రాసి రాసి సిరా చుక్కలు
రాయనంటూ రంగును కోల్పోతే
కలం నీరసించింది
వాడి వాడి అక్షరాలు
వాడిపోయాయి పదాలు
నిలువలేక గుణింతాలకు
విని విని నీరసమొచ్చింది
కవిత్వంలో రాగం లేదని
దీర్ఘం రానంది
ఒత్తులు మా పేరైతే
అక్షరాలకు తొత్తులమా
అసలుసిసలు కవనానికి
ఆయువుపట్టే పునాదులం
పిచ్చి రాతలన్ని కలిసి
కాగితాలను పాడుచేస్తే
కవిత్వం పుట్టుకొస్తుందా
పాఠకుని భావాలు చంపే
కుతంత్రమై కుస్తుందా...
గమనించాలి కథలు
చదవాలి జీవితగాథలు
పుస్తకాలే కాదు మస్తకాలు పఠించాలి
కొత్త కొత్త అనుభవాలు
పొందగలిగితేనే కల్గు భావాలు
జ్ఞాపకాల రుచులతోనే
తియ్యగుండును కవిత్వాలు
©మురళీ గీతం...!!!
#Belong