కార్తీక మాసాన నీదు నామము దలచి
నీదు నామము పాడి మనసునాడి
భక్త జనులనెల్ల నీ దరిని చేర్చగా
హరినిజేరే దారి చూపినావూ
ముక్కంటి నీ కంట మంటలెందుకటంచు
మదిలోన ప్రశ్నొచ్చె మంజునాధ
మాయ మంచు తెరలు కరిగించగానంటు
చెవిలోన చెప్పావు చిత్తవాసా
పాల జల అభిషేక ప్రియుడంటు దలచేరు
భక్తులందరు నిన్ను జ్ఞాన జల ధరయా
సంకల్పమర్పించ చాలన్న యోచనను
కల్గించి వెల్గించు ఆత్మ దివ్వె
మూడు కోణములున్న బిల్వ పత్రమునొకటి
అర్పించి మురిసేరు నీ భక్తులూ
వారి మనసూ బుద్ధి సంస్కారములు మూడు
స్వయముగా గ్రహియించు సర్వేశ్వరా