Those three - 37 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 37

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ఆ ముగ్గురు - 37

మూడు గంటలకు సర్దార్జీ ని విహారి కలిశాడు. అయిదు నిమిషాల్లో వారి సంభాషణ ముగిసింది. మూడున్నరకు ఆదిత్య సర్దార్జీని కలిశాడు. అయిదు వరకు ఇద్దరూ పార్క్ లో ఉన్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళి పోయారు.
సర్దార్జీ ని కలిసిన గంట తర్వాత ఇంతియాజ్, విహారి అన్వర్ అన్వేషణ లో భాగంగా ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్నారు. కాస్త రిలాక్స్ అయి ( అనుకున్న ప్రకారం)
విహారి అన్వర్ ఆచూకీ పనిలో మునిగి పోయాడు. అదే టైంలో ( ఆరు గంటలకు) ఆదిత్య ఆసుపత్రి కి వచ్చాడు. అన్వర్ ను అటెండ్ అయిన సర్జన్ ను కలిశాడు.
" డాక్టర్ ! ఓ రిక్వెస్ట్ ! " తటపటాయిస్తూ అడిగాడు ఆదిత్య.
" చెప్పండి " కొన్ని అనుకోని కారణాల వల్ల పేషెంట్ ను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళి పోవాలి "
" ఇప్పుడా?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు డాక్టర్ " అతడింకా పూర్తిగా కోలుకోలేదు. He needs our observation at least for two days. అతడికి నర్సింగ్ కేర్ చాలా అవసరం. సారీ ! ఇట్స్ నాట్ పాజిబుల్ ".
ఏం చెప్పాలో, ఎలా ఒప్పించాలో ఆదిత్యకు తోచలేదు.
" కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు. అతడిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళక పోతే మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చెప్పే జాగ్రత్తలు సిన్సియర్ గా ఫాలో అవుతాం ప్లీజ్ ! కనీసం మా పూచీ మీదైనా పంపండి. మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు పట్టం."
డాక్టర్ అర నిమిషం మాట్లాడలేదు. ఆదిత్య మొహం లో టెన్షన్.

" ఓకే! మీ రిస్క్ మీదైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. అరగంటలో ఫార్మాలిటీస్ ముగించుకుని నా ఛాంబర్ కు రండి. మీకో షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ క్రమం తప్పకుండా ఫాలో అయ్యారంటే హి విల్ బి సేఫ్ అండ్ క్రాస్ ది డేంజర్ జోన్."
" థ్యాంక్స్ డాక్టర్ " తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆదిత్య.

*************************************************

పోలీసు నెట్ వర్క్ చాలా చాలా పెద్దది. వాళ్ళ వ్యూహాలు కూడా చాలా చిత్ర విచిత్రం గా ఉంటాయి. అన్వర్ ను ట్రేస్ చేయటం వాళ్ళ కు ఏమంత కష్టం కాదు. అందులో ఇప్పుడున్న టెక్నాలజీ తో గంటల్లో పని. ఆ విషయమే
ఆదిత్య తో చెప్పాడు సర్దార్జీ. విహారి తనను కలిసిన విషయం కూడా చెప్పాడు." అంటే విహారి కూడా రైట్ ట్రాక్ లో ఉన్నాడు. తనింక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. .
ఆదిత్య లో ఆరాటం మొదలైంది.
ఆదిత్య ఇప్పుడు స్పెషల్ వార్డ్ లో , అన్వర్ గదిలో , ఆలోచనల జడిలో మునిగి తేలుతున్నాడు.
" ఎలా ప్రారంభించాలి? సర్దార్జీ రంగ ప్రవేశం చేసేలోపల అన్వర్ ను ఎలా ముగ్గులోకి దింపాలి ?
" మిమ్మల్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ." ఆదిత్య చెప్పింది విని తేలిగ్గా నిట్టూర్చాడు అన్వర్. " కానీ ఇప్పుడే రహీం వెళ్ళాడు. ఉదయం వరకు రాడు. మరి హిల్స్ గట్రా ఎవరు చెల్లిస్తారు ?" అన్వర్ కు అర్థం కాలేదు.
" పేమెంట్ బాధ్యత నాది. ముందే చెప్పాను నేను . మీరింటికి చేరేవరకు మీ పూర్తి బాధ్యత నాది ".
అన్వర్ బదులు చెప్పలేక పోయాడు.
" నన్ను నా గదికి చేర్చండి చాలు. మా బాబాయి అదే సర్దార్జీ
సాయం తీసుకోండి. ఆయనకు ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పండి. తగిలింది చిన్న గాయమే కంగారు పడవద్దని చెప్పండి. "
అన్వర్ చెప్పినట్లే సర్దార్జీకి ఫోన్ చేశాడు ఆదిత్య.
" మీరేమీ అనుకోకపోతే నాదో చిన్న రిక్వెస్ట్."
ఏమిటన్నట్లు చూశాడు ఆదిత్య.
" నాకు రక్తం ఇచ్చి కాపాడిన పుణ్యాత్ముణ్ణి చూడాలని వుంది."
వెదికి బోయిన తీగె కాలికి తగిలినట్లు అనిపించింది ఆదిత్య కు.
" పుణ్యాత్ముడు కాడు పుణ్యాత్మురాలు" సవరించాడు.
" ఆడ మనిషా......అంత రాత్రి......నా కోసం వచ్చి "
" అంత మంచి మనిషి కనుకనే మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతూ న్నారు. "
" ఎవరామె ? ఏం చేస్తారు ? కుతూహలం పెరిగింది అన్వర్ లో.
" ఆమె నాతో పని చేస్తుంది
లెక్చరర్. పేరు మెహర్. తల్లి ఉంది. తండ్రి లేడు. " అని అన్వర్ ను ఓరకంటి తో చూశాడు. " అన్వర్ ఉలిక్కి పడ్డాడు.
ఆదిత్య వైపు అయోమయం గా చూశాడు.
" ఓ అన్నయ్య ఉండే వాడట. ఏదో కారణం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి పోయాడట. ఇంతవరకు రాలేదు." అన్వర్ ఫ్రీజ్ షాట్ లా ఉండి పోయాడు. మౌనమే మనిషైనట్లు.
" అతడి పేరు అన్వర్" ఏంటి అంతే డల్ గా ఉన్నారు ?"
" ఎందువల్ల ఇల్లు వదిలి వెళ్ళి పోయారు ?
అతడి ప్రశ్న పట్టించుకోలేదు అన్వర్.
" అతడి తండ్రి అందివ్వలేని ఖరీదైన జీవితాన్ని వెదుక్కుంటూ వెళ్ళి పోయాడు.
చెంప ఛెళ్ళు మన్నట్లు అనిపించింది అన్వర్ కు.
" ఎండమావుల వెంబడి పరుగులు తీయడమంటే ఇదే. ఇంతకీ అనుకున్నది సాధించారో లేదో !" ఆదిత్య సంధించిన మరో బాణం.
" సాధించింది ఏం ప్రయోజనం ? తండ్రిని పోగోట్టుకున్నాడు.
అమ్మ చెల్లెలు దిక్కు లేని వారయ్యారు.తను అన్ని విధాలా ఒంటరి వాడయ్యాడు." అన్వర్ ప్రతి మాటలో అతడి హృదయం కనిపించింది.
" అన్వర్ కు తల్లి అంటే ప్రాణం. కొడుకు కోసం తల్లి కూడా క్షణాలు లెక్కపెడుతోంది. ఎప్పటికైనా తిరిగొస్తాడని ఆ పిచ్చి తల్లి నమ్మకం.
అన్వర్ తల దించుకుని తన ముఖం ఆదిత్య కు చూపలేదు. అతడి కళ్ళల్లో తడి ఆదిత్య గమనించాడు. గాఢమైన నిశ్శబ్దం కొన్ని క్షణాలు.
" అతడి పరిస్థితి సరిగా లేనప్పుడు అంటే అతని social background మంచిది కానప్పుడు తల్లిని ఎలా కలుస్తాడు ?దారి తప్పిన కొడుకును చూసి ఆమె తట్టుకోగలదా ?" తలెత్తి చూశాడు అన్వర్.
" మీ కంట్లో ఆ నీరేంటి ? మీరెందుకు అన్వర్ విషయం లో
ఎమోషనల్ అవుతున్నారు ? " కంగారు నటించాడు ఆదిత్య.
" కళ్ళు తుడుచుకున్నాడు అన్వర్.
" ఎందుకో అన్వర్ నన్ను కదిలించాడు. మీరే చెప్పండి. తల్లి కి కనిపించి ఆమెను బాధ పెట్టడం పాపం కాదా ?"
" అన్వర్ తల్లి మనసు అర్థం చేసుకోలేదు. బిడ్డ ఎలాంటి వాడైనా క్షమించగలిగే పెద్ద మనసు ఆమె కుంది. అందుకు నేనే సాక్ష్యం.". ఆదిత్య ను నమ్మలేనట్లుగా చూశాడు అన్వర్.
" ఆమెను నేను కలిశాను. ఆమెతో నేను మాట్లాడాను. ఆమె అన్వర్ కోసమే జీవిస్తోంది. తను కనబడితే మెహర్ ను తన కప్పగించి ప్రశాంతంగా తృప్తి గా చాటుకోవాలని ఆమె తనను... తపస్సు." అనూహ్యమైన మలుపు తిరిగిన వారి సంభాషణ ఒకరి భావాలు మరొకరికి సునాయాసంగా చేరవేసింది. అన్వర్ మనసు అద్దంలా కనిపించింది ఆదిత్య కు.
అప్పుడే సర్దార్జీ గదిలోకి అడుగు పెట్టాడు. గదిలో వాతావరణం తల నెరిసిన సర్దార్జీ కి అర్థమై పోయింది.
ఆదిత్య అన్వర్ ను సానుకూలంగా మార్చగలిగాడు. తను కాస్తంత చొరవతో తల్లీ కొడుకులు పాలు, నీళ్ళలా కలిసిపోతారు.
" మీకు ఫోన్ చేసి అరగంటైనా కాలేదు. ఇంత దూరం నుంచి అప్పుడే ఎలా వచ్చారు ?"
అర్థం కాలేదు అన్వర్ కు.
" నేను వచ్చి గంట అయింది. ఇంతసేపు రిసెప్షన్ లో ఉన్నాను." నవ్వుతూ చెప్పాడు సర్దార్జీ..
" నాకు ఆక్సిడెంట్ అయిన విషయం ముందే తెలుసా ? ఎవరు చెప్పారు ?". ఆదిత్య ను చూశాడు.
" సర్దార్జీ ఆదిత్యను చూసి " ఆదిత్యా ! కమ్ అవుటాఫ్ ది షెల్" అన్నాడు.
" తను రక్తం ఇచ్చింది మీకేనని మెహర్ కు తెలుసు. తను మిమ్మల్ని చూసింది. గుర్తించింది. అప్పుడు నాకు మీరే అన్వర్ అని కచ్చితంగా తెలిసింది.మీకు తెలియని మరో విషయం . యాకూబ్ పట్టుబడ్డాడు. మీ గురించి వివరాలు చెప్పాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా నేను సమతాసదన్ లొకేట్ చెయ్యగలిగాను. మిమ్మల్ని కలవాలనుకున్నాను. అదీ ఏ.సీ.పీ. ఇంతియాజ్ మిమ్మల్ని అరెస్టు చేయకముందే. అందుకు కారణం మీ అమ్మగారు. మిమ్మల్ని ఎలాగైనా తీసుకు వస్తానని ఆమెకు మాట ఇచ్చాను. ఆక్సిడెంట్ జరిగిన రాత్రి అటుగా రావడం , మిమ్మల్ని చూడడం అల్లాజీ సంకల్పం. నా దగ్గర మీ కంప్యూటరైజ్డ్ ఇమేజెస్ ఉన్నాయి. మీరే అన్వర్ అని గుర్తించాను."
ఈ రోజు సాయంత్రం ఆదిత్య నన్ను కలిశాడు. నీ గురించి పూర్తిగా చెప్పాడు. నువ్వు మారావని అతడి నమ్మకం. కానీ..తనంతట తాను బయటపడలేడు. తనకు నువ్వు అన్వర్ అని తెలిశాక నువ్వెలా రియాక్ట్ అవుతాయో అని తన భయం. అందుకే నా సాయం అడిగాడు. కానీ నువ్వు పాజిటివ్ గా రియాక్ట అయి కథను సుఖాంతం చేశావు. మీ అమ్మ గారి ని కలిసే రోజు ఎంతో దూరంలో లేదు. నువ్వు
మళ్ళీ మనిషిగా మారే అరుదైన అవకాశం ఇది. ఈ క్షణం నుండి నీ ఆప్తుడు, ఆత్మీయుడు ఆదిత్య. అతడు చూపిన మార్గంలో కళ్ళు మూసుకుని నడువు." మేఘ గర్జన లాంటి సర్దార్జీ స్వరం మంద్రస్థాయిలో గదిలో ప్రతిధ్వనించింది.
అన్వర్ బెడ్ పై నుండి మెల్లగా లేచాడు. ఒంగి సర్దార్జీ పాదాలు పట్టుకోబోయాడు. మధ్య లోనే సున్నితంగా వారించారు సర్దార్జీ.
" నన్ను క్షమించండి బాబాయ్."
" బాధపడకు ! ఇప్పటివరకు జరిగింది ఓ పీడకల. నీ ముందు మంచి జీవితం ఉంది. ధైర్యం గా అడుగెయ్. మరో విషయం .....నువ్వెప్పటికీ మాకు అనంత్ వే ". ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు సర్దార్జీ . ఆదిత్య పెదవులపై తృప్తి తో కూడిన చిరునవ్వు.


*******†*****************************************
కొనసాగించండి 38 లో