You And Me.. 3 in Telugu Love Stories by SriNiharika books and stories PDF | నువ్వేనా..నా నువ్వేనా.. 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

నువ్వేనా..నా నువ్వేనా.. 3



 

ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి..


ప్రస్తుతం....




కార్లు అన్ని వెళ్ళిపోయే ఈ ఒక్క సారికి రండి వెళ్దాం అని కారు డోర్ తీస్తాడు డ్రైవర్ వారణాసి..


ఒకే వారణాసి నీకోసం అని రేణు ముందు కారు ఎక్కుతుంది..


విజయ్ బాబు మీరు కూడా రండి త్వరగా వెళ్దాం అని వారణాసి అనగానే..


 సరే పద ఏమి చేస్తాం కొన్ని తప్పవుగా అని కార్ లో అసహనంగా కూర్చుంటాడు విజయ్..


 నేను అదే అనుకుని కారు ఎక్కాను వారణాసి రేణు కోపంగా చూస్తూ అంటుంది..


 చిన్నమ్మగారు బాబుగారు మీరు గొడవ పడకుండా ఉంటే త్వరగా వెళదాము అని వారణాసి అనగానే ఇద్దరు మౌనంగా ఉంటారు..




బావగారు ఎన్ని రొజులు అయింది వచ్చి ఇక్కడికి కాఫీ ఇస్తూ సుమతి (శారద దేవి మరిది కోడలు) అడుగుతుంది...


అలా అడుగు వీళ్ళ పని వల్ల మమల్ని కుడా రానివ్వటం లేదు అని సీత, అంజలి ఒకే సారి అన్నారు..


ఇంతకీ అసలు వాళ్ళు ఏరి..?


వాళ్ళిద్దరూ ఒకే కారులో వస్తున్నారు అని సీత అనగానే...


నిజంగానా అయితే మన ఊరికి సునామి హెచ్హారిక ఇవ్వాలని నవ్వుతుంది సుమతి...


అందరు నవ్వుకున్నారు..


ఇంతకి ఆ విచిత్రం ఎలా జరిగింది..



అదో పెద్ద కధలే అని శారద దేవీ వాళ్ళ నవ్వులని ఆపుతుంది..


ఎన్నీ రోజులకి గుర్తుకువచ్చామా అంటూ లోపలికి వచ్చిన ప్రసాద్ (సుమతి హస్బండ్) భుపతిని హాగ్ చేసుకుంటాడు...


ఇక్కడ నేను ఉన్నాను అని రఘు అనగానే మిమ్మలిని ఎలా మర్చిపోతాను బావగారు అంటూ రఘుకి స్వాగతం చెప్తాడు ప్రసాద్..



వీళ్ళు మాటల్లో ఉండగా వారణాసి వస్తాడు ఆయాసపడుతూ..



ఇంతకి ప్రయాణయం ఎలా జరిగింది వారణాసి సుమతి అడుగుతుంది..



ప్రాణాలతో వస్తాను అని అనుకో లేదు అనగానే అందరు నవ్వుతారు ఇంకోసారి..


======================================


మీరు మొత్తానికి సిటీ వాళ్ళు అయిపోయారు అందుకే రావటం లేదు అమ్మ, మీరు వచ్చి నాలుగేళ్ళు అవుతుంది, అత్తయ్యా మామయ్య కుడా లేరు మాకు పెద్ద దిక్కు మీరే కదా కన్నీటిని ఆపుకుంటూ శారద దేవీ వైపు చూస్తుంది సుమతి..


భాద పడకు సుమతి నా ముందు పెరిగిన వాళ్ళు నా కళ్ళ ముందే చనిపోతే ఆ బాధలో ఇక్కడికి రావాలనిపించ లేదు.. అంతే గాని మిమ్మల్ని చూడాలని నాకు ఉండదంటే..


ఛ.. ఛా..నేనె అనవసరంగా మీకు అన్నీ గుర్తుకు చేశాను మీరు విశ్రాంతి తీసుకొండి అంటు బయటకి వెళ్తుంది సుమతీ..


నేను మర్చిపోతే కదే నువ్వు గుర్తు చేయటానికి అనుకుంటూ నిద్ర పోవటానికి ప్రయత్నిస్తోంది శారద దేవి..



చూడండి వచ్చినప్పటి నుండు రేణు తన గదిలో నుండి బయటకి రాలేదు.. అయితే బంగారం ఏమీ తినలేదా అని భూపతి రేణు గది వైపు వెళ్తాడు.. వెనుకే భోజనం పట్టుకుని అంజలి అతన్ని అనుసరిస్తుంది..


మామయ్య నాకు ఆకలిగా లేదు అంది కొపంగా రేణు..


నేను నిన్ను తినమని అడగటాని రాలేదు బంగారం మీ అత్తయ్యకి తోడుగా వచ్చాను లేచి కొంచం తిని పడుకో తల్లి మళ్ళి నీరసం వస్తుంది..


అయిన సరే నేను ఎవరితో మాటాడను దుప్పటి ముసుగేసుకుంది రేణు..


అమ్మ నువ్వు అసలు నాకు అమ్మవేనా నేను అక్కడ ఆకలితో ఉంటే దీనికీ అన్నం తినిపిస్తున్నావా..?


ఇప్పుడే అది అలక మానింది ఇప్పుడెందుకు విజయ్, రా నీకు పెడతా..


నాకేమీ వద్దులే దానికే పెట్టుకో అని వెళ్ళిపోతున్న విజయ్ నీ సిత ఆపుతుంది నేను పెట్టినా తినవా నా బంగరు కన్నా అని..



బాగా ఆకలీ ఉండడంతో తినడం మంచిదని నోరు తెరుస్తాడు పేట్టు అత్తయ్య అంటు..


చూడు అత్తయ్య గేదెలాగా ఎలా మేస్తున్నాడో..


హుష్.. అని భూపతి రేణుకి సైగ చేస్తాడు..


నన్నే గేదె అంటావా చూడు అని మనసులొ అనుకుని డాడ్ ఈ మధ్య చింపాంజీ కూడా జిన్స్ వేసుకుంటున్నాయి అని విన్నను కానీ అది నమ్మలేదు ఇప్పుడు నమ్మక తప్పటం లేదు అనే విజయ్ మాట పూర్తీ కాక ముందే పిల్లొ వాడి ముఖాన తగులుతుంది..


హ హాహా హ బాగ కాలిందా అంటు విజయ్ పరుగున వెళ్ళిపోయాడు..



ఈ రొజే నీకు ఆకరి రోజురా అంటు రేణు పరుగు అందుకుంది..


దేవుడా ఎలాగైనా వాడిని చంపెయ్ వాడితో నేను వేగలేకపొతున్న, అమ్మొ వద్దులే కాలో చేయో తీ..సై.. కానీ అత్తయ్య బాధ పడుతుందేమో.. ఎం కాదులే నేను చాలులే వాళ్ళకి.. విజయ్ నీ ఎలా ఏడిపించాలో వాడులేని లోకం ఎంత బాగుంటుందో అనే ఊహలతో నిద్ర పొతుంది రేణు..


మన విజయ్ కుడా ఇదే రెంజ్ లో రేణు లేని లొకం కోసం దేవుడిని వేడుకుని దుప్పటి ముసుకేసుకుంటాడు..


మెల్లగా తెల్లారుతుంది..


తొందరగా తయారవ్వండి బామ్మా గుడికి వెళ్ళాలి అని చెప్పింది..



అప్పుడే లేచిందా ముసల్ది బద్దకంగా వళ్ళు విరుస్తూ అంటుంది రేణు..


ఏమే నన్నె ముసల్ది అంటావా చేవి మెలిపెడుంది శారద దేవి..



అవును మరీ తమరు స్వీటీ సిక్స్ టీన్ కదా అంటు చేవి వదిలించుకుని బాత్ రూంలొకి దూరిపోతుంది రేణు..


ఇంకా నన్ను చుస్తూ నుంచుంటారా వెళ్ళి వాడిని లేపండి కసురుతుంది..


చూడు వదిన మానవరాలి మీద కొపం మన మీద చుపిస్తుంది అని నసుగుతున్న సీత తో వయసైపోయిందిలే అని పొరపాటున పైకీ అనేసింది అంజలి..


వదిన నువ్వు పైకీ అనేశావు..



సారి అత్తయ్య అంటు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలి..


శారద దేవి ఎవరు వినలేదు కదా అని చుట్టూ చూసి తను నవ్వుకుంటుంది..



అది చూసి అంజలి హమ్మయ్య అని ఉపిరిపిల్చుకుంటుంది..


గుడి దగ్గర...


అందరు గుడికి పరికిణి ఓణి వేసుకున్నారు నువ్వు కుడా వేసుకోవచ్చుగా ఇలా పోగులు ఊడిపోయి, ఎలిసిపోయిన ప్యాంటు వేసుకున్నావు అంటు రేణు తల మీద ఒకటి వేస్తుంది శారదా దేవి..


 చూడు ముసలి పోనిలే అని గుడికి వచ్చాను ఓణి అన్నావంటే వెళ్ళిపోతాను అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది రేణు..


దీనికి వాడిని ఆ భుపతిని చూసి నోరు ఎక్కువైంది ముందు వాడిని అనాలి అని రుసరుసలాడుతున్న శారదా దేవి నీ చూస్తూ నా సంగతి తెలుసు కదా డార్లింగ్ కొంచం చిల్ అవ్వు అంటు ముందుకు వెళ్తుంది..


అయిన బామ్మా చింపాంజీకి ఓణి సూట్ అవ్వదులే అని శారదా దేవి పక్కన చేరిన విజయ్ నీ కళ్ళెర్ర చేసి చూస్తుంది రేణు..


కానీ సీత వచ్చేముందే గుడిలో గొడవ పడితే ఊరుకోను అని చెప్పటంతో మౌనంగా ఉంటుంది..


కొంచం ముందుకి వెళ్ళగానే చింపాంజీ.. చింపాంజీ.. అని పిల్లలు పెద్దగా అరుస్తూ విజయ్ ఇచ్చే చాకోలెట్స్ తీసుకుంటున్నారు..


రేణు పళ్ళు కొరుకుతూ చేతిలో ఉన్న కొబ్బరి కాయ విసురుతుంది..



విజయ్ తెలివిగా పక్కకి తప్పుకున్నాడు..



ఆ కొబ్బరి కాయ వెళ్ళి పూజారికి తలకి తగిలి చచ్చానురా దేవుడా అంటు కింద పడిపోతాడు..


అమ్మో అని షాక్ అవుతుంది రేణు.. ఈ రోజుకి దీని పని అయిపోయింది అని విజయ్ చేతులు దులుపుకుంటాడు..