“ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు”
తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. యుగం అంటే యోగమని మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఇది వసంతకాలంలో వస్తుంది. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు.
ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్ర లేచి, తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, అలంకరించి, ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనందిస్తారు. వసంత లక్ష్మిని స్వాగతిస్తారు.
ఉగాది అంటే తెలుగులో ఏమిటి?
ఉగాది లేదా యుగాది , సంవత్సరది ("సంవత్సరం ప్రారంభం" అని అర్ధం) అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర దినం మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. చక్రం వాస్తవానికి 60 సంవత్సరాలను కలిగి ఉంటుంది, ప్రతి సంవత్సరం ఒక్కొక్కటిగా పేరు పెట్టబడింది.
సంవత్సరాదికి ఆది ఏమిటి?
తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే పర్వదినం ఉగాది. అంటే అది సంవత్సరాది! కొత్త సంవత్సరంలో మొదటి రోజు. ఇలా సంవత్సరాన్ని విడివిడిగా విభాగాలుగా నిర్దేశించే వ్యవస్థనే ఇంగ్లీష్ లో కేలండర్ అని అంటారు. ఈ కాలండర్ పుట్టుకే సంవత్సరాల పుట్టుకకు పునాది.. ఈ కాలండర్ ఆవిర్భావమే ప్రపంచంలోని వివిధ జాతులు జరుపుకునే సంవత్సరాదికి నాంది! అసలీ కాలెండర్ ఎలా పుట్టిందంటే....
ఆదిమ మానవుడికి ఉన్నదల్లా ఒకటే చింత! ఇప్పటిలా ధనార్జన, విద్యార్జన కోసం పాకులాడడం అతనికి లేవు. ఏరోజు ఆకలి ఆరోజు తీర్చుకోవడం.. అది ఎలా అన్నదే అతడి సమస్య! ఈ సమస్య వల్ల ప్రకృతిని అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడిందతనికి. అలా ప్రకృతిని అధ్యయనం చేస్తున్నప్పుడే అతడో విషయం కనిపెట్టాడు. అలా కని పెట్టిందే ఋతుచక్రం! ఋతువులు ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయని కనిపెట్టాడు. అదీ నియమిత కాలంలో మరల మరల అదే విధంగా వస్తుంటాయని తెలుసుకున్నాడు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇలా ఋతువులను విభజించుకున్న తర్వాత ఏ ఋతువులో తనకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో, ఏ ఋతువులో దొరకదో అతడికి తెలిసిపోయింది. ఇదే క్రమంలో తనకు ఇష్టమైన ఆహారం ఏ ఋతువులో దొరుకుతుందో లభ్యమవుతుందో కూడా అతడు గ్రహించాడు. ఇదే కాలెండర్ నాంది! ఇలా పుట్టిన కాలెండర్లో రకాలున్నాయి. సూర్యుడి గతులపై ఆధారపడి రూపొందించుకున్నది సౌరమానం. చంద్రుడి గతుల పై ఆధారపడి రూపొందించుకున్నది చాంద్రమానం! ఆంగ్లేయులు అనుసరిస్తున్నది సౌరమానమైతే.. మన ఆంధ్రులు, భారతీయులు అనుసరిస్తున్నది చాంద్రమానం!
ఉగాది పండుగ విశిష్టత ఏమిటి?
ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.
ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏమిటి?
షడ్రుచుల సమ్మేళనం
మరే ప్రాంతాల్లో లేని షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.
ఉగాది పచ్చడి / Ugadi Pachadi
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. అంటే ఆ ఆరు రుచులు తీపి – సంతోషానికి, చేదు – బాధకి, కారం – కోపానికి, ఉప్పు – భయానికి, పులుపు – చిరాకుకి, వగరు – ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెబుతుంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువగాని తక్కువగాని అవ్వకుండా అన్ని సమపాళ్లల్లో ఎంతో జాగ్రత్తగా చేస్తారు వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
తెలుగువారు ఉగాదినాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలుపెడతారు. పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలు అని అర్థం చెబుతారు ఇందులో తిధి ద్వారా నక్షత్ర యోగం కరణం అని 5 అంగాలు ఉంటాయి ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. వరుసగా ఇవి మానవునికి సంపద ఆయుషు పాపప్రక్షాళన వ్యాధి నివారణ గంగా స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు.
పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. సాయంకాలం కవులు ఒకచోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఇందులో కవితలు పద్యాలు పాడుకోవడం జరుగుతుంది.
ఉగాది పచ్చడి పదార్థాలు
1. చింతపండు – పుల్లని రుచి
2. బెల్లం – తీపి రుచి
3. పచ్చి మామిడి – చిక్కగా
4. వేప పూలు – చేదు రుచి
5. నల్ల మిరియాలు – కారంగా
6. ఉప్పు – ఉప్పు రుచి