ఓం శాంతి.. అందరికీశార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు.. శుభం భూయాత్.. ప్రపంచంలోని బాబా పిల్లలంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది ఎవరికివారు వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వుంటూనే మనసు కళ్ళతో మమతల ముంగిళ్ళలో మధుర మిలనము జరుపుకునే సమయమిది.. బాబా ఏదైతే చెప్పారో అదే జరుగుతోంది.. ఈ రోజుల్లో మురళి వినడానికి ఎన్నో సైన్సు సాధనాలు అందుబాటులో ఉన్నాయి.. అందుకు సైన్సు వారికి ధన్యవాదాలు.. ఇది విశ్రాంతి సమయం కాదు.. మనసా సేవకు అరుదైన అవకాశం.. అందరం లోపలికి వెళ్దాం,లోపల ఉన్న అనంత చైతన్యానికి శివబాబా సర్వశక్తులూ జోడించి... ప్రపంచం లో వ్యాపింప చేద్దాం.. ఇప్పుడు మూసుకుపోతున్న ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ త్వరలోనే చెరిగిపోతాయి........అప్పుడంతా ఒకటే కుటుంబం.. ఈ పరివారం రక్షణ భాద్యత మనదే... "ప్రపంచానికి పట్టిన కరోనా వ్యాధి శాస్వతంగా తొలగిపోతోంది"... ఈ సంకల్పాన్ని ధృడ నిశ్చయం తో ఆత్మ విశ్వాసం తో పరమాత్మ స్మృతిలో ఉండి పదేపదే అదేపనిగా చేయండి...మంచి ఫలితం కనిపిస్తోంది ఇంట్లో ఉన్న మనం ప్రస్తుతం ప్రపంచానికి చేయగల సేవ ఇదే...ఇది సంకల్పం శక్తి.. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు మీ మీ ఇళ్ళలో ఉండే కర్మ యోగిగా అయి రోజువారీ ఇంటీ పనులు చేసుకుంటూ.. వ్యర్ధ ఆలోచనలు మాని .. పైన పేర్కొన్న సంకల్పాన్నే నిరంతరం మననం చేయండి.. ఇది చాదస్తం కాదు.. మూర్ఖత్వం ఎంత మాత్రం కాదు.. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ పాటించవలసిన కనీసం ధర్మం.. దీని శాస్త్రీయత హేతుబద్ధత గురించి అనవసరంగా ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి... కాణీ ఖర్చులేని ఈ మంచి పనిలో ఇప్పుడే పాల్గొనండి... సంకల్పమయం జగత్సర్వం.. మనః సంకల్ప నిలయః ఓంశాంతి