The shadow is true - 37 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 37

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

నీడ నిజం - 37

కోమలా ! నీ పేరు ....”

“ కోమలా అని పిలుస్తూ పేరు అడుగుతారేమిటి అత్తయ్యా ?” విద్యా మాట్లాడేది గ్రామీణ రాజస్థానీ కాదు ---స్వచ్చమైన హిందీ . తను హిందీ మాట్లాడ గలదు .

అత్తయ్య కూడా భాష మార్చింది .”

“జన్మ మారితే పేరు కూడా మారాలిగా ? ఆమె గలగలా నవ్వింది .

“ మారింది...... విద్యాధరి .”

విద్యాధర . పేరుకు తగ్గట్టే బాగా చదువుకున్నావు . కోమలాదేవి లా అమాయకురాలివి కావు . ఆ జన్మ లో నా మనవడికి అమ్మ లా ప్రేమ నందించావు .

ఈ జన్మలో ప్రేమతో పాటు బుద్ధి , ఓర్పు నేర్పాలి . ప్రతిదానికి చిన్న పిల్లాడిలా అలుగుతాడు . కోపం తెచ్చుకుంటాడు . ఇంకా అప్పటి పసితనం పోలేదు .మనవడిని మురిపెం గా చూసింది .

“ నన్ను మరీ తీసేయకు ! అమ్మకు నా గురించి పూర్తిగా తెలుసు . నిజానికి ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లలా అలిగేది నువ్వే ! నువ్వు అలిగి కొండ ఎక్కా వంటే దించటం చాలా కష్టం . “

ఆ మాటల తీరుకు ముగ్గురూ నవ్వుకున్నారు . రాహుల్ భార్య వారిని వినోదం గా చూసింది . తన భర్త గుండెల్లో బరువు దిగి ఆనందం గా నవ్వటం ఆమెకు పెద్ద రిలీఫ్ .

“ నన్ను క్షమించండి అత్తయ్యా ! “ విద్యా ఆమె పాదాలు తాకింది . గొంతు వణికింది .

“ నీ కన్నీటి లో నువ్వు చేసిన తప్పు ఆనవాలు లేకుండా కరిగి పోయింది . నీకు ఎవరి క్షమాపణ అక్కరలేదు . ఇప్పుడు నువ్వు రెండు జన్మల వారధివి . మాకు కోమలవు . నా మనవడికి యశోదమ్మవు . ఈ జన్మలో విద్యాధరివి . ఒకింటి కోడలివి . ఈ రెండు బాధ్యతలు రెండు పడవలపై ప్రయాణం లాంటివి . ఏదీ హద్దు మీరకూడదు . ఎవరి మనసు కష్ట పెట్టకూడదు . ఈ రెండింటినీ చక్క గా నిర్వహించగల నేర్పు, ఓర్పు నీలో ఉన్నాయి . ఇదో అద్భుతం ! భగవంతుడి సంకల్పం . ´విద్యా తల నిమురుతూ ఉండి పోయింది .

కో మలకు ముసలావిడ దీవెనలు , చల్లటి మాటలు, స్పర్శ కొండంత బలాన్ని, పరిపూర్ణమైన శాంతిని ఇవ్వగలిగాయి . ఆమె విద్యాధరిలో ప్రశాంతం గా ఒదిగిపోయింది . కోమల -విద్యా- రెండు విభిన్న వ్యక్తిత్వాలు ‘ శృతి పక్వంగా ఒకే గుండె చప్పుడు తో , ఒకే చై తన్యం తో, ఒకే మేధస్సు తో , ఆలోచించగలవు .

అద్భుతాలు ఆవిష్కరించగలవు . ఈ అపూర్వ ‘సంగమం కోసమే విద్యా లోని కోమల ముసలావిడను కలవాలని భరత్ రామ్ తొందర చేశాడు .ఇక విద్యా లక్ష్యం వైపు దూసుకుపోగలదు .

‘ రూపాదేవి విద్యాధరిని తమకు అనుకూలంగా ఒప్పించటానికి హైదరాబాద్ వెళ్ళింది . పిల్లలిద్దరూ జైపూర్ లో తమ్ముడు విజయ్ దగ్గర ఉన్నారు . తనిప్పుడు

అన్నివిధాల ఒంటరి . అవమానం, అసహనం , నిస్సహాయత, అన్నింటినీ మించి చేసిన పాపానికి నిప్పులా గుండెను కాల్చేస్తున్న ‘పశ్చాత్తాపం ‘------ ప్రత్యక్ష నరకం అం టే ఏమిటో క్షణక్షణం అనుభవిస్తున్నాడు . మొదటిసారి జీవితం లో అజయ్ కు అనిపించింది ---వంశ గౌరవం, ఆస్తులు, అంతస్తులు అహాన్ని రెచ్చగొట్టే మిధ్యా సంప్రదాయాలు ; ... మానవాత్వం, బంధం- అనుబంధాల ముందు ఇవన్నీ అర్థం లేని ఆర్భాటాలు . కోమల-రాహుల్ బంధం వీటన్నిటినీ జయించింది . అజయ్ విషాద యోగం లో కొట్టుమిట్టాడు తున్నాడు . మానసిక బలం ముందు పశు బలం నిలవలేదు . వీగిపోతుంది . ఈ సత్యం జీవితం లో చాలా పోగొట్టుకున్నాక అజయ్ సింహ అనుభవం లోకి వచ్చింది . ఈ మార్పు అడవి కాచిన వెన్నెల .ఈ రోజు సాయంత్రం అయిస్వర్యాదేవి ---తమ కులదేవత గుడి ముందు ఆధ్యాత్మిక సభ జరగబోతోంది . అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . తనకూ ప్రత్యేక ఆహ్వానం అందింది . ఆధ్యాత్మిక ప్రసంగం చేసేది హీరాలాల్ . జమునాబాయి కొడుకు -ప్రస్తుతం అఘోరి .

మరో సంధర్భం లో అయితే ఈ కార్యక్రమాన్ని తను పట్టించుకునేవాడు కాడు .

అతడు అఘోరి కావచ్చు . కానీ—తన దృష్టి లో జమునాబాయి కొడుకు అతి సామాన్యుడు . అతడు ‘గురుస్థానం లో ‘ తనకు బోధ చేయటమా ?

కానీ – ఇప్పటి పరిస్థితి వేరు . మానసిక స్థితి వేరు . తనకు ఓదార్పు కావాలి. ఉపశమనం కావాలి . మంచిమార్గం లో ఋజుమార్గం చూపే ‘గురువు కావాలి .

అతడు ఎవరైనా పర్వాలేదు . అతడి వల్ల మేలు జరిగితే చాలు . సభకు వెళ్లాలని అజయ్ నిర్ణయించుకున్నాడు .

గుడిముందు పాలరాతి వేదిక ఉంది . ఆ వేదిక్ పై షామియానా వేశారు . వేదిక ముందు కూర్చోటానికి పట్టాలు పరచారు . అందరూ వాటి పైనే కూర్చున్నారు .

నిర్వాహకులు ఒక పక్క కుర్చీ వేసి అజయ్ ను ఆహ్వానించారు . వారి ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరించి తనూ అందరితో పాటు ముందు వరుసలో పట్ట మీద కూర్చున్నాడు . ఈ మార్పు అందరినీ ఆశ్చర్య పరచింది . ఇలా నలుగురి లో ఏ భేషజం లేకుండా కలిసి పోయేది విక్రం సింహ్. మళ్ళీ పాతికేళ్ళ తర్వాత అజయ్ లో అదే వినయం .

అప్పటికే అఘోరి ఉపన్యాసం ఆరంభించి పావుగంట అయింది . అజయ్ వచ్చేసరికి

ఉపోద్ఘాతం పూర్తయింది .

అజయ్ ను అఘోరి ఒక్క క్షణం చూశాడు . ఆ చూపుల్లో శక్తి అజయ్ ను కలవర పెట్టింది తలవంచుకున్నాడు .

అఘోరి వాగ్ధార గంగా ప్రవాహం లా సాగింది . విషయం ఎంత ఉన్నతమైందో వ్యక్తం చేసే భాష కూడా అదే స్థాయి లో ఉంది . ఎక్కడా తొట్రుపాటు లేదు . తికమక లేదు . అతడలా చెబుతుంటే భావం సూటిగా గుండె ను తాకుతోంది . ‘ హీరాలాల్ ఎప్పుడు ఇంత ప్రావీణ్యం సంపాదించాడు . ఆశ్చర్యం వేసింది అజయ్ కు . ఆసాంతం

శ్రద్ధ గా విన్నాడు . ఇలాంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇంతవరకు వినలేదు . మనసు కాస్త తేలిక పడింది . మొదటిసారి అతడిలో పాజిటివ్ ఎనర్జీ .

సభ ముగిసింది . అఘోరి అజయ్ దగ్గరకు చేరాడు .

‘అజయ్ బాబు ! రేపు ఉదయం పూజకు వస్తున్నాను . ఏర్పాట్లు చూడండి . రేపు అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాము . “ అజయ్ తల ఊపాడు . తన తో ఏం మాట్లాడుతాడో ? ఏదైనా కారణం ఉంటుందా ‘?”అర్థం కాలేదు .

******************************

కొనసాగించండి 38లో