జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకెందరో రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు.
మన్నించు - 1
జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు.-------------------------------------------------------------------------------------------2013, ఇంటర్ చదువుతున్న రోజుల్లో..."మా అమ్మాయికి డాక్టర్ చదవాలనే కోరికతో ఉంది, కొంచం ఈ సర్టిఫికెట్లు చూడండి." మా నాన్నగారు నాపదో తరగతి మార్కుల సర్టిఫికెట్ చూపిస్తూ గొప్ప ఆనందపడ్తూ, గర్వంగా చెప్పారు."9.0 పాయింట్స్.... మ్మ్.. " తల అడ్డంగా ఉపుతూ నా వైపు చూసారు డెస్క్లో వున్న అతను. భయపడుతూ చిన్నగా నవ్వాను."అమ్మాయికి ఒకసారి కౌన్సెలింగ్కి పంపించండి." అని చెప్పి పక్కగా వున్న ఒక డోర్ వైపు చూపించారు అతను.మా నాన్నగారు సందేహంగా చూస్తూ "కౌన్సెలింగ్ ఎందుకు అండి, మేము బై. పి. సి అనే అనుకుంటున్నాం" అన్నారు."కౌన్సెలింగ్ కంపల్సరీ అండి. ...Read More
మన్నించు - 2
ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని లేదు అన్నప్పుడు, మనతోనే ప్రేమ ఆగిపోవాలని ఏం వుంది? మనం మొదటి ప్రేమ కానప్పుడు మనమే ప్రేమ అవ్వాలని మాత్రం ఏం వుంది? మనం లేకపోతే వాళ్ళ జీవితం ఆగిపోతుంది అని మాత్రం అనుకోడం మన తప్పు. తను లేకపోతే నేను ఏం ఐపోతానో అనుకోడం ఒక అపోహ.---------------------------------------------------------------------"అమ్మ నేను మొన్న కొన్న డిజైనర్ డ్రెస్ వేసుకొని వెళ్త కాలేజీకి" స్నానానికి వెళ్తూ మా అమ్మకి చెప్పాను."సరే నీ ఇష్టం" మా అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఈ రోజు అందరికన్నా నేనే అందంగా కనిపిస్తాను.స్నానం చేసి ముచ్చటగా కొనుకున్న డిజైనర్ గౌన్ వేసుకున్న. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ డ్రెస్ నాకు."అమ్మ జడ వేయు. కాలేజీకి లేట్ అవ్తుంది." మా అమ్మని పిలుస్తూ టిఫిన్ తిండానికి కూర్చున్నాను.మా అమ్మ బెడ్ రూంలో నుంచి వస్తూ దువ్వెనతో ...Read More
మన్నించు - 3
రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అయిన రంగు, రుచి, ప్రొఫెషన్.. ఏది ఇప్పుడు నచ్చవు. కాలంతో పాటు చాలా మారిపోతుంటాయి... ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు వున్నంత ఇష్టం ఇక ముందు కూడా అలానే వుంటుంది అనేది మనకి మనమే చెప్పుకునే నిఖార్సయిన అబ్బాధం. జీవితం అనే పెద్ద అబద్ధం ముందు ప్రేమ అనే చిన్న అబద్ధం కూడా అబ్బాధమే అని ఎవరూ కనిపెట్టలేరు.----------------------------------------------------------------------------"నా పేరు సిద్ధార్థ్. అందరూ సిడ్ అని పిలుస్తుంటారు. డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూసినప్పటి నుంచి ఇంకా చూస్తూ ఉండాలి అనే ఫీలింగ్. మా ఇంట్లో అందరికీ ఒకే... నీకు ఒకే ఐతే మనం ప్రేమించుకుందాం" అజయ్ చెప్పాడని మొన్న సీన్ క్రియేట్ చేసిన అబ్బాయిని పలకరిద్దాం కథ అనుకుంటే.. ఇలా డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టేశాడు.నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నా పక్కన ఉంటూ ఇది అంతా ...Read More
మన్నించు - 4
మనం అనే బంధంలో .. నేను అనే స్థానం మాత్రమే శాశ్వతం. నువ్వు అనే స్థానంలో ఈ రోజు నువ్వు వుండుండొచ్చు, రేపు ఇంకెవరో ఆ స్వాధీనం చేసుకోవచ్చు..********"ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో నేను డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను." దివ్య ప్రతీదాన్లో చాలా ఫాస్టుగా వుంటుంది."అందరం ఒకే కలర్లో డ్రెస్ వేసుకుందాం" శ్రీస్తి ఎక్సైట్మెంట్గానే వుంది."అదే బాగుంటుంది.. ఏం అంటావ్ ధీర?" మిత్ర మాటలకి అందరూ నా వైపు చూసారు."నేను రాను అనుకుంటా .... నాకు ఆ రోజు వేరే ప్లాన్స్ ఉన్నాయి"మొన్న అజయ్ తో బైక్ మీద వెళ్ళక తను ఇంక కనిపించలేదు. కాలేజీకి కూడా రాలేదు రెండు రోజుల నుంచి. ఏం అయ్యుంటుంది అని ఒకటే ఆలోచన.... మిత్రని అడుగుతే ఏం అనుకుంటుందో... అడగకపోడమే మంచిది."ఈ మధ్య ఇలానే వుంటుంది పరధ్యానంగా..." దివ్య అంటుంటే మళ్ళీ ఆలోచనలలో నుంచి బయటకి వచ్చాను.ఇంకో రోజు గడుస్తోంది.... అజయ్ క్లాస్ వైపు ...Read More
మన్నించు - 5
ప్రేమ మొదట్లో చాలా అందంగా ఉంటుంది. కొంత దూరం కలిసి నడిచాక, ఈ ప్రేమని ఎలా ఆపేయాలో తెలీదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే వెనక్కి రాగలమో తెలీదు, అక్కడే ఆగిపోతే ఏం అవుతుందో కూడా తెలీదు. ప్రేమ ఏడారిలో ఎండమావి లాంటిది.. దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ఊబిలో ఇరుకుపోయేలా చేస్తుంది.**********************క్లాసెస్ ఐపోయాయి.. ఎప్పటిలానే పార్కింగ్కి వెళ్ళి సైకిల్ బయటకి తోసుకుంటూ వచ్చాను. అందరినీ ఇప్పుడే వదిలారు కదా, రోడ్ మొత్తం జనాలే... కాలేజ్ రోడ్ సందు చివరి వరకు తోసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి తోకుకుంటూ వెళ్లోచులే అని స్లోగా సైకిల్ తోస్తున్న."హాయి ధీర" అంటూ పలకరించాడు సిడ్.తల పక్కకి తిప్పి చూసాను. ఎప్పుడులా అనిపించలేదు. ఏంటో బాగా టెన్షన్గా వున్నట్టు అనిపించాడు. చెమటలు కారుతూ, అటూ ఇటూ చూస్తూ... ఏం అయిందో తెలీడం లేదు గానీ ఏదో అయింది."ఏం అయింది. ఎందుకు అలా ఉన్నావ్?""చిన్న హెల్ప్ కావాలి""ఏం అయిందో ...Read More
మన్నించు - 6
నీ ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయేలా చేయగలిగావు అనుకుంటున్నావ్ కదా.. ప్రపంచం చాలా పెద్దది.. ఒక్కసారి నీకు దూరంగా వెళ్ళనివ్వు.. నువ్వు గుర్తులేనంతగా నిన్ను మర్చిపోయేలా చేస్తుంది...************అజయ్ మిత్రాని.రోజు చూస్తున్నాం కదా, ఆకాశం మన సొంతం అనుకుంటే ఎలా?రోజు కనిపిస్తుంది కదా, చందమామ మనదే అనుకుంటే ఎలా?అజయ్ ప్రేమ విషయం తెలిసాక... నేను ఎంత దూరం ఆలోచించానో అనిపించింది. పిచ్చి మనసు.. స్నేహానికి, ప్రేమకి వ్యత్యాసం తెలుసుకోలేకపోయింది.అయిన అజయ్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్తే .. నేను తిరిగి ప్రేమించే పరిస్థితి మా ఇంట్లో లేదు.. ఒక విధంగా ఇలా జరగడం కూడా నా మంచికే..ఎప్పటిలానే కాలేజీకి వెళ్ళాను.అందరూ ఫ్రెషర్స్ డే హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. రేపే ఫ్రెషర్స్ డే.. అప్పుడే నేను కాలేజీ జాయిన్ అయ్యి 2 మంత్స్ ఐపోయాయి అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు."ధీర, ఏం ఆలోచించావ్?" దివ్య అడిగింది."దేని గురించి దివ్య" ముందు వాళ్ళు ...Read More