ఒక్కోరోజు ఒక్క కప్ప ఏడుస్తూ కూర్చుంది అంట, దేవుడు ఎదురు అయ్యి ఏమయింది ఏమీ కావాలి నీకు అని అడిగాడు అంట, అప్పుడు కప్ప నేను ఇంత చిన్న బావి లో ఉండలేను, నాజీవితం ఇక్కడితో అగిపోతాదేమో అని భయం వేస్తోంది అని తనను సముద్రం లో వదులు అని వరం తీసుకుంది అంట,దేవుడు తథాస్తు అన్నాడు..కళ్ళు తెరిచి చూసేలోపు సముద్రంలో ఉంది..అంత పెద్ద ప్రపంచాన్ని రంగు రంగుల చేపలు మొక్కలు అన్ని చూసి చాలా సంతోషపడింది,కాసేపటికి ఎదోపెద్ద జీవులు కప్పని తినటానికి తరుముతూ వచ్చాయి ప్రాణ భయంతో పరుగులు తీసింది,ఎలాగో తప్పించుకుంది,దాహంవేసి నీళ్ళు తాగుదామని నోటిలో వేసుకుంది,ఉప్పుగా ఉండేసరికి ఒక గుటక కూడా మింగలేక పోయింది,అప్పుడు మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది మళ్ళీ దేవుడు వచ్చాడు..ఏమయ్యింది అని అడిగాడు జరిగింది మొత్తం చెప్పేసింది,అప్పుడు దేవుడు అన్నాడంట,ఉన్న దానిలో సర్ధుకోకుండ,ఉన్నదనిలో సంతోషంగా ఉండలేని వారు ఎక్కడికి వెళ్ళిన హ్యాపీ గా ఉండలేరు,ఇతరులని చూసి బాధపడకు, నీ ఇంట్లో లో నీ చర్మానికి తగ్గ వాతావరణం, నికు కావలసినప్పుడు దొరికే ఆహారం,మంచి నీరు, ఇలా అన్ని conforts నీకు దొరుకుతాయి, అక్కడ చూడ్డానికి luxury గా విశాలంగా ఉండొచ్చు, కానీ గుక్కెడు మంచి నీళ్ళు కూడా నికు దొరకవు అన్నాడంట...🖊️madhava krishna e

Telugu Motivational by madhava krishna e : 111904238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now