గడప గడపకు ముగ్గు ముగ్గులో గొబ్బిళ్ళు
సంక్రాంతి లక్ష్మినే స్వాగతించు
హరిదాసు కీర్తనలు బ్రతుకు మర్మముదెల్పు
గాలిపటములు ఆడు గగనమందూ
సంక్రాంతి పండుగ నాడు గడప గడపకూ తీర్చిదిద్దిన ముగ్గులు ముగ్గుల్లో కొలువుదీరిన గొబ్బెమ్మలు సంక్రాంతి లక్ష్మిని స్వాగతిస్తాయి... అలాగే హరిదాసు కీర్తనలు జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తాయి..మరోవైపు రంగు రంగుల గాలిపటాలు గగన వీధి లో అందంగా ఆడుతూ వుంటాయి....ఓంశాంతి