you and me? in Telugu Love Stories by SriNiharika books and stories PDF | నువ్వేనా..నా నువ్వేనా.. 4

Featured Books
  • स्वयंवधू - 35

    धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने...

  • शोहरत का घमंड - 115

    आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे...

  • बन्धन प्यार का - 35

    "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी...

  • गुज़ार लूँ कुछ पल

    कुछ पल युही गुज़ार  लूं तेरे संग फिर पता नहीं तुम रहो या ना र...

  • रहस्यमय कहानी

    भूतिया हवेली का रहस्यगाँव के पास एक पुरानी हवेली थी, जिसे लो...

Categories
Share

నువ్వేనా..నా నువ్వేనా.. 4


రేణు పళ్ళు కొరుకుతూ చేతిలో ఉన్న కొబ్బరి కాయ విసురుతుంది.. విజయ్ తెలివిగా పక్కకి తప్పుకున్నాడు.. ఆ కొబ్బరి కాయ వెళ్ళి పూజారికి తలకి తగిలి చచ్చానురా దేవుడా అంటు కింద పడిపోతాడు..


అసలు కుదురుగా ఉండరుగా కోప్పడుతూ ఇద్దరినీ చూస్తుంది అంజలి..


చుట్టూ ఉన్నవాళ్ళు పూజారిని కూర్చో పెట్టి నీళ్ళు ఇస్తారు..

బానే ఉందా హాస్పటలకి పదండి అంటు విజయ్ తనని పైకీ లేపుతాడు...

 వావ్ పుజారి గారు మీరు చాల స్ట్రాంగ్ కొబ్బరి కాయా తగిలిన మీకేమీ కాలేదు అని అమాయకంగా చూస్తు అంటుంది రేణు..

రేణు మాటలకి అందరు భళ్ళున నవ్వారు... పుజారికి నవ్వాలో ఏడవాలో తెలియక హాస్పటలకి బయలుదేరాడు..


అదిగో ఆయన వస్తున్నాడు మీసంగతి చెప్తా ఉండండి అని అక్కడికి వస్తున్న భూపతికి ఎదురేళ్తుంది అంజలి..


మామ్.. నేను నేమీ.. చేశాను అంతా అదే చెసింది పైగా ఏమి చేయనట్టు ఆ ముఖం చూడు ఎలా పెట్టిందో అంటూనే అక్కడికి వస్తున్న భూపతి ని చూసి బయపడుతున్నాడు విజయ్..


అమ్మ చూడు వాడు మళ్ళి అబద్దం చెప్తున్నాడు ముందు వాడే నన్ను పిల్లలతో కలసి నన్ను ఏడిపించాడు అందుకే అని అమాయకంగా ముఖం పెట్టేసింది రేణు..


 నాకేమీ తెలియదు మీ నాన్న వస్తున్నాడు ఏంచెప్తావో చెప్పుకో... మనం లొపలికి వెల్దాము రా వదినఅని అంజలి చేయి పట్టుకుని గుడి లోపలికి వెళ్తుంది సీత..

అంజలి మౌనముగా సీతని అనుసరిస్తుంది... భూపతి రఘు కొపంగా చుస్తూ గుడిలోకి వెళ్తారు...


హమ్మయ్య అని ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు...


ఇంటి దగ్గర...


సైలెంట్ గా లొపలికి వెళ్తున్న వాళ్ళు  మీకు కొంచం అన్నా బుద్ది ఉందా అని రఘు మాటలు వినిపిస్తాయి..

వినబడనట్టు మెల్లిగా జరుకుంటున్న వాళ్ళని ఇంక గట్టిగా అరుస్తూ అక్కడే ఆగండి అంటాడు రఘు..


ఏంటి భూపతి కోసం చూస్తున్నారా వాడు ఇక్కడ లేడు ఉంటే మీరు చేసిన పనికి వెనకేసుకొస్తాడు అని చూస్తున్నారా..


అదేమీ లేదు మామయ్యా ఇందులో నా తప్పేమీ లేదని విజయ్ చిన్నగా చెప్తున్నాడు...


 మీ ఇద్దరు ఎలా గొడవ పడిన ఉరుకున్నాము కానీ ఇలా ఒకరి ప్రాణం మీదకి తీసుకొస్తారు అనుకోలేదు విజయ్ నీ కొంచం సీరియస్ గా చూస్తూ అన్నాడు రఘు..


మౌనంగా తల దించుకుని నిలబడతాడు విజయ్...


అంతా వాడి వళ్ళే డాడ్ నా..త.. అని రేణు మాటలు పూర్తీ కాకుండానే....

చాల్లే ఆపు ఎప్పుడు ఆ మాటే ఆ మాట తప్పితే వేరేది రాదా అని కోపంగా చూస్తున్న రఘు నీ చూసి ఏడుపు ముఖం పెడుతుంది రేణు..


అయినా డాడ్ ఆ పుజారికి ఏమీ కాలేదు అని దైర్యం తెచ్చుకుని అనేసి మామయ్య ఎక్కడికి వెళ్ళావు అని మనసులో అనుకుంటుంది...


ఏమైనా అయితే నీ పరిస్థితి ఏమిటి మౌనంగా ఉండటం కాదు సమధానం చెప్పు రేణు ఇలా ఇంకోసారి మీరు గొడవ పడితే ఉరుకోను అని వార్నింగ్ ఇస్తాడు రఘు..


నా జోలికి వస్తే ఆ ‘ఐ ఓ ఐ’ (ioi) నీ వదలను డాడ్..


రాక్షసి జొలోకి ఎవరు రారులే మామయ్య..


ఒరేయ్ ‘ఐ ఓ ఐ’ (ioi) నన్ను రాక్షసి అంటావా నేను కాదు నువ్వె ఎగురుతూ తిరిగే కోతివి... గోడ మీద బల్లివి కాదు.. కాదు.. (ఇంకా ఏమానాలో మాటలు వెతుకుంటుంది)...


నేను కోతినైతే సరే నువ్వు చింపాంజీవి అందుకే పిల్లలు అలానే అన్నారు..


చాలు అపండి ఇలానే ఉంటే మీ మెడలు వంచి మీకు పెళ్ళి చేస్తా జీవితాంతం ఇలానే ఉంటారు జాగ్రత్త ఇదే మీకు ఆఖరి సారి చెప్పడం..


డాడ్ ఈ వెధవతో పెళ్ళా..? దాని కన్నా బిచ్చగాడితోనే నయం..


రేణు కోపంగా చెయి ఎత్తుతాడు రఘు..


ఏంటి రఘు పిల్లలి మీద ఇలానేనా అరిచేది అయిన ఆ పుజారికి ఎం కాలేదులే ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు....


అందుకే నిన్ను రావద్దు అన్నాను భూపతి ఇక వీళ్ళు మాటవినరు అంటు రఘు లొపలికి వెళ్ళిపోతాడు..

 ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేణు...


రేణు మాటలకి శారద బాధపడుతూ తన గది లోకి వెలుతుంది...



******


ఏమిటి శ్రాస్తి గారు ఇలా వచ్చారు...


నిన్న పక్క ఊరి రామాలయంలో రాములవారి కళ్యాణం జరిగింది ప్రసాదం అక్షంతలు ఇచ్చి వెళదామని వచ్చాను అంటు ప్రసాద్ చేతికి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతారు శ్రాస్తి గారు..

శ్రాస్తి మాటలకి ఎదో జ్ఞపకం వచ్చి బయటకి వెళ్తుంది శారదా దేవి..


అమ్మగారు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా...


నిన్న మా రేణు చేసిన దాన్ని మనసులో పెట్టుకోకండి వేంకటా చారి..


అదేమీటమ్మా వాళ్ళ గురించి నాకు తెలియనిదా ముందు మీరు వచ్చిన పని చెప్పండి శారద దేవిగారు అంటు లోపలికెళ్ళి కొన్ని పేపర్లు తిసుకుని వస్తారు..


రేణు, విజయ్ జాతకాలూ బానే ఉన్నాయి వాళ్ళకి కళ్యణ గడియలు మొదలయ్యాయి అని వాళ్ళ జాతకాల్లో ఉన్నాయి కానీ వాళ్ళని చూస్తుంటే అసలు అలా జరుగుతుందా అని అనిపిస్తోంది... లేదా వాళ్ళకి బయట సంబంధాలు ఏమైనా అంటు ఆగిపోతాడు చారి..


వేంకటా చారి గారు అలానకండి నా కోరిక వాళ్ళు ఒక్కటవలని..


బాద పడకండి అమ్మగారు ఆ దేవుడు ఎందుకు ఇలా జాతకలు అర్ధం కాకుండా చేశాడో చుద్దాం. నాకు తెలిసి అంత పెద్ద సమస్య ఉండదేమో... మీరెమ్మన దేవుడి కార్యం మర్చిపోయి ఉంటారు అందుకే ఇలా జరుగుతుందేమో ...


మీరన్నది నిజమే వేంకటా చారి గారు ఆయన ఉన్నప్పుడు రాములవారి కళ్యాణం చేద్దాము అనుకున్నాము కుదర లేదు పోద్దున శ్రాస్తి గారు రాములవారి ప్రసాదం ఇచ్చాక గుర్తుకు వచ్చింది.. మరి ఇప్పుడు చెయ్యటానికి వీలుంటుందా...


మంచి పనికి వీలుందేమిటి అమ్మగారు ఒక మంచిరోజు రామాలయంలో కళ్యాణం జరిపిస్తే అంత మంచే జరుగుతుంది...


ఆ మంచి రొజు చూసి నాకు కబురు పెట్టండి మీరే వచ్చి అంతా దగ్గర ఉండి జరిపించాలి కళ్యాణం..


మీరు అంతగా చెప్పాలా నేను మీకు కబురు చేస్తాను అమ్మగారూ..


సరే నేను బయలుదేరతాను అంటు అక్కడి నుండి వెలుతుంది శారద దేవీ..


============================


సరే ఇక ఉంటాము సమతి..

వచ్చి నాలుగు రొజులు కుడా ఉండకుండా వెళ్తున్నారు ఇదేమీ బాగాలేదు అంటు శారద దేవీ నీ హాగ్ చేసుకుంటుంది...

నేను మళ్ళీ వస్తానులేవే చెప్పింది గుర్తు ఉందిగా...

హా ఎప్పుడు కబురు చేస్తే అప్పుడే వచ్చేస్తాము అంటు వదులుతుంది సమతి...

నీకు పెళ్ళిడు కొచ్చినా పిల్లలు ఉన్నారంటే నమ్మరే ఇంక చిన్న పిల్లల చేస్తున్నావు ఏడవకు..


బామ్మా మాకేమీ ఇంక పెళ్ళిడు రాలేదు వెనుక నుంచి లవ కుశ అరుపులు..  వీళ్ళిద్దరు కవలలు లావణ్య, కుసుమ ముద్దుగా అలా పిలుస్తారు.. అమ్మాయిలైనా అబ్బాయిలాగా పెంచాలి అని ప్రసాద్ ఆలోచన  కాని వాళ్ళకి ముందే కొడుకు పుట్టాడు పేరు అజయ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం, లవ కుశ లేమో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు అందుకే శారద పెళ్ళి అనగానే అరిచేసారు..


అందరికి బై చెప్పి స్టార్ అవుతారు.. విజయ్, రేణు సైలెంట్ గా ఉండటం చూసి అందరు హ్యాపీ ఫీల్ అవుతారు కాని ఆ హ్యాపీ ఎంతో సేపు ఉంటుందో చూడాలి..


అమ్మ సుమతి కి ఎదో చెప్తున్నావు మాకు చెప్తే సొంతోషిస్తాము కదా..


మీ నాన్న ఉన్నప్పుడు రాములవారి కళ్యాణం చేద్దాం అనుకున్నాం అది ఇప్పుడు చేయాలి అని మంచి రోజు చూసి చెప్ప మన్న వేంకటా చారి.. అదే సుమతికి చెప్పా వాళ్ళు రావాలి కదా శారద దేవి చెప్పగానే..

ఆయనకి ఎలా ఉంది అమ్మ అని సీత అడుగుతుంది...

బానే ఉన్నారులే ఎదో అంటు రేణు వైపు చూస్తుంది... దీనికి అసలు కొంచం అన్న బాధ లేదు చూడు ఎంత హయిగా ఫోన్ లో ఆడుకుంటుందో మనసులో అనుకుంటుంది...


కాలేజీలో...


హాయ్ హిమ ఎలా ఉన్నావు... రేణు నేను బానే ఉన్నాను..


కానీ మన బ్యాచ్ ఏది హిమ..? రేణు ఇప్పుడేగా వచ్చావు వాళ్ళు వస్తున్నారు చూడు...


కాలేజి మొదటి రోజే లెట్ గా వస్తే ఎలా శైలు నిన్న చెప్పాగా త్వరగా రమ్మని..


అలా అడుగు హిమా అని నవ్వుతుంది రేణు..

నేను నిన్ను కుడా అడుగుతున్న ఎందుకు ఇలా లేట్ మళ్ళీ విజయ్ తో గొడవ పొద్దునే కోపంగా చూస్తుంది హిమ..

అది కాదే హిమ అసలు నాకు రావాలని లేకపోయినా మీకోసం వచ్చాను అని దిక్కులు చూస్తుంది రేణు...

మాట మార్చకూ నాకు అంతా తెలుసులే మీరు ఒక్క నిమిషం అన్న సైలెంట్ గా ఉండరా గుడిలో కుడా గొడవ పడతారా..

నీకు మా శారద దేవీ ఫోన్ చేసినట్టు ఉంది డౌట్ గా చూస్తుంది రేణు..

అవునే చేసిందీ అసలు ఆ పుజారికి ఎమైనా అయితే ఎం చేసే దానివి..

ప్లీజ్ హిమ క్లాసుకి టైం అవుతుంది నీ క్లాసు తరువాత పద అంటు క్లాసు వైపు వెళుతుంది రేణు...


హాయ్ రా మామ ఎలా ఉన్నారు హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశావురా...

అది కాదురా బావ ఇంటిలో దైయ్యం ఉంటే ఎలారా ఎంజాయ్ దిగులుగా అన్నాడు విజయ్...

విజయ్ మాటకి రేణు చెతిలో ఉన్న పెన్ విసురుతుంది అంతే అప్పుడే క్లాసు కీ వచ్చిన సార్ చుడటం రేణుని బయటకి పంపడం జరిగాయి....

వాట్ విజయ్ అది సైలెంటుగా ఉందికదా ఇప్పుడెందుకు ఇలా అన్నావు, మీరు మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా మా వల్ల కాదు క్లాసు అయిపోగానే క్యాంటీన్ రా అని కొపంగా వెళ్ళిపోయింది హిమ..

హిమ వెనుక నాని తరువాత శైలు అలా ఒకరి వెనుక ఒకరు అందరు వాళ్ళ బ్యాచ్ వెళ్ళిపోయారు...

ఇంక ఎవరైనావెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళండి మిగిలిన వాళ్ళకైన  క్లాసు తీసుకుంటా..

ఇక చేసేదెంలేక బయటకి వెళ్ళాడు విజయ్ తల సరిచేస్తూ (జుత్తు)...


క్యాంటీన్ దగ్గర...


ఆపవే అన్ని ఐస్ క్రిమ్ లు తింటే పోతావ్ అయినా వాడి మీద కొపం ఇలా ఐస్ క్రిమ్ లు తింటే పోతుందా..

నేనేమి అనకపోయినా వాడే ముందు అలా అన్నాడు నాకు మండిపోతుంది హిమ వాడిని ఎదో ఒకటి చెయాలి అంటుండగానే....


 బాగా కాలిపోయినా వాసన ఎక్కడి నుండిరా నాని పక్కకి జరుగు చుద్దాం.. ఓహో చల్లార్చడానికి మంచి ఏర్పాటు ఐస్ క్రిమ్ ఎలా ఉంది రాక్షసి అంటు నవ్వుతున్నాడు విజయ్....


హిమ నీకోసం ఏమి అనటం లేదు లేకపొతే నేనేం చేస్తానో అంటున్న రేణు మాటలకి అడ్డుపడుతూ ఎం చేస్తావు చెప్పు ఇక్కడ ఏమీ డాడ్ లేడు నీ ఆటలు సాగవు అంటాడు విజయ్..

నిన్ను ఏమైనా చేయడానికి మామయ్య ఎందుకురా అని రేణు అంటుంటే..


ఇక చాలు అపండి  అయిన విజయ్ ముందు నువ్వె క్లాసులో మొదలు పెట్టావు, అసలు మీరు ఇలానే ఉంటే మీతో ఫ్రెండ్ షిప్ కుదరదు అని చెప్పేస్తుంది హిమ..


నేనేమీ అన్నాను ఇంటిలో దెయ్యం అంటే తననే అన్నట్టేనా..? అంటే తనే ఒప్పుకున్నట్టు కదా..! అసలు తన పేరుతో అనలేదు రేణు దెయ్యం అని టేబుల్ మీద దరువేస్తూ అంటున్న విజయ్ నీ కోపంగా చూస్తూ.... సరే పద హిమ అంటు బ్యాగులో చిల్లర తీసి టెబుల్ మీద వేసి ముష్టి వాడిలా బాగ దరువేసావు గుడ్ అంటుంది రేణు...


విజయ్ కుర్చీ విసర బోతుంటే రేణు మీదకి వెనుక నుండి ఒకరు ఆపుతారు.... హాయ్ రా వరుణ్ నువ్వేంటి ఇక్కడ అందరు హాగ్ చేసుకుంటారు..

ఏంటి ఇక్కడ కుడా మొదలు పెట్టారా...


 వీళ్ళ గొడవ రొజు ఉండేదే నువేంటిక్కడ అంటాడు నాని..


 ప్రిన్స్-పల్ కూతురు ఉండగా నాకేం భయం అని హిమ ని చూస్తున్నాడు వరుణ్..


అంటే నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నవా అందరు ఒకేసారి అన్నారు..


 అవును హిమ వాళ్ళ డాడీకి మా సంగతీ చెప్పింది. ఆయనేమో బాగా చదివి జాబ్ తెచ్చుకో అప్పటికీ మీరు ఇలాగే ఉంటే పెళ్ళి చెస్తాను నాకేమీ ప్రాబ్లెమ్ లేదు అన్నారు...


వావ్ హిమ మాకు చెప్పనే లేదే , రేణు అలుగుతుంది..

నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ముందు నీకే చేప్పాలి అనుకున్న మీరు అసలు చేప్పనిస్తే కదా ఇలా గొడవ పడుతూనే ఉన్నారు అని ఇద్దరి చెవులు పట్టుకుంటుంది హిమ..


సారి హిమ ఎనీవే కాంగార్చులేషన్స్ నీకూడా మామా అంటు వరుణ్ నీ హాగ్ చేసుకుంటాడు విజయ్..


 రేణు, విజయ్ మీకే చెప్పేది వినండి ఇంతకు ముందులా ఉండకూడదు అందరు కలిసే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి, గొడవలు పడితే మిమ్మల్ని వదిలేసి మెము అందరం వెరే గ్రూపుకీ మారిపోతాం అని వార్న్ చేసింది హిమ..


హాయ్ గైస్... నేను మ్యాగీ మీ గ్రూప్.. ఐ మీన్ మీ క్లాసే.. మార్నింగ్ అందరు అలా బయటకి వచ్చేశారు అప్పుడే అర్థమైంది మీరంతా ఒకే బ్యాచ్ అని. నన్ను మీ బ్యాచ్ తో చేర్చుకుంటారా నాకు ఇక్కడ అంతా కొత్తగా ఉంది పైగా రీసెంట్ గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము మై డాడ్ ఆర్మీలో వర్క్ చేస్తారు ఈమధ్య రిటైర్ అయ్యారు.. సారీ నేను ఎక్కువ చెప్పానా అని మాట్లాడటం ఆపుతుంది మ్యాగి...



ఇంకా ఉంది..