An inspiring life in Telugu Moral Stories by Yamini books and stories PDF | స్ఫూర్తిదాయకమైన జీవితం

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

స్ఫూర్తిదాయకమైన జీవితం

సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్నిరోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేనన్నీ కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంటుంది. కొందరూ వయస్సు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయస్సు పెరిగే కొద్ది కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరుగదు.  అయితే వయస్సు పెరుగుతుంటే మనం ఎన్నో గుణపాఠాలు, అనుభవాలను మాత్రం తప్పకుండా నేర్చుకుంటూ ముందుకెళ్తాం. 

ఈ నేపథ్యంలోనే మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి.. అదేవిధంగా భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువను.. మనలను మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని సానుకూలతను పెంపొందించుకోవడం అవసరం.

జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. 

ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. 

సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. 

జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. 

సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు.. జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. 

ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి. 

మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. 

మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు.. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికీ జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటిని ఆలోచించండి. 

సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు. మనకు కావాల్సింది అల్లా పాజిటివ్ గా ఆలోచించి ముందడుగు వేయాలి. 

ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి. 

ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం. 

జీవితంలో మనం ఎవ్వరినీ కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది.

పాజిటివ్ గా ఉంటే ... శబ్దం సంగీతం అవుతుంది.. కదలిక నాట్యం అవుతుంది.. చిరునవ్వు ఓ హాస్యమవుతుంది.. మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది.. జీవితం ఓ సంబరంగా ఉంటుంది.

మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.

జీవితం మసిపూసిన వదనం

జీవితం అఖండ భయసదనం

జీవితం గాలి వీచని సాయంత్రం

లక్ష్య సాధనలో...

నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కరలేదు, నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు నీ మనస్సుకు అయిన గాయాలు, అస్సలే అవసరం లేదు... కానీ.. నీవలన ఒక చిన్న తప్పు జరిగితే... వంద నోర్లు మాట్లాడుతాయి.. ఇదే జీవితం

జీవితం

జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది. తిని ఖాళీ గా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్త్రని.....జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే...!!

ఓపికతో ఉండేవారు ఎప్పుడు ఓడిపోరు నేస్తమా...!!! ఓపిక పట్టి చూడు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

జీవితం ఓ యుద్ధ రంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరుకూ నువ్వు ఓడిపోనట్లే లెక్క. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం. 

అందమైన జీవితం అర్ధంకాని జీవనం          ఆరాటం అనే ఆకలితో అలమటిస్తున్నాం... నిత్యం పోరాడుతూ జీవిస్తున్నాం...

ఎప్పటికి తీరేను నీ ఆరాటం...? "ఎన్నాళ్ళు సాగేను నీ పోరాటం...? నీ సడి ఆగే వరకు నీ దారి మరిచేవరకు....