నా యదలోయలో
తీపి గాయానివి నువ్వే...
మది పాడుకునే
మధుర గేయానివి నువ్వే
నా ఆగని శ్వాసకు
ఆశల గంధం అద్దే
తావివి నువ్వే..
నా ఆశయ సాధన పయనంలో
కర దీపికవై దారి చూపే తారక నీవే
నీవెవరో తెలియదుగానీ..
నన్నెరిగిన జ్ణాతవు నీవే
నా తలపుల్లో కొలువుండే
అజ్ణాతవాసివి నీవే...
ఏమని చెప్పను ప్రియా...
నా దారివీ నీవే.. దరివీ నీవే...