నిదుర రాని కళ్ళు రెండు రేయి కోళ్ళు
మదిలోన రొద పెట్టు కీచురాళ్ళు
రాయిరాయియనుచు రాయించు ముని వేళ్ళు
సాహితీ వనమందు కవులె లేళ్ళు
నిద్ర పట్టని రెండు కళ్ళూ రెండు రేయికోళ్ళై...మదిలోపల రొదపెట్టే కీచురాళ్ళై రాయి రాయి అని మునివేళ్ళను ఉరకలెత్తిస్తుంటే పాపం కవులు సాహితీ వనంలో లేళ్ళలా పరుగులు తీస్తున్నారు అని భావం..ఓంశాంతి