అన్వర్ రాడార్ పరిధిలో కి రాకపోవడం నిజంగా ఓ అద్భుతం !  ఊహించని టర్నింగ్ పాయింట్ . 
" అతడు నిలుచుంది కొండవాలు చివర సర్ . పైగా మంచు
పడుతోంది .  సీక్రెట్ కెమెరా గురి తప్పించుకోవడానికి ఈ రెండూ కారణాలు కావచ్చు .   ఏదైమైనా అన్వర్ భాయ్ అదృష్టవంతుడు .  చావు తప్పించుకున్నాడు . మనకు, తెలంగాణా ఇంటెలిజెన్స్ వింగ్ కు  చేతి నిండా పని కల్పించాడు . 
   రావ్ మాటలకు నవ్వాడు జూనియర్ . 
    " స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్ లో ఇంతియాజ్ అనే ఏ.సి.పి స్థాయి ఆఫీసర్ ఉన్నాడు . కౌంటర్ మిలిటెంట్ ఆపరేషన్స్ నిర్వహించటంలో  ట్రైనింగ్ తీసుకున్నాడు . డిపార్ట్మెంట్ తరపున మన మెసేజ్ అతడే రిసీవ్ చేసుకుంటాడు .  వెల్ ట్రైన్స్, డ్యూటీ మైండెడ్ అండ్ వెరీ డైనమిక్ .  "  అన్వర్ సెర్చ్" అతడి పర్వ్యూ లోకే రావచ్చు. నేను రెకమెండ్ చేస్తాను .రావ్ జూనియర్ ను సాభిప్రాయంగా చూశాడు . అలీ పహరా సిబ్బంది కి దొరకటం  , అన్వర్ తప్పించుకోవడం, ఆపరేషన్ జన్నత్ వివరాలు  మీడియా వెలుగులోకి రాకుండా సెన్సార్ చేయబడ్డాయి .   సరిహద్దు దాటుతూ నలుగురు ఉగ్రవాదులు బి.ఎస్. ఎఫ్ జవాన్ల చేతిలో హతమైయ్యారు ."
అన్న వార్తే ప్రజలకు చేరింది. 
   చాలా సంవత్సరాల తరువాత తెలుగు వార్తలు టీ.వీ లో చూస్తున్నాడు అన్వర్.   రహీం చెప్పిన మాట ను సిన్సియర్ గా పాటిస్తున్నాడు .   ఓపిక ఉన్నంతవరకు , విసుగు రానంత వరకూ టీ.వీ ముందు కూర్చుంటున్నాడు. లేదంటే పడకే . ఇదీ అన్వర్ పరిస్థితి . 
   " ముస్లిం యువకుల్లో  మతం పట్ల అవగాహన కల్పించి ,
శాంతి పూర్వక సహజీవనానికి , ప్రపంచ శాంతి కి కృషి చేస్తున్న డాక్టర్ ఇనాయతుల్లా"  న్యూస్ రీడర్ ఈ వార్త చెప్పగానే టీ.వీ స్క్రీన్ పై అయిదు పదులు నిండిన  ఓ వ్యక్తి 
చిత్రం కనిపించింది . ఆయన వాలకం చూస్తుంటే విద్యావేత్త
అనిపించింది. 
" రేపు సాయంత్రం  రవీంద్ర భారతిలో జరిగే సద్భావనా సదస్సు కు ప్రధాన వక్త డా. ఇనాయతుల్లా . మౌలికంగా మతం అంటే ఏమిటి ?  శాంతి యుతి సహజీవనం అన్న
ఆదర్శాన్ని ఎందుకు పాటించాలి ? నేటి యువత వ్యక్తి గత
వికాసం కోసం  , సమాజ శ్రేయస్సు కోసం ఏం మార్గం లో అడుగేయాలి అన్న అంశాలను వివరిస్తారు . 
   ఈ సమావేశం ముఖ్యం గా యువత కోసం  ఉద్దేశింప బడినది .   ఈ సభకు  విశిష్ట అతిథి రెవెన్యూ మంత్రి షేక్ మస్తాన్. న్యూస్ రీడర్ ఆ వార్త ముగించి ' ఇప్పుడు క్రీడా వార్తలు అని టాపిక్ మార్చింది. అన్వర్ ఆలోచిస్తూ ఆ క్రీడా వార్తలను పట్టించుకోలేదు .
  " ఇస్లాం , జిహాదీ  ! ఈ రెండు పదాలకు  పవిత్ర ఖురాన్ లో 
అర్థాలు ఏమిటి ? ఖురాన్ గురించి తనకు పూర్తిగా అవగాహన లేదు .  తన అరబ్ భాషా జ్ఞానం అంతంత మాత్రమే.  మతోన్మాదులు,  స్వార్థ రాజకీయ నాయకుల ప్రభావం వల్ల  ఈ రెండు పదాలు అసలు ఉనికే పోగొట్టు కున్నాయి .  ఈ పదాలకు డా.ఇనాయతుల్లా  వివరణ ఇవ్వగలడా ?  సద్భావనా  సమావేశానికి వెళితే ? వెళ్ళే వీలు లేదే ! తను  ఈ  నాలుగు గోడల కే పరిమితం . రహీం చెప్పినట్లే నడుచుకోవాలి .  " విసుగు, కోపం కలిగాయి అన్వర్ కు .
   ఇంతలో ల్యాండ్ ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకున్నాడు .
అవతలి రహీం. " హెలో ! అన్వర్ భాయ్ ! ఎలా ఉన్నావు ? " 
అన్వర్ నవ్వాడు. నవాబులా దర్జాగా ఉన్నాను . కాకపోతే హౌస్ అరెస్ట్ . "
తనూ నవ్వాడు రహీం .
" డోన్ట్ వర్రీ !  ఒక్క రోజే  నీకీ బందిఖానా. తర్వాత నీవు ఫ్రీ బర్డ్ . సరే ! రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో  ఓ కార్యక్రమం ఉంది . "
" అవును ! నేను న్యూస్ చూశాను . సద్భావనా సమావేశం
కదా !"
" అవును . ఆ ప్రోగ్రామ్ టీ.వీ కవరేజ్ లో అన్ని ఛానెల్స్ లో వస్తుంది . నువ్వు తప్పకుండా చూడాలి ."
   " అలాగే . అంత కన్నా పనేముంది ?  మంచి కాలక్షేపం . 
మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకోవచ్చు .  
రహీం ఫోన్ పెట్టేసాడు. మళ్ళీ నిశ్శబ్దం.  అన్వర్ టీ.వీ బంద్
చేసాడు . బెడ్ మీద పడుకున్నాడు . 
"సరిహద్దు దాటుతున్న నలుగురు ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో పహరా చేతిలో హతం "  ఇది నిన్నటి వార్త .
    ముగ్గురు చనిపోయారు. అలీ గాయపడ్డాడు . మరి నలుగురు హతం "  అంటారేమిటి ? అలీ కూడా చనిపోయాడా ?  ఆ ఆలోచనే భరించలేక పోయాడు అన్వర్ . ఇది ఖచ్చితంగా సెన్సార్ చేయబడ్డ న్యూస్ . అలీని వారు వదులు కోరు .  అలీ అవసరం వారికి చాలా  ఉంది.
హైదరాబాద్ మహా నగరం నల్లటి చలి దుప్పటి కప్పుకుంది .  
దీపాల కాంతిలో నక్షత్ర మండలం లా వెలిగిపోతోంది. 
రూం బయటకు వచ్చాడు అన్వర్ .   నగరం లోనే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ మూడు అంతస్తుల భవనం మీద
నుండి కనుచూపు మేర కనిపిస్తుంది. చూస్తూ అలాగే  నిలబడి పోయాడు .
   అతడి ముఖం లో కమ్ముకున్న నీలినీడలు ఆ చీకటి లో కలిసి పోయాయి. ఇన్నాళ్ళు బండలా బిగుసుకు పోయిన అతడి గుండె ల్లో  కదలికలు  ప్రారంభమైయ్యయి
 . ఆ కదలికల కలకలం కళ్ళ తడిలా మారింది.. గతం జ్ఞాపకాల పొగమంచు లా  మనసును ఆవరించింది. 
                    .........8