తెలిసో తెలియకో
వచ్చో రాకో
నచ్చో నచ్చకో...
యోగం అందరూ చేస్తారు
అదే.. కర్మయోగం చేస్తారు..
చాలామంది తమ పనుల్లో
మునిగివుంటారు..
అదే యోగమనుకుంటారు
కొందరు మాత్రం నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటూ
శ్రేష్ఠ కర్మలు చేస్తారు... వీరినే రాజయోగులంటారు
వీరెక్కడో అడవుల్లో వుండరు
మనలోనే వుంటూ.. మనలానే వుంటూ.. మనకు అనుక్షణం ఆదర్శంగా నిలుస్తారు..యోగ్యులుగా తీర్చిదిద్దుతారు...
వీరినే అనుసరించేవారు...
ధన్యులవుతారు..
భవిష్యత్తులో దేవతలౌతారు...
ఓంశాంతి