The Author Madhu Follow Current Read మన బలహీనతలు..... By Madhu Telugu Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books बेवफा - 4 नरेन टीचर = ' ओके स्टंडेट्स सुनो सब लोग. जैसे की कल... अपराध ही अपराध - भाग 40 अध्याय 40 “डॉक्टर के इस तरह बोलने के बावजूद धना... You Are My Choice - 45 Sorry for late update....Note: I'll be not able to publi... तेरा...होने लगा हूं - 14 देशमुख निवास रात का वक्त मोक्ष काया के कांप ते होठों को ह... कहानी एक परी की... कुछ दोस्त कम वक्त के लिए मिलकर भी खास बन जाते है और जिंदगी म... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share మన బలహీనతలు..... (6) 6.5k 18.4k 1 మన బలహీనతలు.... అలసట ,అజ్ఞానం ,భయం, సమర్థింపు అహం, మొహమాటం ,మతిమరుపు, ఇవన్నీ మన బలహీనతలు ......మరో రకంగా చెప్పాలంటే,మన శత్రువులు... మన బలహీనతలే మన శత్రువు అవటం ఎంత విచారకరం.... అందుకే యుద్ధం చేయక తప్పదు ....మన బలహీనతలతో మనం ఎలా రాజీ పడతాము??? ఒక్కోసారి మరో శత్రువుని ఎదుర్కోవడం కోసం మనం ముందు బలహీనతలు తగ్గించుకోవలసి వస్తుంది .....అంటే శత్రువులు రెండు రకాలన్నమాట!!! ఒకటి మనలో ఉండే శత్రువు....రెండు బయట ఉండే శత్రువు ....మన శత్రువుని గెలవడం ద్వారా మనకి లభించే విజయం " ఆనందం "....అది నిజమైన పక్షంలో ,ఓడిపోతే మనకి లభించేది "విషాదం"... ఓటమి వల్ల వచ్చే విషాదం రెండు రకాలుగా ఉంటుంది.....ఒకటి మానసికమైన విషాదం.....రెండు భౌతికమైన విషాదం .....1.మానసికమైన విషాదం అంటే కేవలం మన ఆలోచనల ద్వారా కలిగే కష్టం..... ఉదాహరణకి తన మిత్రులందరూ సినిమాకి వెళ్తూ ఉన్నప్పుడు, తను కూడా వాళ్లతో కలిసి వెళ్లబోతే తల్లో, తండ్రో,వద్దని చెప్పటం వల్ల కలిగే విషాదం .....తన స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోయిందని, ఇలాంటి జీవితం వ్యర్థమని ,ఏడుస్తూ కూర్చునే 15 ఏళ్ల కుర్రవాడి కష్టం మానసికమైన విషాదం..... లక్ష్మి 18 ఏళ్ల అమ్మాయి గోపిని మనస్ఫూర్తిగా ప్రేమించింది.... వాళ్ళ ప్రేమ సంవత్సరం పాటు సాగిన తర్వాత ,గోపి మరొక అమ్మాయి ప్రేమలో పడ్డాడని, తెలిసింది.... లక్ష్మీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.... చదువు మానేసింది.... జీవితం నిరర్ధకం అనుకుంది..... ఇవన్నీ మానసికమైన బాధలు ,ఇందులో చాలా బాధల్ని మనం తగ్గించుకోవచ్చు.... దానికి కావాల్సింది అనలైజేషన్ ....ఈ బాధల వల్ల మనకి ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ ఉండదు .... మనం కష్టాల్లో ఉన్నామన్న బావన మనని ఎక్కువ కష్టపడుతుంది .....దీని గురించి సమయం వృధా చేసుకోవడం అనవసరం.....2. భౌతికమైన (ఇవి కూడా మనసుకు సంబంధించినవే..)....బాధలు మరో రకంగా ఉంటాయి.... కొడుక్కి తరచూ కడుపునొప్పి వస్తూ ఉంటుంది.... విలవిలా కొట్టుకుంటూ ఉంటాడు.... ఎంతమంది డాక్టర్లకి చూపించిన నయం కాదు.... అతని బాధ చూస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి... లేదా కొడుకుకి క్యాన్సర్ అని తెలుస్తుంది... న్యాయం చేయించడానికి డబ్బులు ఉండవు అతడు మృత్యువు వైపు వెళ్ళిపోతూ ఉండటాన్ని నిస్సహాయంగా చూస్తూ, ఉండవలసి వస్తుంది ....ఆస్తి చెప్తూ కాబడటం, కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి రావడం, ఆకలి బాధ, కూతుర్ని అత్తవారు పుట్టింటికి పంపించేయటం, పై అధికారి మనసులో ఏదో పెట్టుకుని ఆఫీసులో నిరంతరం వేధిస్తూ ఉండటం, ముఖ్యఅవసరం కోసం దాచి ఉంచుకున్న డబ్బుని దొంగలు దొంగలించడం, ఇవన్నీ ఈ రకమైన కష్టాలు ఇటువంటి కష్టాల్లో మానసిక భాద (కొడుకు కడుపునొప్పి) తో పాటు శారీరక బాధ( ఆకలి )కూడా ఉండొచ్చు ...కానీ మొదటి రకం కష్టాల్లో మాత్రం ఎక్కువ భాగం మనసారా ఆలోచించి కొని తెచ్చుకున్న బాధలే ఎక్కువ ఉంటాయి..... (ఉదాహరణకు ప్రియురాలు మరొకరిని పెళ్లాడటం )అయితే మొదటి రకం బాధల్లో ఉన్నవారు మిగతా ఏ కష్టాన్ని అసలు ఒక కష్టంగా గుర్తించరు... తమకున్నంత కష్టం మరి ఎవరికి లేదనుకుంటారు.... ఇలాంటి వారికి కావలసింది ఆత్మ విమర్శ .....రెండో రకం కష్టాల్లో ఉన్న వారికి కావలసింది దృఢ నిశ్చయం.... మనిషికి ఉండే ఒక ముఖ్యమైన బలహీనత గురించి తెలుసుకుందాం !!!చాలామందికి ఉండే బలహీనతే ఇది... నేను కూడా చాలా కాలం ఈ బలహీనతతో బాధపడుతూ ఉన్నాను ...ఈ బలహీనత పేరు "ఆత్మ న్యూనత "…....పొట్టిగా ఉండటం, పీలకంఠం డబ్బు లేకపోవటం ,మొదలైన మూడు విషయాల వల్ల కాంప్లెక్స్ కి చిన్నప్పుడే లోనయ్యాను ....బహుశా నేను రచయిత కావటానికి కారణం ఇదేనేమో.... మనిషి యొక్క అన్ని బలహీనతల్ని విడిగా చర్చించి, దీన్ని ఒకదాన్నే ప్రత్యేకంగా చర్చించడానికి కారణం ఈ బలహీనత ....మరే విభాగంలోనూ అశాంతి విభాగాల్లోనూ ఇమడదు..... ఒక పారసైట్ లా కనబడకుండా ,మనసుని, మనిషి అభివృద్ధికి పిప్పి చేస్తుంది. ......ఆత్మ న్యూనత......మనిషిగా బ్రతకడం కోసం మనం చాలా కష్టపడాలి.... లేకపోతే అంతకన్నా అధమంగా బ్రతకాల్సి వస్తుంది..... మామూలుగా బ్రతకడం అంతా సులభం కాదు ....రకరకాల కాంప్లెక్సులు, బాధలు, భయాలు ,సమస్యలు ,అన్ని మన ఆనందాన్ని హరించే విష కీటకాలే.....ఆత్మన్యూనత 20 నుండి 35 ఏళ్ల వయసున్న వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది.... ఆత్మ న్యూనత అనే రోగానికి (authenticity) (విశ్వాసనీయమైన ప్రామాణికత్వం) ఔషధం..... దీనిని మెరుగుపరుచుకున్న వ్యక్తులు జీవితంలో ఏ కాంప్లెక్సులతోనూ, బాధపడరు.... ఇలాంటి వ్యక్తులు ఒప్పించటం, ఒప్పించబడటం, అన్ని సమస్యలు లేకుండా ఇతరుల క్షేమంతోనే తమ ఇష్టాలనీ, అవసరాలనీ ముడి పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా, తాము రాజీ పడకుండా గడిపేస్తారు... వాళ్ళని ప్రశ్నించే అవసరం కానీ ,అవకాశం కానీ ఎవరికీ రాదు.....ఆతెంటిసిటీ అనేది ప్రయత్నిస్తే లభించేది కాదు ...అదో జీవితకాలం తపస్సు..... దీనిని నిరంతరం చేస్తూనే ఉండాలి.... పూర్తిగా దీని మీద అధికారం రాకపోయినా చాలా వరకు ప్రయత్నం ద్వారా సఫలీకృతం అవ్వచ్చు..... మనం మన జీవితం మీద అధికారాన్ని సంపాదించడానికి, కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.....1. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.... ఒక్కోసారి చాలా చిన్న విషయాల్లోనే మనం తప్పు చేస్తూ ఉంటాం ..... ఏ ఏ చర్యకి మనం ఎలా స్పందిస్తున్నామో, నిర్భయంగా బయటకు చెప్పగలుగుతున్నామో, లేదో గమనించి ,నోట్ చేసుకుంటూ ఉండాలి......2. ఇతరుల కంటే భిన్నంగా ఉండటామో, ఆలోచించగలగటమో, తప్పు అన్న భావననీ ముందు దూరం చేసుకోవాలి.....3. ఇతరులకి హాని చేయని మీరు నమ్మిన సిద్ధాంతాన్ని నిర్ణయంగా అమలు జరపండి.... పదిమంది మీ గురించి చెడుగా అనుకున్నా సరే ....అయితే మీ సిద్ధాంతం మీకే చెడుగా అనిపిస్తే మాత్రం దానిని నిజాయితీగా వదిలిపెట్టి వేయండి.... 4. ఏ వ్యక్తి అయితే తనను తాను ప్రేమించుకుని, తనను తాను గౌరవించుకొని, తన విలువలను నమ్ముతూ బ్రతుకుతాడో అతడిని ఇప్పుడు కాకపోతే కొంతకాలానికైనా ప్రజలు ప్రేమించడం, మొదలుపెడతారు ....ఉదాహరణకు :- చలాం,హిట్లర్, గోపీచంద్ గార్బచేవ్...5.ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ దాన్ని ఆచరిస్తూ పైకి మాత్రం మరోలా బ్రతుకుతున్నట్లు నటించకండి ....పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న సూక్తి మనకు నిరంతరం వర్తిస్తుంది..... మనం ఎలా బ్రతుకు కావాలనుకుంటున్నామో,,, అలా బ్రతుకుతూ ఉంటే ,,,మనతో అవసరం ఉన్నవాళ్లే మనకి స్నేహితులుగా మిగులుతారు..... వాళ్ల కోసం మనం అందమైన ముసుగు వేసుకోనక్కర్లేదు...6. మీతో మీరు ఎక్కువ సమయం గడపండి.... అది మీ మీద మీకున్న ప్రేమని సూచిస్తుంది.... అప్పుడే నీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోగలరు... స్పష్టంగా తెలుసుకోవాలంటే, మనం నిరంతరం మనతో జీవిస్తూ ఉండాలి.... మనవి పరిశీలించుకుంటూ ఉండాలి.... మన భావం దృఢమయ్యే కొద్దీ ఇతరులతో మన ప్రవర్తన అంత సున్నితంగా ఉంటుంది .....పుస్తకాలు, టీవీ ,తోట పని ,మ్యూజిక్ ,దైవ ప్రార్థన ,కుట్లు అల్లికలు ,ఇలాంటివన్నీ మనతో మనం ఎక్కువసేపు గడపటానికి దోహదపడతాయి.... మన హృదయంలోకి మనమే చొచ్చుకొని వెళ్ళిపోతే , మనలోని శక్తి వెలికి వస్తుంది... అదే Authenticity. అంటే .......మనలా మనం బ్రతకగలగటం కూడా ఒక వరమే ......చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి చూడండి.... చాలా మంది తాము ఎలా బ్రతకాలి అనుకుంటున్నారో !అలా బ్రతకలేరు ....మరి కొంతమంది తాము ఎలా బ్రతకాలనుకుంటారో అలా బ్రతికినా కూడా ,,,దానిని బయటకు చెప్పుకోలేరు...... ఎంత విషాదకరమైన స్థితి ఇది......"కావున మన బలహీనతలను మనమే ఎదుర్కొని, ముందున్న విజయాన్ని ఒక సవాలుగా తీసుకొని ,ముందుకు సాగిపోవాలి..... అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది......." 🌹దన్యవాదములు🌹 Download Our App