ఓం శాంతి..ప్రపంచంలోని బాబా పిల్లలంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది ఎవరికివారు వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వుంటూనే మనసు కళ్ళతో మమతల ముంగిళ్ళలో మధుర మిలనము జరుపుకునే సమయమిది.. బాబా ఏదైతే చెప్పారో అదే జరుగుతోంది.. ఈ రోజుల్లో మురళి వినడానికి ఎన్నో సైన్సు సాధనాలు అందుబాటులో ఉన్నాయి.. అందుకు సైన్సు వారికి ధన్యవాదాలు.. ఇది విశ్రాంతి సమయం కాదు.. మనసా సేవకు అరుదైన అవకాశం.. అందరం లోపలికి వెళ్ ాం,లోపల ఉన్న అనంత చైతన్యానికి శివబాబా సర్వశక్తులూ జోడించి... ప్రపంచం లో వ్యాపింప చేద్దాం.. ఇప్పుడు మూసుకుపోతున్న ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ త్వరలోనే చెరిగిపోతాయి........అప్పుడంతా ఒకటే కుటుంబం.. ఈ పరివారం రక్షణ భాద్యత మనదే...ఓంశాంతి