Weakness Or Strength? in Telugu Moral Stories by Yamini books and stories PDF | బలహీనతా లేక బలమా ..?

The Author
Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

బలహీనతా లేక బలమా ..?

కొన్నిసార్లు మీకున్నటువంటి  అతిపెద్ద బలహీనత మీకు  అతిపెద్ద బలం అవుతుంది. ఉదాహరణకు, ఇక్కడ ఒక జరిగిన కథను చర్చిద్దాం.

ఒక 10 సంవత్సరాల బాలుడు అతను తక్వండో నేర్చుకోవాలని  నిర్ణయించుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఒక భయంకరమైన  కార్ ఆక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో తన తండ్రితో పాటు తన ఎడమ చేయిని కూడా పోగొట్టుకున్నాడు. 

అతను తన తక్వందో మాస్టారు దగ్గరికి వెళ్లి ,ఇక నేను నా జీవితంలో తక్వందో నేర్చకోలేను అని చెప్పాడు. ఆ మాట విన్న మాస్టారు నువ్వెందుకెలా అనుకుంటున్నావు..? నీకున్న ఇష్టంతో మరియు పట్టుదలతో నువ్వు ఒక్క చేత్తో కూడా నేర్చుకుని విజయాన్ని సాధించగలవు అన్నాడు. ఆ మాట విన్న బాలుడికి మొదట ఏమి అర్ధం కాకపోయినా. మాష్టారు మీద ఉన్న  నమ్మకం  కారణంగా తక్వండోని వదిలిపెట్టలేదు. ఇంకా ఎక్కువ సాధన చేయడం ప్రారంభించాడు. 

తక్వండో  స్కూల్ లో తనతో పాటు చాల మంది విద్యార్థులు ఉండేవారు. మాస్టారు అందరికి ఎన్నో రకాల కిక్స్ మరియు త్రోస్ నేర్పిస్తున్నాడు. కానీ ఈ బాలుడికి మాత్రం ఒకటే రకమైన సాధన చేయిస్తున్నాడు.  అది ఎడమ భుజానితో ఎదుటివారిని ఆకర్షించి కుడి చేత్తో కిక్ కొట్టడం. ప్రతీరోజు ఒకేరకమైన సాధన. ఎదుటి వారు ఎలాంటి కిక్స్ కొట్టిన ఈ బాలుడు మాత్రము చేయాల్సింది ఒకటే.. ఇది చూస్తూ చూస్తూ ఆ బాలుడికి ఒక సందేహం వచ్చింది. మాస్టారుతో ఇలా అడిగాడు ” తక్వండో లో ఎన్నో రకాలైన ట్రిక్స్ , కిక్స్ మరియు త్రోస్ ఉన్నాయి అందరికి అన్ని నేర్పిస్తున్నారు.  కానీ, నాకు ఈ ఒక్కటి మాత్రమే నేర్పిస్తున్నారు నేను వేరేది నేర్చుకోవడానికి అర్హుడిని కాదా అని.?

అది విన్న మాస్టారు నవ్వుతూ.. నీకు ఎదుటి వారు ఎలా ఫైట్ చేస్తారో తెలుసు ఎన్ని రకాల  ట్రిక్స్  యూస్ చేస్తారో తెలుసు.  అంతేకాకుండా ఎవరు ఎలాంటి కిక్ చేసిన నువ్వేం చేయాలో కూడా నీకు తెలుసు. అదొక్కటే నిన్ను కాపాడుతుంది అని చెప్పాడు.  అప్పుడు ఆ బాలుడికి ఏమి అర్ధం కాకపోయినా తన మాష్టారి  మీద నమ్మకంతో..  తనని తాను కూడా నమ్ముకున్నాడు. 

కొన్నిరోజుల్లోనే టోర్నమెంట్ స్టార్ట్ అయింది.  ఈ బాలుడు మొదటి రెండు రౌండ్స్ లో చాలా తేలికగా గెలిచాడు. ఆ బాలుడు ఆ విజయాన్ని నమ్మలేక పోయాడు. మూడవ రౌండ్ అదే ఫైనల్ రౌండ్ తాను ఛాంపియన్ అవడానికి.  బాలుడి ప్రత్యర్థి చాలా  బలశాలి మరియు తనకంటే ఎంతో అనుభవం కలిగినవాడు.మూడవ మ్యాచ్ మరింత కష్టమని తేలింది. అతన్ని చూడగానే ఈ బాలుడికి తన అపజయం కళ్లెదుట కనబడింది. అయినా తప్పదనుకుని పోరాడటం మొదలుపెట్టాడు. ఆ బలశాలి బాలుడి యొక్క కాలుపైనా గాయం చేసాడు.  అది ఆ బాలుడిని సరిగా నిలబడనీయకుండా చేసింది. అంతలోనే అంపైర్ వచ్చి ఆ బాలుడితో ఇంతటితో  నీ అపజయాన్ని ఒప్పుకో. లేకుంటే, ఇది నీ ప్రయాణాల మీదకి వచ్చేలా ఉందని చెప్పాడు. అంతలోనే, బాలుడి యొక్క మాష్టారు కలగచేసుకుని తాను ఎంత వరకు పోరాడతాడో అంతవరకు పోరాడనివ్వండి.  తనకు తెలుసు ఎదుటి వారిని ఎలా ఓడించాలో అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విన్న బాలుడు వెంటనే అతికష్టం మీద లేచి నిలబడి తన  ఎడమ చేతిని ప్రత్యర్థికి చూపించాడు. 

అది చూసిన ప్రత్యర్థి “ఎలాగూ కాలికి  గాయం చేశా ఒక చేయి కూడా లేదు వీడికి, ఆ చేయి పైన మరొక పంచ్ కొడితే వీడు ఇక లేవడు అని మనసులో అనుకున్నాడు”.  ప్రత్యర్థి,  ఆ బాలుడు అనుకున్నట్టుగా ఒక క్లిష్టమైన తప్పు చేసాడు.  ఆ బాలుడి గాయం పైన ఇంకా గాయం చేస్తో తానే గెలువొచ్చు అని ఎడమ చేతి వైపుగా పంచ్  చేయడానికి వెళ్ళాడు.  అంతలోనే,  ఆ బాలుడు తన కుడిచేత్తో గట్టిగ కొట్టాడు. ఆ ఒక్కదెబ్బతో ప్రత్యర్థి కుప్పకూలిపోయాడు. బాలుడు మ్యాచ్ మరియు టోర్నమెంట్ గెలిచాడు. అతను ఇపుడు ఆ టోర్నమెంట్  ఛాంపియన్. 

ఆరోజు రాత్రి ఇంటికి తిరిగి వెళ్తున్నపుడు దారిలో బాలుడు మాష్టారుతో ఇలా అడిగాడు. అసలు నేనెలా ఛాంపియన్ అయ్యానో నాకే అర్ధం కావడం లేదు. మొదట ఇద్దరిని తేలికగా ఓడించినా మూడవ వ్యక్తితో నేను గెలవలేను  అనుకున్నాను. మాష్టారు మీరెలా నమ్మారు  నేను గెలుస్తానని..? అని అడిగాడు. అపుడు మాష్టారు, నువ్వు గెలవడానికి రెండు కారణాలు ఉన్నాయి.  ఒకటి ఎదుటి ఏ సమయంలో ఎలాంటి ట్రిక్ తో వస్తారో నీకు బాగా తెలుసు.  రెండవది వారు ఎలాంటి ట్రిక్ తో వచ్చిన నువ్వు నీకు తెలిసిన ఒకే ఒక ట్రిక్ ని ప్లే చేస్తావు. దానితో విజయం నీ స్వంతం అవుతుంది.

నువ్వు  ఏదైతే నీ బలహీనత అనుకుని తక్వండోని వదిలేద్దాం అనుకున్నావో, నీకు అదే బలంగా మారి నీకు విజయాన్ని అందించింది అని చెప్పాడు. నిజానికి ఇక్కడ నీ బలహీనత ఎదుటివారి బలహీనత అవుతుంది. వారికి ఎంత అనుభవం ఉన్నాగాని నీ చేయిని చూడగానే చాలా తేలికగా ఊదించొచ్చనే భావన కలిగి తప్పులు చేస్తుంటారు. అదే నీకు బలంగా మారుతుంది అది నవ్వుతూ బదులిచ్చాడు మాష్టారు.

"నీతి | Moral : “ఈ ప్రపంచంలో చాలా మంది తమలో ఉన్న బలహీనతను(లోపాన్ని) చూసుకుని బాధపడుతుంటారు మరియు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా సంకోచిస్తుంటారు. కానీ, మీ బలహీనతనే బలంగా మార్చుకోండి జీవితంలో మీరు అనుకున్నది తప్పకుండ సాధిస్తారు..”"