The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
నా ప్రియుడు కోసం..... ********************** తను రవి అయితే నేను కలువనవుతాను తను నెలరాజు అయితే నేను వెన్నెలవుతాను తను అల అయితే నేను సంద్రమవుతాను తను తుమ్మెదైతే నేను మధువునవుతాను తను మేఘమైతే నేను చినుకునవుతాను తను రాగమైతే నేను తాళమవుతాను తను కోయిలైతే నేను పాటనవుతాను తను పవలిస్తే పర్పునవుతా తను పలకరిస్తే పిలుపునవుతా తను తడిమితే స్పర్శనవుతా తను కోరితే కలల స్వర్గమవుతా తను ఆరాధిస్తే అందమైన పువ్వునవుతా తను ఆస్వాదిస్తే సుగంధ పరిమళమవుతా నా ప్రియుడి కోసం వేచివున్న ఎదురుచూపు నేను నా సఖుడి లయశృతితో మృోగిన గుండెను నేను మన్మధుడిని వలచని ఈ మానవ దేహం వ్యర్థమే మనువు కాకుంటే తనతో ఈ జన్మ నాకింకా వృథే - మురళీ గీతం...!!!
రాసి రాసి సిరా చుక్కలు రాయనంటూ రంగును కోల్పోతే కలం నీరసించింది వాడి వాడి అక్షరాలు వాడిపోయాయి పదాలు నిలువలేక గుణింతాలకు విని విని నీరసమొచ్చింది కవిత్వంలో రాగం లేదని దీర్ఘం రానంది ఒత్తులు మా పేరైతే అక్షరాలకు తొత్తులమా అసలుసిసలు కవనానికి ఆయువుపట్టే పునాదులం పిచ్చి రాతలన్ని కలిసి కాగితాలను పాడుచేస్తే కవిత్వం పుట్టుకొస్తుందా పాఠకుని భావాలు చంపే కుతంత్రమై కుస్తుందా... గమనించాలి కథలు చదవాలి జీవితగాథలు పుస్తకాలే కాదు మస్తకాలు పఠించాలి కొత్త కొత్త అనుభవాలు పొందగలిగితేనే కల్గు భావాలు జ్ఞాపకాల రుచులతోనే తియ్యగుండును కవిత్వాలు ©మురళీ గీతం...!!! #Belong
#మురళీగీతం #Belong
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser