Those three - 19 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు -19 - లక్కవరం శ్రీనివాసరావు

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ఆ ముగ్గురు -19 - లక్కవరం శ్రీనివాసరావు

నగర శివార్లలో టౌన్ షిప్ అనొచ్చు లేదా కాలనీ అనొచ్చు...
మధ్య తరగతి లేదా దిగువ మధ్యతరగతి వారు , ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతం. చిన్న చిన్న ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ, బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు.
ఆ ఇరుకు ఢిల్లీ ముందు కారాగింది. కారులోంచి విహారి దిగారు . చాలా టిప్ టాప్ గా ఖరీదైన గెటప్ లో ఉన్నాడు.
హుందాగా నడుచుకుంటూ ఓ చిన్న ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. ( ఆ ఇంటికి కాలింగ్ బెల్ కూడా లేదు)
అతడి వేషం, వాలకం దాదాపు అందరి దృష్టి ఆకర్షించింది, వయోబేధం లేకుండా . ఆ స్థాయి వారు ఆ గల్లీకి రావడం అరుదు. అందుకే అంత టెన్షన్.
కొన్ని క్షణాల తర్వాత సగం తలుపు తెరుచుకుంది.
విహారి ఏదో అడిగాడు. అవతలి వ్యక్తి చెప్పిన సమాధానం
ఇతడి ప్రశ్నకు సరైన సమాధానం కాదేమో విహారి పావు నిమిషం మౌనంగా ఉండి పోయాడు . మళ్ళీ ఏదో అడిగాడు. ఈసారి ఆ వ్యక్తి సగం తెరిచిన తలుపు సందులోంచి వెలుపలికి వచ్చి ఎదురుగా కనిపిస్తున్న దుకాణం చూపించాడు. అదో చిన్న ఫ్యాన్సీ స్టోర్.
విహారి ఫ్యాన్సీ స్టోర్ ముందు ఆగాడు . స్టోర్ యజమాని అతడి ని కుతుహలంగా, ప్రశ్నార్థకంగా చూశాడు .
" ఆ ఇల్లు మీదేనా ?" విహారి ప్రశ్నించాడు.
" అవును. మాదే . ఏం కావాలి మీకు .? అతడో నడివయసు ముస్లిం. వేషంలో, రూపం లో సంప్రదాయం ఉట్టిపడుతోంది .
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మీ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం యజమాని ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో రికార్డు అసిస్టెంట్.
" అవును . ఖలీల్ బాయ్. ఆయన ఇప్పుడు లేరు. చనిపోయారు . అవునూ ! అతడి వివరాలు మీకెందుకు ? " విహారి ని గుచ్చి గుచ్చి చూస్తూ అడిగాడు.
" ఆయన మా నాన్న దగ్గర పనిచేశారు. అదే డిపార్ట్మెంట్ లో మానాన్న డిప్యూటీ డైరెక్టర్. ఆయన , మా నాన్న మంచి దోస్తులు. ఆఫీసర్, సబార్డినేట్ అన్న భావన ఇద్దరిలో ఉండేదికాదు. వాళ్ళబ్బాయి అన్వర్ మా ఇంటికి వస్తూ ఉండేవారు. అతడూ నాకు మంచి స్నేహితుడు. " విహారి అతడి భావాలు గమనించడానికి క్షణం ఆగి చిన్నగా నవ్వాడు . షాపు యజమాని శృతి కలిపాడు. విహారి కథనం, వాలకం పై అతడికి నమ్మకం కుదిరింది .
" మా నాన్నకు హైదరాబాద్ నుండి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడే ఆయన రిటైర్ అయ్యారు. అక్కడే స్థిరపడి పోయాము. పని ఉండి హైదరాబాద్ వచ్చాను . నాన్నగారు ఖలీల్ గార్ని కలిసి రమ్మన్నారు . పాత మితృడిని ఆయన మరిచిపోలేరు. " ఆగి చిరునవ్వు నవ్వాడు.
ఎఫ్ ఐ ఆర్ లో తనకు లభించిన వివరాల ఆధారంగా విహారి ఇంత కథ అల్లాడు. పెద్దాయన సెంటిమెంట్ టచ్ తో కదిలిపోయాడు .
" ఇన్నేళ్ల తర్వాత. పాత మితృడిని కలవాలనుకోవటం చాలా గొప్ప విషయం . పాపం ! ఖలీల్ బాయ్ చివరిరోజుల్లో నరకం అనుభవించాడు ."
" ఎందుకని ?" తెలియనట్లు అడిగాడు విహారి.
" అన్వర్ వల్లే . ఆ బద్మాష్ ఆయన మీద అలిగి వెళ్ళి పోయాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. వాడి దిగులు తోనే మంచంలో సగం చిక్కి చనిపోయాడు. ఇక మిగిలింది ఆయన భార్య కూతురు మెహర్. షాపు యజమాని కళ్ళళ్ళో బాధ, సానుభూతి కనిపించాయి.
"అన్వర్ ఎందుకు వెళ్ళిపోయాడు?" ఇదీ జవాబు తెలిసిన ప్రశ్నే . అతడి అభిప్రాయం తెలుసుకోవాలని విహారి ఉద్దేశ్యం.
షాపు యజమాని భారంగా నిట్టూర్చాడు.
" చూస్తున్నారుగా మావి ఎదుగు బొదుగు లేని జీవితాలు.
ప్రభుత్వాలు మారుతున్నా మా పరిస్థితి మారటం లేదు.
పెద్దవాళ్ళు పరిస్థితులతో రాజీ పడతాం. మీరలా కాదుగా ...మీకేవేవో కోరికలుంటాయి. అవి తీర్చలేని మా పేదరికం పై మీకు కోపం. ఆ కోపం వల్ల ఇంట్లో రచ్చలు, కొట్లాటలు. అయినా అన్వర్ నని ఏం లాభం ,మారాతలు మారనప్పుడు? ఇప్పుడు కూడా మా కాలనీ లో చాలామంది అన్వర్ లు ఉన్నారు. " బాధగా నవ్వాడు షాపు యజమాని.

అక్కడి సామాజిక చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించాడు షాపు యజమాని.
విహారి నటించలేదు. సిన్సియర్ గా ఫీలయ్యాడు.
"
ఖలీల్ చనిపోయినా , కొడుకు వెళ్ళిపోయినా ఆ తల్లి బెదిరిపోలేదు . గుండె చిక్కబట్టుకొని నానా కష్టాలు పడి కూతుర్ని చదివించింది. మెహర్ ఇప్పుడు ఓ కాలేజీ లో లెక్చరర్. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది. మెహర్ అప్పుడప్పుడు వచ్చి కలుస్తూంటుంది. తనకు ఇక్కడ చాలామంది స్నేహితులు, క్లాస్ మేట్ ఉన్నారు. మమ్మల్ని మరిచిపోలేదు మెహర్ .".
మెహర్ ఓ మంచి మనిషని కితాబు ఇచ్చాడు షాపు యజమాని. మెహర్ కాలేజీ వివరాలు, ఇంటి అడ్రస్ తీసుకుని, వారిని తప్పక కలుస్తానని ఆయనకు భరోసా ఇచ్చి విహారి కదిలాడు. కేసు ఒక కొలిక్కి వచ్చినందుకు విహారికి చాలా సంతోషంగా ఉంది.
కొనసాగించండి 20