావు.

ఈ కథ పూర్తిగా కల్పితం కాదు. నూటికి ఎనభై పాళ్ళు జరిగిన కథ. నిజంగా ఈ కథానాయకుడు పేరు కూడా సత్తి బాబు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటాడు. 
ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇప్పుడు ఇలా. 
ఇది ముమ్మాటికి నిజం. 

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279