ప్రేమలో .....
ఎదుటివారు
మన సొంతం కావాలనే
స్వార్ధం ఉంటుంది
ఆరాధనలో .....
ఎదుటివారు ఎప్పటికి
మన సొంతం
కానక్కర్లేదనే
నిర్ధారణ ఉంటుంది
నిస్వార్ధం ఉంటుంది.
స్నేహానికి
వయసుతో పనిలేదు
మనసుకి
కులంతో పనిలేదు
బంధానికి
బలగంతో పనిలేదు
అనుబంధానికి
అంతస్తులతో పనిలేదు
ప్రేమకి
ప్రపంచంతో పనిలేదు
ఆరాధనకి
శరీరంతో పనిలేదు..
అందుకే ప్రేమకన్నా ఆరాధనే మిన్న...
.....
సాచి సాహితి
#Feel
#love