ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, భయంతో వణికిపోతున్నాయి. ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం దాల్చిన ప్రాణి చేస్తున్న హుంకారం.వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.వేద, తెల్లటి కుర్తా వ
వేద - 1
ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, వణికిపోతున్నాయి.ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం దాల్చిన ప్రాణి చేస్తున్న హుంకారం.వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.వేద, తెల్లటి కుర్తా వ ...Read More
వేద - 2
ప్రొద్దున ఎండ కాస్త ప్రశాంతంగా ఉన్నా, రుద్రకోట శివార్లలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ఆ కోట ప్రవేశ ద్వారం దగ్గర పడి ఉన్న శిథిలాలు, శతాబ్దాల గాథలను మోస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలిలో ఒక రకమైన పాత వాసన.. మట్టి, తడిసి ఆరిన రాయి, ఇంకా ఏదో తెలియని ప్రాచీన గంధం కలగలిసిన వాసన."గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఈ ప్రాంతంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం.. రుద్రకోట!" అనన్య కెమెరా వైపు చూస్తూ ఉత్సాహంగా అరిచింది.ఆమె గొంతు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రతిధ్వనించింది.విక్కీ మాత్రం కెమెరాను భుజానికి తగిలించుకుని భయం భయంగా అడుగులు వేస్తున్నాడు.చుట్టూ ముసురుతున్న గబ్బిలాల చప్పుడు, నేల మీద పాకుతున్న పాముల పొలుసుల శబ్దం అతడిని వణికేలా చేస్తున్నాయి."అనన్యా.. ప్లీజ్, నా మాట విను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. గాలిలో నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ...Read More
వేద - 3
రుద్రకోటలో జరిగిన ప్రమాదంతో, ధూళి మేఘాలు ఆ గదిని కమ్మేశాయి. పైకప్పు నుండి రాలిపడుతున్న సున్నం, మట్టి అనన్య కళ్ళను పూర్తిగా కప్పేస్తున్నాయి.పైన మృత్యువులా వేలాడుతున్న భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా ఊడి కిందకు దూసుకొచ్చింది. ఆ క్షణం అనన్యకు తన మరణం కళ్ళముందు కనిపించింది."అమ్మో!" అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని నేల మీద ముడుచుకుపోయింది.కానీ, ఆతరువాతి దృశ్యం చూసి అనన్య స్తంభించిపోయింది. ఆమె ఊహించినట్టుగా తన మరణం సంభవించలేదు.దానికి బదులుగా గాలిలో ఒక వింతైన కంపనం.. ఒక ఉగ్రమైన శబ్దం వినిపించింది.వేద మెడలోని 'శరభ ముద్ర' ఇప్పుడు కేవలం వేడెక్కడం కాకుండా, అది అగ్నిగోళంలా మండుతోంది. ఆమె నరనరాల్లో రక్తం ఉడుకుతోంది.అనన్య ఎవరో తెలియకపోయినా, సాటి మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన, ఆమె యొక్క అంతరాత్మలో నిద్రపోతున్న ఆ ప్రాచీన శక్తిని తట్టిలేపింది.దానితో వేద కళ్ళు ఒక్కసారిగా రక్తంలా ఎర్రగా మారాయి. ఆమె చూపుల్లో ఇప్పుడు భయం ...Read More