Those three - 23 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 23 - లక్కవరం శ్రీనివాసరావు

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ఆ ముగ్గురు - 23 - లక్కవరం శ్రీనివాసరావు

అక్కడి పరిస్థితి చూశాక మా వాడికి విషయం అర్థమైంది.
వాళ్ళిద్దరూ దారుణంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అందుకే ప్రతి శనివారం డిన్నర్ కు రావటం లేదు. మావాడి తల తిరిగి పోయింది. మరునాడు సమయం చూసుకుని పవన్ ను నిలదీశాడు. వాడికి ఒప్పుకోక తప్పింది కాదు. విశాల్ వల్ల డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఏడుస్తూ చేతులు పట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కు . అసైలం లో చేరి అలవాటు మానుకుంటానన్నాడు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారని
అడిగితే వివరాలు చెప్పలేదు. వాడి కళ్ళల్లో భయం కనిపించింది. ఆ పైన మా వాడు ఒత్తిడి చేయలేదు. "
" ఎంత రహస్యంగా, ఎంత ప్లాన్డ్ గా సాగిపోతుందీ డ్రగ్స్ రాకెట్ ? అందుకే ఇప్పటి వరకు బయటపడలేదు. ..........
తర్వాత ?"
" అరవింద్ కు ఎందుకో వార్డ్ బాయ్ మీద అనుమానం కలిగింది. యాదగిరి స్టూడెంట్స్ తో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళకు కావలిసినవి బయట నుండి తెచ్చి పెడుతుంటాడు . వాడికి ఒక్కడికే డ్రగ్స్ సప్లై చేసే అవకాశం ఉంది. యాదగిరి ప్రతి శుక్రవారం పగలు పన్నెండు తర్వాత రెండు గంటలు కనిపించడు. ఆ టైంలో అరవింద్ మారు తాళంతో వాడి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు.
యాదగిరి తాళం చెవికి అతి కష్టం మీద డూప్లికేట్ సంపాదించ గలిగాడు. వాడలా వెళ్ళటం నిజం గా సాహసమే. గుండెలు అదురుతుంటే గది అంగుళం అంగుళం పరిశీలించాడు. ఎలాంటి క్లూ దొరకలేదు. కాని షెల్ఫ్ లో గుడ్డల అడుగున ఓ పాపులర్ కంపెనీ అసార్టెడ్
బిస్కెట్ టిన్స్ నాలుగు కనిపించాయి. అలా వాటిని దాచవలసిన అవసరం ఏమిటా అని మా వాడికి అనుమానం వచ్చింది. ఒక టిన్ తెరిచి చూశాడు. బిస్కెట్స్ అడుగున వేఫర్స్ ప్యాక్ చేసే ఫాయల్స్ లో అతి చాకచక్యంగా బ్రౌన్ షుగర్ స్యాచెట్స్ ప్యాక్ చేసి ఉన్నారు. క్షణం గుండె ఆగినట్లైంది. మళ్ళీ వాటిని జాగ్రత్తగా , ఏమాత్రం అనుమానం రాకుండా రీ ప్యాక్ చేసి బయట పడ్డాడు." ఆదిత్య సుదీర్ఘ కధనం ముగిసింది.
ఇంతియాజ్ భారంగా నిట్టూర్చాడు.
"ఇంత పద్ధతిగా డ్రగ్స్ రాకెట్ నడిపే ముఠాను నా సర్వీసు లోనే చూడలేదు. దీని వెనుక ఉన్న వ్యక్తులు సామాన్యులు కారు. వాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ తప్పక ఉండి ఉంటుంది. అలా ఉంటే తప్ప ఇంత సాహసం చేయలేరు. ఉగ్రవాదం కొత్త మలుపు తిరిగింది. వెపన్స్ అటాక్స్ కన్నా భయంకరమైనది ఈ డ్రగ్స్ రాకెట్. మొత్తానికి మీ తమ్ముడు రియల్ హీరో. ఎవ్వరూ చేయలేని సాహసం చేశాడు. ఐరన్ వాల్ బద్దలు కొట్టాడు. హ్యాట్సాఫ్ టు హిమ్." ఆదిత్య చిరునవ్వు తో ఆ కామెంట్ ను అందుకొన్నాడు.
" మొన్న దసరా సెలవులకు వచ్చినప్పుడు అరవింద్ కాలేజీలో జరిగిన వన్నీ అక్షరం పొల్లు పోకుండా చెప్పాడు.
అప్పటికి మా కంపెనీతో నా కాంట్రాక్ట్ పూర్తి కాలేదు. అందువల్ల ఓ నెల వెయిట్ చేయవలసి వచ్చింది. అప్పటికే నేను టీచింగ్ లైన్ కు రావాలని నిర్ణయించుకున్నాను. ఆ డ్రగ్స్ వ్యవహారం తెలిసి మా అరవింద్ 'బి' స్కూల్లో అడుగు పెట్టాను. వాడికి అన్నయ్య ను నేను అని ఎవరికీ తెలియదు. నా ట్రాక్ రికార్డ్ చూసి సమతా ' బి' స్కూల్ నన్ను రెండు చేతులతో ఆహ్వానించింది. " నవ్వుతూ ముగించాడు.
" అసలు నీ ప్లానేంటి ?" సాభిప్రాయంగా చూశాడు ఇంతియాజ్.

" డ్రగ్స్ రాకెట్ చాలా ప్రమాదకరమైనది అని నాకు తెలుసు.
యాదగిరి ని సాక్ష్యాలతో పోలీసులకు పట్టివ్వాలన్నదే నా ప్లాన్. కానీ ---నువ్వన్నట్లు ఇందులో రాజకీయ జోక్యం ఉంటే నా ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. ఒక నమ్మకమైన పోలీసు అధికారి సాయం అవసరమని నీ దగ్గర కొచ్చాను."
" గుడ్ ! నువ్వు నా దగ్గరకు రాపటమే మంచిదయింది."
" జాబ్ లో జాయిన్ అయినాక యాదగిరి ప్రతి కదలిక పై నిఘా పెట్టాను. ప్రతి శుక్రవారం విధిగా అతడు మసీదు కెళతాడు.ఆ రోజే అనుకున్నాను ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉగ్రవాదుల హస్తం ఉందని."
ఇంతియాజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
" సో...., యాదగిరి యాదగిరి కాదు. యాదగిరి ఉరఫ్ సమ్ ముస్లిం. నా ప్రతి ఆలోచనా, అంచనా నూటికి నూరు పాళ్ళు నిజం అయినందుకు అల్లా ముందు నిండు మనసుతో మోకరిల్లాలి."

" నీ ఇమ్మీడియెట్ టార్గెట్ యాదగిరేనా ?"
" ఈ కేసులో యాదగిరే నా గేట్ వే ..... బ్రేక్ త్రూ ".
" ఆల్ ది బెస్ట్ ". మిత్రుని విజయం మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఆదిత్య.
పేపర్లో వార్త చూసి అనంత్ రామ్ ఉరఫ్ అన్వర్ షాకయ్యాడు. సర్జికల్ స్ట్రైక్ లో పి.ఓ.కే లో ఉన్న మిలిటెంట్ స్థావరాలు దాదాపు అన్నీ ధ్వంసమయ్యాయి. వెరీ బ్రేవ్ స్టెప్ "

కొనసాగించండి 24