Truth - 19 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 19

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

నిజం - 19

Next day :

విజయ్ శరభయ్య ని తీసుకొని వాన్ లో కోర్టు కి వెళ్ళాడు, ఈ విషయం వూరి జనానికి తెలీకుండా ఉదయాన్నే బయలుదేరి వెళ్లి పోయారు , మరో వైపు సాగర్ ,రాఘవులు , చంద్రం మరిడయ్య గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు .

కోర్టు లో శరభయ్య కి శిక్ష పడింది , ఏడుస్తున్న శరభయ్య ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కాలేదు విజయ్ కి , హత్య కు వాడే వెపన్ లాగా వాడుకున్నారు శరభయ్య ని , ఈ వెపన్ ని వాడిన చేతులు కి మాత్రం ఇంకా బేడీ లు వేయలేదు , అందరి దృష్టి లో ఈ కేస్ పూర్తయింది , కానీ దీని వెనుక వున్న వాళ్ళను పట్టుకున్న రోజే నా దృష్టి లో కేస్ క్లోజ్ అయినట్టు అని తనలో తానే అనుకున్నాడు విజయ్ , శరభయ్య ని సెంట్రల్ జైల్ కి తీసుకెళ్లడానికి ఒక వాన్ లో ఎక్కించారు , తల ఎత్తి చూసిన శరభయ్య కి ఒక బెంచ్ మీద కూర్చుని వున్న విజయ్ కనిపించాడు , విజయ్ sir అని గట్టి గా పిలిచాడు శరభయ్య , ఆలోచనల నుండి బయటకు వచ్చి తల ఎత్తి చూశాడు విజయ్ , శరభయ్య ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అనుకుని అతని దగ్గరకు వెళ్ళాడు , ఏంటి శరభయ్య ఏమైనా చెప్పాలా అడిగాడు విజయ్ , అడుగుదామా వద్దా అని సందేహిస్తూనే sir సంపత్ బాబు ఎలా వున్నాడు అని అడిగాడు కళ్ళ నిండా నీళ్ళ తో శరభయ్య , నేను టైం కి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను కాబట్టి ప్రాణాల తో వున్నాడు కోలుకోవ డానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు విజయ్ , నేను జైల్ నుండి వస్తానో అక్కడే పోతానో తెలీదు , ఒక వేళ వచ్చినా ఆ వూరికి నన్ను ఎవరూ రానివ్వరు నా కోసం చిన్న పని చేసి పెడతారా అని రెండు చేతులూ జోడించి దణ్ణం పెడుతూ అడిగాడు శరభయ్య , నా పడకగది లోని బీరువాలో కొంత డబ్బు వుంటుంది దానితో నా భార్య కు సమాధి కట్టించండి ఇదే నా చివరి కోరిక అన్నాడు ఏడుస్తూ శరభయ్య , తప్పకుండా చేస్తాను అన్నాడు విజయ్ , ఈలోగా వాన్ కదిలి అక్కడి నుండి బయలుదేరింది .

మరో వైపు మరిడయ్య గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన రాఘవులు , సాగర్ , చంద్రం కలిసి చాలా చోట్ల అడిగారు ఏమీ తెలీలేదు , మధ్యాహ్నం వరకు వెదికి న తర్వాత sir నా పొట్ట లో ఏదయినా పడితే గానీ ఇంక తిరగలేను కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి అన్నాడు చంద్రం, సరే లంచ్ చేసి మళ్ళీ పని మొదలు పెడదాం అన్నాడు రాఘవులు , లంచ్ చేయడానికి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళారు ముగ్గురూ , బలే పెద్దగా ఉంది sir ఈ హోటల్ అన్నాడు చంద్రం , మచలీపట్నం ఇదే పెద్దది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అన్నాడు సాగర్, బయట ఎక్కడ యినా తినేసే వాళ్ళం కదా పని మీద వచ్చి ఇక్కడ తీరిగ్గా కూర్చుని తింటే ఎలా సాగర్ అన్నాడు రాఘవులు , లేదు నాన్న బయట మిగిలిన చోట్ల ఉండే రద్దీ లో మాట్లాడు కోవటం కుదరదు అందుకే ఇక్కడకు తీసుకువచ్చా అన్నాడు సాగర్ , ఏముంది sir మాట్లాడు కోటానికి అన్నాడు చంద్రం , అదే కదా అన్నాడు రాఘవులు చంద్రాన్ని సమర్ధిస్తూ , ఒక్కసారి ఇద్దర్నీ మార్చి , మార్చి చూసి వీళ్ళిద్దరికీ ఈ పోలీస్ జాబ్ ఇచ్చింది ఎవరు అనుకున్నాడు మనసులో , ఏంటి రా ఇద్దరి నీ అలా చూస్తున్నావ్ కొత్తగా అన్నాడు రాఘవులు , పైకి చెప్తే ఏడుస్తారు లే అనుకుని , ఏం లేదు చెప్తాను అని ఒక పెన్ బయటికి తీసాడు , పేపర్ కోసం చూసాడు బాగ్ లో నుండి మరిడయ్య స్కెచ్ వున్న ఒక పేపర్ తీసాడు దానిని వెనక్కి తిప్పి ఆ ఊరిలోని ఏరియాస్ అన్ని పేర్లు రాశాడు , ఇవి మనం పొద్దుట నుండి ఎంక్వైరీ చేసిన ఏరియాస్ అని మార్నింగ్ నుండి వాళ్ళు వెళ్లిన ఏరియాస్ names టిక్ చేశాడు , ఇంకా ఈ మిగిలిన ఏరియాస్ వెతకాలి అని మనం ముగ్గురం కలిసి వెళితే చాలా టైం పడుతుంది , సో మన ముగ్గురికీ ఈ ఏరియాస్ ని డివైడ్ చేస్తా అప్పుడు పని త్వరగా ఫినిష్ అవుతుంది అన్నాడు సాగర్ , మిగిలిన ఇద్దరి మొహాలు విచ్చుకున్నాయి సరే అలానే చేద్దాం అన్నారు ఇద్దరూ ఒకేసారి , ముగ్గురికీ ఏరియాస్ డివైడ్ చేశాడు సాగర్ , ఈ లోగా వెయిటర్ వచ్చాడు ఆర్డర్ తీసుకోడానికి అతని ముందు ఇలా రాయటం బాగోదు అని పేపర్ వెనక్కి తిప్పేసి సాడు సాగర్ , సడన్ గా పేపర్ వైపు చూసిన వెయిటర్ , ఏంటి sir మీరు కూడా ఈ sir గ్రూప్ ఏనా అన్నాడు వెయిటర్ ముగ్గురూ షాక్ అయ్యి చూశారు వెయిటర్ వైపు , సాగర్ మాత్రం వెంటనే తేరుకొని అవును ఈయనే గ్రూపే మేం కూడా ఇంతకీ ఈ sir నీకు తెలుసా అన్నాడు సాగర్ ,అయ్యో ఈయన నాకు తెలీక పోవడం ఏంటి , ఈయన వచ్చినప్పుడల్లా నేనే సర్వ్ చేస్తాను , నాక్కూడా నాటకాలంటే పిచ్చి ఆయన నాక్కూడా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పారు , మా రెస్టారెంట్ లోనే నాటకానికి గెటప్ వేసుకొని వెళతారు , ముందే గెటప్ వేసుకుంటే ఆ క్యారెక్టర్ లోకి త్వరగా వెళ్లొచ్చు అని చెప్తారు అన్నాడు ఆ వెయిటర్ , అవును నీ గురించి నాకొక సారి చెప్పారు నీ పేరు ఏదో చెప్పారు అంటూ ఆలోచిస్తు న్నట్టు నటించాడు సాగర్ , sir భీమన్న నా పేరు అన్నాడు వెయిటర్ , ఆ భీమన్న కదా ఈ sir నే ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అని చెప్పారు అందుకే వచ్చాం కానీ అంటూ సాగదీసాడు సాగర్. కానీ ఏంటి sir ఏదయినా ప్రాబ్లం వుందా అన్నాడు వెయిటర్ , ఆయన చెప్పిన ఈ రెస్టారెంట్ పేరు గుర్తు వుంది కానీ ఆయన స్టే చేయడానికి చెప్పిన హోటల్ పేరు మర్చిపోయాం భీమన్నా అన్నాడు సాగర్ నొసటి దగ్గర చెయ్యి పెట్టుకుని తెగ ఆలోచిస్తున్నట్టు act చేస్తూ , నాకు ఎప్పుడూ సంగతి తెలీదు గానీ కిందటి సారి వచ్చినప్పుడు మాత్రం విద్యానగర్ కాలనీ లోని కృష్ణా పాలస్ నుండి రావడం చూసా , నేనేదో పని మీద రోడ్డు మీద వెళుతుంటే కనిపించాడు అన్నాడు వెయిటర్ భీమన్న . ఇంతకీ భీమన్నా నీకు ఆయన ఏ వూరు నాటకం లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పారు , నాకు చెప్తే ఆయనని కలిసి నప్పుడు గుర్తు చేస్తా అన్నాడు సాగర్ , ఈ వూరి లోనే ఇప్పిస్తానని చెప్పారు , ఆయన నాటకం ఎక్కడ వేస్తున్నారు చెబితే నేను వస్తానని అడిగాను ఒక సారి , నన్ను ఇప్పుడు అడగకు సమయం వచ్చి నప్పుడు నేనే తీసుకెళతా అన్నారు అని దిగులుగా మొహం పెట్టి అన్నాడు భీమన్న . వాడి వెనక తిరిగితే నువ్వు కూడా ఈపాటికి ఏదోఒక జైల్ లో చిప్ప కూడు తింటూ ఉండేవాడివి అనుకున్నాడు సాగర్ .

సరే భీమన్న త్రీ ప్లేట్స్ మీల్స్ తీసుకురా అని వెయిటర్ ను అక్కడి నుండి పంపేశాడు సాగర్ , రాఘవులు ,చంద్రం అలానే చూస్తున్నారు సాగర్ వైపు , ఏంటి ఇద్దరూ అలా చూస్తున్నారు నన్ను అని అడిగాడు సాగర్, భలే మాటల్లో పెట్టి కూపీ లాగారు అన్నాడు చంద్రం , విజయ్ మీతో పాటు నన్ను కూడా ఎం7దుకు పంపించాడు అని ఇప్పుడే అర్థం అయింది అన్నాడు సాగర్ . రాఘవులు , చంద్రం ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు . వెయిటర్ ఫుడ్ తీసుకుని వచ్చాడు , సాగర్ మళ్ళీ భీమన్న తో మాటలు కలిపాడు , భీమన్నా ఎప్పుడయినా ఈ sir కి కాల్ చేసి మాట్లాడతావా లేదంటే ఇక్కడకు వచ్చినప్పుడు కలవటమేన అని అడిగాడు సాగర్ , లేదు sir ఇంతవరకు ఆయన పేరే చెప్పలేదు ఇంకా ఫోన్ నంబర్ కూడా నా , కానీ నా మొహం చూసి నువ్వు మంచి కళా కారుడివి నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు , అదేంటి ఇన్నాళ్ళ పరిచయం లో ఆయన పేరే అడగలేదా నువ్వు అన్నాడు సాగర్ , అడిగాను sir కళాకారుడు ఏ వేషం వేస్తే అదే తన పేరు ఇంకా ప్రత్యేకంగా పేరెందుకు అన్నారు , అందుకే sir మళ్లీ పేరు అడగలేదు మీరన్నా ఆయన పేరు చెప్పండి sir అని అడిగాడు భీమన్న , సాగర్ చిన్నగా నవ్వి ఆయన పేరు పెంటయ్య అందుకే నీకు పేరు చెప్పి వుండరు ఓ అదా సంగతి అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భీమన్న . భీమన్న వెళ్ళగానే రాఘవులు ,చంద్రం కూడా నవ్వేశారు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ sir అంటూ నవ్వాడు చంద్రం, ముగ్గురూ లంచ్ ఫినిష్ అయ్యాక బయలు దేరే ముందు, sir నేను ఇప్పుడు వెళ్లాల్సిన ఏరియాస్ లిస్ట్ రాసి ఇవ్వండి కొంచెం అన్నాడు చంద్రం సాగర్ తో , నో చంద్రం ప్లాన్ లో మళ్లీ చిన్న చేంజ్ అన్నాడు సాగర్ .