పల్లె పడచు - వెన్నెలమనసుఅదొక అందమైన కుగ్రామం. స్వచ్ఛమైన గాలి, మదిని పులకరింపజేసే వాతావరణం. అటు ఇటు ఊగుతూ నవ్వుతూ పలకరించే పచ్చని పొలాలు, ఎటు చూసినా ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నట్లుండే పైరు గాలులు. మనసుకి ప్రశాంతత కావాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మా ఊరు వస్తే చాలు అన్నట్టుగా మెరిసిపోయే బంతి పూల తోటలు. ఆ ఊరి అందాన్ని చూస్తుంటే... 'అయ్యో! మనం ఇలాంటి ఊరిలో ఎందుకు పుట్టలేదా?' అని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు. అలాంటి ప్రకృతి ఒడిలో మొదలైన కావ్యం ఇది.ఆ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మరో అందమైన రూపం 'వెన్నెల'. ఆమె పేరుకు తగ్గట్టే మనసు కూడా నిండు వెన్నెలంత స్వచ్ఛమైనది. సన్నటి తీగలా ఉండే శరీరాకృతి, చామనచాయ రంగులో ఉన్నా ఆమె నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ఆమె మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపడుతున్నాయా అన్నంత హాయిగా ఉంటుంది ఆ గొంతు. ఎవరినీ
అసంపూర్ణ కావ్యం - 1
పల్లె పడచు - వెన్నెలమనసుఅదొక అందమైన కుగ్రామం. స్వచ్ఛమైన గాలి, మదిని పులకరింపజేసే వాతావరణం. అటు ఇటు ఊగుతూ నవ్వుతూ పలకరించే పచ్చని పొలాలు, ఎటు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నట్లుండే పైరు గాలులు. మనసుకి ప్రశాంతత కావాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మా ఊరు వస్తే చాలు అన్నట్టుగా మెరిసిపోయే బంతి పూల తోటలు. ఆ ఊరి అందాన్ని చూస్తుంటే... 'అయ్యో! మనం ఇలాంటి ఊరిలో ఎందుకు పుట్టలేదా?' అని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు. అలాంటి ప్రకృతి ఒడిలో మొదలైన కావ్యం ఇది.ఆ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మరో అందమైన రూపం 'వెన్నెల'. ఆమె పేరుకు తగ్గట్టే మనసు కూడా నిండు వెన్నెలంత స్వచ్ఛమైనది. సన్నటి తీగలా ఉండే శరీరాకృతి, చామనచాయ రంగులో ఉన్నా ఆమె నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ఆమె మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపడుతున్నాయా అన్నంత హాయిగా ఉంటుంది ఆ గొంతు. ఎవరినీ ...Read More
అసంపూర్ణ కావ్యం - 2
అలా రోజులు గడుస్తున్నాయి.. వెన్నెల ఎప్పటిలాగే తన గులాబీ మొక్కలకు నీళ్లు పోస్తూ, మురిపెంగా ముచ్చట్లు చెప్పుకుంటోంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నోళ్లు "చూడండి.. మళ్ళీ మొదలుపెట్టింది ఈ పిచ్చిది! ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు" అంటూ విసిరేసిన మాటలు వెన్నెల మనసుని చివుక్కుమనిపించాయి. అప్పుడే వాళ్ళ అమ్మ శారద మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారి గా ఎవరో ఇక చాలు అన్నట్టు అనిపించింది ఎవరు అని వెనుకకు తిరిగి చూస్తే సరిగ్గా అప్పుడే.. "ఆమె చేస్తున్న తప్పేమిటి?" అన్న ఒక గంభీరమైన గొంతు వినిపించింది. "మొక్కలకి ప్రాణం పోస్తూ, వాటితో కాలం గడపడం నేరమా? అది పిచ్చితనం కాదు, ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమ" అంటూ ఒక వ్యక్తి ఆమెకు అండగా నిలబడ్డాడు. వెన్నెల ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. సుమారు 5.6 అడుగుల ఎత్తు, మెరిసే కళ్ళు, ముఖంలో ...Read More